అమెరికా సంయుక్త రాష్ట్రాలు

వికీపీడియా నుండి
"అమేరికా" ఇక్కడికి దారిమార్పు చెందుతుంది. ఇతర వాడుకల కొరకు అమెరికా (అయోమయ నివృత్తి) చూడండి.
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
Flag of అమెరికా అమెరికా యొక్క Great Seal
నినాదం
In God We Trust  (official)
E Pluribus Unum  (From Many, One; Latin, traditional)
జాతీయగీతం
"The Star-Spangled Banner"
అమెరికా యొక్క స్థానం
రాజధాని వాషింగ్టన్ డి.సి.
38°53′N, 77°02′W
Largest city న్యూయార్క్
జాతీయ భాష కేంద్ర స్థాయిలో అధికారిక భాష ఏదీ లేదు (28 రాష్ట్రాలలో ఆంగ్లం అధికారిక భాష)
ప్రజానామము American
ప్రభుత్వం కేంద్రీకృత అధ్యక్ష తరహా రాజ్యాంగబద్ధ సమాఖ్య
 -  అధ్యక్షుడు బరక్ ఒబమ (రిపబ్లికన్)
 -  ఉపాధ్యక్షుడు రిఛర్డ్ 'డిక్' చెనీ (రిపబ్లికన్)
 -  స్పీకరు నాన్సీ పెలోసీ (డెమొక్రాట్)
 -  ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్
స్వాతంత్ర్యం (గ్రేట్ బ్రిటన్ నుండి)
 -  ప్రకటన జులై 4 1776 
 -  గుర్తింపు సెప్టెంబరు 3 1783 
 -  జలాలు (%) 6.76
జనాభా
 -  2000 జన గణన 281,421,906[1] 
జీడీపీ (PPP) 2008 అంచనా
 -  మొత్తం $14.046 trillion[2] (1st)
 -  తలసరి $45,968 (4th)
జీడీపీ (nominal) 2008 అంచనా
 -  మొత్తం $14.306 trillion[2] (1st)
 -  తలసరి $46,820 (12th)
Gini? (2006) 47.0[3] 
మా.సూ (హెచ్.డి.ఐ) (2005) 0.951 (high[4]) (12th)
కరెన్సీ United States dollar ($) (USD "$")
కాలాంశం (UTC-5 to -10)
 -  వేసవి (DST)  (UTC-4 to -10)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .us .gov .mil .edu
కాలింగ్ కోడ్ +1

అమెరికా సంయుక్త రాష్ట్రాలు లేదా అమెరికా ఉత్తర అమెరికా ఖండములోని అట్లాంటిక్ మహాసముద్రము నుండి పసిఫిక్ మహాసముద్రము వరకు విస్తరించి ఉన్న దేశము. దీనికి ఉత్తరాన కెనడా, దక్షిణాన మెక్సికో దేశాలతో భూసరిహద్దు మరియు అలాస్కా వద్ద రష్యాతో సముద్ర సరిహద్దు కలదు. అమెరికా, 50 రాష్ట్రాల గణతంత్ర సమాఖ్య. సంయుక్త రాష్ట్రాల రాజధాని వాషింగ్టన్ డి.సి.


37 లక్షల చదరపు మైళ్ల (95 లక్షల చదరపు కిలోమీటర్లు) విస్తీర్ణముతో అమెరికా సంయుక్త రాష్ట్రాలు (అన్ని రాష్ట్రాలు మరియు ప్రాంతాలతో కలిపి) వైశాల్యములో మూడవ లేదా నాలుగవ అత్యంత పెద్ద దేశము (చైనా వైశాల్యము లెక్కపెట్టడములో దాని వివాదాస్పద ప్రాంతాలను గణనలోకి తీసుకునే దాన్ని బట్టి అమెరికా మూడవదో లేక నాలుగవదో అవుతుంది). 30 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచములో అత్యధిక జనాభా కలిగిన మూడవ దేశము.


ప్రస్తుత అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా పిలువబడుతున్న నేలపై 15,000 సంవత్సరాల నుండి ఆదివాసీ ప్రజలు నివాసము ఏర్పరుచుకొన్నారు. 16వ శతాబ్దములో ఆంగ్లేయులు, ఫ్రెంచి మరియు స్పానిష్ ప్రజల ఆధ్వర్యాన అమెరికాలో ఐరోపా ప్రజల వలసలు మొదలయ్యాయి. 1776, జూలై 4న తూర్పు తీరము వెంట ఉన్న 13 బ్రిటిషు కాలనీలు బ్రిటిషు ప్రభుత్వ పాలనను నిరసించి స్వాతంత్ర్యము ప్రకటించుకొని యుద్ధం ప్రారంభించాయి. 1783లో బ్రిటిషు ప్రభుత్వము అమెరికాను స్వతంత్ర దేశముగా గుర్తించడంతో యుద్ధం ముగిసింది. 1776 జూలై 4 ను సాధారణముగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడిన రోజుగా గుర్తిస్తారు.


19వ మరియు 20వ శతాబ్దములలో అమెరికా యొక్క సైనిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ ప్రాభవము క్రమక్రమముగా పెరిగినది. ప్రచ్చన్న యుద్ధం చివర సోవియట్ సమాఖ్య పతనముతో అమెరికా నేటి ప్రపంచములో ఏకైక అగ్రరాజ్యముగా అవతరించినది. నేడు ప్రపంచ వ్యవహారాలలో అమెరికా ప్రముఖ పాత్ర పోషిస్తున్నది.

విషయ సూచిక

[మార్చు] నామకరణం

క్రీ. శ. 16వ శతాబ్దం ప్రారంభంలోని ప్రముఖ ఇటాలియన్ సాహస యాత్రికుడు అమెరిగో వెస్పూచి పేరు మీదుగా అమెరికా అనే పదం ప్రాచుర్యంలోకొచ్చింది. జులై 4, 1776న ఈ పదాన్ని మొదటి సారి అధికారికంగా అమెరికా స్వాతంత్ర్య ప్రకటన లో వాడటం జరిగింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనే పేరు నవంబరు 15, 1777 నుండీ అమల్లోకి వచ్చింది. దైనందిన వ్యవహారాల్లో ఈ దేశాన్ని యు. ఎస్. ఎ., యు. ఎస్., అమెరికా, స్టేట్స్, ఇలా వివిధ పేర్లతో పిలుస్తారు. అమెరికా ఖండాన్ని కనుగొన్న యూరోపియన్ నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ పేరు మీదుగా గతంలో కొలంబియా అనే పేరు కూడా కొంత కాలం వాడుకలో ఉంది (ప్రస్తుతం ఈ పేరుతో దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశాన్ని పిలుస్తున్నారు)

[మార్చు] భౌగోళికం

అమెరికా భౌగోళిక పటం
అమెరికాలో వివిధ ప్రాంతాల్లో వాతావరణం

అమెరికా సంయుక్త రాష్ట్రాలు దాదాపు పశ్చిమార్ధగోళం మొత్తం విస్తరించి ఉన్నాయి. అలాస్కా తప్ప మిగతా అమెరికా భూభాగం పడమట పసిఫిక్ మహా సముద్రం, తూర్పున అట్లాంటిక్ మహా సముద్రం, ఆగ్నేయాన మెక్సికో అగాధం, ఉత్తరాన కెనడా మరియు దక్షిణాన మెక్సికో దేశాల నడుమ విస్తిరించి ఉంది. భౌగోళికంగా అలాస్కా అమెరికాలోని అన్ని రాష్ట్రాలలోనూ పెద్దది. కెనడా దేశం ఈ రాష్ట్రాన్ని మిగతా అమెరికా భూభాగంనుండి విడదీస్తుంది. అలాస్కా అమెరికాకి నైరుతి దిశగా ఆవల ఉంది. దీనికి ఉత్తరాన ఆర్కిటిక్ సముద్రం, దక్షిణాన పసిఫిక్ మహాసముద్రం ఉన్నాయి. భూవైశాల్యం పరంగా అమెరికా ప్రపంచంలో మూడవ పెద్ద దేశం (మొదటి రెండూ: రష్యా, చైనా). పసిఫిక్ మహా సముద్రం లోని కొన్ని చిన్న చిన్న ద్వీప సముదాయాలు కూడా అమెరికా కిందకు వస్తాయి (ఉదా: ప్యూర్టో రికో, గువామ్)

అట్లాంటిక్ తీరప్రాంతం ఆకులు రాల్చే చెట్లతో నిండిన దట్టమైన అడవులు గల పైడ్ మాంట్ పర్వత శ్రేణులతో నిండి ఉంటుంది. అపలచియాన్ పర్వతాలు తూర్పు తీరాన్ని ఘనమైన సరస్సులు, విస్తారమైన గడ్డిభూములతో నిండిన మధ్య పడమటి ప్రాంతం నుండి విడదీస్తుంది. మిసిసిపి-మిస్సోరి నది అమెరికా దేశానికి సరిగా మధ్యలో ఉత్తరం నుండి దక్షిణ దిశగా ప్రవహిస్తుంది. ఇది ప్రపంచంలోని నాలుగవ అతి పెద్ద నదీ పరివాహక ప్రాంతం. రాకీ పర్వత శ్రేణులు ఉత్తర దక్షిణ దిశల్లో విస్తరించి ఉంటాయి. వీటికి తూర్పుగా ఉన్న సారవంతమైన స్టెప్పీ భూములు పడమటి వైపుకు వ్యాపించి ఉంటాయి. రాకీ పర్వతాలకు పడమటి దిశలో మొహావే ఎడారి ఉంటుంది. సియెరా నెవెడా పర్వత శ్రేణి రాకీ పర్వతాలకు సమాంతరంగా, పసిఫిక్ మహా సముద్రానికి సమీపంలో విస్తరించి ఉంటుంది.

అలాస్కాలోని మెకిన్లీ పర్వతం 20,320 అడుగుల/6,194 మీటర్ల ఎత్తుతో అమెరికాలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం. అమెరికా అధీనంలో ఉన్న అనేక ద్వీపాల్లో అగ్ని పర్వతాలు అతి సాధారణం. హవాయి రాష్ట్రం మొత్తం అగ్ని పర్వతాలతో నిండిన చిన్న చిన్న దీవుల సముదాయం. ఎల్లో స్టోన్ జాతీయ పార్కు లోని మహాగ్నిపర్వతం ఉత్తర అమెరికా ఖండం అంతటికీ పెద్దదైన అగ్ని పర్వతం.

[మార్చు] వాతావరణం

అతి పెద్ద భూవైశాల్యం, వివిధ రకాల భౌగోళిక విశేషాల వల్ల అమెరికాలో ఎన్నో రకాల వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి. చాలా ప్రాంతాల్లో సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది. హవాయి, ఫ్లోరిడా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అలాస్కాలో ధృవ వాతావరణం ఉంటుంది. నైరుతి వైపు ఎక్కువగా ఎడారి వాతావరణం, కాలిఫోర్నియా తీర ప్రాంతంలో మధ్యధరా ప్రాంతంలోలాంటి ఉష్ణోగ్రతలు కనిపిస్తాయి. మెక్సికో అగాధ సమీప ప్రాంతాల్లో తుఫానులు, గాలివానల తాకిడి ఎక్కువ. మధ్య పడమటి భాగంలో ప్రచండమైన సుడిగాలులు తరచూ సంభవిస్తుంటాయి.

[మార్చు] ప్రజాజీవన విశేషాలు

[మార్చు] చరిత్ర

[మార్చు] దేశీయ అమెరికనులు, ఐరోపా వలసదారులు

క్రితం హిమ యుగానికి ముందు ఇప్పటి అలాస్కా ప్రాంతాన్ని అసియా ఖండంలోని సైబీరియా తో కలుపుతూ సుమారు 1,000 మైళ్లు (1,600 కి.మీ.) పొడవైన భూమార్గం ఉండేది. దీన్ని బేరింగ్ వంతెన గా పిలుస్తారు. ఈ మార్గం గుండా సుమారు 25,000 సంవత్సరాల క్రితం ఆసియా వాసులు చిన్న చిన్న సముదాయాలుగా అమెరికా ఖండానికి వలస వచ్చి వివిధ ప్రాంతాల్లో స్థిర పడి సమాజాలుగా రూపొందారు. వీరు క్రమంగా వ్యవసాయం, కట్టడాల నిర్మాణం వంటి రంగాల్లో ప్రావీణ్యం సంపాదించారు. హిమ యుగాంతాన (దాదాపు 11,000 సంవత్సరాల క్రితం) బేరింగ్ వంతెన సముద్రంలో మునిగిపోవటంతో వీరికి ఆసియా ఖండంతో సంబంధాలు తెగిపోయాయి. తిరిగి ఐరోపాకు చెందిన స్పానిష్ నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ 1493, నవంబరు 19న పసిఫిక్ మహా సముద్రంలోని ప్యూర్టో రికో దీవిలో అడుగు పెట్టే వరకూ వీరినీ, వారితో పాటు రెండు అమెరికా ఖండాల ఉనికినీ మిగతా ప్రపంచం మర్చిపోయింది. ఈ కొత్త ప్రపంచానికి క్రమంగా అమెరికా ఖండం అనే పేరు స్థిర పడింది. అనాదిగా అక్కడ స్థిర పడిన ఆసియా సంతతి తెగల వారిని దేశీయ అమెరికన్లు (నేటివ్ అమెరికన్స్) గా పిలవనారంభించారు. ఐరోపావాసుల రాక మొదలయిన కొద్ది కాలానికే వారితో పాటు అమెరికాలో ప్రవేశించిన అంటువ్యాధుల తాకిడికి దేశీయ అమెరికన్లలో చాలా శాతం అంతరించిపోయారు.

[మార్చు] అమెరికా లో 10 పెద్ద నగరాలు

  1. న్యూయార్క్
  2. లాస్ ఏంజిల్స్
  3. చికాగో
  4. హ్యూస్టన్
  5. ఫిలడెల్ఫియా
  6. ఫీనిక్స్ నగరం
  7. శాన్ అంటోనియో
  8. శాన్ డియాగో
  9. డల్లాస్
  10. డెట్రాయిట్
  11. సెయింట్ లూయిస్

[మార్చు] సంయుక్త రాష్ట్రాల జాబితా

[మార్చు] అంతర్జాతీయంగా ఉన్న స్థానం

సంస్థ నిజనిర్దారణ చేసి సేకరించిన సమాచారం స్థానం
యునైటెడ్ నేషన్స్ అభివృద్ది కార్యక్రమం మానవ అభివృద్ది సూచిక [5] 177లో12 స్థానం[6]
(1-వ స్థానం ఉత్తమం)
ది ఎకనోమిస్ట్ ఎలక్ట్రానిక్ వ్యాపారం చేసేదానికి సిధ్ధంగా ఉన్న దేశాలు 70లో1 స్థానం[7]
(1-వ స్థానం ఉత్తమం)
ది ఎకనోమిస్ట్ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ 48లో1 వ స్థానం[8]
(1-వ స్థానం ఉత్తమం)
ది ఎకనోమిస్ట్ అధిక కొనుగోలు శక్తి 70లో5 వ స్థానం[9]
(1-వ స్థానం ఉత్తమం)
A.T. Kearney/విదేశీ వ్యవహారాల పత్రిక [ అంతర్జాతీయకరణ సూచిక 2006] లో స్థానం
IMD International ప్రపంచ దేశాల పోటీ సూచిక పుస్తకం 10 లో స్థానం
ది ఎకనోమిస్ట్ ప్రపంచ మానవ జీవన ప్రమాణాల సూచిక 48 లో 41 వ స్థానం[10]
(1-స్థానం ఉత్తమం)
యేల్ యూనివర్సిటి/కొలంబియా యూనివర్సిటి వాతావరణ రక్షిత సూచిక, 2005 (pdf) లో వ స్థానం
ఎల్లలు లేని పాత్రికేయులు పత్రికా స్వేచ్చ సూచిక 2006 169లో48 వ స్థానం[11]
(1-వస్థానం ఉత్తమం)
ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ దేశాలలో అవినీతి సూచిక - 2007 158లో17 స్థానం[12]
(1-వ స్థానం ఉత్తమం)
హేరిటేజి ఫౌండేషన్/ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఆర్థిక స్వేచ్చ సూచిక,2007 162లో-5 వ స్థానం[13]
1-వ స్థానం ఉత్తమం
ది ఎకనోమిస్ట్ ప్రపంచ శాంతి సూచిక[14] 144 లో వ స్థానం 97
(1-వ స్థానం ఉత్తమం)
Fund for Peace/ForeignPolicy.com విఫల దేశాల సూచిక,2007 177 లో160 వ స్థానం[15]
(1-వ స్థానం అద్వాన్నం)[16]

[మార్చు] ప్రధాన వ్యక్తులు

[మార్చు] మూలాలు,వనరులు,సమాచార సేకరణ

  1. Population Finder: United States. U.S. Census Bureau. తీసుకొన్న తేదీ: 2007-12-20.
  2. 2.0 2.1 Report for Selected Countries and Subjects (30 advanced economies; 6 subjects). World Economic Outlook Database. International Monetary Fund (October 2007). తీసుకొన్న తేదీ: 2008-02-05.
  3. DeNavas-Walt, Carmen, Bernadette D. Proctor, and Jessica Smith (August 2007). Income, Poverty, and Health Insurance Coverage in the United States: 2006. U.S. Census Bureau. తీసుకొన్న తేదీ: 2008-02-05.
  4. The Human Development Index—Going Beyond Income. Human Development Report 2007. United Nations Development Program. తీసుకొన్న తేదీ: 2007-11-27.
  5. Human Development Index. తీసుకొన్న తేదీ: 2008-07-10.
  6. 2007/2008 Human Development Index rankings. తీసుకొన్న తేదీ: 2008-07-10.
  7. E-readiness ranking. తీసుకొన్న తేదీ: 2008-07-10.
  8. Biggest economies. తీసుకొన్న తేదీ: 2008-07-10.
  9. Highest purchasing power. తీసుకొన్న తేదీ: 2008-07-10.
  10. Highest life expectancy. తీసుకొన్న తేదీ: 2008-07-10.
  11. ప్రపంచ పత్రికా స్వేచ్చ సూచిక 2007. తీసుకొన్న తేదీ: 2008-07-10.
  12. Corruption Perceptions Index 2007. తీసుకొన్న తేదీ: 2008-07-10.
  13. Index of Economics freedom 2008. తీసుకొన్న తేదీ: 2008-07-10.
  14. All information in the table of rankings from: Both are linked from: Vision of Humanity (2008). EIU Reports - Documents - Global Peace Index. తీసుకొన్న తేదీ: 2008-06-17.
  15. Failed States Index Scores 2007. తీసుకొన్న తేదీ: 2008-07-10.
  16. larger number indicates sustainability

[మార్చు] బయటి లింకులు

United States గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

Wiktionary-logo-en.png నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
Wikibooks-logo.svg పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
Wikiquote-logo.svg ఉదాహరణలు వికికోటు నుండి
Wikisource-logo.svg మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
Commons-logo.svg చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
Wikinews-logo.png వార్తా కథనాలు వికీ వార్తల నుండి

ప్రభుత్వం
గణాంకాలు
చరిత్ర
దేశ పటాలు
ఇతరాలు


[మార్చు] ఇతర వివరాలు













వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు
వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
సహాయము
పరికరాల పెట్టె
ఇతర భాషలు