చాక్లెట్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
చాక్లెట్
Chocolate.jpg
Chocolate most commonly comes in dark, milk, and white varieties, with cocoa solids contributing to the brown color
వంటకం వివరాలు
ప్రధానపదార్థాలు Chocolate liquor

చాక్లెట్ లేదా చాకొలైట్ లేదా శాకోలేట్ ఒక మిఠాయి. దీనిని ఎక్కువగా కర్మాగారాలలో తయారు చేస్తారు. పిల్లలు మరియు అమ్మాయులు దీనిని ఇష్టంగా తింటారు.స్నేహితులైనా ప్రేమికులైనా ఆత్మీయులైనా అధికారులైనా శుభాకాంక్షలు చెప్పాలన్నా అభినందనలు తెలపాలన్నా స్వాగతిస్తున్నా వీడిపోతున్నా ఇచ్చిపుచ్చుకునే కానుక చాక్లెట్లే. ఒకప్పుడు ఎవరినైనా కలవాలన్నా శుభాకాంక్షలు చెప్పాలన్నా పూలూ పండ్లే తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు వీటి స్థానంలోకి చాక్లెట్ వచ్చేసింది తియ్యగా. ముఖ్యంగా చిన్నపిల్లలకయితే చాక్లెట్‌ని మించిన కానుక లేనే లేదు. అందుకే అందమైన బాక్సుల్లోనూ బొకేల్లోనూ ముస్తాబు చేసి మరీ అందిస్తున్నారు. పెళ్లి, పుట్టినరోజు, కొత్తసంవత్సరం... వంటి వేడుకల్లోనూ ఫ్యాషన్ వేదికలమీదా అద్భుతమైన చాక్లెట్ కళాకృతులతో ఆహూతుల్ని అలరిస్తూ తీసి రుచుల్ని అందిస్తున్నారు.

నేపధ్యము[మార్చు]

లైంగిక ఉత్తేజాన్ని పెంచే ఆహారాలలో చక్లైట్లు కుడా ఒకటి . చాక్లైట్ల లో ఉండే అమినో ఆమ్లాలు అడ్రినాలిన్ , డోపమైన్ అనే రసాయనాల విడుదలకు కారణమవుతాయి . అడ్రినాలిన్ ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని , డోపమైన్ ఆనందాన్ని పెంచే హార్మోన్ గా పనిచేస్తాయి . ఇక వాటిలో ఉండే కొన్ని రసాయనాలు పురుసాంగము లోని రక్తనాళాల్లో ఉండే ఎండోలియం పని తీరును మెరుగుపరుస్తాయి . రక్తనాళాలను వ్యాకోజింప జేసి రక్త సరఫరా వేగంగా జరిగేలా చేసే " నైట్రిక్ ఆక్శైడ్" ఉత్పత్తికి తోడ్పడతాయి . కోకోవా ఎక్కువగా ఉండే బ్లాక్ చాక్లైట్లు వాడితేనే ఫలితం బాగా ఉంటుంది .

రక్తపోటు అధికంగా ఉందని డాక్టరు దగ్గరికి వెళితే ఔషధ నిర్ణయం (ప్రిస్కిప్షన్)లో ఒక డోస్ డార్క్ చాక్లెట్ తీసుకోమని సలహా ఇస్తున్నారట! అదెలా అంటారా? అయితే చదవండీ....

రక్తపోటు నివారణకు డార్క్ చాక్లెట్ ఒక దివ్య ఔషధమని కొత్త పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. డార్క్ చాక్లెట్లలో- కేటచిన్‌ అనే ఫ్లావనాయిడ్ పదార్ధం ఉంటుంది. ఇది మన రక్త నాళాలను పెద్దదిగా చేసే శక్తి కలిగి ఉంటుందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. దీని కారణంగా రక్తనాళాలలో రక్త ప్రసరణ సులువుగా జరుగుతుంది.

చాక్లెట్ - రకాలు - తయారీ[మార్చు]

కకోవా గింజలతో చేసే చాక్లెట్ల రుచులూ రకాలూ కోకొల్లలు. ప్రాథమికంగా చాక్లెట్స్ మూడే రకాలు.

  • కకోవా లిక్కర్(గింజ తొడిమనుంచి తీసే పొడి లేదా ద్రవం)
  • కకోవా బటర్(గింజలోని కొవ్వుపదార్థం)
  • కకోవా పొడి (లిక్కర్, కొవ్వు తీసేయగా మిగిలిన పొడి)ని వాడుతూ చేస్తారు. కకోవా లిక్కర్‌కి కాస్త కకోవా బటర్, పంచదార కలిపి చేసేదే డార్క్ చాక్లెట్ లేదా బ్లాక్ చాక్లెట్. ఇందులో కలిపే కకోవా లిక్కర్ కనీసం 35 శాతానికి తగ్గకూడదనే నిబంధన ఉంది. ఖరీదైన డార్క్ చాక్లెట్స్‌లో 70 నుంచి 99 శాతం కకోవా లిక్కర్ ఉంటుంది. కకోవా ద్రవం లేదా పొడి కనీసం 20 శాతం ఉండి పాలు, పంచదారతో కలుపుతూ చేసేదే మిల్క్ చాక్లెట్ . కకోవా బటర్ మాత్రమే వాడుతూ పాలు, పంచదారతో చేసేదే వైట్ చాక్లెట్ . ఇందులో కకోవా అస్సలు ఉండదు. ఈ మూడు రకాలకీ జోడించే పాలు, పంచదార శాతాన్ని బట్టి ఎన్నో రకాల చాక్లెట్లు చేస్తారు. వీటిల్లోనూ పుదీనా, వెనీలా, కాఫీ, ఆరెంజ్, స్ట్రాబెర్రీ... ఇలా రకరకాల ఫ్లేవర్లనీ బాదం, వేరుసెనగ, పిస్తా...వంటి నట్స్‌నూ జోడిస్తూ చేసే మరెన్నో రకాలు చాక్లెట్‌లు ఉన్నాయి.

చాక్లెట్ - శృంగారవాంఛ[మార్చు]

చాక్లెట్ శృంగారప్రేరితం అన్నది చారిత్రక సత్యం. నాటి అజ్‌టెక్ రాజు మాంటెజుమా రోజుకి 50 కప్పుల చాక్లెట్ తాగేవాడట. ప్రియురాల్ని కలుసుకునేముందు మరీ ఎక్కువట. ఈ రాచపోకడే చివరకు ప్రేమికుల రోజున ప్రేమికులు చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయానికి దారితీసింది. అయితే ప్రేమలో పడ్డప్పుడు విడుదలయ్యే ఫినైల్ ఇథైల్ ఎమీన్, శృంగారవాంఛను పెంచే ట్రిప్టోఫాన్ కకోవాలోనూ ఉంటాయని తేలింది.ఇదెలా ఉన్నా ఈ రెండూ ఆనందాన్ని కలిగించే సెరటోనిన్ విడుదలకు తోడ్పడతాయి.

చాక్లెట్లు - వైద్య సంబంధ ఉపయోగాలు[మార్చు]

  • డార్క్ చాక్లెట్లు  :కకోవా శాతం సుమారు 70 నుంచి 85 శాతం ఉండే డార్క్ చాక్లెట్‌లో ఎన్నో పోషకాలున్నాయి. పీచూ ఖనిజాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్లశాతం ఎక్కువ. అందుకే చాక్లెట్‌ను 'ఛాంపియన్ ఆఫ్ యాంటీఆక్సిడెంట్స్' అంటారు. ఇవి హృద్రోగాలనూ క్యాన్సర్లనూ దూరంగా ఉంచుతాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
  • ఇందులోని ఫ్లేవొనాల్స్ బీపీ నియంత్రణకు అవసరమైన నైట్రిక్ ఆక్సైడ్ శాతాన్ని పెంచుతాయి. రక్తప్రసారాన్ని మెరుగుపరుస్తూ సూర్యకాంతి నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.
  • చాక్లెట్ మెదడు పనితీరునీ మెరుగుపరుస్తుంది. డిప్రెషన్‌ని తగ్గిస్తుంది. చాక్లెట్ తింటే మనసు ఉత్సాహంగా ప్రశాంతంగా ఉంటుంది. మంచి నిద్ర పడుతుంది. ఇందులోని థియోబ్రొమైన్ మెదడులో న్యూరో ట్రాన్స్‌మిటర్లుగా పనిచేసే సెరటోనిన్, డోపమైన్ రసాయనాల విడుదలకు సహకరిస్తూ ఆనందాన్ని కలిగిస్తుంది. ఒత్తిడిని తగ్గించి, మెదడు చురుగ్గా ఉండేలా చేస్తుంది.
  • 100 గ్రా. చాక్లెట్ బార్‌లో 67శాతం ఐరన్, 58 శాతం మెగ్నీషియం, 89శాతం కాపర్, 98 శాతం మాంగనీసూ 11 గ్రా. పీచూ ఉంటాయి. పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, సెలీనియంలూ, బి1, బి2, డి, ఇ విటమిన్లూ ఉంటాయి. అయితే వంద గ్రా. చాక్లెట్ రోజూ తీసుకోలేం. ఎందుకంటే దీన్నించి 600 క్యాలరీలూ వస్తాయి. అందువల్ల ఒక ఔన్సు అంటే 28.5 గ్రా. చాక్లెట్ బార్‌ని తినడం ఆరోగ్యానికి మంచిదేనన్నది నిపుణుల ఉవాచ. దీనివల్ల ఇతర స్వీట్లూ నూనె పదార్థాలను తినాలన్న కోరిక తగ్గుతుంది.
  • కోకోవా ఉపయోగించి తయారుచేసిన చాక్లెట్ వల్ల జీర్ణనాళ క్యాన్సర్ వచ్చే అవకాశము తగ్గుతుంది.
  • కోకోవాలో ఉన్న " పాలీఫినాల్స్ " క్యాన్సర్ నుండి రక్షిస్తాయి.
  • చాక్లెట్లలో శక్తివంతమైన యాంటీ ఆక్షిడెంట్స్ ఉన్నాయి. అవి ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ ప్రభావమునుండి రక్షిస్తాయి. ఎంతో మేలు చేకూరుస్తాయి. ఫ్రీ రాడికల్స్ జీర్ణనాళములోని పేగుభాగపు క్యాన్సర్ ని తెస్తున్నాయ్ని కనుగొనబడింది . అటువంటి ఫీ రాడికల్స్ నుండి జీర్ణనాళ రక్షణకు చాక్లెట్స్ చక్కగా పనికొస్తాయని కొన్ని పరిశోధనలవల్ల వ్యక్తమయినది .
  • ఫ్లావనాల్స్ అనే పదార్ధం శరీరంలో ఎండోథీలియం నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తిని పెంచుతుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణ ప్రక్రియకు తోడ్పడుతుంది. అంతేకాకుండా తక్కువ రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. అయితే అధిక రక్తపోటు ఉన్న వారు ఈ డార్క్ చాక్లెట్లు తీసుకుంటే సత్ఫలితాలుంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.
  • చాక్లెట్లు తింటే పళ్లు పుచ్చిపోతాయనేది అపోహ మాత్రమే. చాక్లెట్లే కాదు, పిండిపదార్థాలు ఉన్న ఏ పదార్థం ఇరుక్కున్నా పళ్లు పుచ్చిపోతాయి. చాక్లెట్‌లోని సహజ కొవ్వులవల్ల మిగిలిన స్వీట్లకన్నా దీన్ని శుభ్రం చేయడం తేలిక. కకోవాలోని టానిన్లు త్వరగా పాచి పట్టనీయవు.
  • కానీ కొంత మందికి కోకోవా పడదు అలర్జీ వస్తుంది . నిద్ర కుడా కొందరిలో సరిగా పట్టదు . చాకోలిట్లు వాడడం లో జాగ్రత్త పడాలి .

చాక్లెట్లు - ప్రపంచవ్యాప్త వినియోగము[మార్చు]

  • ప్రపంచవ్యాప్తంగా ఏటా పది లక్షల కోట్ల రూపాయల చాక్లెట్ ఉత్పత్తుల్ని వినియోగిస్తున్నారు. వీటిల్లో సగం వాటా అమెరికన్లదే. మిల్క్ చాక్లెట్లంటే వాళ్లకి మరీ ఇష్టం. వంటల్లోనూ చాక్లెట్ రుచిని కోరుకుంటున్నారు.
  • వ్యక్తిపరంగా చూస్తే అందరికన్నా ఎక్కువగా స్విట్జర్లాండ్ వాసులు ఏడాదికి తలకి సుమారు 11 కిలోల పైనే తినేస్తున్నారు. విచిత్రంగా ఊబకాయం, గుండెజబ్బులు తక్కువగా ఉన్న దేశాల్లో స్విట్జర్లాండ్ ఒకటి.
  • చాక్లెట్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం కోట్ డీవార్

ప్రపంచంలోనే ఖరీదైన చాక్లెట్లు[మార్చు]

చాక్లెట్లలో ఖరీదైన చాక్లెట్ల తీరే వేరు. నిప్‌షిల్ట్ ఫ్రిట్జ్ కంపెనీ 1999లో రూపొందించిన చాకొపొలాజి ప్రపంచంలోకెల్లా ఖరీదైనది. అత్యుత్తమ ట్రఫెల్, కకోవా బీన్స్‌తో తయారయ్యే దీన్ని ఆర్డరుమీద చేస్తారు. అరకిలో సుమారు రూ.2 లక్షలు. తరవాతి స్థానం సుమారు రూ.56 వేల ఖరీదు చేసే నోకా వింటేజ్ కలెక్షన్‌ది. దీనికోసం ట్రినిడాడ్, ఈక్వెడార్, వెనెజులా, కోట్ డీవార్ నుంచి కకోవా గింజల్ని సేకరిస్తారు. నాణ్యమైన కకోవా గింజలతోనూ 24 క్యారెట్ల బంగారు ఆకులతోనూ చేసే డెలాఫీది మూడో స్థానం. సుమారు రూ.33 వేలు. బార్ విషయానికొస్తే బంగారుపూత పూసిన క్యాడ్‌బరీస్ విస్పాదే ప్రథమస్థానం. దీని ఖరీదు రూ. లక్షా ఆరువేలు.

చాకొలైట్ గురించి కొన్ని విశేశాలు[మార్చు]

  • చాక్‌లెట్ వాడకం అన్నది క్రీస్తుపూర్వం 100వ సంవత్సరం నుంచీ వుందని లెక్క తేల్చారు. ఆ కాలంలో దక్షిణ మెక్సికోలోని OLMECS అనే ఆటవికుల తెగ చాక్‌లెట్ పానీయాన్ని సేవించేవారని పరిశోధకులు తేల్చారు.
  • 1528లో స్పానిష్ పరిశోధకుడు HERNANDO CORTEZ కోకా బీన్స్ మెక్కను దక్షిణ అమెరికా నుంచి స్పానిష్ రాజకుటుంబానికి బహుమతిగా తెచ్చాడట.
  • అమెరికాలో సుమారు నాలుగు వందల ఏళ్ల క్రితమే కోకా మొక్కను పెరటితోటలో పెంచే అలవాటు వుండేది.
  • మొదటి సారి మెక్సికోలో చాక్‌లెట్ బార్ తయారీ ప్రారంభమైంది. అదీ 300 ఏళ్ల క్రితం. ఆ తరువాత చాలా కాలానికి 1840లో ప్రఖ్యాత క్యాడ్‌బరీ కంపెనీ ప్రారంభమైంది.
  • కోకా చాక్‌లెట్లు తిని సెక్స్‌లో పాల్గొంటే మరింత హుషారుగా వుంటుందన్నది కేవలం మానసిక భావనే తప్ప నిజం కాదట.
  • మనుషులకు అంత ప్రియమైన చాక్‌లెట్లు కుక్కలకు మాత్రం ఏమంత మంచివి కాదట. చాక్‌లెట్‌ల్లో వుండే థియోబ్రొమైన్ అనే పదార్ధం కుక్కల సెంట్రల్ నెర్వస్ సిస్టమ్‌ను దెబ్బతీస్తుందట.
  • హిచ్‌కాక్ ప్రఖ్యాత చిత్రం సైకోలో ఒక సన్నివేశంలో రక్తం చూపించడం కోసం కోకో సిరప్‌ను వాడారట.
  • మిల్క్ చాక్లెంట్లంటే ప్రపంచవ్యాప్తంగా మోజే కానీ, మగవారు ఎక్కువ డార్క్ చాక్‌లెట్లనే ఇష్టపడతారని ఓ సర్వేలో తేలింది.
  • ఒక్క చాక్‌లెట్ తింటే 150 అడుగుల దూరం నడించేంత శక్తి వస్తుందట.
  • ఏటా ప్రపంచవ్యాప్తంగా ఏడు బిలియన్ డాలర్ల విలువైన చాక్‌లెట్లు ఖర్చయిపోతున్నాయి.
  • కకోవా చెట్ల స్వస్థలం దక్షిణ అమెరికా. దీన్ని కకావో అని పిలిచేవారు. వీటిని మొదట ఆల్మెక్ అమెరికన్లు గుర్తించారు. మాయన్లూ అజ్‌టెక్‌ల ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. అప్పట్లో వీళ్లు కకోవా గింజల్నే కరెన్సీగా వాడేవారు.
  • అరకిలో చాక్లెట్ తయారీకి సుమారు 400 కకోవా గింజలు కావాలి. ఏటా ఆరు లక్షల టన్నుల గింజల్ని చాక్లెట్లకోసం వాడుతున్నారు.
  • శక్తి కోసం నెపోలియన్ వెంట ఎప్పుడూ ఓ చాక్లెట్ ఉండేదట. జ్ఞాపకశక్తి పెరిగేందుకు రోజూ చాక్లెట్ పూత పూసిన 3 వెల్లుల్లి రెబ్బల్ని ఉదయాన్నే తినేవాడట రూజ్‌వెల్ట్.
  • లండన్‌లోని ఆర్చిపెలాగో రెస్టారెంట్ మెనూలో చాక్లెట్ పూతపూసిన తేళ్లు ఉంటాయి.
  • ఆనందాన్ని పంచేందుకో పెంచుకునేందుకో చాక్లెట్ తినే సందర్భాల నుంచి అన్నింటా చాక్లెట్ అనే సంస్కృతి భారతీయులకీ అలవాటైపోయింది. హాట్ చాక్లెట్ ఫౌంటెయిన్లతోపాటు చాక్‌టెయిల్సూ, చాక్‌షేకులూ, చాకొపిజ్జాలూ, శాండ్‌విచ్‌లతో కూడిన చాక్లెట్‌రూమ్‌లు భారత నగరాల్లోనూ ఉన్నాయి. ఔత్సాహిక వంటగాళ్ళు అయితే చాక్లెట్ కేకులూ కుకీలూ డెజర్ట్‌లూ బిస్కెట్లూ డ్రింకులూ ఐస్‌క్రీములూ, పాప్‌కార్న్‌లతో పాటు లడ్డూలూ ఇడ్లీలూ దోసెలూ సమోసాలక్కూడా చాక్లెట్ రుచులు అద్దేస్తున్నారు.
  • లిథేనియాలోని విల్నియిస్‌లో ఆక్రోపాలిస్ షాపింగ్‌మాల్‌లో వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ చాక్లెట్ రూమ్‌ని ఏర్పాటు చేసింది. పైకప్పు నుంచి ఫ్లోరింగ్ వరకూ అందులో అన్నీ చాక్లెట్ నిర్మితాలే. ఇది కేవలం చూసేందుకే. గొడివా కంపెనీ కూడా చాక్లెట్ రూమ్‌ని ఏర్పాటు చేసింది. సోఫాలో కూర్చుని మరీ ఆ గదిలోని చాక్లెట్ అందాలను ఆస్వాదించవచ్చు.

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=చాక్లెట్&oldid=1374545" నుండి వెలికితీశారు