చాద్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
جمهورية تشاد
జమ్-హూరియత్ త్‌షాద్
రిపబ్లిక్ డు ట్‌చాద్
చాద్ గణతంత్రం
Flag of చాద్ చాద్ యొక్క Coat of arms
నినాదం
"Unité, Travail, Progrès"  (ఫ్రెంచ్)
"ఏకత్వం, పని, ప్రగతి"
జాతీయగీతం
లా చాదియెన్ని
చాద్ యొక్క స్థానం
రాజధాని నద్‌జమేనా
12°06′N, 15°02′E
Largest city రాజధాని
అధికార భాషలు ఫ్రెంచ్, అరబ్బీ
ప్రభుత్వం గణతంత్రము
 -  రాష్ట్రపతి ఇద్రీస్ దేబి
 -  ప్రధానమంత్రి దెల్వా కసీరె కౌమకోయె
స్వాతంత్ర్యం ఫ్రాన్స్ నుండి 
 -  తేది ఆగస్టు 11 1960 
విస్తీర్ణం
 -  మొత్తం 1,284,000 కి.మీ² (21వది)
495,753 చ.మై 
 -  జలాలు (%) 1.9
జనాభా
 -  2005 అంచనా 10,146,000 (75వది)
 -  1993 జన గణన 6,279,921 
 -  జన సాంద్రత 7.9 /కి.మీ² (212వది)
20.4 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $15.260 బిలియన్లు (128వది)
 -  తలసరి $1,519 (163వది)
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Increase 0.368 (low) (171వది)
కరెన్సీ మధ్య ఆఫ్రికా ఫ్రాంక్ (XAF)
కాలాంశం WAT (UTC+1)
 -  వేసవి (DST) గమనించబడలేదు (UTC+1)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .td
కాలింగ్ కోడ్ +235

చాద్ (ఆంగ్లం :Chad (ఫ్రెంచ్ భాష : Tchad ), (అరబ్బీ భాష : تشاد}} త్‌షాద్ (Tshād)), అధికారిక నామం చాద్ గణతంత్రం ("రిపబ్లిక్ ఆఫ్ చాద్") మధ్య ఆఫ్రికా లోని ఒక భూపరివేష్టిత దేశం. 1960నకు పూర్వం ఇదొక ఫ్రెంచ్ కాలనీ.

చాద్ దేశం-పూర్వాపరాలు[మార్చు]

క్రీస్తు పూర్వం 7వ శతాబ్దమునందే చాద్ సరస్సు ప్రాంతానికి వేల సంఖ్యలో జన జీవనం వ్యాపించింది. క్రీ.పూ. 1వ శతాబ్దానికి అనేక చిన్నచిన్న రాజ్యాలు ఏర్పడినాయి నశించిపొయాయి కూడా. ఇక్కడ ఏర్పడిన ప్రతి రాజరికము కూడా, సహారా వ్యాపార మార్గాలను తమ అదుపులో ఉంచుకోవటానికి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చాయి. 1920లో ఈ దేశాన్ని ఫ్రాన్స్ ఆక్రమించి తమ 'ఫ్రెంచి ఈక్విటోరియల్ ఆఫ్రికా' వలస ప్రాంతములో కలుపుకున్నది. ప్రాంకొయిస్ టొమ్బలబయ నాయకత్వంలో, చాద్ 1960 స్వాతంత్రము సాధించుకున్నది. అతని ప్రభుత్వము మీద, ఉత్తరాన ఉన్న ముస్లిముల నిరసన ఎక్కువయి, 1965 సంవత్సరానికల్లా, అంతర్యుద్ధానికి దారి తీసినది. 1979 సంవత్సరములో విప్లవకారులు రాజధాని నగరాన్ని ఆక్రమించి, ఎంతో కాలం బట్టి జరుగుతున్న దక్షిణప్రాంతవాసుల పరిపాలనకు చరమ గీతం పాడారు. కాని, విప్లవకారులు, వారి నాయకులు, తమలో తామె కుమ్ములాడుకున్నారు, సరయిన పరిపాలన జరగలేదు. ఇటువంటి పరిస్థితి, హిస్సెని హబ్రి వచ్చి వారిని ఓడించె వరకు జరిగినది. జెనరల్ ఇద్రిస్ దెబె, హబ్రిని 1990లో అధికారం నుండి పడగొట్టి, తాను పరిపాలించటం మొదలు పెట్టాడు.

భౌగీళికం[మార్చు]

చాద్ లోని మూడు ప్రాంతాలు

ఆఫ్రికాలోని రెండవ పెద్ద సరస్సు చాద్. ఆ సరస్సు పేరుమీదగానే చాద్ దేశం ఏర్పడినది. చాద్ దేశాన్ని అధికారికంగా 'రిపబ్లిక్ ఆఫ్ చాద్' అని పిలుస్తారు. చాద్ మధ్య ఆఫ్రికాలో ఉన్నది. ఈ దేశానికి సముద్ర తీరం లేదు, అన్ని పక్కలా ఇతర దేశాల భూభాగమే! అందువలన, ఎగుమతి-దిగుమతులకు పొరుగు దేశాలమీద ఆధారపడవలచినదే. ఉత్తరాన లిబియా, తూర్పున సూడాన్, దక్షిణాన 'సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్' ఉన్నాయి. అలాగే, కామెరూన్ మరియు నైగర్ కూడా చాద్ తో సరిహద్దుగల దేశాలు. సముద్ర ప్రాంతానికి దూరంగా ఉండటం వలన, ఈ దేశంలో ఎడారి వాతావరణం ఉంటుంది. చాద్ దేశం భౌగోళికముగా మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు-1) ఉత్తరాన ఎడారి ప్రాంతము, 2) మధ్య ప్రాంతములో నిస్సారమయిన 'సహెలీయన్' ప్రాంతము మరియు 3) దక్షిణాన సారవంతమయిన సుడాన్-సవన్నా ప్రాంతము. చాద్ లో పెద్ద నగరం 'ఎన్-జమీరా', అతి పెద్ద పర్వత శిఖరం 'ఎమి కౌస్సి'. చాద్ లో రెండు వందలకు పైగా జాతులు, భాషా సంబంధ సముదాయాలు ఉన్నాయి. ప్రభుత్వ భాషలు ఫ్రెంచి మరియు అరబిక్. ఎక్కువ మంది ప్రజలు ఇస్లాం మతాన్ని అవలంభిస్తారు.

రాజకీయాలు[మార్చు]

దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికి, అధికారం మాత్రం అధ్యక్షుడు డెబె మరియు అతని రాజకీయ పార్టీ "దేశభక్త విముక్తి ఉద్యమం" (PATRIOTIC SALVATION MOVEMENT) చేతుల్లోనే కేంద్రీకృతమయి ఉన్నది. చాద్ లో రాజకీయ హింస ఎక్కువ మరియు సైనిక కుట్రల తలనొప్పి కూడా ఎక్కువ అనే చెప్పవచ్చు. చాద్ ఇప్పటికి అతి బీద దేశాలలో ఒకటి మరియు ఇక్కడ అవినీతి ప్రపంచలో కెల్లా ఎక్కువట. ఎక్కువమంది ప్రజలు దుర్భర దరిద్రంలో గొడ్లు కాచుకుంటూనో, వ్యవసాయం చేసుకుంటూనో చాలీ చాలని జీవితాలను గడుపుతున్నారు. సామన్యంగా ఆ దేశానికి అక్కడ పండే ప్రత్తి పంట వల్ల ఎక్కువ ఆదాయం వచ్చేది. కాని, 2003లో ముడి చమురు కనుగొనబడినప్పటినుండి, ముఖ్య ఆదాయవనరు 'ముడి చమురు' గా మారి పోయినది.

చరిత్ర[మార్చు]

కీస్తు పూర్వం 7వ శతాబ్దములో, ప్రకృతి సహజ వాతావరణ పరిస్తితుల వలన ఉత్తర చాద్ ప్రాంతం జనావాసాలకు ఎంతగానో అనుగుణ్యంగా ఉండేదట. అందువలన, ఆ ప్రాంతంలో త్వరితగతిన జనాభా పెరుగుదల సంభవించిందట. పురాతత్వ తవ్వకాలలో ఎప్పటివో రెడువేల సంవత్సారల కిందటి గుర్తులు ఈ ప్రాంతములో దొరికినవి. ఈ ప్రాంతములో ముఖ్యముగా వ్యవసాయము మీద ఆధారపడి జీవించేవారట. రకరకాల సంస్కృతులకు నిలయమయ్యినదట. ఇటువంటి సంస్కృతులలో మొట్టమొదటిది, ఎంతో పేరొందిన "సావో" సంస్కృతి. ఈ సంస్కృతి ప్రాముఖ్యం చక్కటి చేతి పనులు మరియు మౌఖిక చరిత్రా విధానం. అంటే, వారి చరిత్ర వ్రాయకుండానే, ఒక తరం నుండి తరువాతి తరానికి అందించేవారాట. కాని, సావో సంస్కృతిని "కానెమ్" రాజరికం నాశనం చేసింది. కానెమ్ రాజరికం చాద్ లో ఎక్కువకాలం మనగలిగి పరిపాలించిన రాజరికం. ఈ రాజరికములోనె, 1వ శతాబ్ద ప్రాంతములో, చాద్ లొని 'సహెలియన్" ప్రాంతాన్ని అభివృధిపరిచారు. ఈ రాజరికం యెక్క శక్తి, సహారా వ్యాపార మార్గాల మీద వారి అధీనము, అధిపత్యము వలన వచ్చినదట. వీరు సామాన్యముగా ముస్లిము మతాన్ని అవలింభించేవారట. వారెప్పుడు కూడా చాద్ దక్షిణ ప్రాంతమును తమ అధిపత్యములోనికి తెచ్చుకొనలేదు. కాని, అప్పుడప్పుడు, బానిసలను లాక్కురావటానికి మాత్రం, దక్షిణ ప్రాంతం మీద దాడులు చేస్తూ ఉండేవారట.

ప్రెంచి వలసవాదులు చాద్ ప్రాంతీయ సైన్యం అని 1900 సంవత్సరములో ఏర్పరిచి, తద్వారా 1920 కల్లా చాద్ ను తమ పూర్తి అధీనంలోకి తెచ్చుకున్నారు. ప్రెంచి వారెప్పుడు, చాద్ లొని వివిధ వర్గాల మధ్య సయోధ్యత తీసుకురావటాని ప్రయత్నించలేదు. వారి పరిపాలనలో సరయిన విధానాలు లేవు, అధునీకరణ కూడా చాల స్వల్పంగా జరిగినది. ఫ్రెంచి వారికి, చాద్ ఒక పనికిరాని వలస ప్రాంతం మాత్రమే. చవకయిన కూలీల కొరకు చాద్ వారికి ఉపయోగపడేదట. 1929కల్లా ప్రెంచి వారు, పత్తి ఉత్పత్తి చాద్ లో పెద్ద ఎత్తున మొదలు పెట్టించారు. ప్రెంచి వలసవాద ప్రభుత్వం సిబ్బంది కొరతతో అంతగానొ బాధపడేదట. ప్రాంతీయుల సహకారంతో పరిపాలన ఎలాగొలాగు జరిపించేవారట. దక్ష్రిణ ప్రాంత మాత్రమే సవ్యంగా పరిపాలించబడేదట. ఉత్తర, ప్రాచ్య ప్రాంతాలలో ప్రెంచి ప్రాబల్యం నామమాత్రమేనట. దీని మూలాన, విద్య విధానం ఎంతగానో అశ్రద్దచేయుబడినది. రెండవ ప్రపంచ యుధానంతరం ప్రెంచివారు, చాద్ కు విదేశ ప్రాంత హోదా కలగచేసారు. చాద్ ప్రజలకు, తమ ప్రెంచి జాతీయ సభకు మరియు చాద్ అసెంబ్లీకి తమ ప్రతినిధులను ఎన్నుకునె అవకాశం కలిగించారు.అప్పట్లో అతి పెద్ద రాజకీయ పార్టీ, 'చాదియన్ ప్రోగ్రెసివ్ పార్టీ'. ఈ పార్టీ ఎక్కువగా దక్షిణ చాద్ లో ప్రాచుర్యంలో ఉండేది. ప్రాంకొయిస్ టొమ్బలబయ నాయకత్వంలో చాద్ ప్రజలు స్వాతంత్రము కొరకు అందోళన జరిపినందువలన ప్రెంచి వారు, చాద్ కు ఆగస్టు 11, 1960న స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు. స్వతంత్ర చాద్ దేశపు మొదటి అధ్యక్షుడు పి.పి.టి. నాయకుడయిన ఫ్రాంకోఇస్ టొంబల్ బయె.


రెండు సంవత్సరముల తరువాత టొంబల్ బయె ఇతర రాజకీయ పార్టీలన్నిటిని నిషేధించి, తన పార్టీ ఒకటి ఉంచి, ఏక పార్టీ పాలనకు తెర తీసాడు. టొంబల్ బయె నిరంకుశ పాలన, అతని చాతకాని విధానాలు, జాతుల మధ్య వైరుధ్యాన్ని పెంచి వారి మధ్య ఉద్రిక్తలకు దారి తీయటాని తోడ్పడ్డాయి. 1965 లో చాద్ దేశంలోని ముస్లిమ్ లు అంతర్యుద్ధాన్ని మొదలు పెట్టారు. టొంబల్ బయె ను పదవీచ్యుతుణ్ణి చేసి 1975లో చంపివేశారు. కాని, అధికారంకొరకు అంతర్యుద్ధం కొనసాగినది. 1979 లో విప్లవకారులు రాజదాని నగరాన్ని ఆక్రమించారు, దానివల్ల, కేద్రీకృతమయిన అధికార పాలన అంతమయ్యింది. అయుధ ధారులయిన విప్లవ మూకల మధ్య అధికార పోరు కొనసాగినది. దీనివల్ల, ప్రాన్స్ కు ఉన్న పరపతి పోయి, చివరకు పొరుగు దేశమయున లిబియా, చాద్ అంతర్యుధములో వేలు పెట్టటానికి అవకాశం దొరికినది. 1987లో లిబియా పొరుగు దేశమయిన చాద్ లొ చేయ తలబేట్టిన, సాహసం బెడిసికొట్టింది, మళ్ళీ, ప్రెంచి వారి ఆదరణ/బలంతో అధ్యక్షుడు హిస్సెని హబ్రి ఇంతకు మునుపెప్పుడు చాద్ లో ఎరుగని దేశభక్తిని ప్రబోధించి, లిబియా సైన్యాన్ని, చాద్ నుండి తరిమిగొట్టగలిగాడు.

హబ్రి కూడ నియంతే. హబ్రి తన నిరకుశ పాలనను అవినీతి, హింసలతో బలొపేతం ఛెసుకున్నాడు. సుమారు 40,000 ప్రజలు అతని పాలనలో చంపబడ్డారు. హబ్రి తన తెగ అయిన 'డాజ' వారినె దగ్గ్రకు తీసి, తన పూర్వ మిత్రులయిన 'జఘావ' తెగవారిమీద సవతి తల్లి ప్రేమ చూపి, వారికి అన్యాయం చేసాడు. దీంతో , అసంతృప్తి పెరెగిపోయి, అతని సైనికాధికరయిన జెనరల్ ఇద్రిస్ దిబె, 1990వ సంవత్సరములో, హెబ్రె ను ప్దవీచ్యుతుణ్ణి చేసి అధికారం చేజిక్కంచుకునాడు.

దెబె అనేక విధాలుగా ఉన్న విప్లవకారులమధ్య సంధి కుదిర్చి, పలు పార్టీ వ్యవస్తను మళ్ళీ ప్రవేశపెట్టాడు."ప్రజా నిర్ణయం"(REFERENDUM)ద్వారా కొత్త రాజ్యాంగాన్ని, చాద్ ప్రజలు అమోదించారు. 1996లో దెబె అధ్యక్ష అన్నికలలో సునాయాసంగా గెలిచాడు. అతను రెండవసారి కూడా అధ్యక్ష పదవికి మరో ఐదు సంవత్సరాలు ఎన్నికయ్యాడు. 2003లో ముడి చమురు నిక్షేపాలకొరకు వెతకటం మొదలయ్యింది. దీనివల్ల, ప్రగతి జరిగి, శాంతి సౌభాగ్యాలతో తులతూగుదనుకున్న చాద్, లొలోపల రాజుకున్న అసంతృప్తి మూలంగా మళ్ళీ అంతర్యుద్ధంలోకి నెట్టబడింది.ఈసారి, దెబె, ఏకపక్షంగా రాజ్యాంగాన్ని మార్చి, అధ్యక్షుడిగా ఏవ్యక్తి అయినాసరే రెండుసార్లకన్నా ఉండకూఅదన్న నిబంధనను తీసిపారేశాడు. ఈ చర్య, మిగిలిన నాగరిక ప్రపంచం నిరసించింది. ఆవిధంగా, 2006లో మూడవసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావటం జరిగింది. ఆ ఎన్నికను ప్రతిపక్షాలన్నీ బహిష్కరించాయి. తూర్పు చాద్ లో జాతుల మధ్య యుద్ధం చెలరేగింది. ఐక్యరాజ్య కాదిశీకుల అతున్నత అధికారి దర్ఫుర్ మాదిరి జాతుల ఊచకోత చాద్ లో జరిగే అవకాశం ఉన్నదని హెచ్చరించాడు. 2006 మరియు 2008 సంవత్సరాలలో, విప్లవ సైన్యాలు, రాజధాని నగరన్ని తమసైనిక బలంతో అక్రమించ చూశాయి గాని, ఆ రెండు సందర్బాలలోను విజయం సాధించలేకపోయారు.

రాజకీయము-ప్రభుత్వము[మార్చు]

చాద్ రాజ్యాంగము ప్రకారము అధ్యక్షునికి ఎనలేని అధికారాలు ఉన్నాయి, ఆయన రాజకీయాలలో ముఖ్య పాత్ర వహిస్తారు. అధ్యక్షుడు, ప్రధానమంత్రిని, అతని కాబినెట్ లో మత్రులను నియమిస్తాడు. అంతేకాదు, మిలిటరి జనరల్స్, న్యాయమూర్తులను మరియు ఇతర అధికారుల నియామకాలలో ఎంతో కీలక పాత్ర వహిస్తాడు. దేశంలోని పరిస్తితులు బాగాలేనప్పుడు, శాంతి భద్రతలకు తావ్ర విఘాతం ఏర్పడినప్పుడు, అధ్యక్షుడు జాతీయ అసెంబ్లీ ని సంప్రదించి, అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు.అధ్యక్షుణ్ణి, ప్రజలే ఐదు సంవత్సరాల పదవీకాలానికి ఎన్నుకోవటం జరుగుతుంది. అధ్యక్షుడు రెండు సార్లకన్నా ఎన్నిక కాకూడదనే నియమం ఇదువరకు ఉండేది కాని, 2005 సంవత్సరములో ఈ నియమాన్ని తొలగించారు. అంటే ఒక వ్యక్తి ఎన్ని సార్లయినా అధ్యక్షుడిగా ఎన్నిక కావచ్చును.

దెబె ముఖ్య సలహాదార్లలో ఎక్కువమంది, జఘావా తెగకు చెందినవారు. అవినీతి అన్ని చోట్లా విలయ తాండవం చేస్తున్నది. అంతర్జాతీయ అవినీతి కొలత పద్దతులు-2005 ప్రకారం, చాద్ ప్రపంచంలోకెల్లా ఎక్కువ అవినీతి గల దేశమట, తరువాతి సంవత్సరాలలో ఏదో కొద్దిగా అవినీతి తగ్గినదని చెప్తారు. పది పాయింట్లు ఉన్న అవినీతి స్కేలు మీద, చాద్ కు1.8 మించి మార్కు రాలేదంటే, అక్కడ అవినీతి ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. చాద్ కంటే అవనీతిలో పై చెయ్యిగా ఉన్నదేశాలు టోంగా, ఉజ్బెకిస్తాన్, హైతి, ఇరాక్, మ్యాయన్మార్(బర్మా) మరియు సొమాలియా. అధ్యక్షుడు దెబె ను విమర్శించేవారు, అతను తన అనుచరులకు మాత్రమే మేలు చేస్తాడని, తన తెగ వాళ్ళను మాత్రమే దగ్గరకు తీస్తాడని అరోపణలు చేశారు.

కొద్ది చోట్ల చాదియ న్యాయ విషయాలు అమలులో ఉన్నప్పటికె, ఎక్కువగా చాద్ లో న్యాయ శాస్త్రము, న్యాయస్థానాలు, ప్రెంచి న్యాయ విధానలనే అనుసరిస్తాయి. నాయమూర్తులకు పూర్తి స్వేఛ ఉన్నప్పటికి, ముఖ్య న్యాయమూర్తులను నియమించేది మాత్రము అధ్యక్షుడే. న్యాయ నిర్ణాయక విధానంలో అతున్నతమైన సుప్రీం కోర్ట్ మరియు రాజ్యాంగ సభ 2000 సంవత్సరమునుండి పూర్తిగా పని చెయ్యటం మొదలు పెట్టాయి. సుప్రీం కోర్టులో అధ్యక్షుడితో నియమించబడిన చీఫ్ జస్టిస్ తో పాటు, అధ్యక్షుడు మరియు జాతీయు అసెంబ్లీ కలసి నియమించిన 15 జీవితకాలపు సభ్యులు ఉంటారు. రాజ్యాంగ న్యాయస్తానమునకు తొమ్మిది మంది న్యాయ మూర్తులను తొమ్మిది సంవత్సరాల పదవీ కాలమునకు ఎన్నుకుంటారు. ఈ న్యాయస్థానము, దేశమునందు చేయబడిన చట్టాలు, ఇతర దేశాలతో ఒప్పందాలను అమలు చేయటానికి ముందు పరిశీలించే అధికారం కలిగి ఉంటుంది.

జాతీయ అసెంబ్లీ దేశానికి అవసరమయిన చట్టాలను ప్రతిపాదించి, తయారు చేస్తుంది. ఇందులో 155 మంది సభ్యులు, వారి పదవీ కలం నాలుగు సంవత్సరాలు. ఈ జాతీయ అసెంబ్లీ సంవత్సరంలో మూడు సార్లు సమావేశమవుతుంది.ఈ విధమయిన సమావేశాలు మార్చ్ మరియు అక్టోబరు మాసాలలో జరుగుతాయి. ఎప్పుడయినా ప్రధానమంత్రి కోరినప్పుడు అత్యవసర సమావేశం కూడా జరపటానికి అవకాశం ఉన్నది.ఇందులోని సభ్యులు రెడేళ్ళ పదవీ కాలానికి, అసేంబ్లీ అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు. అసెంబ్లీ అధ్యక్షుడు, అసెంబ్లీ ప్రతిపాదించిన చట్టాలను ఒప్పుకుని సంతకం చెయ్యటమో లేదా తిరస్కరించటమో పదిహేను రోజులలో చెయ్యవలసి ఉంటుంది. ప్రధాన మంత్రి యెక్క కార్యాచరణ విధానాలను జాతీయ అసెంబ్లీ ఒప్పుకోవచ్చు లేదా ఎక్కువమంది సభ్యుల ఓటుతో 'నొ కాన్ఫిడెన్స్' ప్రతిపాదించి ప్రధానమంత్రిని తొలగించవచ్చు. అసెంబ్లీ కనుక ఒక సంవత్సరములో ప్రధాన మంత్రి క్ర్యాచరణను రెండుసార్లు తిరస్కరించినట్లయితే దేశాక్ష్యక్షుడు, అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలను జరిపించి కొత్త అసెంబ్లీని ఏర్పాటుచెయ్యవచ్చు. నిజానికి, దేశాక్ష్యక్షుడు తన పార్టీద్వారా, జాతీయ అసెంబ్లీ మీద పట్టు బిగించి ఉంటాడు. ప్రస్తుతాని దెబె తన దేశభక్త సాల్వేషన్ పార్టీకి జాతీయ అసెంబ్లీలో ఉన్న మెజారిటీతో అసెంబ్లీ మీద తన ప్రభావాన్ని చూపుతున్నాడు.

ప్రతిపక్షాలు వ్యతిరేకించే వరకు దెబె కి చెందిన పార్టీ ఒక్కటే ఉండేది. కాని ఇప్పుడు 78 రాజకీయ పార్టీలు చురుకుగా పని చేస్తున్నాయట. 2005వ సంవత్సరములో జరిగిన రాజ్యాంగ సవరణ ప్రజాబిప్రాయ సేకరణను(Referendum) ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. కారణమేమంటే, ఈ ప్రజాభిప్రాయ సేకరణ దేశాద్యక్షుడు రెండుసార్ల కన్న ఎక్కువ, ఎన్నిక కాకూడదన్న రాజ్యాంగ నిబంధన తొలగించి, తద్వారా దెబె మూడవసారి ఎన్నిక కావటానికి మార్గాన్ని సుగమం చెయ్యటానికి మాత్రమే.

దెబె కు వ్యతిరేకంగా అనేక అయుధధారులయిన విప్లవకారులు ఉనారు, వారిలో వారు కుమ్ములాడుకుంటున్నప్పటికి, వారందరి ఏకైక లక్ష్యం దెబె ను పదవీచ్యుతుణ్ణి చెయ్యటమే. ఈ విప్లవకారులు 13 ఏప్రిల్ 2006 లో రాజధాని మీద దాడి చేశాయి కాని ప్రభుత్వ దళాలు వారిని తిప్పి కొట్టాయి. ఈవిషయంలో, దెబెకు ప్రెంచి వారి సహాయం ఎంతయినా ఉన్నది. చాద్ విదేశాంగ విధానాలమీద ప్రెంచి వారి ప్రభావం చాలా ఉన్నది. ప్రెంచి వారు దాదాపు 1000 మంది తమ సైనికులను చాద్ లో ఇప్పటికి ఉంచారు.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

{{{1}}} గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

Wiktionary-logo-en.png [[wiktionary:Special:Search/{{{1}}}|నిఘంటువు నిర్వచనాలు]] విక్క్షనరీ నుండి
Wikibooks-logo.svg [[wikibooks:Special:Search/{{{1}}}|పాఠ్యపుస్తకాలు]] వికీ పుస్తకాల నుండి
Wikiquote-logo.svg [[wikiquote:Special:Search/{{{1}}}|ఉదాహరణలు]] వికికోటు నుండి
Wikisource-logo.svg [[wikisource:Special:Search/{{{1}}}|మూల పుస్తకాల నుండి]] వికి మూల పుస్తకాల నుండి
Commons-logo.svg [[commons:Special:Search/{{{1}}}|చిత్రాలు మరియు మాద్యమము]] చిత్రాలు మరియు మాద్యమము నుండి
Wikinews-logo.png [[wikinews:Special:Search/{{{1}}}|వార్తా కథనాలు]] వికీ వార్తల నుండి

ప్రభుత్వం


"https://te.wikipedia.org/w/index.php?title=చాద్&oldid=1467144" నుండి వెలికితీశారు