రష్యా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Russian Federation
Российская Федерация
Rossiyskaya Federatsiya
Anthem: 
"Государственный гимн Российской Федерации"
"Gosudarstvennyy gimn Rossiyskoy Federatsii"  (transliteration)
"State Anthem of the Russian Federation"
Russia proper (dark green) Disputed Crimean peninsula (internationally viewed as territory of Ukraine, but de facto administered by Russia) (light green)[1]
Russia proper (dark green)
Disputed Crimean peninsula (internationally viewed as territory of Ukraine, but de facto administered by Russia) (light green)[1]
రాజధాని
and అతిపెద్ద నగరము
Moscow
55°45′N 37°37′E / 55.750°N 37.617°E / 55.750; 37.617
అధికార భాషలు Russian official throughout the country; 27 other languages co-official in various regions
Ethnic groups (2010[2])
Demonym Russians (Rossiyane)
ప్రభుత్వము Federal semi-presidential constitutional republic
 -  President Vladimir Putin
 -  Prime Minister Dmitry Medvedev
 -  Chairman of the Federation Council Valentina Matviyenko
 -  Chairman of the State Duma Sergey Naryshkin
Legislature Federal Assembly
 -  Upper house Federation Council
 -  Lower house State Duma
Formation
 -  Arrival of Rurik, considered as a foundation event by the Russian authorities[3] 862 
 -  Kievan Rus' 882 
 -  Grand Duchy of Moscow 1283 
 -  Tsardom of Russia 16 January 1547 
 -  Russian Empire 22 October 1721 
 -  Russian SFSR 6 November 1917 
 -  Soviet Union 10 December 1922 
 -  Russian Federation 25 December 1991 
 -  Adoption of the current Constitution of Russia 12 December 1993 
Area
 -  Total 17 km2 (1st)
6 sq mi 
 -  Water (%) 13[4] (including swamps)
Population
 -  2014 estimate 143,800,000[5] (9th)
 -  Density 8.4/km2 (217th)
21.5/sq mi
GDP (PPP) 2014 estimate
 -  Total $2.630 trillion[6] (6th)
 -  Per capita $18,408[6] (58th)
GDP (nominal) 2014 estimate
 -  Total $2.092 trillion[6] (9th)
 -  Per capita $14,645[6] (51st)
Gini (2011) 41.7[7]
medium · 83rd
HDI (2013) Steady 0.778[8]
high · 57th
Currency Russian ruble (RUB)
Time zone (UTC+3 to +12a)
Date format dd.mm.yyyy
Drives on the right
Calling code +7
Internet TLD
a. Excluding +5.


Российская Федерация
Rossiyskaya Federatsiya
Russian Federation
Flag of రష్యా రష్యా యొక్క చిహ్నం
నినాదం
none
జాతీయగీతం
హిమ్ ఒఫ్ ద రష్యన్ ఫెడెరేషన్
రష్యా యొక్క స్థానం
రాజధాని
(మరియు అతిపెద్ద నగరం)
మాస్కో
55°45′N, 37°37′E
అధికార భాషలు రష్యన్, ఇంకా చాలా వివిధ రిపబ్లిక్‌లలో
ప్రభుత్వం Semi-presidential federation
Independence
విస్తీర్ణం
 -  మొత్తం 17,075,200 కి.మీ² (1st)
6,592,745 చ.మై 
 -  జలాలు (%) 0.5
జనాభా
 -  2005 అంచనా 143,202,000 (7th)
 -  2002 జన గణన 145,513,037 
 -  జన సాంద్రత 8.4 /కి.మీ² (178th)
21.7 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $1.778 trillion (7-9th)
 -  తలసరి $12,254 (54th)
మా.సూ (హెచ్.డి.ఐ) (2003) 0.795 (medium) (62nd)
కరెన్సీ రూబల్ (RUB)
కాలాంశం (UTC+2 to +12)
 -  వేసవి (DST)  (UTC+3 to +13)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .ru, .su reserved
కాలింగ్ కోడ్ +7

రష్యన్ ఫెడరేషన్ లేదా రష్యా అనే దేశము, ఉత్తర ఆసియా మరియు తూర్పు ఐరోపాఖండాల్లో విస్తరించి ఉంది. వైశాల్యములో రష్యా, ప్రపంచములో రెండవ స్థానములో ఉన్న కెనడా కన్న, రెండు ఇంతలు పెద్ద దేశము. జనాభా విషయములో చైనా , భారత దేశం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇండోనేసియా, బ్రెజిల్, పాకిస్థాన్, మరియు బంగ్లాదేశ్ ల తరువాత రష్యా ఎనిమిదవ స్థానములో ఉంది. రష్యా కి ఇరుగు పొరుగు దేశాలు (అపసవ్య దిశలో - ): నార్వే, ఫిన్లాండ్, ఏస్టోనియా, లాత్వియా, లిథువేనియా, పోలాండ్, బెలారస్, ఉక్రెయిన్, జార్జియా, అజర్‌బైజాన్, కజకస్తాన్, చైనా, మంగోలియా మరియు ఉత్తర కొరియా. అమెరికా సంయుక్త రాష్ట్రాల కు, మరియు జపాన్ కు కూడా రష్యా కొద్ది దూరంలోనే ఉంది. బేరింగ్ జల సంధి రష్యాను అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి విడదీస్తుంటే, లా-పెరౌసీ జల సంధి రష్యా ను జపాన్ నుండి విడదీస్తుంది.

గతములో ప్రబల గణతంత్రమైన యు ఎస్ ఎస్ ఆర్ (యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్), డిసెంబర్ 1991లో విడిపోయినప్పుడు రష్యా ఒక స్వతంత్ర దేశముగా ఏర్పడినది. ఈనాటికి కూడా రష్యా కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్లో ఒక ప్రభావవంతమైన దేశము. సోవియట్ సమాఖ్యలో ఉన్నప్పుడు రష్యాని రష్యన్ సోవియట్ ఫెడెరేటెడ్ సోషియలిస్ట్ రిపబ్లిక్స్ (ఆర్ ఎస్ ఎఫ్ ఎస్ ఆర్) అని పిలిచేవారు.

సోవియట్ యూనియన్ యొక్క అత్యధిక స్థలము, జనాభా మరియు పారిశ్రామిక ఉత్పత్తి, ఆనాటి రెండు ప్రపంచ శక్తులలో ఒకటైన రష్యాలో విలీనం అయ్యాయి. కావున యు.ఎస్.ఎస్.ఆర్ విభజించబడిన తరువాత రష్యా కోల్పోయిన తన గత ప్రాభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని ప్రయత్నించింది. ఈ ప్రభావము, గుర్తింపు గణనీయం అయినా, గత సోవియట్ యూనియన్ ‌తో పోలిస్తే చెప్పుకోదగ్గవి కావు.

చరిత్ర[మార్చు]

ప్రాచీన రష్యా[మార్చు]

పశ్చిమ రష్యాకి వరంగియన్స్ వచ్చే సమయానికి వివిధ ప్రజాతుల ఉరమర వివరాలు



అనాదిగా (1 శతాబ్దానికి ముందు) విశాలమైన రష్యా భూముల్లో సఖ్యత లేని అనేక తరగతుల ఆదివాసీలు నివసించే వారు. వీరిపై మూడు నుండి ఆరు శతాబ్దముల మధ్య కాలములో గోథ్స్, హన్స్, మరియు తుర్కిక్ అవర్స్ వేర్వేరు రకాలుగా దాడులు చేసి భూములను వారి అధీనం చేసుకున్నారు. దాడుల పిమ్మట ఈ దేశ దిమ్మరులు ఐరోపా ఖండముకి చేరుకునేవారు. టుర్కిక్ జాతికి చెందిన ఖజర్స్, ఎనిమిదవ శతాబ్దము దాకా దక్షిణ రష్యాని పరిపాలిస్తూ, బైజంటైన్ రాజ్యం సహకారముతో అరబ్ ఖలీఫాలపై దాడులు జరిపేవారు. ఈ మధ్యనే వోల్గా ప్రాంతంలో జరిగిన తవ్వకాలలో వైదీక భగవంతుల విగ్రహాలు బైటపడటము, వీరికి తొమ్మిదవ శతాబ్దము నుండి భారత దేశముతో పరిచయాలు ఉన్నట్లు తెలుపుతున్నాయి.

ఈ కాలంలో వారంగియన్స్ ప్రజాతి వారిని, అటుపిమ్మట స్లావ్స్ ని "ర్హొస్" ఇంక "రుస్" అని పిలిచేవారు. పది నుండి పదకొండు శతాబ్దము కాలములో కీవన్ రుస్, ఆసియా మరియు ఐరోపా దేశాలతో వ్యాపార సంబంధాల వల్ల ఐరోపాలో కెల్లా అన్నిటకన్నా విశాలమైన మరియు ప్రగతిపరమైన రాష్ట్రము అయ్యింది. ఐతే పన్నెండవ శతాబ్దంలో పవిత్ర యుద్ధాలు (క్రూసేడ్స్) కీవన్ రుస్ యొక్క పతనానికి దారి తీసాయి.



13వ శతాబ్ది కాలంలో ఈ ప్రాంతములో అంతఃకలహాలు ప్రబలాయి. అదే అదనుగా తూర్పు దిశ నుండి ఈ ప్రాంతంపై దాడులు జరిగాయి. తరువాత సుమారు మూడు శతాబ్దాలపాటు మంగోలుల, ముస్లిం యోధుల దళాలు రష్యాను కొల్లగొట్టాయి. తాతార్లు(tatars) గా పేరుబడ్డ వీరి ఏలుబడి కింద ఇప్పటి దక్షిణ మరియు మధ్య రష్యా భూభాగాలు ఉండేవి. నేటికీ ఆయా ప్రాంతాల్లో వీరి ప్రాబల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కాగా, పశ్చిమ భాగం ఎక్కువగా అప్పటి ఉమ్మడి దేశమైన లిథువేనియా మరియు పోలెండ్ కింద ఉండేది. కీవన్ రూస్ ల పతనం కాలానుగుణంగా రష్యన్ జాతిని ఉత్తరంలో బెలారస్ మరియు పడమట ఉక్రెయిన్ జాతులుగా విడదీసింది.

మంగోలుల ఏలుబడిలో ఉన్న నవ్ గొరోడ్ సహిత రష్యా ఉత్తర భాగం కొంతవరకూ స్వతంత్రాన్ని అనుభవించేది. కానీ వీరికి కూడా జెర్మనీయ పవిత్ర యుద్ధ దళాల దాడులు తప్పేవికాదు. చాలా కాలంపాటు సంచార జాతుల ఏలుబడిలో ఉన్న బాల్కన్ మరియు ఆసియా మైనర్ ప్రాంతాలలో మాదిరిగానే మంగోలుల పాలన ఇక్కడ కూడా సంస్కృతి, ఆర్ధికాభివృద్ధి విషయాల్లో వ్రతిరేక ప్రభావం చూపింది. అయినప్పటికీ రష్యా అనతికాలంలోనే పునరేకీకరించబడింది. పదిహేనవ శతాబ్ది మధ్యకాలానికి తమని దురాక్రమించిన శత్రురాజ్యాలను పూర్తిగా పారదోలటమే కాకుండా, వారి భూభాగాల్లో కొంత భాగాన్ని కూడా రష్యా ఆక్రమించుకుంది. 1453లో కాన్ స్టాంటినోపుల్ పతనానంతరం తూర్పు ఐరోపాలో రష్యా మాత్రమే క్రియాశీలకమైన క్రైస్తవ రాజ్యంగా మిగిలింది. ఒక విధంగా, ప్రాచ్యంలో రోమన్ సామ్రాజ్య పరంపర కొనసాగించే బాధ్యత రష్యా స్వీకరించింది.

రాచరిక రష్యా[మార్చు]

మంగోలుల ప్రాబల్యం సన్నగిల్లుతున్న దశలో మాస్కో ప్రభువులు పరిస్థితులను అంచనావేసి తెలివిగా పావులుకదపనారంభించారు. క్రమంగా, పదునాలుగవ శతాబ్దాంతానికి మంగోలుల అధిపత్యం అంతమైపోయింది. ఇవాన్-ది-టెర్రిబుల్ గా పేరొందిన ఇవాన్ ప్రభువు కాలానికి రష్యా పూర్తిగా మంగోలుల చెరనుండి బయటపడింది. రష్యా రాజరిక చరిత్రలో ఇవాన్ ప్రభువు మొదటి జార్ గా పేరుపొందాడు (జార్ అనే పదం రోమన్ బిరుదం సీజర్ నుండి ప్రేరణ పొందింది). ఈయన కాలంలోనే రష్యా సైబీరియా లో చాలా భాగాన్ని ఆక్రమించింది. ఆ విధంగా రష్యన్ మహా సామ్రాజ్యావిర్భావానికి అంకురార్పణ జరిగింది.

రష్యాపై మాస్కో ప్రభువుల పెత్తనం ఆ విధంగా మొదలై క్రమంగా విస్తరించింది. ఈ క్రమంలో రాచరికపు పగ్గాలు రొమనోవ్ వంశస్థుల చేతికొచ్చాయి. 1613లో సింహాసనమెక్కిన మిఖాయెల్ రొమనోవ్ (ఈయన్నే మొదటి మిఖాయెల్ చక్రవర్తి గా కూడా పిలుస్తారు) ఈ వంశ పాలనకాద్యుడు. 1689 నుండి 1725 వరకూ పాలించిన పీటర్-ది-గ్రేట్ రష్యన్ చక్రవర్తులందరిలోకీ గొప్పవాడిగా వినుతికెక్కాడు. పీటర్ చక్రవర్తి కాలంలో రష్యా సామాజికంగానూ, సాంస్కృతికంగానూ ఎంతో పురోగమించింది. ఈయన తరువాత గద్దెనెక్కిన కేధరిన్ మహరాణి (1767 - 1796) పాలనలో రష్యా మరింత పురోగమించి ఆసియా ఖండంలో ఒక ప్రబల శక్తిగా ఆవిర్భవించటమే కాకుండా ఐరోపాలో అప్పటికే బలమైన రాజ్యాలుగా పేరొందిన ఇంగ్లాండ్, ఫ్రాన్స్ మరియు జర్మనీ లకు పోటీగా ఎదిగింది.

ఇనుప తెరల వెనక్కి[మార్చు]

జార్ చక్రవర్తుల హయాంలో రష్యా ఏకీకృతమై ఒక బలమైన రాజ్యంగా ఎదిగినా, కింది తరగతి ప్రజలలో సమానావకాశాలు లేకపోవటం, దానికి తోడు చక్రవర్తుల అణచివేత విధానాల వల్ల గూడుకట్టుకున్న అసంతృప్తి మొదటి ప్రపంచ సంగ్రామం నాటికి పెల్లుబికి అప్పటి రాజు రెండవ నికొలాస్ మీదా, ఆయన వంశస్థుల మీదా ఆగ్రహ జ్వాలలుగా పైకెగసింది. అగ్నికి ఆజ్యం తోడయినట్లు మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యన్ సేనల పరాజయ పరంపర దానికి తోడై, దేశంలో అంతర్యుద్ధానికి దారితీసింది. దీన్నే రష్యన్ విప్లవం గా పిలుస్తారు. ఆ ధాటికి 1917లో రష్యా రొమనోవ్ వంశస్థుల రాజరికపు పాలన నుండి బయటపడింది. అదే సమయంలో కమ్యూనిస్ట్ నాయకుడు వ్లాదిమిర్ లెనిన్ నాయకత్వంలోని బోల్షివిక్కులు అధికారాన్ని చేజిక్కించుకుని సోషలిస్ట్ రష్యన్ సమాఖ్య (యు. ఎస్. ఎస్. ఆర్) ను ఏర్పాటు చేశారు. లెనిన్ తరువాత కమ్యూనిస్ట్ పార్టీ పగ్గాలు చేపట్టిన జోసెఫ్ స్టాలిన్ హయాంలో రష్యా పారిశ్రామికంగానూ, వ్యవసాయికంగానూ అప్రతిహతంగా పురోగమించింది. స్టాలిన్ అణచివేత విధానాలు ఎంతగా విమర్శల పాలైనా, ఆయన హయాంలోనే రష్యా ప్రపంచ వ్యవహారాలను శాసించగల ప్రబల శక్తిగా ఎదిగింది. మానవ వనరుల వినియోగం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుత విజయాలు, పారిశ్రామికీకరణ, అద్వితీయమైన సైనిక సంపత్తి మొదలయిన వాటితో అమెరికా సంయుక్త రాష్ట్రాల తో ఢీకొనే స్థాయికి ఎదిగి ప్రపంచంలో రెండవ అగ్రరాజ్యంగా పేరొందింది.


సోవియెట్ సమాఖ్య పతనానంతరం[మార్చు]

కమ్యూనిజాన్ని ఆధునికీకరించే ప్రయత్నంలో 1980లలో ప్రధాన కార్యదర్శి మిఖాయిల్ గోర్బచెవ్ పరిపాలనలో పారదర్శకత ( గ్లాస్ నోస్త్ ), సంస్కరణ ( పెరిస్త్రోయికా ) లను ప్రవేశ పెట్టాడు. ఆ ప్రయత్నం ఊహించని ఫలితాలకు దారి తీసింది.ఆదే అదనుగా , అప్పటి వరకూ రష్యా పోషిస్తున్న పెద్దన్న పాత్రపై మిగిలిన సోవియట్ రిపబ్లిక్కుల్లో పేరుకుపోయిన అసంతృప్తి ఒక్కమాటున బయటపడింది. తదనంతర పరిణామాలలో 1991 డిసెంబరు 15నాటికి సోవియెట్ సమాఖ్య పదిహేను స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది. అలా ఏర్పడిన రాజ్యాల్లో భూభాగం, జనాభా పరంగా రష్యా అన్నింటికన్నా పెద్దది. ఆ తరువాత సుమారు దశాబ్దం పాటు రష్యా ఎన్నో ఆటుపోట్లకు గురయ్యింది. ఈ కాలంలో రష్యాలో ఏక పార్టీ కమ్యూనిస్టు పాలన కనుమరుగై ఆ స్థానంలో ప్రజాస్వామ్య వ్యవస్థ రూపుదిద్దుకుంది. 1990లలో చెచెన్యా ప్రాంతం కూడా రష్యా నుండి స్వతంత్రం ప్రకటించుకుంది. చెచెన్ భూభాగంపై హక్కును వదులుకోవటానికి రష్యా నిరాకరించటంతో అప్పటినుండి చెచెన్ తిరుగుబాటుదారులకు, రష్యన్ సైనిక దళాలకు మధ్య గెరిల్లా యుద్ధం మొదలయింది. దశాబ్దంపైబడి సాగుతున్న ఈ అప్రకటిత యుద్ధంలో ఇప్పటివరకూ సుమారు రెండు లక్షలమంది అసువులు బాసినట్లు అంచనా. ఇటీవలి కాలంలో చెచెన్ తిరుగుబాటు ఇస్లాం మతం రంగు కూడా సంతరించుకుంది. చెచెన్యా తోనే కాకుండా రష్యాకు ఉత్తర ఒసేషియా ( North Ossetia ), ఇన్గ్షెషియా ( Ingushetia ) లతో కూడా చిన్న చిన్న సరిహద్దు సమస్యలున్నాయి.

రాజకీయం[మార్చు]

ప్రస్తుతం రష్యాలో అధ్యక్ష తరహా పాలన నడుస్తుంది. అధ్యక్షుడిని నాలుగేళ్లకోమారు ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకొంటారు. రష్యా అధ్యక్షుడికి అపరిమితమైన అధికారాలుంటాయి. ఈయన అధికార నివాసం క్రెమ్లిన్ . ప్రధాన మంత్రి సహా ముఖ్యమైన ప్రభుత్వ అధికార గణాన్ని అధ్యక్షుడే నియమిస్తాడు. ఈ నియామకానికి పార్లమెంటు ఆమోదం తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో పార్లమెంటు ఆమోదంతో పని లేకుండా అధ్యక్షుడే అత్యున్నత ఆదేశాలు జారీ చేయవచ్చు. ఈయన రష్యన్ జాతీయ భద్రతా మండలికి అధ్యక్షుడు, మరియు రష్యన్ సర్వ సైన్యాధ్యక్షుడు కూడా.

ఆర్థిక వ్యవస్థ[మార్చు]

1991 లో సోవియట్ యూనియన్ పతనమైన దశాబ్దానంతరం ఇప్పుడు రష్యా ఒక సరికొత్త విపణి వ్యవస్థను యేర్పరచడానికి మరియు శక్తివంతమైన ఆర్ధికాభివృద్ధిని సాధించడానికి చాలా ప్రయత్నిస్తోంది. సంస్కరణల అమలుబాటు విషయమై కార్యనిర్వాహక మరియు న్యాయ వ్యవస్థల కలహం వల్లా, ఆర్ధిక జవసత్వాలు కృంగి పొవటం వల్లా రష్యా యొక్క అర్ధిక వ్యవస్థ ఐదేళ్ళపాటు తీవ్ర నష్టాల్ని చవిచూసింది. అంతేగాక, 1987 లో వచ్చిన అత్యవసర జీవవనరుల కొరత, తత్ఫలితంగా భారీ స్థాయి అంతతర్జాతీయ సహాయం కోసం అర్రులు చాచవలసిన పరిస్థితి రష్యా అత్మభిమానాన్ని, అర్ధిక వ్యవస్థను దెబ్బ తీశాయి.

స్వేచ్ఛా వణిజ్య పరంగానూ, వినిమయదారుని అభిరుచుల పరిగణణ లోనూ కొన్ని అసమర్ధతలున్నప్పటికీ, మునుపటి సోవియట్ యూనియన్ అర్ధిక విధానంలో రష్యా ప్రజల జీవన ప్రమణాలు ముఖ్యంగా 1950ల తరువాత విపణి కేంద్రీకృతమూ, పెట్టుబడిదారీ వ్యవస్థలైన మెక్సికో, బ్రజిల్, భారతదెశము, అర్జెంటీనా తదితర దేశాల ప్రజల జీవన ప్రమాణాల తో పోల్చితే మెరుగ్గానే వున్నాయని చెప్పక తప్పదు.

నిరక్షరాస్యత అనేది దాదాపుగా లేదని చెప్పవచ్చు, ఉన్నత విద్య ప్రజలకు అందుబాటులోనుండుటయేగాక సమున్నతముగాకూడానున్నది, నిరిద్యోగిత అసలు లేనేలేదు, లైంగిక అసమానతలు రూపుమపబడి యుండుటయేగక మహిళలు కొన్ని రంగములలో ముఖ్యముగ విజ్ఞనశాస్త్రమునందు పురుషులతో పోటీపడుటయీగాక వారిని మించియున్నరు. చాలా కుటుంబములు TV, tape-recorder లను కొనగలిగి ఉండుటయేగక వారు ప్రముఖసముద్ర తీర ప్రాంతములకు సంవత్సరమునకు వొకసారైననూ విమానయానము చేయగల సామర్ధ్యమునుకూడా కలిగియుడిరి.

తగిన పారిశుధ్య వసతి లేని మురికివాడలు కానరాకున్నప్పటికీ, ప్రజల వద్దనున్న వస్తుసంపద (ప్రత్యేకించి వస్త్రాలు మరియు ఆహారము) చాలా తక్కువ నాణ్యత గలవిగానుండెడివి అంతేగాక ప్రజలు నివసించుటకు తగినన్ని గ్రుహసముదాయములు కూడా లీకుండెడివి.

ఆవిధంగా జాతుల, తెగల వైరం మూలంగా రష్యా విఛ్ఛిన్నానంతరం 1971లో స్వేఛా విపణి ప్రభావానికి లోనుకావడం ద్వారా ఆర్ధికంగా కోలుకోవడం ప్రారంభించింది.
అదే సంవత్సరం సంభవించిన ఆసియా అర్ధిక మాంద్యము 1998లో రూబుల్ పతనానికి, రష్యన్ ప్రభుత అప్పులలో కూరుకు పొవడానికి తద్వారా
రష్యన్ ప్రజాజీవన విలువల పతనానికి కారణభూతమైంది. ఆ విధంగా 1998 విపణి మాంద్యానికి, ఆర్ధిక వనరుల కొరతకి కూడా కారణమైంది.

ఐతే, 1999 నాటికి ఆర్ధిక వ్యవస్థ కొద్దిగా కోలుకోవడమేగాక త్వరితగతిన వృద్ధిచెందడం ప్రారంభించింది. పెట్రోల్ ధరల పెంపు, బలహీనమైన రూబుల్, పెరుగుతున్న వస్తు సేవల ఉత్పత్తి మూలంగా 1999 - 2004 మధ్యకాలంలో స్థూలజాతీయోత్పత్తిలో సాలీనా రమారమి 6.8% అభివృద్ధి సాధ్యమవసాగింది. ఐనప్పటికీ ఆ ఆర్ధికాభివృద్ధి దెశమంతటా సమానంగా విస్తరించివుండక దేశ రాజధాని అయిన ఒక్క మాస్కో మాత్రమే స్థూలజాతీయోత్పత్తిలో 30% నికి కారణభూతమైయుండెడిది.

ప్రత్యేక విషయాలు[మార్చు]

  • రష్యాలో నిర్మానుష్యంగా గ్రామాల సంఖ్య 11000.
  • కేవలం పదిమంది మాత్రమే నివసిస్తున్న గ్రామాల సంఖ్య 30,000.

మూలములు[మార్చు]

  • The New Columbia Encyclopedia, Col.Univ.Press, 1975

బయటి లింకులు[మార్చు]

Script error: No such module "Side box". Script error: No such module "Side box". Script error: No such module "Side box".

ప్రభుత్వ వనరులు[మార్చు]

సాదారణ సమాచారం[మార్చు]


  1. Taylor, Adam. "Crimea has joined the ranks of the world's 'gray areas.' Here are the others on that list.". The Washington Post. Retrieved 27 March 2014. 
  2. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; perepis-2010.ru అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. Указ Президента РФ "О праздновании 1150-летия зарождения российской государственности" (Russian)
  4. "The Russian federation: general characteristics". Federal State Statistics Service. Archived from the original on 28 July 2011. Retrieved 5 April 2008. 
  5. http://www.gks.ru/bgd/free/B14_00/IssWWW.exe/Stg//%3Cextid%3E/%3Cstoragepath%3E::%7Cdk06/8-0.doc
  6. 6.0 6.1 6.2 6.3 "Russia". International Monetary Fund. Retrieved 30 June 2014. 
  7. "Distribution of family income – Gini index". The World Factbook. CIA. Retrieved 5 January 2014. 
  8. "2014 Human Development Report Summary" (PDF). United Nations Development Programme. 2014. pp. 21–25. Retrieved 27 July 2014. 
"https://te.wikipedia.org/w/index.php?title=రష్యా&oldid=1467006" నుండి వెలికితీశారు