స్వీడన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Greater coat of arms of Sweden.svg
Flag of Sweden.svg

స్వీడన్ (స్వీడన్ సామ్రాజ్యం) ఉత్తర యూరప్ కు చెందిన ఒక దేశము. స్కాండినేవియా ద్వీపకల్పానికి చెందిన ఒక నార్డిక్ కౌంటీ. 1995 జనవరి 1 నుంచి యూరోపియన్ యూనియన్ లో భాగమైంది. దీని రాజధాని నగరం స్టాక్ హోం.

దీని వైశాల్యం 449,964 చ.కి.మీ. స్వీడన్ వైశాల్యపరంగా చూస్తే యూరప్ లో ఐదవ, మరియు పశ్చిమ యూరప్ లో మూడవ అతి పెద్ద దేశం. అయితే ఇక్కడ మెట్రోపాలిటన్ నగరాలను మినహాయిస్తే మిగతా ప్రాంతాలలో జన సాంద్రత చ.కి.మీ కు 20 మాత్రమే. 84% శాతం మంది నగరాలలోనే నివసిస్తారు. నగరాల మొత్తం వైశాల్యం దేశ వైశాల్యంలో 1.3% మాత్రమే. [1] ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు చాలా మెరుగ్గా ఉంటాయి. ఇది చాలా ఆధునికమైన మరియు స్వేచ్చాయుతమైన దేశం. పర్యావరణ సంరక్షణ, వాతావరణ సమతౌల్యాన్ని పాటించడానికి ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను అక్కడి ప్రజలు మనస్పూర్తిగా ఆహ్వానిస్తారు.[2][3]

స్వీడన్ చాలా ఏళ్ళ నుంచి ఇనుము, రాగి, కొయ్యలను ప్రధానంగా ఎగుమతి చేస్తూవస్తోంది. 1890 లలో వచ్చిన పారిశ్రామికీకరణ మార్పుల నేపథ్యంలో ఇక్కడ ఉత్పత్తి పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి. 20వ శతాబ్దం నాటికి మంచి UN హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆధారంగా మంచి సంక్షేమ దేశంగా అభివృద్ధి సాధించింది. అభివృద్ధి చెందిన రవాణా సాధనాలు, మరియు కమ్యూనికేషన్ సాధనాలను ఉపయోగించుకొని ఇక్కడి సహజ సిద్ధమైన వనరులను వారు చాలా చక్కగా వినియోగించుకొంటున్నారు. స్వీడన్ నీటినుంచి విస్తారంగా విధ్యుచ్చక్తిని ఉత్పత్తి చేస్తారు గానీ ఇక్కడ చమురు నిల్వలు, బొగ్గు నిల్వలు చాలా తక్కువ.

జనాభా వివరాలు[మార్చు]

ఏప్రిల్ 2007 గణాంకాలను అనుసరించి స్వీడన్ మొత్తం జనాభా 9,131,425 గా అంచనా వేయబడింది.[4]

భాష[మార్చు]

స్వీడన్ లో ప్రధానంగా మాట్లాడే భాష స్వీడిష్. ఇది ఒక ఉత్తర జర్మనిక్ భాష. డేనిష్, నార్వేజియన్ భాషలకు చాలా దగ్గరగా ఉండి ఉచ్ఛరణలో, మరియు లిపిలో మాత్రం తేడా ఉంటుంది. నార్వేజియన్లు స్వీడిష్ భాషను చాలా తేలికగా అర్థం చేసుకోగలుగుతారు. కానీ డేనిష్ ప్రజలు నార్వేజియన్లతో పోలిస్తే అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టపడతారు.

మూలాలు[మార్చు]

  1. Statistics Sweden. Yearbook of Housing and Building Statistics 2007. Statistics Sweden, Energy, Rents and Real Estate Statistics Unit, 2007. ISBN 978-91-618-1361-2. Available online in pdf format.
  2. Swedish Environmental Protection Agency (Naturvårdsverket) (2006). Sweden's Environmental Objectives – Buying into a better future. A progress report from the Swedish Environmental Objectives Council. De Facto, 2006, p. 9: "Swedes in general feel that environmental issues and action to reduce impacts on the environment are important". See also Legislation & guidelines and Greenhouse gas emissions: "Swedish greenhouse gas emissions per head of population are among the lowest in the member states of the OECD."
  3. Kristrom, Bengt and Soren Wibe (1997). Environmental Policy in Sweden. Swedish University of Agricultural Sciences – Department of Forest Economics, Working paper 246, 27 August 1997.
  4. Statistics Sweden.Preliminary Population Statistics, by month, 2004 - 2006. Population statistics, 1 January 2007. Retrieved 14 February 2007.
"https://te.wikipedia.org/w/index.php?title=స్వీడన్&oldid=1467228" నుండి వెలికితీశారు