ఆసియాప్రపంచములోని అతిపెద్ద ఖండము మరియు అత్యంత జనాభా కలిగిన ఖండము. ఆసియా ఖండం భూమి యొక్క మొత్తం తలములో 8.6% మేర విస్తరించి ఉన్నది లేదా మొత్తం భూతలములో 29.4%) మరియు ప్రపంచము యొక్క ప్రస్తుత జనాభాలో 60% శాతం మంది ప్రజలు ఆసియాలో నివసిస్తున్నారు.
ఆసియా అనే పురాతన గ్రీక్ (గ్రీక్ భాషలో "Ασία" అని వ్రాస్తారు) మాట నుండి లాటిన్ భాష ద్వారా ఇంగ్లీష్ భాష లోనికి వచ్చింది. ఆసియా అన్న పేరు మొదట వాడింది గ్రీక్ చక్రవర్తి హీరోడోటాస్ (క్రీ.పూ 440). వీరు ఈ పదాన్ని అనాతోలియా (ఆసియా మైనర్ ప్రాంతం), అంటే పర్షియన్ రాజులుపర్షియన్ యుద్దాలు చేసే ప్రదేశమనే అర్థంలో వాడారు.