వికీపీడియా:రచ్చబండ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అడ్డదారి:
WP:VP
రచ్చబండ
వార్తలు | పాలసీలు | ప్రతిపాదనలు | సాంకేతికము | ఆలోచనలు | పత్రికా సంబంధాలు | ఇతరత్రా..

తెలుగు వికీపీడియాలో స్తబ్దత[మార్చు]

తెలుగు వికీపీడియాలో తిరిగి రచనలు ప్రారంభించాలనుకొంటున్నాను. (వికీసోర్సు నుండి తొలగించబడిన పుస్తకాలన్నీ అర్జునరావు, రహ్మానుద్దీనుల చొరవతో తిరిగి స్థాపించబడ్డాయి) నా యొక్క విలువైన సమయాన్ని సద్వినియోగం చేయడానికి, నా సోదర సభ్యుల సలహాలు కోరుతున్నాను. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 09:39, 30 ఆగష్టు 2015 (UTC)

డాక్టరు Rajasekhar1961 గారు, నమస్కారము. మీరు కొద్దికాలము కేవలం విశ్రాంతి తీసుకున్నారు. మీరు అందుబాటులో లేని లోటు లోటుగానే ఉంటుంది. ముఖ్యంగా, పనిచేసే మరియు పనిచేయించ గలిగే మీలాంటి వారు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటేనే మాలాంటి వారికి ఒక దారి తెన్నూ లభిస్తుంది. మీరు ప్రశ్నించండి, వీలయితే సమాధానము చెప్పగలుగుతాము. మీకు శుభాభివందనములు. JVRKPRASAD (చర్చ) 11:48, 30 ఆగష్టు 2015 (UTC)
ధన్యవాదాలు. సభ్యులందరికీ అందుబాటులో ఉంటూ మీ అందరి సహాయ సహకారాలతో తెవికీని మరింత ముందుకు తీసుకొని పోవడానికి ప్రయత్నిస్తాను.--Rajasekhar1961 (చర్చ) 13:40, 30 ఆగష్టు 2015 (UTC)
Rajasekhar1961 గారు వికీపీడియా వ్యాసాలను అభివృద్ది చేయడానికి కృషి ప్రారంభించ సంకల్పించినందుకు ధన్యవాదాలు. వారికి సంపూర్ణ సహకారం అందించగలను. వారి సారధ్యంలో వికీ మరింత అభివృద్ధి చెందగలదు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 14:10, 30 ఆగష్టు 2015 (UTC)
  • రాజశేఖర్ గారూ పున:స్వాగత శుభాకాంక్షలు. నేను తెలుగు సినిమా వ్యాసాలపై చేస్తున్న కృషిని గమనించి, దానిని ఇతర సభ్యుల సహకారంతో మరింత వ్యాపితం చేసేందుకు మీరిచ్చిన సూచనలతో ప్రాజెక్టు ఉపపేజీ ప్రారంభించాను. మీలాంటి అనుభవజ్ఞులు అంకితభావం కలవారు ఈ ప్రణాళికలో పాలుపంచుకుంటే బావుంటుంది. --పవన్ సంతోష్ (చర్చ) 07:18, 31 ఆగష్టు 2015 (UTC)
తప్పకుండా నేను భాగస్వామిగా సినిమా వ్యాసాలను అభివృద్ధి చేద్దాము. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 11:04, 31 ఆగష్టు 2015 (UTC)
నేను మీకు సహాయపడగలను, నా వద్ద తెలుగు సాంకేతికత ఉన్నది, వ్యాసాలు వ్రాయడములో మీకు సహాయపడగలను. ఏమైనా సహాయపడగలను అనుకుంటే నాతో చెప్పండి. ధన్యవాదములు -- శ్రీనివాస్ (చర్చ | మార్పులు) 15:59, 31 ఆగష్టు 2015 (UTC)

క్రికెట్[మార్చు]

క్రికెట్ నకు సంబందించిన వ్యాసాలు తెలుగు వికిపీడియ లో ఎవరు కూడా వ్రాయడం లేదు, ప్రస్తుతం జరుగుతున్న వాటిల్లో నేను శ్రీలంక పర్యటనలో భారత క్రికెట్ జట్టు 2015 అనే దానిని వ్రాయనారంబించితిని. మీరు కూడా నాతో సహకరించండి. మీరు కూడా మరిన్ని వ్యాసాలు వ్రాయుటకు మీ సహకారాన్ని అందించండి. ధన్యవాదములు. శ్రీనివాస్ (చర్చ | మార్పులు) 13:58, 30 ఆగష్టు 2015 (UTC)

శ్రీనివాస్ గారూ మీరు క్రికెట్ సంబంధిత వ్యాసాలను వ్రాయ సంకల్పించినందుకు ధన్యవాదాలు. మా సహకారం ఎప్పుడూ ఉంటుంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 14:07, 30 ఆగష్టు 2015 (UTC)
ధన్యవాదములు కె.వెంకటరమణ, మనము మిగిలిన అన్నీ క్రికెట్ వ్యాసములు, మూసలు, వర్గములు మొదలగునవి కూడా వ్రాయదలచితిని. శ్రీనివాస్ (చర్చ | మార్పులు) 14:17, 30 ఆగష్టు 2015 (UTC)
వ్రాయండి. సహకరిస్తాము.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 14:39, 30 ఆగష్టు 2015 (UTC)
చాలా మంచి ప్రణాలిక. క్రికెట్ గురించిన మంచి సమాచారం ఆంగ్ల వికీపీడియాలో కలదు. వానినుండి తెలుగులోకి అనువాదం చేసుకొంటే కొంతవరకు పని జరుగుతుంది. నేను మీకు సహాయం అందించగలను.--Rajasekhar1961 (చర్చ) 15:14, 30 ఆగష్టు 2015 (UTC)

మూలాలు చేర్చే మూసలు కనపడడం లేదు[మార్చు]

మూలాలు చేర్చండి అన్న బార్ పెట్టి, దానిలో సైట్ వెబ్, సైట్ న్యూస్, సైట్ బుక్, సైట్ జర్నల్ అన్న నాలుగు మూసలు, పేరుపెట్టిన మూలాలు, తప్పుల తనిఖీ అనేవి చేర్చారు. ఇన్నాళ్ళుగానూ మొత్తం మూస మార్కప్ కోడ్ రాసుకోకుండా బటన్ ద్వారానే వినియోగించుకుంటున్నాను.కానీ ఇప్పుడు సైట్ వెబ్, సైట్ న్యూస్, సైట్ బుక్, సైట్ జర్నల్ అన్న నాలుగింటిపై క్లిక్ చేసినా అందులో నింపేందుకు ఖాళీలు కనిపించడంలేదు. నేను నేరుగా మార్కప్ కోడ్ తెచ్చి వినియోగించుకుంటున్నాను. తిరిగి మొదట్లో వైజాసత్య గారు స్థాపించినప్పుడున్న విధంగా వచ్చేలా ఎవరైనా ప్రయత్నిస్తే బావుంటుంది.--పవన్ సంతోష్ (చర్చ) 13:36, 1 సెప్టెంబరు 2015 (UTC)

సరి చేసాను. వైజాసత్య గారు ఇక పై ఏదయినా గ్యాడ్జెట్ స్థాపించినపుడు తగు రీతిలో ఆ గ్యాడ్జెట్ పాఠ్యీకరణను అందించగలరు. అలా జరిగి ఉంటే తక్కువ సమయంలోనే ఈ సమస్య పరిష్కరించగలిగేవాణ్ణి. --రహ్మానుద్దీన్ (చర్చ) 09:34, 5 సెప్టెంబరు 2015 (UTC)

గ్రామవ్యాసాలను అభివృద్ధి చేయు వాడుకరులకు వినతి[మార్చు]

మీరు తెవికీలో గ్రామ వ్యాసాలను సరిదిద్దుతున్నందుకు ధన్యవాదాలు. మీరు గ్రామవ్యాసాలలొ చిన్నమార్పు చేస్తున్నప్పుడు పేజీని భద్రపరచే ముందు " ఇది ఒక చిన్న సవరణ" అనే బాక్సులో క్లిక్ చేసి భద్రపరచండి. అలా చేయనిచో ఇటీవల మార్పులను పర్యవేక్షించడానికి యిబ్బందిగా ఉంది. మీరు చేస్తున్న చిన్నమార్పులు అనేక వేలసంఖ్యలో ఉన్నందున మధ్యలో అనామక వాడుకరులు ఏవైనా దుశ్చర్యలకు పాల్పడినట్లైతే గుర్తించడానికి నిర్వాహకులకు యిబ్బందిగా ఉంటుంది. మీరు " ఇది ఒక చిన్న సవరణ" ను గుర్తిస్తే యిటీవలి మార్పులలో చిన్నమార్పులను హైడ్ చేసి మిగిలిన మార్పులను పర్యవేక్షించడానికి అనుకూలంగా ఉంటుంది.సహకరింపవలసినదిగా కోరుచున్నాను.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 01:48, 2 సెప్టెంబరు 2015 (UTC)

కె.వెంకటరమణ గారు, నేను minor edit అనే ఇస్తున్నాను. తదుపరి, మీరు గుర్తించవలసినవి:

(1) గ్రామము అనే బదులు గామము అని ఉంటోంది.
(2) వ్యవసాయము అనే చోట వ్వవసాయము అని ఉంది.
(3) జనాభా బదులు జనబ, జనబా జనాబా జనాబ ఇలా ఉంది.
(4) మూలాలు అనే చోట మూలం వ్రాయడము జరుగుతోంది
(5) మూలాలు దాని క్రింద మూలాల జాబితా మూస ఉండాలి. ఆ రెండింటి మధ్య మూలం ఉంటున్నది.
(6) జనాభా లెక్కలు చాలా చోట్ల తప్పులు ఉన్నవి.
(7) ఒక జిల్లాకు బదులు మరో జిల్లా కోడ్ చాలా చోట్ల ఉన్నాయి
(8) మూసలలోని గ్రామాల జాబితాకు, ఆ మండలములోని జాబితాకు కొన్ని మూసలలో పొంతన లేదు.
(9) మండలములోని గ్రామాల జాబితాకు, ఆ మండలమునకు చెందిన మూస మరియు జాబితాకు పొంతన చాలావాటికి లేదు.
(10) చాలా గ్రామాలకు బాక్స్‌లు, ఇతరములు పొందుపరచాలి.
(11) అనేక విభాగాలు తొలగించవలసిన అవసరము ఉన్నది.
(12) తక్కువ సమయములో తప్పులు లేకుండా ఎక్కువ పని చేయనవసరము ఉన్నది.
(13) చెప్పాలనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. అయినా ఇది నేను ఎవరినీ విమర్శించే ఉద్దేశ్యముతో వ్రాయ లేదు. పని చాలా ఉంది. చేసే పని మెచ్చుకోక పోయినా ఇబ్బంది లేదు, కానీ విమర్శలతో రాజకీయాలు చేయాలనుకునే వారికి తగు సలహాలు, సూచనలు ఇవ్వగలరు.
(14) గ్రామాలలో జరుగుతున్న పని నేను చేస్తున్నది వివరించమంటే వివరంగా వివరించగలను.
(15) నా పని లేదా నా గురించి ఏమైనా ఎవరికయినా నా నుండి తెలుసు కోవాలనుకుంటే తప్పకుండా జవాబు ఇస్తాను.

ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 02:05, 2 సెప్టెంబరు 2015 (UTC)

పైన మీరు తెలియజేసిన కార్యక్రమమాలు మహోన్నతమైనవి. యివి వికీపీడియా అభివృద్ధికి, గ్రామవ్యాసాల అభివృద్ధికి తోడ్పడే మంచి విధానాలు. వికీపీడియాలో వ్యాసాల శుద్ధి కార్యక్రమాలకోసం నిరంతరం అలుపెరుగక కృషి చేస్తున్న వాడుకరులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఆటోవికీ బ్రౌజర్ లో చేస్తున్న మార్పులకు మైనర్ ఎడిట్స్ గా వస్తున్నాయి. మామూలుగా చిన్నమార్పులు చేస్తున్న కొందరు గౌరవ సభ్యులు మైనర్ ఎడిట్స్ గుర్తించమని మనవి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 02:23, 2 సెప్టెంబరు 2015 (UTC)
కె.వెంకటరమణ గారు, మీరు ఇస్తున్న పోత్సాహం ఓపిక లేకున్నా మరింత కష్టపడి పని చేయాలనిపిస్తోంది. పునాది పని చేస్తున్నాను. ఒక్కొక్క గ్రామాన్ని చూసి తప్పులు తదుపరి సరి చేస్తాను. వీలయినంత వరకు వ్యాసపుటను ఉన్నంతలో అందముగా వచ్చేవిధముగా తీర్చిదిద్దుతాను. నేను చేస్తున్న విధానము తప్ప మరో మార్గము తక్కువ సమయములో ఎక్కువ పని చేయుటకు అవకాశము లేదు. తదుపరి, గణాంకాలు [1]నందు పురుషుల: మరియు స్త్రీల: అని వ్రాయడము జరిగినది. జనాభా సంఖ్యను పురుషులు: మరియు స్త్రీలు: అని ఉండాలి అని నా అభిప్రాయము. దయచేసి దీని మీద స్పందించగలరు. JVRKPRASAD (చర్చ) 03:16, 2 సెప్టెంబరు 2015 (UTC)
JVRKPRASAD గారూ, అనేక గంటలు వికీపీడియా అభివృద్ధికి కష్టపడి పనిచేయడానికి ఓపిక,కృషిచేసే సామర్థ్యం, ఉన్న మీవంటి వాడుకరులకు బాటు ద్వారా చేయడం తెలియదు. బాటులు నడిపే వారికి చేయడానికి తగినంత సమయం ఉండకపోవచ్చు! అందువల్ల మీ వంటి వారు తక్కువకాలంలో వేగంగా గ్రామవ్యాసాలను వృద్ధి చేయడానికి ఆటోవికీబ్రౌజర్ చాలా ఉపయోగపడుతుంది. ఏ విధానంలో చేసినా మన అంతిమ లక్ష్యం వికీపీడియా లో వ్యాసాల అభివృద్ది చేయుట.కనుక మీ కృషిని కొనసాగించండి. గ్రామవ్యాసాలలో ఖాళీ భాగాలు తొలగించుట, గణాంకాలు చేర్చుట వంటి విషయాలు చేస్తున్న వాడుకరులందరికీ ధన్యవాదాలు. మీరు సూచించిన గ్రామవ్యాస లింకు లో [2] లో పురుషుల, స్త్రీల పదాలకు బదులుగా పురుషులు, స్త్రీలు అనే ఉండాలి. సరిదిద్దండి. వికీదేవాలయాన్ని శుద్ధి చేస్తున్నందుకు ధన్యవాదాలు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 15:49, 2 సెప్టెంబరు 2015 (UTC)
నిజంగా అద్భుతమైన కృషి, ఇలాంటి చిన్న చిన్న మార్పులు, అక్షర దోషాల గుర్తింపు వెంటనే జరగవల్సిన అవసరం ఉంది..--విశ్వనాధ్ (చర్చ) 04:23, 3 సెప్టెంబరు 2015 (UTC)

Introducing the Wikimedia public policy site[మార్చు]

Hi all,

We are excited to introduce a new Wikimedia Public Policy site. The site includes resources and position statements on access, copyright, censorship, intermediary liability, and privacy. The site explains how good public policy supports the Wikimedia projects, editors, and mission.

Visit the public policy portal: https://policy.wikimedia.org/

Please help translate the statements on Meta Wiki. You can read more on the Wikimedia blog.

Thanks,

Yana and Stephen (Talk) 18:13, 2 సెప్టెంబరు 2015 (UTC)

(Sent with the Global message delivery system)

Open call for Individual Engagement Grants[మార్చు]

My apologies for posting this message in English. Please help translate it if you can.

Greetings! The Individual Engagement Grants program is accepting proposals until September 29th to fund new tools, community-building processes, and other experimental ideas that enhance the work of Wikimedia volunteers. Whether you need a small or large amount of funds (up to $30,000 USD), Individual Engagement Grants can support you and your team’s project development time in addition to project expenses such as materials, travel, and rental space.

Thanks,

I JethroBT (WMF), Community Resources, Wikimedia Foundation. 20:52, 4 సెప్టెంబరు 2015 (UTC)

(Opt-out Instructions) This message was sent by I JethroBT (WMF) (talk) through MediaWiki message delivery.

వృక్షశాస్త్రం ప్రాజెక్టు[మార్చు]

వృక్షశాస్త్రం పై జరుగుతున్న కార్యక్రమ తదుపరి ఆవృతం సెప్టెంబర్ 11,12, 13 తేదీలలో జరుగనుంది. ఆసక్తి గల వారు పాల్గొనగలరు. సీఐఎస్-ఏ2కే నుండి పవనజ ఈ కార్యక్రమాన్ని నడుపుతారు, విజయవాడలో ఆ సమయంలో ఉండే సముదాయ సభ్యులు పవనజ ను కలవవచ్చు. పవనజ కన్నడ వికీపీడియాలో నిర్వాహకులు, అంతకు ముందు భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్, టీఐఎఫార్ లలో పని చేసిన అనుభవముంది. --రహ్మానుద్దీన్ (చర్చ) 14:51, 5 సెప్టెంబరు 2015 (UTC)