జోర్డాన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ పేజీ ప్రపంచ దేశాల ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది.
మొలక స్థాయిలోని ఈ వ్యాసములో కొన్ని అనువదింవలసిన భాగాలు లేదా మూస ఉండవచ్చు.
దయచేసి ఇక్కడున్న సమాచారాన్ని అనువదించి లేదా ఇదే విషయముపై ఆంగ్ల వికీలోని వ్యాసము నుండి సమాచారాన్ని అనువదించి ఈ ప్రాజెక్టుకు తోడ్పడగలరు
المملكة الأردنية الهاشمية
అల్-మమ్‌లకా అల్-ఉర్దూనియ్యా అల్-హాషిమియ్యా
హాషిమియా సామ్రాజ్యం, జోర్దాన్
Flag of జోర్డాన్ జోర్డాన్ యొక్క చిహ్నం
జాతీయగీతం
عاش المليك
జోర్డాన్ జాతీయగీతం
  ("అస్-సలామ్ అల్-మలకి అల్-ఉర్దోని")1
చిరకాలం రాజు జీవించుగాక

జోర్డాన్ యొక్క స్థానం
రాజధాని అమ్మాన్
31°57′N, 35°56′E
Largest city రాజధాని
అధికార భాషలు అరబ్బీ భాష
ప్రభుత్వం రాజ్యాంగపర రాజరికం
 -  రాజు అబ్దుల్లా II
 -  ప్రధానమంత్రి మారూఫ్ అల్ బాకిత్
స్వాతంత్ర్యం
 -  బ్రిటిష్ పాలన అంతం లీగ్ ఆఫ్ నేషన్స్ మాండేట్
మే 25 1946 
విస్తీర్ణం
 -  మొత్తం 89,342 కి.మీ² (112వది)
45,495 చ.మై 
 -  జలాలు (%) negligible
జనాభా
 -  జూలై 2007 అంచనా 5,924,000 (110వది)
 -  2004 జన గణన 5,100,981 
 -  జన సాంద్రత 64 /కి.మీ² (131వది)
166 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $27.96 బిలియన్లు (97వది)
 -  తలసరి $4,900 (103వది)
Gini? (2002–03) 38.8 (medium
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Increase 0.760 (medium) (86th)
కరెన్సీ జోర్డానియన్ దీనార్ (JOD)
కాలాంశం UTC+2 (UTC+2)
 -  వేసవి (DST) UTC+3 (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .jo
కాలింగ్ కోడ్ +962
1 ఇంకనూ రాజరికపు జాతీయగీతం.

జోర్డాన్ నైఋతి ఆసియాలో సిరియా ఎడారి దక్షిణ భాగము నుంచి అకాబా అఖాతము వరకూ వ్యాపించి ఉన్న ఒక అరబ్ దేశము. సరిహద్దులుగా ఉత్తరాన సిరియా, ఈశాన్యాన ఇరాక్, తూర్పు దక్షిణాలలో సౌదీ అరేబియా, పడమరాన ఇజ్రాయేల్, పాలస్తీనా ప్రాంతాలు ఉన్నాయి. అరబిక్‌ భాషలో జోర్డాన్ అంటే అలోర్దన్ అంటారు. (అల్ ఓర్దన్). పూర్తి పేరు "ముమల్కతు అల్ హాషిమీయత్ అల్ ఓర్దనీయ" (Hashimite Kingdom of Jordan). హాషిమయిట్ వంశస్తులు పాలిస్తున్నరు కనుక ఇది హాషిమైట్ రాజ్యమయింది.

మృతసముద్రాన్ని ఇజ్రాయేల్ తో, అకాబా తీర ప్రాంతాన్ని ఇజ్రాయేల్, ఈజిప్టు, సౌదీ దేశాలతో పంచుకుంటోంది. జోర్డాన్ లో చాలా భాగం ఎడారితో నిండి ఉంటుంది. ముఖ్యంగా అరేబియా ఎడారి. కాక పోతే వాయువ్యాన పవిత్రమయిన జోర్డాన్ నది ఉండటంతో ఆ ప్రాంతాన్ని "సారవంతమయిన నెలవంక" గా అభివర్ణిస్తూ ఉంటారు. జోర్డాన్ రాజధాని అమ్మాన్ కూడా ఈ వాయువ్య దిశనే ఉంటుంది.

జోర్డాన్ తన చరిత్రలో సుమేరియన్, అక్కాడియన్, బాబిలోనియన్, మెసొపొటేమియన్, అస్సిరియన్, పర్షియన్ వంటి ఎన్నో నాగరికతలను చూసింది. ఇవే కాక కొంతకాలం ఫారోల నాటి ఈజిప్టు సామ్రాజ్యంలో భాగంగా ఉండటమే కాక నెబేటియన్ అనే ఒక స్థానిక నాగరికతకు ఆలవాలమయింది. ఈ నెబేటియన్ నాగరికతకు సంబంధించి ఎన్నో పురావస్తు విశేషాలు పెత్రాలో నేటికీ చూడవచ్చు. ఇవే కాక పాశ్చాత్య నాగరికతలయిన మాసిడోనియా, రోం, బైజాన్‌ట‍యిన్, ఆట్టోమన్ సామ్రాజ్యాల ప్రభావం కూడా జోర్డాన్ పై ప్రభవించింది. బ్రిటీష్ వారి పాలనలో ఉన్న కొద్ది కాలం తప్పితే, ఏడవ శతాబ్ది నుండి ఇస్లాం మరియు అరబ్ నాగరికతలను స్వంతం చేసుకుంది. జోర్డాన్ లో ఉన్నది రాజ్యాంగబద్దమయిన పార్లమెంటరీ రాచరిక ప్రభుత్వము. ఇక్కడ రాజు దేశాధినేతగా సర్వసైన్యాధ్యక్షునిగా వ్యవహరిస్తారు. రాజు తన ప్రభుత్వము, మంత్రివర్గ సభ్యుల సహకారంతో పరిపాలన సాగిస్తారు. ఈ మంత్రివర్గము ప్రజలు ఎన్నుకున్న లెజిస్లేచరుకు జవాబుదారుగా ఉంటారు. హౌస్ ఆఫ్ డెప్యూటీస్ మరియు హౌస్ ఆఫ్ నోటబుల్స్ అనే రెండు విభాగాలు కలిగి ఉన్న ఈ లెజిస్లేచరు ప్రభుత్వపు లెజిస్లేటివ్ విభాగంగా పని చేస్తుంది. జ్యూడేషియల్ విభాగము మరిక స్వతంత్ర విభాగము.

ఇవీ చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జోర్డాన్&oldid=1358769" నుండి వెలికితీశారు