డెన్మార్క్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Kingdom of Denmark
Kongeriget Danmark
Red with a white cross that extends to the edges of the flag; the vertical part of the cross is shifted to the hoist side
Anthem: 
Der er et yndigt land
There is a lovely country
Kong Christian stod ved højen mast[N 1]
King Christian stood by the lofty mast
Location of  Denmark[N 2]  (dark green)– on the European continent  (green & dark grey)– in the European Union  (green)  —  [Legend]
Location of  Denmark[N 2]  (dark green)

– on the European continent  (green & dark grey)
– in the European Union  (green)  —  [Legend]

Kingdom of Denmark: Greenland, the Faroe Islands (circled), and Denmark.
Kingdom of Denmark: Greenland, the Faroe Islands (circled), and Denmark.
రాజధాని
and అతిపెద్ద నగరము
Lesser coat of arms of Copenhagen.svg Copenhagen
55°43′N 12°34′E / 55.717°N 12.567°E / 55.717; 12.567
అధికార భాషలు Danish
Recognised regional languages
Demonym
ప్రభుత్వము Unitary parliamentary
constitutional monarchy
 -  Monarch Margrethe II
 -  Prime Minister Lars Løkke Rasmussen
Legislature Folketing
Establishment
 -  Consolidation c. 10th century 
 -  Democratisation
(Constitutional Act)
5 June 1849 
 -  Danish Realm 24 March 1948[N 4] 
Area
 -  Denmark[N 2] 42.7 km2[2] (133rd)
(1.1 sq mi 
 -  Greenland 21,66,086 కి.m2 (8,36,330 sq mi)
 -  Faroe Islands 1,399 కి.m2 (540.16 sq mi)
Population
 -  July 2014 estimate 5,639,719[3] (113th)
 -  Greenland 56,370[4][N 5]
 -  Faroe Islands 49,709[5][N 5]
 -  Density (Denmark) 131/km2
339.3/sq mi
GDP (PPP) 2013 estimate
 -  Total $211.321 billion[6][N 6] (52nd)
 -  Per capita $37,794[6] (19th)
GDP (nominal) 2013 estimate
 -  Total $324.293 billion[6][N 6] (34th)
 -  Per capita $57,998[6] (6th)
Gini (2012) negative increase 28.1[7]
low
HDI (2013) Increase 0.900[8]
very high · 10th
Currency Danish krone[N 7] (DKK)
Time zone CET (UTC+1)
 -  Summer (DST) CEST (UTC+2)
Drives on the right
Calling code +45[N 8]
Internet TLD .dk[N 9]

డెన్మార్క్, అధికార నామం కింగ్డం ఆఫ్ డెన్మార్క్(డానిష్: Kongeriget Danmark, డేన్స్‌ల నేల అని అర్ధం) డెన్మార్క్ మూడు స్కాండినేవియన్ దేశాల్లో ఒకటి. ప్రధాన భూభాగం జర్మనీ దేశానికి ఉత్తరంగా కలదు. రాజధాని నగరం కోపెన్‌హగెన్.

నైసర్గిక స్వరూపం[మార్చు]

  • రాజధాని: కోపెన్‌హగన్
  • ప్రభుత్వపాలన: యునిటరీ పార్లమెంటరీ కాన్‌స్టిట్యూషనల్ మొనార్చి
  • కరెన్సీ: డానిష్ క్రోన్
  • భాషలు: డానిష్
  • మతం: క్రైస్తవం
  • ఉష్ణోగ్రతలు: ఫిబ్రవరిలో 3 డిగ్రీల సెల్సియస్, జూలైలో 14 నుండి 22 డిగ్రీల ఉష్ణోగ్రతలు.

చరిత్ర[మార్చు]

  • డెన్మార్క్ దేశం ఓవైపు ఉత్తర సముద్రం మరోవైపు బాల్టిక్ సముద్రం ఉన్నాయి. ఈ దేశంలో మొత్తం 406 ద్వీపాలు ఉన్నాయి. ఇందులో 89 ద్వీపాలలో మాత్రం ప్రజలు నివసిస్తున్నారు. సముద్ర మట్టానికి కేవలం 171 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక సముద్రతీరం 7300 కిలోమీటర్లు ఉంది. దీనికి 10 వేల సంవత్సరాల చరిత్ర ఉంది.
  • ఈ దేశంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన రూపశిల్పులు, భవననిర్మాణ శిల్పులు ఎందరో ఉన్నారు.

సంస్కృతి-సంప్రదాయాలు[మార్చు]

డెన్మార్క్ దేశంలో మహిళలు ఎక్కువగా కూలిపనులు చేస్తారు. యూరోప్ ఖండంలో లేబర్ మార్కెట్‌లో మహిళల శాతం డెన్మార్క్‌లోనే అధికం.మహిళలు తమ భర్తలను ఎంపిక చేసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఈ దేశంలో ఉంది. అలాగే పురుషులు రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం పూర్తి నిషేధం. మహిళలు తమ పిల్లలకు ఆరునెలలు వయసురాగానే వారిని పిల్లల సంరక్షణ కేంద్రాలకు పంపించేస్తారు. ఎందుకంటే వారు పనులు చేయడానికి వెళ్ళాలి కాబట్టి.

దుస్తులు మరియు ఆహార్యం[మార్చు]

డెన్మార్క్ దేశీయులు సాధారణంగా సిల్కు, ఊలు, దుస్తులు ధరిస్తుంటారు. ఎండాకాలం కూడా చల్లగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఉన్ని దుస్తులు ఎక్కువగా వాడుతారు.మహిళలు సాధారణంగా మెడకు స్కార్ఫ్‌కట్టుకుంటారు. నలుపు రంగు స్కార్ఫ్ ధరించడం వీరు హుందాగా భావిస్తారు. లేసులతో, ఎంబ్రాయిడరీ చేసిన పొడవాటి లంగా ధరిస్తారు. దీనిపైన జాకెట్ ధరిస్తారు.పురుషులు మాత్రం ఊలు, తోలు దుస్తులు ఎక్కువగా ధరిస్తారు. చాలా పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలలో మహిళలు సామూహిక నృత్యాలు చేస్తారు.

ఆహారం[మార్చు]

వీరి భోజనంలో ముఖ్యంగా మాంసం, బంగాళదుంపలు, బ్రెడ్ ఉంటాయి. ప్రపంచం మొత్తంలో పందిమాంసం ఎక్కువగా తినేది డెన్మార్క్‌లోనే. వీళ్ళు ఎక్కువగా సాండ్‌విచ్, మాంసం ముక్కలు, ఉడికించిన గుడ్లు, వీటితోపాటు బీరు తప్పకుండా తీసుకుంటారు. సాధారణంగా మధ్యాహ్న భోజనాన్ని హోటళ్ళలో కానిచ్చి రాత్రి భోజనాన్ని మాత్రం ఇంటి దగ్గరే తింటారు. వీరు తినే బ్రెడ్, మాంసం కలయికను స్మోర్‌బ్రాడ్ అని అంటారు. భోజనంతోపాటు ఐస్‌క్రీమ్, పళ్ళు, పళ్ళరసాలు తీసుకోవడం వీరికి చాలా ఇష్టం.

పరిపాలనా విభాగాలు[మార్చు]

డెన్మార్క్ దేశం దాదాపు 406 ద్వీపాలు, ద్వీపకల్పాలతో కూడుకొని ఉంది. ఒక్కో ద్వీపానికి వెళ్ళడానికి వివిధ ఆకారాలలో బ్రిడ్జిలు నిర్మించారు. బ్రిడ్జిలు నిర్మించ వీలు లేని ద్వీపాలకు ఫెర్రీ బోట్లమీద ప్రయాణం చేస్తారు.

  • దేశాన్ని ముఖ్యంగా మూడు భాగాలుగా విభజించారు.
  1. డెన్మార్క్ - దీని వైశాల్యం - 42915.7 చ.కి.మీ., జనాభా-56,27,235
  2. గ్రీన్‌లాండ్ - దీనివైశాల్యం-21,66,086 చ.కి.మీ., జనాభా-56,370
  3. ఫారో ఐల్యాండ్స్ - దీని వైశాల్యం-1399 చ.కి.మీ., జనాభా-49,709
  • పరిపాలనా సౌలభ్యం కోసం దేశాన్ని ఐదు ప్రాంతీయ భాగాలుగా విభజించారు.
  1. డెన్మార్క్ రాజధాని ప్రాంతం
  2. కేంద్రీయ డెన్మార్క్ ప్రాంతం
  3. ఉత్తర డెన్మార్క్ ప్రాంతం
  4. జీలాండ్ ప్రాంతం
  5. దక్షిణ డెన్మార్క్ ప్రాంతం.

పంటలు-పరిశ్రమలు[మార్చు]

  • డెన్మార్క్ దేశంలో ఇనుము, స్టీలు, రసాయన, ఫుడ్‌ప్రాసెసింగ్, యంత్రసామాగ్రి, టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్, నౌకల తయారీ, మందుల పరిశ్రమలు అనేకంగా ఉన్నాయి.
  • ఇక ప్రపంచానికి క్రిస్‌మస్ ట్రీలను ఎగుమతి చేసే దేశం డెన్మార్క్. ఈ చెట్లను పెంచి, ఎగుమతి చేసే వ్యాపారంలో దాదాపు అరలక్షమంది ఉద్యోగులు ఉన్నారు.
  • దేశంలో బార్లీ, బంగాళదుంపలు, గోధుమలు, చెరకు పంటలతోపాటు చేపల పెంపకం, పందుల పెంపకం, పాల ఉత్పత్తులు అధికంగా ఉన్నాయి.

ముఖ్య నగరాలు[మార్చు]

దేశంలో అయిదు రీజియన్‌లు, 98 మున్సిపాలిటీలు ఉన్నాయి. రాజధాని కోపెన్‌హగన్, ఆర్హస్, ఓరెన్స్, ఆల్‌బోర్గ్, ఫ్రెడరిక్స్ బెర్గ్, ఎస్బ్‌జెర్గ్, జెంటోఫ్టె, గ్లాడీసాక్స్, రాండర్స్, కోల్డింగ్, హర్సెన్స్, ఇంకా 45 ముఖ్యమైన నగరాలు, పట్టణాలు ఉన్నాయి.

దర్శనీయ ప్రదేశాలు[మార్చు]

కోపెన్‌హగన్[మార్చు]

రాజధాని నగరం కోపెన్‌హగన్‌లో టివోలిగార్డెన్, ప్రీటేన్ క్రిస్టియానా, అటిల్ మర్మయిడ్, కోపెన్‌హగన్ పోర్ట్, నగరం సమీపంలో క్రాన్‌బోర్గ్ కోట (కాజిల్) (kronborg castle) ముఖ్యమైనవి. ఈ కోట అనేది ఒకప్పుడు విలియం షేక్‌స్పియర్ రాసిన హమ్లెట్ నాటకానికి నేపధ్యప్రదేశం.

బుడోల్ఫిచర్చి[మార్చు]

జుట్‌లాండ్ ప్రాంతంలో 17వ శతాబ్దానికి ఆల్‌బోర్ఘ్‌స్ కోట(Aalborghus castle) 14వ శతాబ్ధానికి చెందిన బుడోల్ఫిచర్చి (Budolfi church), అలాగే గ్రామీణ మ్యూజియం చూడదగినవి. వీటితోపాటు బిల్లుండ్ విమానాశ్రయం, చెక్కతో చేసిన ఇళ్ళు ఉన్న ఎబెల్ టోఫ్ట్ (Ebeltoft) గ్రామం, మోర్స్‌ద్వీపంలో జెస్ఫెరస్ పూల ఉద్యానవనం చూడదగ్గవి.

దక్షిణ భాగపు సముద్ర తీర ప్రాంతం[మార్చు]

డెన్మార్క్ దేశానికి వచ్చే యాత్రీకులు తప్పనిసరిగా చూసేది దేశపు దక్షిణ భాగంలో ఉన్న సముద్ర తీర ప్రాంతం (సీలాండ్). అలాగే దీని చుట్టూ ఉన్న అనేక ద్వీపాలు. ఇసుక బీచ్‌లు. లిసెలుడ్‌పార్కు, మొనదేలిన పర్వతాగ్రాలు ఇక్కడే దర్శనమిస్తాయి.

మూలాలు[మార్చు]

[N 10]

  1. "Not one but two national anthems". Denmark.dk. Ministry of Foreign Affairs of Denmark. Retrieved 18 May 2014. 
  2. Statistics Denmark
  3. July 2014 population estimate. Danish Ministry for Economic Affairs and the Interior
  4. "Greenland in Figures 2013," Statistics Greenland. Retrieved 2 September 2013
  5. "Faroe Islands"The World Factbook. Retrieved 6 June 2012
  6. 6.0 6.1 6.2 6.3 "Denmark". International Monetary Fund. Retrieved 16 March 2014. 
  7. "Gini coefficient of equivalised disposable income (source: SILC)". Eurostat Data Explorer. Retrieved 13 August 2013. 
  8. "2014 Human Development Report Summary" (PDF). United Nations Development Programme. 2014. pp. 21–25. Retrieved 27 July 2014. 

బయటి లంకెలు[మార్చు]

ప్రభుత్వము
పటములు
వర్తకము
వార్తలు మరియు మీడియా
ఇతరములు
  • Vifanord.de – library of scientific information on the Nordic and Baltic countries.


ఉదహరింపు పొరపాటు: <ref> tags exist for a group named "N", but no corresponding <references group="N"/> tag was found, or a closing </ref> is missing