కె. అచ్యుతరెడ్డి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

కె. అచ్యుతరెడ్డి (20 జూన్, 1914 - 23 జనవరి, 1972 స్వాతంత్ర్య సమరయోధులు, శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు.

వీరు మహబూబ్ నగర్ జిల్లా నాగర్‌కర్నూల్లో జన్మించారు.

వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయం లో బి.ఎల్. చదువుతున్నప్పుడే వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నందుకు బహిష్కరించబడ్డారు. 1938లో ఆ ఉద్యమపు కార్యాచరణ సమితి అధ్యక్షుడిగ ఎన్నికయ్యారు. ఆంధ్ర మహాసభలో చిరకాలం సభ్యుడిగా ఉన్నారు. తర్వాత హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ సభ్యుడై, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని కారాగార శిక్షను అనుభవించారు. 1947 ఇండియన్ యూనియన్ ఉద్యమంలో పాల్గొన్నందుకు ప్రభుత్వం వీరిని నిర్బంధించింది. 1948లో పోలీస్ చర్య వలన, నిజాం రాజ్య ప్రజలు స్వాతంత్ర్యాన్ని పొందినపుడు వీరు జైలునుండి విడుదలయ్యారు.

1958లో హైదరాబాద్ లోని కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకుకు అధ్యక్షులై 1962 వరకు ఆ పదవిని నిర్వహించారు. తెలంగాణా ప్రాంతీయ కమిటీకి తొలి అధ్యక్షుడుగా నియమితుడై 1957 నుండి 1962 వరకు పనిచేశారు. హైదరాబాద్ లోని హిందీ ప్రచార సభకు 15 సంవత్సరాలు ఆయన అధ్యక్షత వహించారు.

కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున శాసన సభ్యునిగా రెండు సార్లు ఎన్నికయ్యారు. 1971 లో రెవిన్యూ మంత్రిగా నియమితులై ఆ పదవీ బాధ్యతలను నిర్వహించారు.