1923
వికీపీడియా నుండి
1923 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1920 1921 1922 - 1923 - 1924 1925 1926 |
దశాబ్దాలు: | 1900లు 1910లు - 1920లు - 1930లు 1940లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక
సంఘటనలు[మార్చు]
- ఏప్రిల్ 18: అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో అన్నవరం పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగింది.
- నవంబర్ 28: భోగరాజు పట్టాభి సీతారామయ్య చే మచిలీపట్నంలో ఆంధ్రా బ్యాంకు స్థాపించబడింది.
జననాలు[మార్చు]
- ఫిబ్రవరి 6: జే.రామేశ్వర్ రావు, వనపర్తి సంస్థానాధీశుడు, దౌత్యవేత్త మరియు భారత పార్లమెంటు సభ్యుడు. (మ.1998)
- మే 16: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మెర్టన్ మిల్లర్.
- మే 27: అమెరికా దౌత్యనీతివేత్త హెన్రీ కిసింజర్.
- మే 28: నందమూరి తారక రామారావు, తెలుగు సినీ నటుడు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ( మ.1996)
- జూన్ 23: దివాకర్ల వేంకటావధాని, పరిశోధకుడు, విమర్శకుడు. (మ.1986)
- జూలై 1: కె.సభా, కథా రచయిత, నవలాకారుడు, కవి, గేయకర్త, బాలసాహిత్య నిర్మాత, సంపాదకుడు, జానపద గేయ సంకలనకర్త, ప్రచురణకర్త. (మ.1980)
- జూలై 16: జనరల్ కె. వి. కృష్ణారావు, భారత సైనిక దళాల మాజీ ఛీఫ్. (మ.2017)
- జూలై 22: ముకేష్, భారతీయ హిందీ సినిమారంగ నేపథ్య గాయకుడు. (మ.1976)
- ఆగష్టు 23: జిల్లెళ్ళమూడి అమ్మ, ఆధ్యాత్మిక వేత్త. (మ.1985)
- ఆగష్టు 23: బలరామ్ జక్కర్ ప్రముఖ రాజకీయనాయకులు, పార్లమెంటు సభ్యులు మరియు మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్. (జ.1923)
- ఆగష్టు 24: హోమీ సేత్నా, సుప్రసిద్ధ భారతీయ శాస్త్ర పరిశోధకుడు. (మ.2010)
- ఆగష్టు 29: హీరాలాల్ గైక్వాడ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- సెప్టెంబరు 20: అక్కినేని నాగేశ్వరరావు, ప్రముఖ తెలుగు నటుడు మరియు నిర్మాత. (మ.2014)
- సెప్టెంబరు 26: దేవానంద్, ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు. (మ.2011)
- సెప్టెంబరు 24: కొరటాల సత్యనారాయణ, ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడు. (మ.2006)
- అక్టోబరు 2 : ఎం.శాంతప్ప, రాయలసీమకు చెందిన ప్రముఖ విద్యావేత్త. మాజీ వైస్‌ఛాన్స్‌లర్ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం.
- అక్టోబరు 13: కాసరనేని సదాశివరావు, శస్త్రవైద్య నిపుణులు. (మ.2012)
- అక్టోబర్ 23: బైరాన్ సింగ్ షెకావత్, భారత మాజీ ఉప రాష్ట్రపతి. (మ.2010)
- నవంబరు 16: తాడేపల్లి లక్ష్మీ కాంతారావు, ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు. (మ.2009)
- : కృష్ణాజిరావు సింధే, తెలుగు టాకీ చిత్రమైన భక్తప్రహ్లాద లో ప్రహ్లాదునిగా నటించిన బాలనటుడు. సురభి నాటక సమాజంలో రంగస్థల నటుడు. (మ.2004)
- : అనగాని భగవంతరావు, ప్రముఖ న్యాయవాది మరియు మంత్రివర్యులు. (మ.1986)
- : బొడ్డేపల్లి రాజగోపాలరావు, ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు పార్లమెంటు సభ్యుడు. (మ.1992)
మరణాలు[మార్చు]
- జూలై 12: కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత. (జ.1877)
- ఫిబ్రవరి 10: రాంట్జన్, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- ఆగష్టు 20: నారదగిరి లక్ష్మణదాసు, పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవి మరియు వాగ్గేయకారుడు. (జ.1856)