Home >> Sunday Star
Select District:

ఆధ్యాత్మికత అవసరమే...

చెరగని న…వ్వు, తరగని అందం ఆమె సొంతం. బాలీవుడ్‌లో తన సమకాలీకులందరితో కలసి నటించడంతో పాటు పలువురి మన్ననలు అందుకున్న నటి లారాదత్తా. మిస్‌ ఇంటర్నేషనల్‌, ఫెమీనా మిస్‌ ఇండియా యూనివర్‌‌స, మిస్‌ యూనివర్‌‌సగా ఎంపికైనప్పటికీ ఏమాత్రం గర్వాన్ని ప్రదర్శించని గొప్పతనం లారాది. సినిమాల ద్వారా తను తీసుకుంటోన్న పారితోషికం నుండి కొంతమొత్తాన్ని సామాజిక సేవకు వినియోగిస్తున్న లారాతో ఈవారం ముచ్చట్లు.

పేరు:లారా దత్తా
పుట్టినతేది: ఎప్రిల్‌ 1978
ఎక్కడ: గాజీయబాద్‌, ఉత్తరప్రదేశ్‌
ఎత్తు: 5.8 అడుగులు.
తల్లిదండ్రులు: జెన్నిఫర్‌ దత్తా,ఎల్‌.కె దత్తా(రిటైర్‌‌డ వింగ్‌ ƒమాండర్‌,
చదువు: ముంబాయి యూనివర్సిటీ నుండి ఎకానామిక్‌‌సలో గ్రాడ్యుయెట్‌.
సాధించినవిజయాలు.1997లో మిస్‌ ఇంటర్నేషనల్‌, 2000లో ఫేమినా మిస్‌ ఇండియా యూనివర్‌‌స, మిస్‌ యూనివర్‌‌స 2001లో యుఎన్‌ఎఫ్‌ పిఎ గుడ్‌విల్‌ అంబసిడర్‌.
మొదటిచిత్రం:అందాజ్‌
ఇష్టమైనపుస్తకం: గోనే విత్‌ ది విండ్‌
ఇష్టమైన చిత్రం: లైఫ్‌ ఈస్‌ బ్యూటిఫుల్‌
ఇష్టమైనపుడ్‌: దాల్‌ మకాని, బిర్యాని, థాయిపుడ్‌.
ఇష్టమైన రంగు: ఎరుపు
ఇష్టమైన పాట: మెలోడీ, కహీన్‌ దూర్‌ జబ్‌ దాల్‌ జాయి
ఇష్టమైన ప్రదేశం : పారిస్‌.

మీ సామాజిక సేవ గురించి....


`నేను మిస్‌ యూనివర్‌‌సగా ఎంపికైన సమయంలో ఐక్యరాజ్య„సమితినుండి పిలుపు వ…చ్చింది. వారు నన్ను 2001లో యుఎన్‌ఎఫ్‌ పిఎ గుడ్‌విల్‌ అంబా సిడర్‌గా నియమించారు. దీనితో నేను అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం దొరికింది. ఇండియాలో ఎయిడ్‌‌స పట్ల అవగాహాన కల్పించడానికి ప్రచారం నిర్వహించాను.మహిళల హక్కుల విషయంలో ఉద్యమించాను.అనేక ముఖాముఖి కార్యక్రమాల్లో కూడా పాల్గొని నా గళాన్ని వినిపించాను.

అలాగే ఐక్యరాజ్యసమితి జనాభా ఫండ్‌ విషయంలో పాల్గొన్నాను. ఇండియాలో చిన్నపిల్లలపై అత్యాచారలు, వారితో సెక్‌‌స చేయించడం వంటివి పెరు గుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటున్నాను.

మీరు మీ గురించి ఎలా ఆలోచిస్తారు.


`మన గురించి మనం ఆలోచించుకోవలసింది చాలా ఉంది. ముఖ్యంగా మనం సగటు మనుషులం అన్న విషయం మరవ…రాదు. కొంత ఆధ్యాత్మికత ఉండాలి. ఏదీ శాస్వతం కాదు. మనం ఏం పొగొట్టుకుంటున్నాం. ఏం సాధిస్తున్నాం అనే విషయాలు తెలుసుకోవాలి. మనం ఎక్కాల్సిన పడవ రాదనుకున్నపుడు ఈత తెలిసి ఉండాలి. దేవుడు ప్రతి పక్షికి జన్మనివ్వగలడు కానీ వాటన్నింటికీ గూళ్లు నిర్మించి ఇవ్వలేడు కదా. వాటిని అవే నిర్మించుకోవాలి.

బిల్లు చిత్రం గురించి చెప్పండి.


`షారూక్‌ఖాన్‌, ఇర్పాన్‌ఖాన్‌లతో కలసి చేసిన చిత్రమిది. మొదటిసారిగా ఎలాంటి మెకప్‌ లేకుండా నటించాను. అలాగే ఈ చిత్రంలో నా దుస్తులన్ని మట్టికొట్టుకు పోయి ఉంటాయి. అయినప్పటికీ నా అందంలో ఎలాంటి తేడా కనిపించకుండా జాగ్రత్త పడ్డాను.
Copyright 2008 © SPR Publications