ఢిల్లీ: తెలంగాణలోని దేవాదుల ప్రాజెక్టుకు తొలి విడతలో రూ.112.50 కోట్లు విడుదల చేసిన కేంద్ర జలవనరులశాఖ     |     పాకిస్తాన్‌‌: ఓ కోర్టు బయట బాంబు పేలుడు, 8 మంది మృతి, 12 మందికి గాయాలు     |     మహబూబ్‌నగర్‌: కొడంగల్‌ శివారులో కారు -ట్యాంకర్‌ ఢీ, ఐదుగురు మృతి     |     కృష్ణా:కృష్ణానదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి     |     చత్తీస్‌గఢ్‌: రాయ్‌పూర్‌లో చర్చిపై దాడి కేసులో ఏడుగురు అరెస్ట్     |     కోల్‌కతా: కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి యువతిపై యువకుడు అత్యాచారయత్నం, తప్పించుకున్న యువతి     |      ఢిల్లీ: ఉగ్రవాదుల కదలికలపై హోంమంత్రి రాజ్‌నాథ్‌ సమీక్ష, 10 నగరాల్లో అలర్ట్‌ ప్రకటించిన కేంద్రం; ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌, విజయవాడలో అలర్ట్‌     |     యెమెన్‌: నౌకలో దుండగుల కాల్పులు, ఇద్దరు భారతీయ నావికులు మృతి, ముగ్గురికి గాయాలు, ధృవీకరించిన విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌     |     జమ్మూకశ్మీర్‌: కుల్గంలో ఎన్‌కౌంటర్, ఉగ్రవాది హతం     |     దేశవ్యాప్తంగా వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు     |     Please send feedback to feedback@andhrajyothy.com     

ప్రముఖ రచయిత్రి కమలా లక్ష్మణ్‌ అస్తమయం
15-11-2015 01:20:14

పుణె, నవంబరు 14: ప్రఖ్యాత రచయిత్రి, కార్టునిస్టు ఆర్కే లక్ష్మణ్‌ భార్య కమలా లక్ష్మణ్‌ శనివారం పుణెలో కన్నుమూసారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. ఈ ఏడాది జనవరిలో ఆర్కే లక్ష్మణ్‌ మరణించిన విషయం తెలిసిందే! ఆయన మృతితో కమలా లక్ష్మణ్‌ కృంగిపోయారని, అప్పటి నుంచి పలు సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఆర్కే లక్ష్మణ్‌ చివరి దశలో తరచూ ఆస్పత్రి పాలయినపుడు సరైన వైద్య సహాయం అందేలా ఆమె ఎంతో శ్రద్ధ తీసుకున్నారని చెప్పారు. చక్రాల కుర్చీకే పరిమితమైనప్పటికీ కామన్‌ మ్యాన్‌ సృష్టిలో ఆర్కేకు కమల ఎంతగానో సహకరించారని వివరించారు.