గుంటూరు

కళాసాంస్కృతిక రంగ దిక్సూచి అజోవిభొ కందాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), జనవరి 4: కళావికాసంతోనే సామాజిక సంపూర్ణ చైతన్యం సిద్ధిస్తుందన్న సద్భావనతో 25 వసంతాల క్రితం స్థాపించబడిన అజోవిభొ కందాళం ఫౌండేషన్ రజతోత్సవాలు గురువారం నగరంలోని శ్రీ వెంకటేశ్వరా విజ్ఞాన మందిరంలో వేడుకగా ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు సంస్కృతి అధ్యక్షుడు పిన్నమనేని మృత్యుంజయరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన వివిఐటి ఛైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతికరంగాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ, ప్రొఫెసర్ కందాళం రామానుజాచారి వంటి దిగ్దండుల సారధ్యంలో రూపుదిద్దుకున్న అజోవిభొ కందాళం ఫౌండేషన్ దేశాంతర ఖ్యాతిని ఆర్జించిందన్నారు. అధ్యక్షుడు మృత్యుంజయరావు, సభా ప్రారంభకుడు అంబటి మురళీకృష్ణ, పోటీ నాటికల ప్రాథమిక పరిశీలకుడు కరణం సురేష్ తదితరులు అజోవిభూ చేస్తున్న దశాబ్ధాల సాంస్కృతిక రంగ సేవలను నిరూపమానమైనవిగా కొనియాడారు. తాము ఎక్కడ ఉన్నా మాతృభూమి పట్ల, సంస్కృతి, సంప్రదాయాల పట్ల అచంచలమైన గౌరవాభిమానాలు కలిగి ఉన్నామని అప్పాజోస్యుల సత్యనారాయణ, ఆచార్య కందాళం రామానుజాచార్యులు తెలిపారు. నాటికల పుస్తకావిష్కరణ ఎ మురళీకృష్ణ, ప్రతిభా వైజయంతి సంచికను విద్యాసాగర్‌లు ఆవిష్కరించారు. తెలుగునాటక రంగంలో ప్రతిభ కనబర్చిన డాక్టర్ డిఎస్‌ఎన్ మూర్తిని అతిథులు సత్కరించారు. నాటకరంగానికి తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ నటుడు శనివారపు నరసింహారెడ్డి (జ్యోత్స్న)కు రంగస్థల సేవామూర్తి జీవితకాలపు సాధనా పురస్కారాన్ని ప్రదానం చేసి, 10 వేల రూపాయల పారితోషికాన్ని అందజేశారు.

స్వచ్ఛవార్డుల ఎంపిక

* గోల్డెన్ వార్డుకు కోటి రూపాయలు

గుంటూరు, జనవరి 4: స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని 62 డివిజన్లలో స్వచ్ఛవార్డుల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనూరాధ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. పారిశుద్ధ్యంలో మొదటి స్థానం సాధించిన డివిజన్‌ను గోల్డెన్ డివిజన్‌గా ప్రకటించి కోటి రూపాయలు, ద్వితీయ స్థానం సాధించిన డివిజన్‌ను సిల్వర్‌గా పరిగణిస్తూ 50 లక్షల రూపాయలు, మూడవ స్థానం సాధించిన డివిజన్‌కు రజతగా గుర్తింపునిస్తూ 25 లక్షల రూపాయలు బహూకరించనున్నట్లు ప్రకటించారు. దీనివలన నగర పౌరులతో పాటు సిబ్బందిలో అవగాహన కల్పించాలనేది లక్ష్యంగా కమిషనర్ చెప్పారు.