User login

CAPTCHA
This question is for testing whether you are a human visitor and to prevent automated spam submissions.
Image CAPTCHA
Enter the characters shown in the image.

 

Reddys Matrimony

Follow Us

Follow us on Twitter

Who's online

There are currently 0 users and 0 guests online.

స్వాతంత్ర్య సమర యోధుడు, బహుభాషావేత్త - మన బెజవాడ గోపాల రెడ్డి

Bezawada Gopala Reddyడా.బెజవాడ గోపాలరెడ్డి (Bezawada Gopala Reddy)స్వాతంత్ర్య సమర యోధుడు, బహుభాషావేత్త, ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి, డా.బెజవాడ గోపాలరెడ్డి (ఆగష్టు 7, 1907 - మార్చి 9, 1997). పదకొండు భాషల్లో పండితుడైన గోపాలరెడ్డి అనేక రచనలు కూడా చేసాడు. పరిపాలనాదక్షుడుగా, కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రిపదవులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిత్వమే కాక, ఉత్తర ప్రదేశ్కు గవర్నరు గాను మరియు రాజ్యసభ సభ్యుడు (1958-1962) గా కూడా పనిచేసాడు.

జీవిత విశేషాలు

1907 ఆగష్టు 7న నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో జన్మించాడు. తండ్రి పట్టాభిరామిరెడ్డి, తల్లి సీతమ్మ. స్వంత ఊరిలోనే కళాశాల చదువు పూర్తి చేసి బందరు జాతీయ కళాశాలలో చేరారు. అక్కడ నుండి శాంతి నికేతన్లో 1924-27 సం||లలో రవీంద్ర కవీంద్రుని అంతే వాసి అయ్యారు. ఒక వైపు జాతీయోద్యమం మరోవైపు సాహిత్యపిపాస గోపాలరెడ్డి జీవనంలో పెనవేసుకొన్నాయి. 1927లో శాంతినికేతన్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో స్నాతకోత్తర విద్యను పూర్తి చేసాడు. రవీంద్రుని గీతాంజలిని తెనిగించిన సాహితీవేత్త. తిక్కవరపు రామిరెడ్డిగారి కుమార్తె లక్ష్మీకాంతమ్మను వివాహమాడారు. వారికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 186 నెలలు వివిధ రాజకీయ పదవులు నిర్వహించారు.
సాహితీ రాజకీయ రంగాలలో తనదైన విశిష్ట స్థానాన్ని నిలుపుకొని 90 సంవత్సరాల నిండు జీవితాన్ని పరిపూర్ణారొగ్యంతో గడిపిన పూర్ణపురుషుడు బెజవాడ గోపాలరెడ్డి. ఈ శతాబ్ది ప్రథామంలో జన్మించి చివరి వరకు జరిగిన పరిణామాలు అన్నిటినీ దర్శించిన భవ్యపురుషుడు. కవితారంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్న డా. గోపాలరెడ్డి వార్ధక్యాన్ని సాహితీ సుగంధాలతో నింపుకుని శేష జీవితాన్ని నెల్లూరులో గడిపారు.

రాజకీయ జీవితం జాతీయోద్యమంలో

జాతీయోద్యమంలో పాల్గొని చెరసాలల్లో సంవత్సరాల తరబడి గడిపారు. ముప్పయి సంవత్సరాలు నిండకముందే రాజాజీ మంత్రివర్గంలో అవిభక్త మదరాసు రాష్ట్రంలో మంత్రి అయ్యారు. అప్పటికింకా ఆయన అవివాహితుడు. తిక్కవరపు రామిరెడ్డిగారి కుమార్తె లక్ష్మీకాంతమ్మను మంత్రిగా వివాహమాడారు. కర్నూలులో ఆంధ్రరాష్ట్రం ఏర్పడినపుడు 1955లో ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో విశాలాంధ్ర ఏర్పడినపుడు హైదరాబాదు రాజధానిగా ఉపముఖ్యమంత్రి అయ్యాఅరు. ఆ తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ కేంద్రంలో మంత్రిగా ఆహ్వానించి రెవిన్యూ మంత్రిని చేశారు.

అనంతరం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను అప్పగించారు. ఐదేళ్ళపాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా వ్యవహరించారు. 186 నెలలు వివిధ రాజకీయ పదవులు నిర్వహించారు. సాహితీ రాజకీయ రంగాలలో తనదైన విశిష్ట స్థానాన్ని నిలుపుకొని 90 సంవత్సరాల నిండు జీవితాన్ని పరిపూర్ణారొగ్యంతో గడిపిన పూర్ణపురుషుడు బెజవాడ గోపాలరెడ్డి. ఈ శతాబ్ది ప్రథమంలో జన్మించి చివరి వరకు జరిగిన పరిణామాలు అన్నిటినీ దర్శించిన భవ్యపురుషుడు బెజవాడ గోపాల రెడ్డి.

సంయుక్త మద్రాసు రాష్ట్రంలో

ముప్పయి సంవత్సరాలు నిండకముందే రాజాజీ మంత్రివర్గంలో అవిభక్త మదరాసు రాష్ట్రంలో మంత్రి అయ్యారు. అప్పటికింకా ఆయన అవివాహితుడు.
ఆంధ్ర రాష్ట్రంలో - కర్నూలులో ఆంధ్రరాష్ట్రం ఏర్పడినపుడు 1955లో ముఖ్యమంత్రి అయ్యారు.
ఆంధ్ర ప్రదేశ్ లో - 1956లో విశాలాంధ్ర ఏర్పడినపుడు హైదరాబాదు రాజధానిగా ఉపముఖ్యమంత్రి అయ్యారు.

దేశ రాజకీయాలలో

జవహర్ లాల్ నెహ్రూ మంత్రి వర్గంలో 1962-64 మధ్య కాలంలో సమాచార ప్రసారమంత్రిగా వ్యవహరించారు. విశాఖపట్టణ కేంద్రం (ఆగష్టు 4, 1963), కడప కేంద్రం (జూన్ 17, 1963) ప్రారంభోత్సవాలు వీరి చేతిమీదుగా జరిగాయి. కామరాజ్ ప్లాన్ క్రింద గోపాలరెడ్డి 64లో మంత్రివర్గం నుండి రాజీనామా చేశారు. అనంతరం ఐదేళ్ళపాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా వ్యవహరించారు.

సాహితీ రంగంలో

Bezawada Gopala Reddyసాహితీ రంగంలో ఆయన సవ్యసాచి. 1946 నుండి తెలుగుభాషా సమితి అధ్యక్షులుగా వ్యవహరించారు. 1957 నుండి 82 వరకు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా 25 సం||లు పనిచేశారు. 1978 నుండి కేంద్ర సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక సభ్యులు. 1963 నుండి ఎనిమిదేళ్ళు జ్ఞానపీఠ అధ్యక్షులు. ఆయనకు పరిచితులుకాని సాహితీకారులు లేరు. అనేక భాషలలో సన్నిహిత పరిచయం గల గోపాలరెడ్డి రవీంద్రుని గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. తొలుత అనువాదాలతో ప్రారంభమై డెబ్బయివ ఏట స్వతంత్ర రచనలు మొదలుపెట్టారు. 1978లో తొలి స్వీయ కవితాసంపుటి వెలువరించారు. ఆమె, ఆమె జాడలు, ఆమె నీడలు, ఆమె తళుకులు, ఆమె చెరుకులు. ఇలా ఆమె పంచకం వెలువడింది. గోపాలరెడ్డి నోబెల్ బహుమతి గ్రహీతయైన రవీంద్రనాథ్ ఠాగూర్ వ్రాసిన ఊర్వశి, గీతాంజలి వంటి పలు రచనలను తెలుగులోకి అనువదించారు.

గోపాలరెడ్డి అంకితం పొందిన గ్రంథంలోని పద్యాలు

శ్రీవజ్ఝల చినసీతారమస్వామి శాస్త్రి గారు తాను రచించిన బాలవ్యాకరణోద్ద్యోతము అనే కృతిని శ్రీమాన్ బెజవాడ గోపాలరెడ్డి గారికి అంకితమిస్తూ ఆ గ్రంథములో వ్రాసిన కొన్ని పద్యాలను ఇక్కడ చూడ వచ్చు.

కం: బాలవ్యాకరోద్ద్యోతాలోకన ముభయభాషలందును వ్యాకృ
త్యాలోదన ఫల మీయంజాలుట నిది శబ్దశాస్త్ర సర్వస్వమగున్
దీని దగియెడు నాథుండీ నరలోకమున నీవె ఎన్నిక సేయన్
గానం దీనికి గృతి పతివై నా వాంఛితము దీర్పుమదిగాక యిలన్.
సీ: ఇండియా దేశంపు బుక్థశాఖా మంత్రి
యాంధ్ర విశ్వకళాసమజ్య కెల్ల
గౌరాధ్యుక్షుడాగ్లంబున వంగాంధ్ర సంస్కృతంబులను విశారదుండు
విద్యాలయము వారి బిరుదముల్ డాక్టరు డీ లిట్టు లలరు విశాల కీర్తి,
పండిత కవి పక్షపాతి పండిత పోషణాభిముఖ్యుండు దేశాభిమాని,
తే.గీ. కృతి పతిత్వంబు నంగీకరించె నాంధ్ర సంస్కృతంబుల లక్షణజాల మిందు,
పరగుచున్నది సూరిలోపములు దీర్చు నిట్టి దీనికి సాటి వ్యాకృతులు గలవె...
కం: చుట్టాలసురభి సీతను జెట్టం జేపాట్టినట్టి జెట్టికి శ్రీమత్,
పట్టాభి రామిరెడ్డికి, దిట్టకు మీపితకు గలదె క్షీ టిలలోనన్
చిరకాలంబునకున్ లభించె మరలన్ శ్రీరెడ్డి సామ్రాజ్య మీ
ధర శ్రీనాథుని నాటికన్న గడు నాంధ్రంబుజ్జ్వలంబౌచు భా,
స్వరతం గాంచుట యబ్బురంబగునె గోప్పాలాంధ్ర రెడ్డి ప్రభూ
మరలింపందగదే భవద్యశము వేమారెడ్డి సత్కీర్తులన్?.
కం: పాపులకతి దూరునకన్, శ్రీపతి పాదాబ్జ చంచరీకాత్మునకున్, గోపాల రెడ్డి విభునకు భూపాల సమర్చితాత్మ పుష్కర యుతికిన్.

bezawadagopalareddyBezawada Gopala Reddy

Donate Now

Donate Now

Advertisements

 

Sakshi Classifieds

 

 

 

 

Poll

Reddys 2nd in India, 5th in Asia, 11th in World, The 4th Most Richest Community in World, by 2018 Reddys will be Worlds No.1 ?
Yes
88%
No
12%
Total votes: 1278