తెలంగాణలో ఎవరిని కొట్టారో చెప్పాలి

Posani Krishna Murali Comments On Pawan Kalyan - Sakshi

పవన్‌కళ్యాణ్‌కు పోసాని సవాల్‌

చంద్రబాబు మాటలే..మాట్లాడుతున్నావు..

మీ అన్న, మీ ఆస్తులను లాక్కుని కొట్టారా? 

విద్వేషాలు రెచ్చగొట్టి.. ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేయొద్దు

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రవాళ్లని కొడుతున్నారని చెబుతున్న పవన్‌కళ్యాణ్‌ ఎవరెవర్ని కొట్టారో చెప్పాలని ప్రముఖ సినీనటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళీ సవాల్‌ చేశారు. పైగా ఆంధ్రులపై దాడులు జరుగుతుంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భుజాలకెత్తుకుంటున్నారని ఆంధ్రజ్యోతి పలుకులనే పవన్‌కళ్యాణ్‌ పలికారని విమర్శించారు. గతంలో పవన్‌ ఎవరిని భుజాలకెత్తుకున్నారో ప్రజలకు తెలుసని సంబంధిత వీడియోలను చూపించారు. శనివారం అమీర్‌పేటలో విలేకరులతో మాట్లాడుతూ నాలుగు ఓట్ల కోసం తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకూడదని హితవు పలికారు. మంచి సీఎం కేసీఆర్‌ అని, తెలంగాణ నాయకులనే స్ఫూర్తిగా తీసుకోవాలని పవన్‌ చెప్పిన మాటలను గుర్తు చేశారు.

సీఎం కూతురు కవిత గురించి మాట్లాడుతూ ‘బంగారు చెల్లీ వేల వేల అభినందనలు, హ్యాప్పీ బర్త్‌డే  అంటూ ట్వీట్‌లు చేసింది మీరు కాదా’ అని ప్రశ్నించారు . ‘కేసీఆర్‌ భూములను ఆక్రమించారని అంటున్నావు ఎక్కడైనా ఆంధ్రావారి భూములు లాక్కున్నట్లు చూపిస్తే పాదాభివందనం చేస్తానని’ పోసాని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో  కేసీఆర్‌ను విమర్శిస్తూ వ్యతిరేకంగా వ్యాసాలు రాసినా ఎవరూ తన జోలికి రాలేదని గుర్తు చేశారు. ‘తెలంగాణ రాష్ట్రంలో నీ ఆస్తులు, మీ అన్న ఆస్తులు ఉన్నాయి కదా.. ఏనాడైనా మిమ్మల్ని బెదిరించారా’ అని పోసాని ప్రశ్నించారు

తెలంగాణలో.. ఎన్టీఆర్‌ను చంపిందెవరు?..
తెలంగాణ నడి బొడ్డులో  ఆంధ్రాకు చెందిన గ్రేట్‌ నాయకుడు, తెలుగు ప్రజల ముద్దు బిడ్డ ఎన్టీరామారావు చనిపోవడానికి కారకుడైన వ్యక్తి చంద్రబాబునాయుడని చెప్పారు. ఆంధ్రా వారిని ఆంధ్రా నాయకుడే చంపించారని తెలిపారు. ఇక ఆంధ్రాలో ఆంధ్రా ప్రజలు క్షేమంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. ‘నిజాయితీగా పనిచేసే మహిళా అధికారి వనజాక్షిని వెంటపడి వెంటపడి కొట్టారు. కొట్టింది తెలంగాణ వారు కాదని, చంద్రబాబు మనుషులని తెలియదా’ అన్నారు. ‘మైక్రో ఫైనాన్స్‌ను అడ్డం పెట్టుకుని ఎంతోమంది మహిళల జీవితాలను నాశనం చేసింది తెలంగాణ వారు కాదే..ఆంధ్రాలో ఉండి  ఏనాడైనా వెళ్లి ఆడవాళ్లకు అండగా నిలిచి కేసులు పెట్టించావా’ అన్ని ప్రశ్నించారు. ఎందుకు చంద్రబాబునాయుడి మాటలు మాట్లాడాల్సి వస్తోందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఒక స్థలం కోసం టీఆర్‌ఎస్‌ నాయకులు ఒక ఎమ్మెల్యేను బెదిరిస్తే.. భయపడి వైఎస్సార్‌సీపీలో చేరతాడా..ఇదే నిజమైతే ఆంధ్రాలో చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను బెదిరించి తీసుకువెళ్లాడా? ఆ ఎమ్మెల్యేలు అమాయకులని చెప్పదలుచుకున్నావా? మీ అన్న పార్టీ పెట్టినప్పుడు మీ ఇంట్లో ఆడవారిని కూడా కించపరిచే విధంగా చంద్రబాబు టీడీపీ నాయకుల చేత మాట్లాడించిన విషయాన్ని మరచిపోయి వైఎస్సార్‌సీపీ నాయకులపై ఆరోపణలు చేస్తున్నావా. విద్వేషాలను రెచ్చగొట్టి జరగరాని ఘనటలు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని’ ప్రశ్నించారు. ఇలాగే  గతంలో రెచ్చగొడితే ముంబాయిలో సేన వాళ్లు ఏమి చేశారో గుర్తు తెచ్చుకో అన్నారు. ‘ఆంధ్ర ప్రజలారా కేసీఆర్‌ విషయంలో పవన్‌కళ్యాణ్, చంద్రబాబునాయుడి మాటలు నమ్మవద్దు. తెలంగాణలో ఆంధ్రా ప్రజలు అంతా క్షేమంగా ఉన్నారు. పవన్‌ కొత్త పార్టీ పెట్టావు. ప్రజలకు మంచిచేయి.చెడు మాత్రం చేయవద్దని  పోసాని హితవు పలికారు. 

మరిన్ని వార్తలు

24-03-2019
Mar 24, 2019, 05:18 IST
సాక్షి, హైదరాబాద్‌: సీఎం చంద్రబాబు ఒకవైపు కులవిద్వేషాలు, ప్రాంతీయ విభేదాలు సృష్టించేలా ఎన్నికల సభల్లో మాట్లాడుతూంటే.. మరోవైపు జనసేన అధ్యక్షుడు...
24-03-2019
Mar 24, 2019, 05:13 IST
సాక్షి, అమరావతి: రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ఖాయం అని జాతీయ సర్వేలు స్పష్టం చేస్తుండడంతో బెంబేలెత్తుతున్న టీడీపీ సిండికేట్‌...
24-03-2019
Mar 24, 2019, 05:00 IST
సాక్షి, అమరావతి: వ్యాపారవేత్తల ముసుగులో బ్యాంకులకు టోపీ పెడుతున్న వారికి తెలుగుదేశం పార్టీ అడ్డాగా మారింది. రుణాలు, పన్నులు ఎగ్గొట్టిన...
24-03-2019
Mar 24, 2019, 04:44 IST
శ్రీకాకుళం జిల్లా నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి/సాక్షి, విశాఖపట్నం/సాక్షి ప్రతినిధి, కాకినాడ/గొల్లప్రోలు:  ‘‘ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ ఇళ్ల మంజూరు, రేషన్‌...
24-03-2019
Mar 24, 2019, 04:31 IST
సాక్షి, అమరావతి బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే..జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పాటిస్తారని, టిక్కెట్ల కేటాయింపు తర్వాత మార్పులు,...
24-03-2019
Mar 24, 2019, 03:41 IST
సాక్షి, హైదరాబాద్‌: కొత్తగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం తన బాధ్యత అని సీఎం కేసీఆర్‌ భరోసానిచ్చారు. శనివారం...
24-03-2019
Mar 24, 2019, 03:13 IST
నల్లగొండ రూరల్‌: పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీ అభ్యర్థిగా...
24-03-2019
Mar 24, 2019, 02:47 IST
సాక్షి, హైదరాబాద్‌: దేశాన్ని పురోభివృద్ధి దిశగా తీసుకెళ్తూ, ప్రపంచ దేశాల్లో భారత్‌ను ముందు వరుసలో నిలిపేందుకు కృషి చేస్తున్న నరేంద్రమోదీ...
24-03-2019
Mar 24, 2019, 02:39 IST
సాక్షి, హైదరాబాద్‌: సీపీఐ, సీపీఎంల మధ్య పొత్తు కొలిక్కి వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం పోటీ చేసే ఖమ్మం, నల్లగొండ,...
24-03-2019
Mar 24, 2019, 02:24 IST
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ అధిష్టానం శనివారం ప్రకటించింది. ఇటీవల...
24-03-2019
Mar 24, 2019, 02:15 IST
సాక్షి, సంగారెడ్డి: ‘రాష్ట్రం నుంచి 16 మంది ఎంపీలను టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలిపిస్తే..ఢిల్లీ మన చేతుల్లో ఉంటుంది. మనమే...
24-03-2019
Mar 24, 2019, 02:00 IST
సాక్షి, జగిత్యాల: పసుపు రైతులకు న్యాయం కోసం తాను ఎక్కని కొండలేదని, మొక్కని బం డ లేదని సిట్టింగ్‌ ఎంపీ,...
24-03-2019
Mar 24, 2019, 01:50 IST
సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో పాలమూరు జిల్లా రాజకీయం సాగునీటి ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతోంది. కృష్ణానది జలాల అంశాలు టీఆర్‌ఎస్,...
24-03-2019
Mar 24, 2019, 01:24 IST
సాక్షి, హైదరాబాద్‌/కరీంనగర్‌: పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్‌.. బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైంది. ఆయన్ను పార్టీలో చేర్చుకుని పెద్దపల్లి నుంచే...
24-03-2019
Mar 24, 2019, 01:20 IST
గోదావరిఖని/మంచిర్యాల: మాజీ ఎంపీ వివేక్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీ ద్రోహం చేయలేదని, ఆయన పార్టీకి తీరని ద్రోహం చేశారని సంక్షేమ శాఖ...
24-03-2019
Mar 24, 2019, 01:16 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకే పార్టీ వారు ఉంటేనే రాష్ట్రానికి ఎక్కువ మేలుజరుగుతుందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌...
24-03-2019
Mar 24, 2019, 01:11 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని, తమ పార్టీ ఎమ్మెల్యేలను అనైతికంగా టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్న ప్రభుత్వాన్ని...
24-03-2019
Mar 24, 2019, 01:07 IST
సాక్షి, హైదరాబాద్‌: సీఎం చంద్రశేఖర్‌రావు చర్యలతో రాష్ట్రం రాజకీయ, రాజ్యాంగ, నైతిక సంక్షోభంలో కూరుకుపోయిందని కేంద్ర మాజీ మంత్రి వీరప్ప...
24-03-2019
Mar 24, 2019, 01:00 IST
సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ వ్యూహం సిద్ధం చేసింది. 16 స్థానాల్లో కచ్చితంగా విజయం...
24-03-2019
Mar 24, 2019, 00:17 IST
‘నేను విన్నాను. నేను ఉన్నాను.’ వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కొన్ని రోజులుగా  ఎన్నికల ప్రచార సభలలో ప్రస్ఫుటంగా చెబుతున్న మాటలు...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top