అమాత్య... అన్న పిలుపేదీ?

No Ministry For Three Constituencies Since - Sakshi

తెలుసుకుందాం!

సాక్షి, గుంటూరు : జిల్లాలో గతంలో ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య పనర్విభజనతో 19 నుంచి 17కు తగ్గిపోయింది. అయితే ఇప్పటి వరకూ మూడు నియోజకవర్గాలకు మంత్రి పదవి దక్కలేదు. వాటిలో ఒకటి రద్దయిన దుగ్గిరాల నియోకవర్గంకాగా మిగిలిన రెండు నరసరావుపేట పార్లమెంట్‌ పరిధిలోని గురజాల, మాచర్ల. నరసరావుపేట పార్లమెంట్‌ పరిధిలోని సత్తెనపల్లికి కేవలం నెలరోజులే మంత్రి పదవి దక్కింది. దుగ్గిరాల నియోజకవర్గం నుంచి గుదిబండి వెంకటరెడ్డి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి మాత్రం దక్కలేదు.

మాజీ మంత్రి ఆలపాటి ధర్మారావు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందినప్పటికీ మంత్రి పదవి దక్కలేదు. అనంతరం వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేసి మంత్రి అయ్యారు. సత్తెనపల్లిది విచిత్ర పరిస్థితి. 1983లో ఇక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన నన్నపనేని రాజకుమారి ఎమ్మెల్యేగా గెలుపొంది నాదెండ్ల భాస్కరరావు మంత్రి వర్గంలో నెలపాటు మంత్రిగా కొనసాగారు. ఆ నెల మినహా సత్తెనపల్లి నియోజకవర్గానికి ఇప్పటి వరకు మంత్రి పదవి దక్కలేదు.

సత్తెనపల్లి నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీచేసి వరుసగా నాలుగు సార్లు గెలుపొందిన స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్యకు సైతం మంత్రి పదవి దక్కలేదు. 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు 924 స్వల్ప మెజార్టీతో గెలిచినా శాసన సభ స్పీకర్‌ పదవితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చిలకలూరిపేట నియోజకవర్గంలో 2014 వరకు మంత్రి పదవి దక్కలేదు. 2014లో మాత్రం మొట్టమొదటిసారిగా ప్రత్తిపాటి పుల్లారావు అమాత్యుడిగా ప్రమాణం చేశారు. పల్నాడు ప్రాంతంలో ఉన్న గురజాల నియోజకవర్గం నుంచి ఇంత వరకు ఒక్కరు కూడా మంత్రి పదవి పొందలేదు.

అయితే గురజాల వాసి అయిన డొక్కా మాణిక్యవరప్రసాదరావు తాడికొండ నియోజకవర్గం నుంచి విజయం సాధించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా కొనసాగారు. అయితే ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడూ రెండు సార్లుకంటే ఎక్కువ సార్లు గెలవకపోవడంతో మంత్రి పదవులు దక్కలేదని చెప్పుకోవచ్చు. మాచర్ల నియోజకవర్గం నుంచి కూడా ఇంత వరకు ఒక్కరు కూడా మంత్రి పదవిని పొందలేకపోయారు.

ఈ నియోజకవర్గం నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినా అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అనర్హత వేటుకు గురై 2012 ఉప ఎన్నికల్లో రెండో సారి గెలిచి రికార్డు సృష్టించారు. 2014 ఎన్నికల్లో సైతం విజయం సాధించి పల్నాడు ప్రాంతంలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ రికార్డు సృష్టించారు. ఆయన మినహా మిగిలిన ఎవరూ రెండు సార్లు గెలవలేదు.       

మరిన్ని వార్తలు

26-03-2019
Mar 26, 2019, 08:29 IST
ఏమోయ్‌ రాములు.. ఇంట్లున్నవానోయ్‌.... ఏంజేత్తన్నవేంది అనుకుంట రాములు ఇంట్ల అడుగు బెట్టిండు ఆయనకు బావ వర్సయ్యే ఎంకటి. గల్మ లోపల్కి...
26-03-2019
Mar 26, 2019, 08:29 IST
‘‘బాబు వస్తే జాబు వస్తుందన్నారు.ప్రభుత్వ ఉద్యోగాల జాతర అన్నారు. ఏడాదికో డీఎస్సీ అన్నారు. అధికారంలోకి వచ్చాక ఆ మాట మరిచారు. తీరా చూస్తే ఉద్యోగాల్లేవ్‌..ఇక...
26-03-2019
Mar 26, 2019, 08:21 IST
చింతకింది గణేశ్, సాక్షి– హైదరాబాద్‌ :అనేక ప్రాంతాల ప్రజలు.. భిన్న సంస్కృతుల నెలవు.. పారిశ్రామికరంగానికి రాజధాని.. మల్కాజిగిరి. జీవనోపాధి కోసం...
26-03-2019
Mar 26, 2019, 08:18 IST
సామర్లకోట (పెద్దాపురం): సామర్లకోట మండలంలోని వేట్లపాలెం గ్రామానికి చెందిన బొడ్డు భాస్కర రామారావు వర్గీయులు సుమారు 300 మంది సోమవారం...
26-03-2019
Mar 26, 2019, 08:14 IST
సాక్షి, అమరావతి : స్టార్‌.. స్టార్‌.. ‘ట్రోలింగ్‌ స్టార్‌’.. ఇంతకీ ఈ ట్రోలింగ్‌ స్టార్‌ ఎవరంటే? .. ఇంకెవరు.. చినబాబు...
26-03-2019
Mar 26, 2019, 08:14 IST
సుశీలక్కా.. ఓ సుశీలక్కా.. ఇంకా రడీ కాలేదేంటే.. అంటూ వచ్చింది వనజాక్షి సుశీల : ఆ.. ఇంట్లో పాచి పనులన్నా అవ్వొద్దంటే...
26-03-2019
Mar 26, 2019, 08:12 IST
ఎన్నికలంటేనే.. పాలన విధానాల రూపకల్పన కు సరైన వ్యక్తులను చట్టసభలకు పంపించటం. చట్టసభల్లో సమస్య పరిష్కారం కానప్పుడు..? నిరసన.. ఆ...
26-03-2019
Mar 26, 2019, 08:03 IST
సాక్షి, గుంటూరు : సాగునీటికి కరువు.. తాగునీటికీ కరువు.. పశుగ్రాసానికి కరువు.. ఇంత కరువా.. కచ్చితంగా కరువుకు కేంద్రబిందువు.. ఇది అనంతపురం...
26-03-2019
Mar 26, 2019, 08:02 IST
డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలన్నింటినీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తాం. మహిళా సంఘాలకు లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు...
26-03-2019
Mar 26, 2019, 07:37 IST
సాగునీటి కోసం తహతహలాడే పల్లెలు, ఆధునికత మేళవించిన పట్టణ ప్రాంతాలు కలిగిన చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో పాగా వేసేందుకు ప్రధాన...
26-03-2019
Mar 26, 2019, 07:33 IST
సాక్షి, అవనిగడ్డ :  ‘‘అంతన్నాడు.. ఇంతన్నాడే.. చిన్నబాబు.. నన్నొగేసెలిపోయినాడే చిన్నబాబు..’’ అంటూ దీనంగా రోదిస్తోందీ చల్లపల్లి. స్వచ్ఛ చల్లపల్లిగా ఖ్యాతి పొందిన...
26-03-2019
Mar 26, 2019, 07:32 IST
సాక్షి, జగ్గయ్యపేట : జగ్గయ్యపేట నియోజకవర్గంలో భార్యభర్తలు ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారు. వారే మండలంలోని ముక్త్యాల గ్రామానికి చెందిన ముక్త్యాల...
26-03-2019
Mar 26, 2019, 07:28 IST
సాక్షి, అమరావతి : ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలం కనపడుతోంది. పార్టీలు, అభ్యర్థుల విమర్శలతో రాజకీయం వేడెక్కింది. ఈ...
26-03-2019
Mar 26, 2019, 07:21 IST
సాక్షి, న్యూఢిల్లీ : 2014, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అఖండ విజయం సాధించడంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను ఉపయోగించుకొని...
26-03-2019
Mar 26, 2019, 07:13 IST
సాక్షి, కర్నూలు : రాష్ట్ర తొలి రాజధానిగా గుర్తింపు పొందిన కర్నూలులో ఇప్పటివరకు 16 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. కర్నూలు లోక్‌సభ...
26-03-2019
Mar 26, 2019, 05:50 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తుది ఓటర్ల సంఖ్య 3,93,45,717 అని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్‌ 11న 25...
26-03-2019
Mar 26, 2019, 05:34 IST
సాక్షి, అమరావతి: అడుగడుగునా ప్రజల్లో కనిపిస్తున్న వ్యతిరేకత, తాను చెప్పే విషయాలకు జనంలో స్పందన కరువవడం.. అన్నింటికీ మించి దేనికీ వెరవకుండా...
26-03-2019
Mar 26, 2019, 05:29 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసు ఉన్నతాధికారులను, సిబ్బందిని ఎన్నికల బాధ్యతల నుంచి...
26-03-2019
Mar 26, 2019, 05:23 IST
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హిందూపురం లోక్‌సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. వివరాల్లోకి వెళితే...
26-03-2019
Mar 26, 2019, 05:18 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని ఓటర్లు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న అంశంగా మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫామ్స్‌...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top