e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 7, 2021
Home News నాడు దండగ అన్న వ్యవసాయం.. నేడు పండగైంది..

నాడు దండగ అన్న వ్యవసాయం.. నేడు పండగైంది..

నాడు దండగ అన్న వ్యవసాయం.. నేడు పండగైంది..

తెలంగాణ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. దాదాపుగా 60 లక్షల మందికిపైగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే వ్యవసాయానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్నన్ని కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రమూ అమలు చేయడం లేదు. రైతుల మేలుకోసం సీఎం కేసీఆర్ దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక వ్యూహాలను అమలు చేస్తున్నారు. పంట వేసే దశ నుంచి పంట అమ్ముకునే దశ వరకు పలు రకాల పథకాలతో పథకరచన చేశారు. రైతుబంధు, రైతు బీమా,  రైతుల పంట రుణాలు మాఫీ చేయడం, ఇన్ పుట్ సబ్సిడీ అందించడం, ఉచిత విద్యుత్ అందివ్వడం, గోదాముల నిర్మాణంతోపాటు వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. రైతుల దిగుబడి, తలసరి ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం ఆధునిక వ్యవసాయ పద్ధతులను అమలు పరుస్తున్నది.

 2013-14 బడ్జెట్ లో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించింది 4,040 కోట్లు. అందులో తెలంగాణ వాటా 1,697 కోట్లు మాత్రమే. మొత్తంగా 2004-14 వరకు పది సంవత్సరాల్లో ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు వ్యవసాయశాఖకు కేవలం రూ.8,581 కోట్లు మాత్రమే కేటాయించిది. అదే టిఆర్ఎస్ ప్రభుత్వం 2019-20 లో రూ.33,125 కోట్లు కేటాయించింది. పశు సంవర్ధక శాఖకు సమైక్య పాలనలో 2004-14 వరకు 2,219 కోట్లు కేటాయిస్తే.. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014-20 వరకు రూ.9.035 కోట్లు కేటాయించారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు మార్కెటింగ్ శాఖకు మొత్తం కేటాయింపులు రూ.214 కోట్లు కాగా, అందులో తెలంగాణ వాటా 90.28 కోట్లు మాత్రమే. కానీ, తెలంగాణ వచ్చాక ప్రభుత్వం 2017-18 బడ్జెట్లో మార్కెటింగ్ శాఖకు కేటాయించింది రూ. 509 కోట్లు. వ్యవసాయానికి ఏడాదికి 37,968 కోట్ల రూపాయలు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. వ్యవసాయ రంగంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా రైతుల ఆదాయంపై గణనీయమైన మార్పు చూపాయి. 2016 నుంచి ప్రతి ఏటా 100 లక్షల టన్నులకు పైనే వ్యవసాయ ఉత్పత్తులు జరుగుతున్నాయి. బ్యాంకుల నుంచి రైతులు ప్రతిఏటా దాదాపు రూ.29 వేల కోట్ల వరకు రుణం పొందుతున్నారు.

వృద్ధిరేటు : వ్యవసాయం, దాని అనుబంధ శాఖలతో కూడిన ప్రాథమిక రంగంలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో 1.8 శాతం వృద్ధిరేటు మాత్రమే తెలంగాణలో నమోదైంది. ఇపుడు  6.3 శాతం అదనపు వృద్ధి సాధించి 8.1 శాతం నమోదు చేయగలిగింది.   రాష్ట్రంలో పంటల ఉత్పత్తిలో 23.7 శాతం వృద్ధి సాధించింది.

నాడు దండగ అన్న వ్యవసాయం.. నేడు పండగైంది..
  1. రుణవిముక్తులను చేసిన ‘రుణమాఫీ’

రైతులు తీసుకున్న రుణాలు వారికి భారం కాకూడదన్న ఉద్దేశంతో టీ.ఆర్.ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 16,124.37 కోట్ల రుణమాఫీ చేసింది. ఒకేసారి మాఫీ చేయాలని సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆర్.బి.ఐ అంగీకరించకపోవడంతో 4 విడతలుగా రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేసింది. రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో టిఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలోని రైతులందరికీ రూ. లక్ష లోపు పంట రుణాలను టీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసింది. 2014 మార్చి 31 వరకు ఉన్న రూ. లక్ష లోపు వ్యవసాయ రుణాలు రద్దు చేసింది. 4 విడతల్లో రైతులకు రూ.16,124.37 కోట్ల రుణమాఫీ సంపూర్ణమయ్యింది. 35,29,944 మంది రైతులకు ప్రయోజనం కలిగింది.

రెండో దఫా రైతు రుణమాఫీ రూ.25,936 కోట్లు

2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 నాటికి రాష్ట్రంలో బ్యాంకుల ద్వారా రూ.లక్ష లోపు తీసుకున్న రూ.25,936 కోట్లు రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 40.66 లక్షల మంది రైతులకు ఈ రుణమాఫీతో లబ్దిచేకూరనున్నది.  రుణమాఫీ మార్గదర్శకాలతో కూడిన జీవో ఆర్టీ నంబర్‌- 148ని 2020 మార్చి 17న విడుదల చేశారు. అసలు, వడ్డీ కలిపి కుటుంబానికి రూ.లక్ష చొప్పున రుణమాఫీ చేస్తున్నారు. స్వల్పకాలిక పంట రుణాలతోపాటు బంగారం తాకట్టు పెట్టి రైతులు తీసుకున్న పంట రుణాలు కూడా మాఫీ చేస్తారు. రుణమాఫీకి ప్రభుత్వం 2019-20 బడ్జెట్లో లో రూ.6 వేల కోట్లు, 2020-21 బడ్జెట్లో  రూ.6225 కోట్లు కేటాయించింది.  రెండోదఫాలో రూ.25వేల లోపు బాకీ ఉన్న 5.88 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.1210 కోట్ల రుణాలను తొలుత మాఫీ చేస్తున్నది. ఈ నిధులను 07 మే, 2020న ప్రభుత్వం విడుదల చేసింది. వీరి రుణాలకు నగదును వారి వారి ఖాతాల్లో జమ చేశారు. రుణమాఫీ అయిన రైతులు బ్యాంకుల నుంచి కొత్త రుణాలను పొందనున్నారు. రూ.25 వేలకు పైగా అప్పు ఉన్న రైతులకు నాలుగు విడతలుగా రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించారు.

రూ.25 వేల లోపు రుణాలున్న రైతుల రుణమాఫీకి రూ.1210 కోట్లు

 రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవడానికి రూ.25 వేల లోపు ఉన్న రుణాలను ప్రభుత్వం ఒకేసారి మాఫీచేసింది. ఇందుకోసం రూ.1210 కోట్లను 7 మే 2020న ఆర్థికశాఖ విడుదలచేసింది. వ్యవసాయశాఖ నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ చేశారు. దీనివల్ల రూ.25 వేల లోపు పంట రుణాలున్న దాదాపు 6.15 లక్షల మంది రైతుల పంటరుణాలు ఒకేసారి మాఫీ అవుతాయి. రుణమాఫీ అయిన రైతులు బ్యాంకుల నుంచి కొత్త రుణాలను పొందనున్నారు.

నాడు దండగ అన్న వ్యవసాయం.. నేడు పండగైంది..
  • రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లింపు

పంట రుణాలను మాఫీ చేయడమే కాకుండా, ప్రభుత్వం 2009 నుంచి రైతులకు చెల్లించాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ పాత బకాయిలను కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చెల్లించింది. వడగండ్లు, భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహరం 2014-15లో రూ.480.43 కోట్లతో 12.64 లక్షల రైతుల ఖాతాలలో జమ చేశారు. తర్వాత వైపరీత్యాలకు కూడా ప్రభుత్వం రూ.845.14 కోట్లను రైతులకు చెల్లించింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 37,45,102 మంది రైతులకు మొత్తం రూ.1325 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చారు.

  • ఎర్రజొన్న రైతులకు రూ.9.5 కోట్లు చెల్లింపు

నిజామాబాద్ జిల్లాలోని ఎర్ర జొన్న రైతులకు రావలసిన రూ.9.5 కోట్ల పాత బకాయిలను వారికి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ బకాయిలను 2014 నవంబర్ 8న చెల్లించింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు రైతులు ఎర్ర జొన్న పండించి, పక్క రాష్ట్రాలకు అమ్మితే బ్రోకర్‌ చేసిన మోసం వల్ల నష్టపోయారు. ఈ రైతులను ఆదుకోవడానికే ప్రభుత్వం బకాయిలను చెల్లించింది.

  • సకాలంలో ఎరువులు, విత్తనాలు సరఫరా

తెలంగాణ ఏర్పాటుకు ముందున్న ప్రభుత్వాల హయాంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కోసం  రైతులు చెప్పులు లైన్లలో పెట్టి రోజులకొద్దీ ఎదురుచూసే దుస్థితి ఉండేది. దీన్ని తిరగరాసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ఆత్మగౌరవాన్ని పెంచేలా వ్యవసాయ ప్రణాళికలను రూపొందించారు. వ్యవసాయశాఖ ఎండాకాలంలోనే విత్తనాలు తెప్పించి, గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచుతున్నది. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అరకొర పంపిణీ వ్యవస్థతో రైతులను ఇబ్బందులకు గురిచేసి లాఠీ దెబ్బలు రుచి చూపించిన చరిత్రను మనం ఇప్పటికీ మరచిపోలేం. కానీ తెలంగాణ ప్రభుత్వం రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులను ముందుగానే తెప్పించి, నిల్వచేసి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతు ముంగిటకే రాయితీపై పంపిణీ చేస్తున్నది.

 

నాడు దండగ అన్న వ్యవసాయం.. నేడు పండగైంది..

ఎరువుల వాడకం

2013-14             : 28.89 లక్షల టన్నులు

2019-20            : 32.75 లక్షల టన్నులు

(పెరుగుదల 3.86 లక్షల టన్నులు, పెరిగిన శాతం 13.36)

  • కొనుగోలు కేంద్రాల సమాచారం.. రైతుల ఫోన్లకే

ధాన్యం కొనుగోలు, కనీస మద్దతు ధర చెల్లింపులకు సంబంధించి రైతులకు ప్రయోజనం కలిగేలా ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఓపీఎమ్మెస్)ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2019 యాసంగి సీజన్ నుంచి ఈ సాఫ్ట్‌ వేర్‌ను అన్ని కొనుగోలు కేంద్రాల్లో (పీపీసీ) తెచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల సమాచారాన్ని రైతులకు సెల్‌ఫోన్ ద్వారా అందించేలా సాఫ్ట్‌ వేర్‌ను అభివృద్ధి చేశారు. దీనిద్వారా రైతులు ఎక్కడినుంచైనా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతా వివరాలను కూడా నమోదు చేసుకోవచ్చు. ధాన్యం కేటాయించిన ఏడురోజుల్లోగా మిల్లుల నుంచి సమాచారం అందకపోతే.. అధికారులను అప్రమత్తం చేస్తూ సంక్షిప్త సందేశాలు వెళ్తాయి. జియో ట్యాగింగ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు, మిల్లులపై నిఘా ఉంటుంది. మిల్లుల సామర్థ్యానికి అనుగుణంగా ధాన్యం కేటాయించేలా సాఫ్ట్‌ వేర్‌ను అభివృద్ధి చేశారు. ఓపీఎమ్మెస్ (Office of Personnel Management) మొబైల్‌యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు.

  • రైతుకు ప్రభుత్వమే పంట పెట్టుబడి సాయం అందించే ‘రైతుబంధు’

రైతుల పెట్టుబడి సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్నమైన, ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నది. రైతుకు పంట సమయంలో పెట్టుబడి చాలా కీలకం. వ్యవసాయ పెట్టుబడి కోసం రైతులు అప్పుల పాలవుతున్నారు. పెట్టుబడి కోసం చేసిన అప్పు, దానిమీద పడే వడ్డీ పులిమీద పుట్రలా ఒకదానికి ఒకటి తోడై రైతును పూర్తిగా కృంగదీస్తున్నాయి. ఈ క్షోభ నుంచి రైతును కాపాడడం కోసం పంటకు అవసరమైన పెట్టుబడిని ప్రభుత్వమే పంటసాయంగా అందించాలని నిర్ణయించింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ ఏ ప్రభుత్వమూ రైతుపక్షాన నిలబడి ఇంతగొప్ప నిర్ణయం తీసుకోలేదు.

భూముల వివరాలు : రాష్ట్రవ్యాప్తంగా 1,50,12,603 ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి, 61,50,134 మంది రైతులు ఉన్నారు. 60.95 లక్షల మంది పట్టాదారుల్లో మూడెకరాల్లోపు ఉన్నవారు 72.57 శాతం మంది ఉన్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలకు చెందిన వారే 98.7 శాతం మంది ఉన్నారు. మొత్తంగా పది ఎకరాల్లోపు ఉన్న రైతులే 98.38%గా ఉన్నారు. 25 ఎకరాలు పైబడిన రైతులు 6,679 మంది ఉన్నారు. వీరి చేతుల్లో 2,24,733 ఎకరాల విస్తీర్ణమున్న భూములు ఉన్నాయి.

నాడు దండగ అన్న వ్యవసాయం.. నేడు పండగైంది..

రాష్ట్రంలో రైతులు, వారికి ఉన్న భూముల వివరాలు

విస్తీర్ణంపట్టాదారుల సంఖ్యవిస్తీర్ణం (ఎకరాల్లో)పట్టాదారుల శాతం
3 ఎకరాల్లోపు44,22,99160,60,393.5672.57
3-5 ఎకరాల్లోపు11,08,19343,60,186.1418.18
5-10 ఎకరాల్లోపు4,6529830,94,854.597.63
10-20 ఎకరాల్లోపు84,60611,09,304.631.39
20 ఎకరాల పైన14,0463,87,864.260.23
             మొత్తం60,95,1341,50,12,603.18100
  • ఈ నేపథ్యంలో తొలుత ప్రతి ఎకరాకు రెండు పంటలకు కలిపి రూ.8 వేల రైతుబంధు పంట సాయం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 2018 మే 10న కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి – ఇందిరానగర్‌ వద్ద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. ధర్మరాజుపల్లి వాసులు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చెక్కులు, పట్టాదార్‌ పాస్ పుస్తకాలు అందుకున్నారు.

2018లో రైతుబంధు సాయం: 2018 వానాకాలంలో ఎకరాకు 4 వేల చొప్పున 50 లక్షల 25 వేల మంది రైతులకు చెందిన 1 కోటి 30 లక్షల 91 వేల ఎకరాల భూములకు ప్రభుత్వం రూ.5,236.30 కోట్లు రైతుబంధు పంటసాయం అందజేసింది. 2018-19 యాసంగిలో ఎకరాకు రూ. 4వేల చొప్పున 49 లక్షల 13 వేల మంది రైతులకు చెందిన 1 కోటి 31 లక్షల 30 వేల ఎకరాల భూములకు ప్రభుత్వం రూ.5,251.89 కోట్లు రైతుబంధు పంటసాయం అందజేసింది.

2019 నుంచి పంటసాయం ఎకరాకు రూ.10 వేలు : 2019 నుంచి ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని 2 పంటలకు కలిపి ఎకరాకు రూ.10 వేలకు పెంచింది. 2019 వానాకాలంలో రూ.6125.54 కోట్లు, యాసంగిలో రూ.4406.48 కోట్లు, 2020 వానాకాలంలో 7288.70 కోట్లు ఇవ్వగా,   2021 యాసంగి పంటకు  రూ.7505 కోట్లు చొప్పున అందజేసింది. 2021 మే నాటికి ప్రభుత్వం రూ. 35,676.22 కోట్లు రైతుబంధు పంటసాయం అందజేసింది.

  చెల్లించిన ప్రీమియం, అందిన రైతు బీమా:

–       రాష్ట్రంలోని 32.33 లక్షల మంది అర్హులైన రైతుల కోసం 2018-19, 2019-20, 2020-21 మూడేండ్లలో ప్రభుత్వం రైతు బీమా పథకం అమలు కోసం రూ.2917.39 కోట్లను ప్రీమియంగా ఎల్.ఐ.సి సంస్థకు చెల్లించింది. నాలుగో ఏడాది 2021-22 లో ప్రభుత్వం రూ.1200 కోట్ల బీమా ప్రీమియం చెల్లించింది. మే 2021 నాటికి 49,755 మంది రైతులు చనిపోగా, వీరి కుటుంబాలకు రూ.2488.75 కోట్ల బీమా మొత్తం అందింది.

నాడు దండగ అన్న వ్యవసాయం.. నేడు పండగైంది..

వరిసాగులో అగ్రస్థానం వైపు పయనిస్తున్న తెలంగాణ :

–       వరిసాగులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్నేలా.. రెండోస్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం పయనిస్తున్నది.

–       రైతులకు గిట్టుబాటుధరకల్పించడానికి2019-20 వానాకాలం, యాసంగిలో ప్రభుత్వం 6,408 కేంద్రాలద్వారా రైతుల కల్లాలవద్దే 1.12 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది.తెలంగాణ వచ్చిన ఏడేండ్లలో కొనుగోళ్లు  367శాతం పెరిగాయి.

రైతుల పంటల కొనుగోళ్లలో అగ్రస్థానం :

–       ధాన్యం కొనుగోలు విషయంలో దేశంలో తెలంగాణ వాటా 63శాతం ఉండగా, మిగతా రాష్ట్రాలన్నీ కలిపి 37శాతం వాటా మాత్రమే ఉంది.

–       దేశంలో రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

నాడు దండగ అన్న వ్యవసాయం.. నేడు పండగైంది..

ప్రవాసులకూ రైతుబంధు చెక్కులు

రాష్ట్రంలో పట్టాదార్ పాస్‌ పుస్తకం కలిగి ఉండి విదేశాల్లో నివసిస్తున్న61,000 మంది ఎన్నారైలకు రైతుబంధు చెక్కుల పంపిణీపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. నిబంధనల ప్రకారం.. పట్టాదార్ పాస్‌పుస్తకం కలిగిన రైతే రైతుబంధు చెక్కు తీసుకోవాలి. ఈ విషయంలో ఎన్నారై రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నందున ఆ రైతు కుటుంబ సభ్యుల్లో భార్య/భర్త, పిల్లలు లేదా తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రభుత్వం చెక్కు ఇస్తున్నది.

రాష్ట్రంలో భూముల విస్తీర్ణం :

2013-14                    : 1.54 కోట్ల ఎకరాలు

2021              : 1.85 కోట్ల ఎకరాలు 

(పెరుగుదల 31 లక్షల ఎకరాలు, పెరిగిన శాతం 20)

దిగుబడి :

2013-14                    : 1.92 కోట్ల టన్నుల పంటలు

2021              : 2.46 కోట్ల టన్నుల పంటలు

(పెరుగుదల 54 లక్షల టన్నులు, పెరిగిన శాతం 28)

తెలంగాణ రైతు బంధును అనుసరిస్తున్న కేంద్రం, వివిధ రాష్ట్రాలు

కేంద్ర ప్రభుత్వం : కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పేరిట రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నది. ఏడాదికి రూ.6 వేల పెట్టుబడి సాయాన్ని.. 2వేల చొప్పున 3 విడుతల్లో అందిస్తున్నది.

పశ్చిమబెంగాల్‌ : క్రిషక్‌బంధు పథకం రైతుకు ఏడాదికి ఎకరాకు రూ.5వేల చొప్పున రెండు విడుతల్లో ఇస్తారు. రైతుబీమా పథకం కూడా ఈ రాష్ట్రం అమలుచేస్తున్నది.

ఆంధ్రప్రదేశ్‌ : ప్రభుత్వం కూడా రైతు భరోసా పేరుతో రైతులకు పెట్టుబడిసాయాన్ని అందిస్తున్నది. ప్రతిరైతుకు ఏడాదికి రూ.7,500 ఇస్తున్నది.

ఒడిశా : కాలియా పేరుతో రైతుబంధును అందిస్తున్నది. మొదట్లో పంటకు రూ.5 వేల చొప్పున, ఏడాదికి 10 వేలు ఇవ్వగా.. దానిని ఈ ఏడాది నుంచి రూ.4 వేలకు తగ్గించింది.

జార్ఖండ్‌ : ఆశీర్వాద్‌ యోజనగా రైతుకు ఏడాదికి ఎకరాకు 5 వేల సాయం అందిస్తున్నది.

ప్రముఖుల ప్రశంసలు

దేశంలోనే తక్కువ వయసుగల తెలంగాణ రాష్ట్రం అమలుచేస్తున్న ఈ పథకాన్ని అనేకమంది ప్రముఖులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రశంసించారు. ప్రపంచబ్యాంకు, ఐక్యరాజ్యసమితిలోభాగమైన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో), ప్రముఖ ఆర్థిక నిపుణులు అరవింద్‌ సుబ్రమణ్యన్‌, అశోక్‌ గులాటి, ఐకార్‌ మాజీ డైరెక్టర్‌ ఆర్‌ఎస్‌ పరోడా, ప్రముఖ సామాజికవేత్త అన్నాహజరే తదితర ప్రముఖులు రైతుబంధు పథకాన్ని కొనియాడారు. ఇది రైతుల బతుకులు మార్చే పథకమని, దేశం మొత్తం దీనిని అమలుచేయాల్సిన ఆవశ్యకత ఉన్నదని ఉద్ఘాటించారు. అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) యూనివర్సిటీ రైతుబంధు పథకంపై అధ్యయనం చేస్తున్నది. ఈ పథకం వల్ల రైతులకు చేకూరుతున్న మేలు, అమలు, తదితర అంశాలను పరిశీలిస్తున్నది.

  • రైతులకు ఉచిత జీవిత బీమా పథకం (రైతు బీమా)

రాష్ట్రంలో మొత్తం 57 లక్షల మందికి పైగా రైతుల్లో.. అర్హులైన (18 ఏండ్ల నుంచి 60 ఏండ్ల లోపు వయస్సు గల) 50 లక్షల మందికి పైగా రైతులకు రూ.5 లక్షల చొప్పున వ్యక్తిగత జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకయ్యే మొత్తం ప్రీమియాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. 2018 ఫిబ్రవరి 26న కరీంనగర్‌లో రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహన సదస్సులో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2018 ఆగస్టు 14న ఈ పథకం ప్రారంభమైంది. ఈ పథకం కింద ఏ కారణంతోనైనా సరే మరణించిన రైతు కుటుంబానికి 10 రోజుల్లో రూ. 5 లక్షల బీమా సొమ్ము అందిస్తున్నారు. మరణ ధ్రువీకరణ పత్రం వుంటే ఆ కుటుంబానికి (నామినీకి) బీమా అందుతుంది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర రైతు సమన్వయ సమితులు రైతులతో బీమా చేయిస్తాయి. ప్రభుత్వమే రైతులందరికీ గ్రూప్ ఇన్సూరెన్స్ చేయిస్తుంది. చిన్నకారు, సన్నకారు, పెద్ద రైతు అనే తేడా లేకుండా రైతులందరికీ బీమా సౌకర్యం వర్తింప చేయనున్నారు. రైతు బీమా చేసేందుకు ఎన్నో బీమా సంస్థలు ప్రభుత్వాన్ని సంప్రదించాయి. అయినప్పటికీ సీఎం కేసీఆర్ మాత్రం.. ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థగా పేరుండి, ఊరూరా విస్తరించి, ప్రజల్లో నమ్మకం కలిగిన ఎల్ఐసీ సంస్థకే ఈ బాధ్యతను అప్పగించారు.

రైతు బీమాపై ఎల్.ఐ.సీ.తో ఎంఓయూ

రైతు బీమా పథకంపై రాష్ట్ర ప్రభుత్వం – ఎల్ఐసీ మధ్య 2018 జూన్ 4న కీలక ఒప్పందం జరిగింది. హైదరాబాద్ లోని మాదాపూర్ హెచ్ఐసీసీలో జరిగిన రైతుబంధు జీవిత బీమా పథకం అవగాహన సదస్సులో ఈ మేరకు ఒప్పందాన్ని పూర్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎల్ఐసీ చైర్మన్ వీకే శర్మ సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలపై ఎల్ఐసీ రీజినల్ మేనేజర్ జి.సత్యనారాయణ శాస్త్రి, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి సంతకాలు చేశారు. అనంతరం వారు పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

బీమా ప్రీమియం : జీవిత బీమా పథకం కోసం 18 నుంచి 60 ఏండ్లలోపు వారి పేర్లు నమోదుచేశారు. ఆధార్ కార్డుపైన నమోదైన పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకున్నారు. ఒక్కో పట్టాదారునికి వార్షిక ప్రీమియం రూ.1,925 కాగా అదనంగా 18 శాతం జీఎస్టీతో ఒక్కోరైతు పేరిట ప్రభుత్వం రూ.2,271.50 ప్రీమియం ఎల్‌ఐసీకి చెల్లించింది. 

తొలిఏడాది 2018-19లో బీమా వివరాలు

 తొలిఏడాది 2018-19లో 31.27 లక్షల మంది రైతులు బీమా చేయించుకున్నారు. వీరి బీమా ప్రీమియంగా రూ.710.30 కోట్లను ప్రభుత్వం ఎల్.ఐ.సి సంస్థకు చెల్లించింది. దీంతో ఎల్.ఐ.సి అధికారులు రైతుబంధు జీవితబీమా పాలసీ బాండ్ ను 15 ఆగస్టు 2018 రోజున ప్రభుత్వానికి అందజేశారు.   వీరిలో 17,521 మంది రైతులు మరణించగా వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున రూ.876.05 కోట్ల బీమా మొత్తం అందింది.

పెరిగిన బీమా ప్రీమియం : రైతుబీమా పథకం ప్రీమియాన్ని ఎల్.ఐ.సీ. ఒకేసారి 56.54 శాతాన్ని పెంచింది. దీంతో ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ. 3,556 చొప్పున మొత్తం 32.16 లక్షల మంది రైతులకు రూ.1143.60 కోట్లను ప్రీమియంగా ఎల్.ఐ.సి.కి చెల్లించింది. 2018-19లో రైతు బీమా కింద చెల్లించిన పరిహారం, రైతుల మరణాల సంఖ్య, ఇతర ఖర్చులను లెక్కలోకి తీసుకున్న ఎల్‌ఐసీ.. ఈసారి ప్రీమియం రేటును పెంచుతున్నట్టు పేర్కొన్నది.  

 2021 నాటికి ప్రభుత్వం చెల్లించిన ప్రీమియం.. రైతు కుటుంబాలకు అందిన బీమా

రాష్ట్రంలోని 32.33 లక్షల మంది అర్హులైన రైతుల కోసం 2018-19, 2019-20, 2020-21 మూడేండ్లలో ప్రభుత్వం రైతు బీమా పథకం అమలు కోసం రూ.2917.39 కోట్లను ప్రీమియంగా ఎల్.ఐ.సి సంస్థకు చెల్లించింది. నాలుగో ఏడాది 2021-22 లో ప్రభుత్వం రూ.1200 కోట్ల బీమా ప్రీమియం చెల్లించింది. మే 2021 నాటికి 49,755 మంది రైతులు చనిపోగా, వీరి కుటుంబాలకు రూ.2488.75 కోట్ల బీమా మొత్తం అందింది.

‘రైతుబంధు, రైతుబీమా’కు ఐక్యరాజ్యసమితి గుర్తింపు

రైతుబంధు, రైతుబీమా పథకాలకు ఐక్యరాజ్యసమితి (ఐరాస) గుర్తింపు లభించింది. ప్రపంచ దేశాల్లో రైతుల అభివృద్ధి కోసం చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో 20 పథకాలను ఐక్యరాజ్యసమితి ఎంపిక చేసింది. 20 నవంబర్ 2018 నుంచి 23 నవంబర్ 2018 వరకు ‘వ్యవసాయాభివృద్ధిలో వినూత్న ఆవిష్కరణలు’ అనే అంతర్జాతీయ సదస్సు ఐరాసలోని వ్యవసాయ విభాగం ఆహార వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏవో) కేంద్ర కార్యాలయం రోమ్ నగరంలో జరిగింది. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతుబంధు, రైతుబీమా పథకాలను ఎంపిక చేయగా, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలపై ప్రత్యేక ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రతీ రైతుకు ఒక సీజన్ లో పెట్టుబడి సాయం కింద వానాకాలం, యాసంగి రెండు పంటలకు కలిపి ఎకరానికి రూ. 10 వేల చొప్పున సాయంగా అందిస్తున్నట్లు వివరించారు.   ఏ కారణంతోనైనా రైతు చనిపోతే ఆ కుటుంబానికి ఆసరాగా ఉండేలా రూ. 5 లక్షల బీమా ఎల్ఐసి ద్వారా చెల్లిస్తున్న విషయాన్ని పేర్కొన్నారు. దీంతో రైతుబంధు, రైతుబీమా పథకాలను అంతర్జాతీయ ప్రతినిధులు ప్రశంసించారు.

పంటలకు బీమాతో రైతుకు ధీమా

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు అతివృష్టి, అనావృష్టితో నష్టపోయినపుడు వారిని ఆదుకునే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో భాగస్వామ్యమైంది. రైతులు తాము పండించే పంటలకు బీమా చేసుకుంటే, వాతావరణ మార్పులతో పంట నష్టపోయిన పక్షంలో వారికి బీమా అందుతుంది. ఈ పథకం కింద రైతులు ఆహార పంటలకు 2శాతం, వాణిజ్య పంటలకు 5శాతం ప్రీమియం చెల్లిస్తే, మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి.  బ్యాంకు ద్వారా పంట రుణాలు తీసుకున్న రైతులకు తప్పనిసరిగా బ్యాంకు ద్వారా బీమా చేస్తారు. బ్యాంకురుణాలు తీసుకోని రైతులు మీ సేవా, బీమా కంపెనీలు నిర్ధారించిన సంస్థల ద్వారా బీమా చేయాలి.

అగ్నిప్రమాదం, పిడుగుపాటు, గాలివాన, వడగళ్లు, తుపాను, అనావృష్టి, వరదలు, పంట నీటమునిగిపోవడం, తెగుళ్లు , ప్రతికూల వాతావరణం మొదలైన వాటివల్ల కలిగే దిగుబడి ఆధారంగా నష్టపరిహారం చెల్లిస్తారు. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధాన పంటలను రైతులు విత్తలేకపోవడం లేదా నాట్లు వేయలేకపోవడం వల్ల కలిగే ఆర్థిక నష్టానికి బీమా మొత్తంలో 25 శాతం వరకు సత్వరమే నష్టేపరిహారం చెల్లిస్తారు. స్థానికంగా వచ్చే విపత్తులు అంటే పంట పొలాలు నీట మునిగిపోవడం, వడగళ్ల వాన కురవడం, మట్టిపెళ్లలు విరిగిపడిపోవడం వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాన్ని అంచనా వేసి రైతుకు పరిహారం చెల్లిస్తారు. పంట మధ్యకాలంలో నష్టపోతే అంచనావేసి పరిహారంలో 25 శాతం రైతుకు ముందస్తుగా చెల్లిస్తారు. పంటకోతల తరువాత పొలంలో ఆరబెట్టిన పంటకు 14 రోజుల వరకు తుపాన్లు, అకాల వర్షాల వల్ల పంటకు నష్టం జరిగినప్పుడు కూడా పరిహారం చెల్లిస్తారు. యుద్ధం, ముట్టడి, విదేశీ శత్రువుల చర్య, పౌర కల్లోలం, దోపిడీ వల్ల నష్టం జరిగినప్పుడు బీమా వర్తించదు. అలానే అణుఇంధనం, వెలువడి అణువ్యర్థాల నుంచి వచ్చే రేడియోధార్మికత వల్ల వచ్చే కాలుష్యం వల్ల పంట నష్టం జరిగినా బీమా వర్తించదు.

2018-19 వానాకాలం, యాసంగి సీజన్లలో దాదాపు 2.85 లక్షల మంది రైతులు పంటల బీమా చెల్లించారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల పంట నష్టపోయిన వీరికి రూ.419 కోట్ల పంట నష్టపరిహారం అందింది. కాగా, ఈ ఏడాది 2019-20 వానాకాలంలో గరిష్టంగా దాదాపు 8.1 లక్షల మంది రైతులు పంటల బీమా పథకంలో నమోదు చేసుకున్నారు.

  • ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 6 లక్షల సాయం

వ్యవసాయంలో నష్టాల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతు కుటుంబాలను ఆదుకోవడానికి స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పరిహారాన్ని పెంచింది. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు కుటుంబాలకు రూ. 6 లక్షల పరిహారం ఇవ్వాలని 2015 సెప్టెంబర్ 19న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. చనిపోయిన రైతు కుటుంబానికి రూ.5 లక్షలు, రైతు చేసిన అప్పుల చెల్లింపునకు వన్‌టైం సెటిల్‌మెంట్ కింద రూ. లక్ష ఇస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రైతు కుటుంబానికి కేవలం రూ.1.50 లక్షలు మాత్రమే ఎక్స్ గ్రేషియా ఇచ్చేవారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడేండ్లలో ఆత్మహత్యలకు పాల్పడిన 457 మంది రైతులకు రూ.27.42 కోట్లు విడుదల చేస్తూ 9 అక్టోబర్, 2017న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసి వారికి ఆ పరిహారాన్ని అందించారు. అలాగే 2017 నుంచి 2018 (ఆగస్టు) మధ్య ఆత్మహత్య చేసుకున్న 243 మంది రైతు కుటుంబాలకు రూ.6 లక్షల చొప్పున మొత్తం రూ.14.58 కోట్లు విడుదల చేశారు. ఆ రైతుల పిల్లలను సంక్షేమ హాస్టళ్లలో చదివిస్తున్నారు. ఆ కుటుంబానికి ఇండ్లు కూడా మంజూరు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా వారిని ఆర్ధికంగా ఆదుకుంటున్నారు. బాధిత కుటుంబంలో పెళ్లీడుకు వచ్చిన అమ్మాయిలకు కల్యాణలక్ష్మి పథకం వర్తింప చేస్తున్నారు.ఆ రైతు కుటుంబంలో అర్హులకు ఆసరా పెన్షన్ అందిస్తున్నారు.

నాడు దండగ అన్న వ్యవసాయం.. నేడు పండగైంది..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు రైతులు దశాబ్దాల తరబడి కరెంటు కష్టాలు అనుభవించారు. రోజుకు కనీసం 3-4 గంటల కరెంటు కూడా రాకపోయేది. దీంతో పంటలు ఎండిపోయి రైతులు విపరీతంగా నష్టపోయేవారు. వచ్చే కరెంటు కూడా లో ఓల్టేజిది కావడంతో మోటార్లు కాలిపోయేవి. ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోయేవి. వాటి మరమ్మతుల కోసం రైతులే తిరిగి ఖర్చులు పెట్టుకోవాల్సి వచ్చేది. కష్టాలన్నింటికీ తెరదించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వ్యవసాయానికి 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా సరఫరా చేస్తూ తెలంగాణ రాష్ట్రం కొత్త చరిత్రను సృష్టించింది. రాష్ట్రంలోని 23 లక్షల పంపుసెట్లకు 2018 జనవరి 1న అర్థరాత్రి 12:01 గంటల నుంచి నిరంతరాయ విద్యుత్ సరఫరా ప్రారంభమైంది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ల నుంచే రైతులకు రోజుకు 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నారు. 1 జనవరి 2018 నుంచి రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. ఈ ఘనత సాధించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కొన్ని రాష్ట్రాలు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో 24 గంటలు సరఫరా చేస్తున్నప్పటికీ అక్కడ ఉచితంగా ఇవ్వడం లేదు. ఎలాంటి షరతులు లేకుండా దేశంలోనే ఉచితంగా 24 గంటల వ్యవసాయ కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమే. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఉచిత విద్యుత్ ఇస్తున్నప్పటికీ యూనిట్ల పరిమితి, విద్యుత్ మోటార్ల హార్స్ పవర్ పరిమితి వంటి షరతులను విధించాయి.

తెలంగాణలో ఉచిత విద్యుత్ సరఫరా మైలురాళ్లు

– 2014 నవంబర్ 20 నుంచి కరెంటు కోతలు ఎత్తివేత. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా. పరిశ్రమలు,గృహాలు, వాణిజ్య సంస్థలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా

– 2017 జూలై నుంచి పాత మెదక్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతున్నది.

– 2017 నవంబర్ 6నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పంపుసెట్లకు ప్రయోగాత్మకంగా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

– 2018 జవవరి 1 నుంచి 24.92 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

  1. పెరిగిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు

సమైక్య రాష్ట్రంలో 2014లో టీఎస్ ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ డిస్కంల కింద కలిపి మొత్తం 1 కోటి 11 లక్షల కనెక్షన్లు ఉండేవి. 2020 డిసెంబర్ నాటికి కనెక్షన్ల సంఖ్య 1 కోటి 59 లక్షలకు పెరిగింది. (48 లక్షల కనెక్షన్లు పెరగగా, పెరుగుదల 43 శాతంగా ఉంది.) ఇందులో 24.92 లక్షల మంది వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు 30 శాతం విద్యుత్ ను వినియోగిస్తున్నారు. వ్యవసాయ విద్యుత్ కోసం ప్రభుత్వం ప్రతీ ఏటా రూ.5 వేల కోట్లు రాయితీగా ఇస్తున్నది. రాష్ట్ర అవతరణకు ముందు 19.02 లక్షల కనెక్షన్లు మాత్రమే ఉండేవి. 2020 డిసెంబర్ నాటికి కొత్తగా 5.90 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశారు. దీంతో మొత్తం కనెక్షన్లు 24.92 లక్షలకు చేరుకున్నాయి.  2014లో 2 వేల మెగావాట్లకు మించి వ్యవసాయ డిమాండ్ రాకపోయేది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎత్తిపోతలతో కలుపుకొని వ్యవసాయానికి 6 వేల మెగావాట్ల వరకు డిమాండ్ ఏర్పడింది.  ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే పట్టణాల్లో 6 గంటల్లోగా, గ్రామాల్లో 24 గంటల్లోగా పునరుద్ధరిస్తున్నారు. నాణ్యమైన విద్యుత్ అందడంతో ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోవటం 30 శాతం నుండి 10 శాతానికి తగ్గింది.

  1. ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారి

వ్యవసాయరంగం బాగుపడాలంటే దానికి అనుబంధంగా ఉన్న అన్ని విభాగాలను ప్రక్షాళన చేయాలనేది సీఎం కేసీఆర్ ఆకాంక్ష. తెలంగాణ వచ్చే నాటికి వ్యవసాయ, ఉద్యానవన శాఖలో 707 ఏ.ఈ.ఓ(అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్)లు పనిచేస్తుండేవారు. రాష్ట్రంలో ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక ఏఈఓను (వ్యవసాయ విస్తరణాధికారులు) నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా అదనంగా 1,897 ఏఈఓ పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుతం తెలంగాణతో క్యాడర్ సంఖ్య 2,604 వరకు పెరిగింది. రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి కోసం 3,430 మంది వ్యవసాయ అధికారులున్నారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఆగ్రానమిస్టులుగా తీర్చిదిద్దింది.

  1.  వీఏవోలకు పంటల సాగు నమోదు బాధ్యతలు

వ్యవసాయంలో పంటల సాగును లెక్కించేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. క్షేత్రస్థాయిలో పరిశీలన ద్వారా సాగును నమోదు చేయాలని నిర్ణయించింది. పంటల సాగును లెక్కించే భాద్యతను గ్రామస్థాయిలోని వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)కు అప్పగించింది. గతంలో ఈ నమోదును సోషల్ అడిట్ పద్ధతిలో చేసేవారు. 2020 సెప్టెంబర్ నుంచి అది వ్యక్తిగత అడిట్ గా మారింది. ఏఈవోలు సేకరించిన పంటల సాగు సమాచారాన్ని జిల్లా స్థాయిలో డీఏవో, డివిజన్ స్థాయిలో ఏడీఏ, మండల స్థాయిలో ఏంఏవోలు పరిశీలిస్తారు.

  1. రైతు సమన్వయ సమితుల ఏర్పాటు (రైతు బంధు సమితులుగా పేరు మార్పు)

ప్రపంచంలో ఎవరు తయారుచేసిన వస్తువుకు వారే ధర నిర్ణయిస్తారు.  అదేం పాపమో గానీ, రైతులు తాము పండించిన పంటను మాత్రం రోడ్డు మీద కుమ్మరించుకొని, దళారీలు నిర్ణయించే ధరకే తెగనమ్ముకోవాల్సిన దుస్థితి. ఈ దుస్థితి చూసి చలించిన సీఎం కేసీఆర్.. రైతులను సంఘటితపరచడం ద్వారానే వారి జీవితాల్ని గుణాత్మకంగా మార్చగలమని విశ్వసించారు. ప్రపంచంలోనే మరెక్కడా లేనివిధంగా విడిపోయిఉన్న రైతుల నడుమ సమన్వయం కుదిర్చేందుకు 2017 సెప్టెంబరులో రైతు సమన్వయ సమితులకు రూపకల్పన చేశారు. (ఆ తర్వాత 2020 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పేరును రైతు బంధు సమితులుగా మార్చింది) రైతుల వ్యవసాయ అవసరాల మేరకు సాగునీరు, విద్యుత్, పెట్టుబడి, ఎరువులు, విత్తనాలు అందేలా చూడటమే కాకుండా, వారు ఏ పంటలు పండించుకోవాలో వాటికి మద్దతు ధర ఎలా రాబట్టుకోవాలో చూసే బాధ్యతను కూడా ఈ రైతుబంధు సమితులపైనే పెట్టారు. దుక్కిదున్ని విత్తనం వేసిన దగ్గర నుంచి పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు ప్రతీ దశలోనూ ఈ సమితులు రైతులకు అండగా నిలిచేలా కార్యాచరణ రూపొందించారు.

సెప్టెంబర్ 1 నుంచి 9 వరకు 10,733 గ్రామల్లో రైతు సమన్వయ (రైతుబంధు) సమితులు ఏర్పాటయ్యాయి. గ్రామంలో వ్యవసాయ భూమి కలిగిన రైతులందరూ సభ్యులుగా ఉన్నారు. సెప్టెంబర్ 10 నుంచి 15 వరకు రైతు సమన్వయ సమితుల సదస్సులు మండల స్థాయిలో నిర్వహించారు. 2017 సెప్టెంబర్ 15న రాష్ట్రవ్యాప్తంగా 559 మండలాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. గ్రామస్థాయిలో 15మంది రైతులతో, మండలస్థాయిలో 24 మందితో, జిల్లాస్థాయిలో 24 మందితో, రాష్ట్రస్థాయిలో 42 మంది సభ్యులతో మొత్తం లక్షా 61 వేల మంది రైతులు సభ్యులుగా సమితులు ఏర్పాటయ్యాయి.  తెలంగాణ రైతు సమన్వయ సమితి తొలి అధ్యక్షుడిగా గుత్తా సుఖేందర్‌ రెడ్డిని నియమిస్తూ 2018 మార్చి 8న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆ తర్వాత గుత్తా ఎమ్మెల్సీగా నియామకమై మండలి చైర్మన్ పదవి చేపట్టారు. రైతుబంధు సమితిగా పేరు మార్చిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా 2019 నవంబర్ 16న మరో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ముఖ్యమంత్రి  కేసీఆర్ నియమించారు.

  1. రాష్ట్ర వ్యాప్తంగా 2,601 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం

రైతులు, వ్యవసాయాధికారులు, రైతుబంధు సమితి సభ్యులు, శాస్త్రవేత్తలు సమావేశమయ్యేలా ప్రభుత్వం రైతు వేదికలు నిర్మించింది. ప్రతీ ఐదువేల ఎకరాలకు ఒక క్లస్టర్ గా విభజించి, ప్రతీ క్లస్టర్ లో ఒక వేదిక నిర్మించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,601 వ్యవసాయ విస్తరణాధికారుల క్లస్టర్లలో 2వేలకు పైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో రైతు వేదికల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.573 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కో వేదికను రూ. 22 లక్షల వ్యయంతో నిర్మించారు. మొదటగా ఎర్రవల్లి, మర్కూక్‌ గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ 29 మే, 2020న శంకుస్థాపన చేశారు. ఈ రెండు రైతు వేదికలను సీఎం కేసీఆర్‌ తన సొంత ఖర్చులతో నిర్మించనున్నారు. జిల్లాల్లో ఆయా మంత్రులు, ఎమ్మెల్యేలు రైతు వేధికలకు భూమిపూజ చేశారు. 2020 చివరినాటికి వీటి నిర్మాణాలను కూడా పూర్తి చేశారు.

స్వచ్ఛందంగా ముందుకు వచ్చే దాతల ద్వారా స్థల సేకరణ చేయాలన్న సీఎం కేసీఆర్ పిలుపునకు వివిధ గ్రామాల్లో దాతలు స్పందించి ఎకరం చొప్పున స్థలాలను విరాళంగా ఇచ్చారు. అలా లభించని చోట్ల, సీఎం కేసీఆర్ సూచన మేరకు జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ స్థలాలను గుర్తించి, రైతు వేదికలు నిర్మించారు. రైతులకు శిక్షణనిచ్చేందుకు, పథకాలపై అవగాహన కల్పించేందుకు మైకులు, కుర్చీలు, ఇతర మౌలిక సదుపాయాలు ఉండేలా రైతు వేదికలను తీర్చిదిద్దారు. మార్కెట్లో ఏ పంటకు డిమాండ్ ఉన్నది, ఏ పంట వేస్తే ఎక్కువ ధర వస్తుంది, అందరూ ఒక్కసారే మార్కెట్ కు పంటలు తీసుకెళ్తే ధర తగ్గే అవకాశం ఉన్నందున,ఎవరు ఎప్పుడు పంట మార్కెట్ కు తీసుకెళ్లాలి.. అనే విషయాలను రైతులు రైతు వేదికల్లో చర్చించుకుంటున్నారు.   2020 దసరా పండుగ నాటికి రైతు వేదికల నిర్మాణం దాదాపుగా పూర్తి చేశారు.

కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన సీఎం కేసీఆర్

2020 అక్టోబర్ 31న జనగామ జిల్లా కొడకండ్లలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్మించిన రైతు వేదికను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించారు.

9 మార్కెట్ యార్డుల్లో రైతు వేదికలు

రాష్ట్రంలోని 9 మార్కెట్ యార్డుల్లో ప్రభుత్వం రైతువేదికలు నిర్మిస్తున్నది. ఇందుకోసం స్థలాల్ని కూడా కేటాయిస్తూ 7 ఆగస్టు 2020న ఉత్తర్వులు ఇచ్చింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, జన్నారం, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాచర్ల, నల్లగొండ జిల్లాలోని నకిరేకల్, ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల, జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం మార్కెట్ యార్డుల్లో ఈ రైతు వేదికలు నిర్మించనున్నారు.

  1. భూ యాజమాన్య హక్కులపై స్పష్టత ఇవ్వడానికి ‘భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన’

వలస పాలనలో తన ఆధీనంలో ఉన్న భూమికి పట్టాలు రాక అలసిపోయిన తెలంగాణ రైతులు. స్వయం పాలనలో భూవివాదాలను పరిష్కరించుకొని, భూ హక్కులను వివాదరహితంగా సుస్థిరం చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం ద్వారా ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టి, ఎవరిభూమి వాళ్లకే  అప్పజెప్పింది. 2017 సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించింది. వంద రోజుల పాటు నిర్వహించిన భూ రికార్డుల ప్రక్షాళన పార్ట్-ఎ విజయవంతమైంది. రెవెన్యూ గ్రామం యూనిట్ గా భూ రికార్డుల ప్రక్షాళన జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోని 94 శాతం భూముల విషయంలో స్పెషల్ డ్రైవ్ లో స్పష్టత వచ్చింది. ఏ భూమికి ఎవరు యజమానో తేలింది. ఈ వివరాల ఆధారంగానే కొత్త పాస్ పుస్తకాల జారీ, పంట పెట్టుబడి మద్దతు పథకం అమలు చేశారు. ఇలా ఒక్కసారి ప్రక్షాళన చేయడం ద్వారా ప్రభుత్వం అమలు చేసే వ్యవసాయానికి పెట్టుబడి సాయం ఇచ్చే రైతుబంధు పథకం సక్రమంగా అమలై వివాదాలకు తెరపడింది. భవిష్యత్తులో కూడా వివాదాలను నివారించినట్లయింది. కోర్టు కేసులు, ఇతర వివాదాలు, అభ్యంతరాలు కలిగిన భూములను పార్ట్ – బిలో పరిష్కరిస్తారు.

ప్రక్షాళన జరిగిన తీరు

రాష్ట్రంలోని 589 మండలాల్లోని 10,823 రెవెన్యూ గ్రామాల్లో సర్వే నిర్వహించారు. మొత్తం అధికారులు 1,523 బృందాలుగా ఏర్పడి పని విభజన చేసుకున్నారు. 72,09,694 ఖాతాలకు చెందిన 2,38,28,180 ఎకరాల భూమి రికార్డులను (1.95కోట్ల సర్వేనెంబర్లు) పరిశీలించారు. ఇందులో 1.85 కోట్ల సర్వే నెంబర్లలో ఎలాంటి సమస్యలు లేవని వెల్లడించారు. 2.27 కోట్ల ఎకరాల భూమి స్పష్టంగా ఎవరికి సంబంధించిందో తేల్చారు. 1.56 కోట్ల ఎకరాలు వ్యవసాయ భూమిగా నిర్ధారించారు. మరో 11 లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం వ్యవసాయ ఖాతాలు 58.87 లక్షలు కాగా, 1.42 కోట్ల ఎకరాలకు సంబంధించిన 54.03 లక్షల ఖాతాలకు డిజిటల్ సంతకాలు అయ్యాయి. మరో 4.84 లక్షల ఖాతాలకు డిజిటల్ సంతకాలు కావాల్సి ఉంది. ఇందులో 2.82 లక్షల ఖాతాలకు ఆధార్ కార్డు లేనివిగా గుర్తించారు. వ్యవసాయేతర, ప్రభుత్వ, అటవీ భూములు, నాలాలకు వినియోగించే భూములు అన్నీ కలిపి 70.64 లక్షల ఎకరాలుగా గుర్తించారు. తొలిసారిగా 1931లో భూ రికార్డుల ప్రక్షాళన జరిపి, రికార్డులకెక్కించారు. ఆ తర్వాత ఏ ప్రభుత్వమూ ఈ విషయాన్నే పట్టించుకోలేదు. సరైన రికార్డులు లేకపోవడంతో ఒకే భూమిపై వేర్వేరు వ్యక్తుల వివాదాలు, కోర్టు కేసులు.. చివరకు ఇది శాంతిభద్రతల సమస్యగా కూడా మారింది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ 87 ఏళ్ల తర్వాత 2018లో తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టి, దేశంలోనే చరిత్ర సృష్టించింది.

తెలంగాణ భూ విస్తీర్ణం వివరాలు

  • తెలంగాణ భూభాగం : 1,12,077 చదరపు కిలోమీటర్లు ( 2.80 కోట్ల ఎకరాలు)
  • గ్రామీణ ప్రాంతాల్లోని భూమి : 2.40 కోట్ల ఎకరాలు
  • ఎలాంటి వివాదాలు లేని వ్యవసాయ భూమి : 1.51 కోట్ల ఎకరాలు
  • కోర్టు కేసులు, వివాదాల్లో ఉన్న భూములు : 17.89 లక్షల ఎకరాలు
  • రైతుల వద్ద ఉన్న వ్యవసాయేతర భూములు : 11.95 లక్షల ఎకరాలు
  • చెరువులు, కుంటలు, కాల్వలు, రైల్వేలైన్లు, సబ్ స్టేషన్లు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ప్రభుత్వ ఆస్తుల భూములు, కోర్టు కేసులున్న అటవీ భూములు : 84 లక్షల ఎకరాలు
  • నగరాలు, పట్టణాలు,గ్రామాల నివాస ప్రాంతాలు, వివాదాలు లేని అటవీభూమి : 24 లక్షల ఎకరాలు
  • రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునళ్లు ఏర్పాటు (12 జనవరి 2021)

రెవెన్యూ కోర్టుల్లోని పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. ఈ మేరకు కలెక్టర్‌ నేతృత్వంలో జిల్లా ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేసింది. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్‌ సభ్యులుగా ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నెలలోపు అన్ని పెండింగ్‌ కేసులు పరిష్కరించాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వచ్చాయి.  తెలంగాణ భూమి హక్కులు – పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టం – 2020 లోని సెక్షన్‌ 16, 17 ప్రకారం ప్రత్యేక ట్రిబ్యునళ్ల మార్గదర్శకాలను సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ జారీచేశారు. ఈ నిబంధనలను స్పెషల్‌ ట్రిబ్యునల్‌ రూల్స్‌-2021గా పరిగణించాలన్నారు.

ట్రిబ్యునల్‌లో ఇద్దరు సభ్యులు

ప్రతి జిల్లాలో ఇద్దరు సభ్యులతో కూడిన స్పెషల్‌ ట్రిబ్యునల్‌ ఉంటుంది.  జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) సభ్యులుగా ఉంటారు. ఏదైనా జిల్లాలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) పోస్టు ఖాళీగా ఉంటే అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) సభ్యుడుగా ఉంటారు. ఆర్‌వోఆర్‌ యాక్ట్‌ – 1971 ప్రకారం.. 2021 జనవరి వరకు జిల్లాల పరిధిలో రెవెన్యూ అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ ప్రత్యేక ట్రిబ్యునల్‌కు బదిలీ అవుతాయి. వాటిని జిల్లా కేంద్రంలోనే విచారణ చేపడుతారు. అవసరం మేరకు జిల్లా కలెక్టర్‌ తన జిల్లా పరిధిలో ఎవరైనా ఉద్యోగులను సహాయకులుగా వినియోగించుకోవచ్చు.  ప్రతి కేసుకు సంబంధించిన వ్యవహారాలను కంప్యూటర్‌ రికార్డులో భద్రపర్చాలి. పత్రి ఆర్డర్‌కూ సిస్టం జనరేటెడ్‌ నంబర్‌ ఇవ్వాల్సి ఉంటుంది. పట్టదారు పాస్‌పుస్తకాల చట్టం – 2020 సెక్షన్‌ 13 ప్రకారం తమ వద్దకు వచ్చిన కేసులపై దర్యాప్తు చేపట్టే అధికారం స్పెషల్‌ ట్రిబ్యునల్‌కు ఉంటుంది. గరిష్ఠంగా నెలరోజుల్లో కేసులను పరిష్కరించాలి. ప్రత్యేక ట్రిబ్యునల్‌ జారీచేసిన ఆదేశాలే అంతిమం. పరిష్కారం అయిన కేసుల రికార్డు కలెక్టరేట్‌లో మాన్యువల్‌ ప్రకారం భద్రపరుస్తారు.

  1. రెవెన్యూ సిబ్బందికి నెల జీతం బోనస్

అత్యంత క్లిష్టమైన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా పూర్తి చేసిన రెవెన్యూ శాఖ ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం ఒక నెల మూల వేతనాన్నిఅందించింది. 10,809 మంది రెవెన్యూ ఉద్యోగులు, 24,410 మంది వీఆర్.ఏలు, 530 మంది సర్వే విభాగం ఉద్యోగులు. మొత్తం 35,749 మంది ఉద్యోగులకు ఒక నెల మూల వేతనం అదనంగా అందించారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో కేవలం వంద రోజుల వ్యవధిలోనే రెవెన్యూ ఉద్యోగులు రేయింబవళ్లు పనిచేసి భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

  1.  ‘ధరణి వెబ్ సైట్’ నిర్వహణ

నూతన రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత ప్రభుత్వం తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్‌ పుస్తకాల బిల్లు-2020కు ఆమోదముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం వ్యవసాయ భూములకు తహసీల్దార్లు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. ఆ వెంటనే మ్యుటేషన్‌ కూడా పూర్తవుతుంది. ఈ మేరకు తెలంగాణ భూమి హక్కులు-పట్టాదారు పాస్‌ పుస్తకాల బిల్లు-కి గవర్నర్‌ తమిళిసై ఆమోదముద్ర వేసిగెజిట్‌ విడుదల చేశారు. తాజా చట్టంతో భౌతిక రికార్డులకు కాలం చెల్లినట్లయింది. ధరణిని భూమి హక్కుల రికార్డుగా ప్రభుత్వం గుర్తించింది. ధరణి రికార్డులను ఎవరూ మార్పు చేయడానికి వీల్లేకుండా కట్టడి చేశారు.

నాడు దండగ అన్న వ్యవసాయం.. నేడు పండగైంది..

భూరికార్డుల డిజిటలైజేషన్, ఆన్‌లైన్ నిర్వహణ అంతా పకడ్బందీగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం సమీకృత భూ రికార్డుల యాజమాన్య విధానం (ధరణి) వెబ్‌సైట్‌ను రూపొందిస్తుంది. రాష్ట్రంలోని ప్రతి ఎకరం భూభాగం వివరాలు పొందుపరుస్తూ, ఎప్పటికప్పుడు చోటు చేసుకునే మార్పులను కూడా నమోదు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల వెబ్ సైట్ ‘ధరణి’ని రూపొందిస్తుంది. దీంతో భూమి రిజిస్ట్రేషన్ అయినరోజే ఆ వివరాలు ధరణి వెబ్ సైట్ లో నమోదై పేరు మార్పిడి జరుగుతుంది. మండల కార్యాలయం నుంచి మొదలుకుని రాష్ట్రస్థాయిలో అన్నిచోట్లా ఈ వెబ్ సైట్ నుంచి వివరాలు తీసుకోవచ్చు. విదేశాల్లో ఉన్న వారు కూడా ధరణి ద్వారా అందే సమాచారంతో క్రయ, విక్రయాలు జరుపుకోవచ్చు. భూమికి పహాణీలో పట్టాదారే అనుభవదారు అనీ, అనుభవదారు కాలమ్ అవసరం లేదని భావించిన సీఎం  కేసీఆర్.. ఆ కాలమ్ పూర్తిగా తొలగించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు పహాణీలో ఉన్న క్లిష్ట పదాలను తీసేసి, సరళ తెలుగు పదాలను ఉపయోగిస్తున్నారు. రెవెన్యూశాఖ ధరణి వెబ్‌సైట్‌తో రిజిస్ట్రేషన్ల శాఖ కంప్యూటర్ ఎయిడెడ్ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్ (కార్డ్)ను అనుసంధానం చేసింది.

  1. రైతుల సాదా బైనామాలకు ఉచిత రిజిస్ట్రేషన్, పట్టాలు

తెలంగాణలో వ్యాపార లావాదేవీలు ఎక్కువ శాతం మాట మీదనే నడుస్తాయి. మనిషిని మనిషి నమ్మే సాంస్కృతిక జీవన విధానం తెలంగాణ రైతు కూలీలది. ఈ క్రమంలో గతంలో జరిగిన భూముల క్రయ విక్రయాలన్నీ చాలామటుకు మాటల మీదో, తెల్ల కాగితాల మీదో జరిగాయి. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేయడంలో చూపించిన ఉత్సాహాన్ని, పేదవాడికి భూ భద్రతను కల్పించే విషయంలో తెలంగాణ ఏర్పాటుకు ముందున్న ప్రభుత్వాలు అలసత్వం వహించాయి. ఇదే సమయంలో భూముల ధరలు పెరిగిపోవడం, తరాల అంతరాల నేపథ్యంలో ఎన్నో వివాదాలు చోటు చేసుకున్నాయి. శాంతి భద్రతల సమస్యకు కూడా దారి తీసిన ఈ భూ వివాదాల తక్షణ పరిష్కారానికి, పేదవానికి నష్టం జరగకుండా.. పటిష్టమైన భూ హక్కులను కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే సాదా బైనామాల ఉచిత క్రమబద్దీకరణ. ఇది నిరుపేదకు రైతు కూలీలకు అందివచ్చిన వరం. తెలంగాణ వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నారు.

 అందులో భాగంగా భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వ్యవహారాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. సాదా బైనామాలను (గ్రామీణ ప్రాంతాల్లో 5 ఎకరాల లోపు) ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసింది. 2016 జూన్ 3 నుంచి  జూన్ 22 వరకు 19 రోజులు ఈ కార్యక్రమం నిర్వహించారు. వారసత్వంగా వచ్చిన భూములను పది రోజుల్లోగా, ఇతర భూములను రిజిస్ట్రేషన్ అయిన 15 రోజుల్లో మ్యుటేషన్ చేశారు. అన్యాక్రాంతమైన భూములను వాపస్ తీసుకుని అర్హులకు అందించింది. మొత్తం 11,19,111 మందికి సాదా బైనామాల ఉచిత రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 15,68,171 సర్వే నంబర్లు నమోదయ్యాయి. 1638.5 ఎకరాల భూమికి పట్టాలు పొందారు. ఈ భూమి విలువ రూ. 9,487 కోట్లు. మొత్తం 6.18 లక్షల మంది పట్టాలు పొందినారు. 4.19 లక్షల దరఖాస్తులను తిరస్కరించారు.

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాల్లోనూ సాదా బైనామాలు

మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో విలీనమైన గ్రామాల్లో సాదా బైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 2020 అక్టోబర్ 31న నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునేందుకు వారం రోజుల పాటు గడువు ఇవ్వాలని ఆదేశించారు. దీనికి సంబంధించి వెంటనే ఉత్తర్వులను జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వరంగల్ కార్పోరేషన్ లో విలీనమైన గ్రామాల్లో కూడా సాదా బైనామాలను  క్రమబద్ధీకరించాలని ప్రజాప్రతినిధులు సీఎంను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం కెసిఆర్ రాష్ట్రంలోని అన్ని మున్సిలిపాలిటీల పరిధిలోని విలీన గ్రామాల్లో సాదాబైనామాలతో జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయ లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి హామీ ఇచ్చారు.

  1. ఖరీఫ్, రబీ పంటకాలాల పేర్లు వానాకాలం, యాసంగిగా మార్పు

ఖరీఫ్, రబీ వ్యవసాయ పంట కాలాల పేర్లను అర్ధం చేసుకోవడంలో నేటితరంలో చాలామంది  గందరగోళానికి లోనవుతున్నారు. దీంతో ఖరీఫ్, రబీల పేర్లను ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వాడుకలో ఉన్న వానాకాలం, యాసంగిగా మారుస్తూ 25 ఏప్రిల్, 2020న ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇక నుంచి వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లు, వ్యవసాయశాఖ కార్యాలయాలల్లో వానాకాలం, యాసంగి పంటకాలాల పేర్లనే వాడాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

  • నకిలీ, కల్తీకి పాల్పడే వారిపై పీడీ చట్టం

విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల్లో కల్తీలు, నకిలీల వల్ల రైతులు ఎంతో నష్ట పోవాల్సి వస్తున్నది. రైతులు పెట్టిన పెట్టుబడి, శ్రమ బూడిదలో పోసిన పన్నీరుగా మారడంతోపాటు, పంట కాలం కూడా కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కల్తీలు, నకిలీలపై కఠినంగా వ్యవహరించి, రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. నకిలీకి, కల్తీకి పాల్పడే వారిపై పీడీ యాక్టు నమోదుచేసి జైలుకు పంపేలా ఆర్డినెన్స్‌ జారీకి 2017 జూన్ 17న కేబినెట్‌ ఆమోదం చెప్పింది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ఐదు నకిలీ విత్తన కంపెనీల యజమానులపై ప్రభుత్వం పీడీయాక్ట్ కేసు నమోదు చేసి జైలుకు పంపించింది. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో రైతులకు కల్తీ విత్తనాలు పంపిణీ చేసిన 135 మంది డీలర్ల లైసెన్సులు, 9 సెంట్రలైజ్డ్ సీడ్‌లైసెన్సులు రద్దుచేసి, 17 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ కల్తీలు, నకిలీలు జరగకుండా కాపుకాస్తున్నది.

దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో విత్తన ధ్రువీకరణ పూర్తి అమలు

దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్ విత్తన ధ్రువీకరణను పూర్తిస్తాయిలో ప్రవేశపెట్టి.. దేశంలోని అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. 2016 వానాకాలం సీజన్ నుంచి ఎన్నో సమస్యలను అధిగమించి సంపూర్ణంగా ఆన్‌లైన్ విత్తన ధృవీకరణను చేస్తున్నారు. బార్‌కోడింగ్, క్యూఆర్ కోడింగ్ ద్వారా విత్తనలాట్లను గుర్తించే విధానాన్ని 2019 జూలై 1 నుంచి అమలు చేస్తున్నారు.

  • వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రోత్సాహించడానికి ‘ఫామ్ మెకనైజేషన్’

వ్యవసాయంలో యాంత్రీకరణ వల్ల శ్రమతో పాటు ఖర్చు తగ్గుతుంది. సమయం ఆదా అవుతుంది. పెట్టుబడి తగ్గుతుంది. ఉత్పత్తి పెరుగుతుంది. అందుకే వ్యవసాయంలో యాంత్రీకరణ పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఫామ్ మెకనైజేషన్’ కార్యక్రమాన్ని చేపడుతున్నది. రూ. 420 కోట్ల వ్యయంతో రైతులకు ఆధునిక వ్యవసాయ పనిముట్లను సబ్సిడీతో అందిస్తున్నది. ఈ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టింది. ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం సబ్సిడీతో, ఇతర రైతులకు 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లను అందిస్తున్నారు. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడానికి ప్రభుత్వం 2018-19 బడ్జెట్లో రూ.522 కోట్లు కేటాయించింది.

  • సబ్సిడీపై ట్రాక్టర్లు – ఇతర వ్యవసాయ పరికరాలు

రైతులకు 50% నుంచి 90 శాతం సబ్సిడీపై ప్రభుత్వం వ్యవసాయ ట్రాక్టర్లు అందిస్తున్నది. వ్యవసాయ ట్రాక్టర్లపై రవాణా పన్ను రద్దు చేశారు. ఆగస్టు 2018 నాటికి 14 వేల ట్రాక్టర్లు పంపిణీ చేశారు. ఈ ట్రాక్టర్లకు రోడ్ టాక్స్, కమర్షియల్ టాక్స్, టెంపరరీ రిజిస్ట్రేషన్, కమర్షియల్ రిజిస్ట్రేషన్ టాక్స్, జీఎస్టీని మినహాయించింది. ట్రాక్టర్లకు బిగించే సేద్య పరికరాలు కూడా పంపిణీ చేశారు. 4 లక్షల 71 వేల టార్పాలిన్లు, 26,179 స్ప్రేయర్లు పంపిణీ చేశారు. వీటితోపాటు నాట్లువేసే మిషన్లు కూడా సబ్సిడీ ధరల్లో అందించాలని నిర్ణయించారు. మొత్తం 5,500 వరినాటు యంత్రాలు సబ్సిడీపై అందిస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీపై ఇస్తుండగా.. బీసీ, సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 85 శాతం సబ్సిడీతో ఇస్తున్నారు. 75 శాతం రాయితీతో వరిలో ఆడ, మగ విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేస్తున్నది.

నాడు దండగ అన్న వ్యవసాయం.. నేడు పండగైంది..
  • రైతు బజార్ల ఏర్పాటు

తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో కేవలం 30 రైతు బజార్లు మాత్రమే ఉండేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగా 29 రైతు బజార్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 12 రైతు బజార్లు కార్యకలాపాలు ప్రారంభించగా, మరో 17 నిర్మాణ దశలో ఉన్నాయి. తెలంగాణలో 42 రైతు బజార్లలో కార్యకలాపాలు జరుగుతున్నవి.

  • సమీకృత మార్కెట్ల నిర్మాణం

ప్రజలు తమ నిత్యావసరాల కోసం ఒక్కో సరుకు కోసం ఒక్కో ప్రదేశానికి వెళ్లేవారు. వారి సమయం వృథా అయ్యేది. పనిభారం కూడా పెరిగేది. ఇది గమనించిన ప్రభుత్వం సమీకృత మార్కెట్లు నిర్మించింది. మొదటగా దీన్ని సిద్దిపేటలో 6.10 ఎకరాల విస్తీర్ణంలో, రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించారు. దాదాపు 80 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన భవనాల్లో సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేయగా, 2019 ఫిబ్రవరి 6న ప్రారంభించారు. ప్రతీ కుటుంబానికి కావలసిన కూరగాయలు, పండ్లు, పూలు, పాలు, మాంసం, చేపలు ఇతర నిత్యావసరాల వస్తువులన్నీ ఇందులో లభిస్తాయి. వినియోగదారుల కోసం రెండు లిఫ్టులు, సరుకులు తరలించేందుకు  మరో రెండు లిఫ్టులు ఏర్పాటు చేశారు. మెట్లు, ర్యాంప్ సౌకర్యం ఏర్పాటు చేశారు. క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి మార్కెట్లను నిర్మించనున్నారు. ఈ సమీకృత మార్కెట్ ను గజ్వల్ లో కూడా నిర్మిస్తున్నారు.

  • పాల సొసైటీల రైతులకు బర్రెల పంపిణీ –  లీటరుకు రూ.4 ఇన్సెంటివ్

తెలంగాణలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 1 కోటి 3 లక్షల కుటుంబాలుండగా, కోటి లీటర్ల పాలు అవసరమవుతాయి. కానీ, రైతుల ద్వారా, డెయిరీల ద్వారా మొత్తం కలిపి 7 లక్షల లీటర్ల పాలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. తెలంగాణకు ప్రతీరోజు ఆంద్రప్రదేశ్ నుంచి 4 లక్షల లీటర్లు, గుజరాత్ నుంచి 2 లక్షల లీటర్లు వస్తున్నాయి. ఈ లోటును భర్తీ చేయడానికి ప్రభుత్వం పాల ప్రోత్సాహకం పథకాన్ని ప్రవేశపెట్టింది.   తెలంగాణలో పాల ఉత్పత్తిని పెంచడం కోసం ప్రభుత్వం పెద్దఎత్తున బర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఈ పథకాన్ని ప్రారంభించాక పాల ఉత్పత్తి, వినియోగంలో తెలంగాణ స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలో రోజుకు 80 లక్షల లీటర్ల పాలు వినియోగిస్తుంటే ఇందులో 72 లక్షల లీటర్లు తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్నాయి. మరో 8 లక్షల లీటర్లు ప్రతిరోజు ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్నాయి. విజయ డెయిరీ ఫెడరేషన్ ద్వారా 33  జిల్లాల్లో 3018 సహకార సంఘాల నుంచి 66 వేల మంది పాల ఉత్పత్తిదారులు సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో విజయ డైరీ 35 కోట్ల లాభాలు గడించింది. సంస్థకున్న 25 కోట్ల అప్పు చెల్లించింది. 16 కోట్ల రూపాయలను వివిధ బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసుకున్నది.

పాడి రైతులకు లీటరు పాలపై రూ.4 ఇన్సెంటివ్

పాడి రైతులకు ప్రభుత్వం లీటరు పాలకు రూ.4 ఇన్సెంటివ్‌ అందిస్తున్నది. దీని ద్వారా లక్ష మంది పాడి రైతులు లబ్దిపొందుతున్నారు. ప్రభుత్వం 2014-15 నుంచి 2021 మే వరకు రైతులకు రూ. 304 కోట్లు ప్రోత్సాహకంగా చెల్లించింది. దీంతోపాటు రూ.50 కోట్లు ఉన్న బకాయిలను రైతులకు చెల్లించారు. 2020-21 బడ్జెట్లో పాల ప్రోత్సాహకానికి రూ.100 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ చర్యలతో పాడి పశువుల రంగంలో 17.3శాతం వృద్ధి నమోదైంది. పశువుల్లో నట్టల నివారణకు ప్రభుత్వం రూ.4.60 కోట్లు ఖర్చు చేసింది.

  • బర్రెల పంపిణీ
నాడు దండగ అన్న వ్యవసాయం.. నేడు పండగైంది..

 2017 సెప్టెంబర్ 17న సీఎం కేసీఆర్ బర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు. గొర్రెల పంపిణీ లాగానే ప్రభుత్వం బర్రెల పంపిణీ పథకాన్ని చేపట్టింది. 2018 ఆగస్టులో  ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.  ఈ పథకంలో ఒక్కో యూనిట్ విలువ రూ.80 వేలతో పాడి రైతులకు 50 శాతం సబ్సిడీపై, ఎస్సీ, ఎస్టీలకు 75శాతం సబ్సిడీపై బర్రెలు, ఆవులను పంపిణీ చేస్తున్నారు. విజయ, కరీంనగర్, ముల్కనూర్, మదర్ డెయిరీలలో సభ్యులుగా ఉన్న 2.13 లక్షల మంది పాడి రైతులకు రూ.1677 కోట్ల అంచనా వ్యయంతో గేదెలు, ఆవులను అందిస్తున్నారు. మే 2019 నాటకి 57,538 మందికి పశువులను పంపిణీ చేశారు. బర్రెల కొనుగోలు కోసం 28 జిల్లాల కలెక్టర్ల ఖాతాలకు మొదటి విడతగా రూ.161 కోట్లు జమ చేశారు. లబ్ధిదారులు చెల్లించిన వాటా ధనాన్ని ఆయా డెయిరీల ప్రతినిధులు కూడా ఆ ఖాతాలకు జమ చేయాల్సి ఉంటుంది.

పాడి రైతులకు ప్రత్యేక రుణాలు ( 9 జూన్ 2020 )

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌తో ఆర్థికంగా కుదేలైన పాడి రైతులను ఆదుకొనేందుకు ప్రత్యేకంగా కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను అందించింది. వీటి ద్వారా రాష్ట్రంలోని దాదాపు 3 లక్షల మంది పాడి రైతులు నేరుగా బ్యాంకు నుంచి రూ.లక్షా 60 వేల నుంచి రూ.3 లక్షల వరకు రుణాన్ని పొందే అవకాశం కలిగింది. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన క్రెడిట్‌ కార్డులతో దాదాపు 3 లక్షల మంది పాడి రైతులకు సాంత్వన చేకూరింది.

  • పశువులకు ఇంటివద్దే వైద్యం అందించడానికి ‘సంచార పశువైద్యశాలలు’

అనారోగ్యం పాలైన పశువులకు ఇంటి వద్దే వైద్యం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సంచార పశు వైద్యశాలలను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని 15 సెప్టెంబర్, 2017న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఒక్కో వాహనాన్ని రూ. 14.65 లక్షల ఖర్చుతో రూపొందించారు.  సంచార పశు వైద్యశాలలను 2017 సెప్టెంబర్ 15న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. పాడి పశువులకు జబ్బు చేస్తే రైతులు 1962 నంబర్‌కు ఫోన్ చేస్తే చాలు.. అరగంటలో డాక్టర్లే అధునాతన పరికరాలు, వసతులతో కూడి ఉన్న సంచార పశు వైద్యశాలలతో ఇంటి ముందుకు వస్తారు. పశువులకు పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రభుత్వం 99 సంచార పశు వైద్యశాలలను ఏర్పాటు చేసింది. ఒక్కో వాహనానికి సగటున నెలకు రూ.2 లక్షలు ఖర్చు చేస్తున్నారు.  ఒక్కో అంబులెన్స్‌ రోజుకు 7-12 పశువులకు వైద్యసేవలు అందిస్తోంది. 6.61 లక్షల పశువులకు చికిత్స అందించారు. 1.66 లక్షల పశువులకు శస్త్రచికిత్సలు చేశారు. ముఖ్యంగా 2.40 లక్షల గొర్రెలకు, 1.26 లక్షల గేదెలకు, 1.20 లక్షల మేకలకు చికిత్సలు చేశారు. అలాగే 1.26 లక్షల ఇతర పశువులకు కూడా చికిత్సలు అందించారు. 7 వేల కుక్కలు, 39 వేల కోళ్లకు వైద్యం అందించారు. గుర్రాలు, కుందేళ్లు, పిల్లులకుకూడా చికిత్స చేస్తున్నారు. తెలంగాణలో 1391 మంది గోపాలమిత్రులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం వీరికి నెలకు రూ.8500 గౌరవ వేతనం ఇస్తున్నది.

  • పశువులకూ యూనిక్ ఐడీ నంబరు

ఇప్పటివరకు మనుషులకు మాత్రమే ఉన్న ఆధార్‌ తరహా నంబర్‌ను రాష్ట్ర ప్రభుత్వం పశువులకూ యూనిక్ ఐడీ నంబరు కేటాయిస్తున్నది. పశు సంవర్ధకశాఖ ఇంటింటికీ వెళ్లి ఆవులు, ఎద్దులు, బర్రెలు, దున్నలను గుర్తించి పన్నెండు అంకెల యునిక్‌ ఐడీతో కూడిన ట్యాగ్‌ను పశువు చెవికి అమర్చి యజమానికి గుర్తింపుకార్డు అందజేస్తున్నారు. ట్యాగ్‌ నంబరు, పశువు వయసు, ఆడ, మగ, ఊరిపేరు యజమాని పేరు, మొబైల్‌ నంబరు, ఆధార్‌ నంబరు, వ్యాక్సినేషన్‌ చేసిన తేదీ తదితర వివరాలతో రిజిస్ట్రేషన్ చేసి, పశు హెల్త్ కార్డు అందజేస్తున్నారు. పశువు ప్రొఫైల్‌లో వాటి సమగ్ర సమాచారం ఉంటుంది. దీనిద్వారానే భవిష్యత్‌లో పశువులకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు జరుగుతాయి.

  • మేలుజాతి పశుసంపద వృద్ధిలో ముందు వరుసలో తెలంగాణ  

కృత్రిమ గర్భధారణతో మేలుజాతి పశుసంపదను వృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కల్యాణ్ అభియాన్ పథకాన్ని దేశంలోని 111 జిల్లాల్లో ప్రారంభించింది. ఈ పథకంలో తెలంగాణ 72.40 శాతం వృద్ధి సాధించి జాతీయ స్థాయిలో ముందు వరుసలో నిలిచింది. అలాగే, రాష్ట్రంలోని దాదాపు 15 లక్షలకు పైగా పశువుల చెవులకు 12 అంకెల ట్యాగ్ వేసి, దాని యజమాని నుంచి సమాచారం సేకరించి, ఆన్ లైన్ లో నిక్షిప్తం చేసే పనిని రాష్ట్ర పశువుల అభివృద్ధి సంస్థ (టీఎస్ ఎల్ డి.ఏ) పూర్తి చేసింది.

  • పశుగ్రాసం సాగుకు ప్రోత్సాహం

రాష్ట్రంలో పశుగ్రాసం కొరత రాకుండా 75 శాతం సబ్సిడీపై 2,722 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలు రైతులకు అందించారు. పశుగ్రాసం సాగును ప్రోత్సహించేందుకు 75 శాతం సబ్సిడీపై 195 టన్నుల స్టైలో హైమాట పశుగ్రాస విత్తనాలను రైతులకు సరఫరా చేసి, 97 వేల ఎకరాలను సాగులోకి తెచ్చారు.

  • ఇంటర్ నెట్ ద్వారా వ్యవసాయ సమాచారం

ఆధునిక సాంకేతిక వ్యవసాయ సమాచారాన్ని, సేవలను రైతులకు ఆధునిక మాధ్యమాల ద్వారా  ప్రభుత్వం త్వరితంగా, సమర్ధవంతంగా రైతులకు అందిస్తున్నది. ఎన్.ఇ.జి.పి.ఎ (NeGP-A- National E Governance Plan in Agriculture) ద్వారా G2B, G2G మరియు G2C/F సేవలను అందిస్తున్నారు. ఆన్ లైన్ లైసెన్స్ మేనేజ్ మెంట్ సిస్టం (OLMS) ద్వారా ఇన్ పుట్ డీలర్లకు ఆన్ లైన్ పద్ధతిలో లైసెన్సులు మంజూరు చేస్తూ, పారదర్శక విధానం పాటిస్తోంది. అలాగే, ఆన్ లైన్ ద్వారానే వ్యవసాయ యాంత్రీకరణ పథకం, కిసాన్ పోర్టల్ పథకాలు అమలు చేస్తూ, రైతుల సమగ్ర సమాచారాన్ని పొందుపరుస్తోంది.

  • వ్యవసాయ మార్కెంటింగ్ శాఖలో ఈ-సేవలు

వ్యవసాయమార్కెట్లలో పారదర్శకత,జవాబుదారీతనం,వేగం మరింత పెంచేందుకు ప్రభుత్వం ఈ- సేవలు,  మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. మార్కెట్ వ్యవహారాలన్నీ ఇక నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ జారీచేసే వ్యాపారుల లైసెన్సులు,మార్కెట్ కమిటీలు జారీచేసే కమిషన్ ఏజెంట్ల లైసెన్సులను,కమిషన్ ఏజెంట్లు ఇవ్వాల్సిన తక్‌పట్టీలను ఆన్‌లైన్‌లో జారీ చేయవచ్చు. వ్యాపారులు ఆన్‌లైన్‌లో పర్మిట్ తీసుకొని సరుకును సులభంగా రవాణా చేయవచ్చు. కొనుగోలు వివరాలు,నెలవారీ నివేదికలు ఆన్‌లైన్ ద్వారా మార్కెట్ కమిటీకి పంపొచ్చు. కమిషన్ ఏజెంట్లువ్యాపారస్తులు చెల్లించే అన్నిరకాల మార్కెట్ ఫీజులు,అద్దె తదితర వాటికి రశీదులు కూడా మార్కెట్ కమిటీలు ఆన్‌లైన్‌లోనే అందజేస్తారు. చెక్‌పోస్టుల వద్ద నగదు వసూళ్లన్నీ ఆన్‌లైన్‌లో నమోదవుతాయి. క్యూఆర్ కోడ్‌తో కూడిన ఎక్స్ పోర్టు పర్మిట్లు, చెక్‌పోస్టు చెల్లింపుల రశీదులను జారీ చేస్తారు. వీటికి నకిలీ సృష్టించే అవకాశం ఉండదు.

  • రాష్ట్రవ్యాప్తంగా భూసార పరీక్షలు

ఒకరిని చూసి, మరొకరు ఒకే ప్రాంతంలోని రైతులంతా ఒకే రకం పంటను వేస్తే, అమ్మినపుడు ధరలు లేక నష్టపోవాల్సి వస్తున్నది. తమ భూమి సారం ఎలా ఉంది? ఏ పంట వేస్తే అధికంగా దిగుబడి వస్తుందో తెలియక కూడా రైతులు నష్టపోతున్నారు. అందుకే ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి తగ్గించి, దిగుబడి పెంచడమే లక్ష్యంగా భూసార పరీక్షలను పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టింది. రాష్ట్రంలోని 589 మండలాల్లో ప్రతీ మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకొని 1.15 లక్షల మట్టి నమూనాలను సేకరించి, భూసార పరీక్షలు నిర్వహించారు. నివేదికలు, కార్డుల ముద్రణ పూర్తికావటంతో రాష్ట్రవ్యాప్తంగా కార్డుల పంపిణీ ప్రారంభించారు. భూసార పరిరక్షణ పథకం కింద రైతు భూమిలోని పోషక లోపాలను గుర్తించి, ఏ పంటలు సాగుచేయాలి? ఎంత మోతాదులో ఎరువులు వాడాలి? పెట్టుబడిని తగ్గించి నాణ్యమైన, స్థిరమైన దిగుబడిని ఎలా సాధించాలి? అనే అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఒక ప్రాంతీయ, నాలుగు సంచార, మూడు జిల్లాస్థాయి, 12 మార్కెట్ కమిటీ కేంద్రాలు కలిపి 26 పరీక్ష కేంద్రాల్లో విశ్లేషణ చేశారు. భూసార పరీక్షాకేంద్రాల్లో విశ్లేషించిన వివరాలను సాయిల్ హెల్త్ కార్డు పోర్టల్‌లో నమోదుచేశారు.

సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీ : 2014-15లో రైతుల భూముల్ని పరీక్షించి 19.24 లక్షల సాయిల్ హెల్త్ కార్డులు అందజేశారు. 2015-16లో 25.20 లక్షల కార్డులు, 2016-17లో 30.34 లక్షల కార్డులు, 2017-18 లో 15.20 లక్షల కార్డుల్ని రైతులకు అందజేశారు.   మొత్తం 16.47 లక్షల శాంపిళ్లను సేకరించి 72.67 లక్షల సాయిల్ హెల్త్ కార్డులను రైతులకు అందజేశారు.

  • క్రాప్ కాలనీల ఏర్పాటు

రాష్ట్రంలోని నేలల స్వభావం, వాతావరణ పరిస్థితులు, నీటి వసతులు, పంట ఉత్పాదక వసతులను బట్టి  ప్రభుత్వం క్రాప్ కాలనీలు ఏర్పాటు చేస్తున్నది. వరి, పత్తి, మొక్కజొన్న, సోయా, చిక్కుడు, కంది తదితర పంటలకు క్రాప్ కాలనీలు రూపొందించారు.

నేలల స్వభావాన్ని బట్టి వర్గీకరణ : తెలంగాణలోని ఎర్ర నేలలు, చెల్క నేలలు, దుబ్బ నేలలు, ఒండ్రు మృత్తికలు, నల్ల రేగడి, లాటరైట్/ జిగురు నేలల్ని వ్యవసాయశాఖ విభజించింది. భూముల స్వభావాల్ని బట్టి జిల్లాల వారీగా ఏం పంటలు వేయాలో అనువైన పంటలను కూడా ప్రకటించింది.

  • కూరగాయల విత్తనాలకు భారీ సబ్సిడీలు

కృషి వికాస యోజన పథకం కింద 50% రాయితీతో హైబ్రిడ్ కూరగాయల విత్తనాలను, 75% రాయితీతో ఉల్లి విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేసింది. అలాగే, ఆలుగడ్డ సాగు ప్రోత్సాహానికి ఎకరాకు రూ.5 వేలు రాయితీ ఇస్తున్నారు. కూరగాయలు, పండ్ల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం రైతులకు గరిష్టంగా 5 ఎకరాలకు రూ.6వేల వరకు, హైబ్రిడ్ కూరగాయల విత్తనాల మీద 50% సబ్సిడీ ఇస్తున్నది.

శాశ్వత పందిళ్లు : నాణ్యమైన తీగ జాతి కూరగాయాలు, బీర, పొట్ల, సొరకాయ, కాకర, దొండ పంటలను పండించే రైతులకు ప్రభుత్వం రాయితీలిస్తోంది. శాశ్వత పందిర్ల నిర్మాణానికి ఎకరాకు రూ.లక్ష చొప్పున రెండున్నర ఎకరాల పరిమితితో 50% రాయితీ అందిస్తున్నారు.

ప్లాస్టిక్ బుట్టలు : పంటకోత అనంతరం నష్టాలు తగ్గించడానికి రైతులకు 50 శాతం రాయితీతో ప్లాస్టిక్ బుట్టలను ఇస్తున్నారు. ఇందులో బుట్టకు రూ. 120 మించకుండా ఒక్కో రైతుకు 40 బుట్టలు సబ్సిడీపై అందజేస్తున్నారు.

హరితపందిరి : తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి సాధించేందుకు ఒక్కో రైతుకు 3 ఎకరాల్లో హరిత పందిర్ల నిర్మాణానికి రూ.81 లక్షల వరకు రాయితీ ఇస్తున్నారు.

  • సమర్థ నీటి వినియోగం కోసం మైక్రో ఇరిగేషన్ కు ప్రాధాన్యం

తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించే అవకాశమున్న మైక్రో ఇరిగేషన్ కు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. ఈ పథకంతో పంటల ఉత్పత్తి, ఉత్పాదకత రెట్టింపు, అధిక నాణ్యతతో కూడిన దిగుబడులు సాదించవచ్చు. బిందు సేద్యం, తుంపర సేద్యం రైతులకు ఎంతో ప్రయోజనకర మైనదిగా భావించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నది.

2015-16 బడ్జెట్లో రూ.308 కోట్లు, 2016-17లో 302.50 కోట్లు, 2017-18 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో కలిపి రూ.287.24 కోట్లు కేటాయించారు. 2018-19 బడ్జెట్లో రూ.127 కోట్లు, 2020-21 రూ.600 కోట్లతో మైక్రోఇరిగేషన్ కార్యక్రమాలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలు/షెడ్యూల్డ్ తెగల రైతులకు 100% రాయితీ, వెనుకబడిన తరగతులకు, సన్న, చిన్నకారు రైతులకు 90% రాయితీ, ఇతర రైతులకు 80% రాయితీలు ఇస్తున్నది. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఒక ఎకరాకు ఒక లక్ష రూపాయల సబ్సిడీ వచ్చేది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ 10 జిల్లాల్లో కేవలం 12 లక్షల ఎకరాలను బిందు, తుంపర సేద్యంతో సాగులోకి తీసుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం గరిష్టంగా 12.5 ఎకరాలకు రూ.6 లక్షల సబ్సిడీ అందిస్తుంది. దీని కొరకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ నిధులకు తోడుగా నాబార్డ్ నుండి రూ.874 కోట్లు కలిపి మొత్తం రూ.1,092 కోట్ల వ్యయంతో మైక్రో ఇరిగేషన్ పనులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో భూగర్భ జలాల ద్వారా మొత్తం 43.20 లక్షల ఎకరాల భూమి సాగవుతుండగా, మైక్రో ఇరిగేషన్ ద్వారా మార్చి 2020 నాటికి 2,49,200 మంది రైతులకు రూ.1,819 కోట్ల రూపాయల లబ్ది చేకూరింది. 6.30 లక్షల ఎకరాల్లో ఈ తరహా వ్యవసాయం జరుగుతున్నది.

సూక్ష్మసేద్యం : 25 లక్షల ఎకరాలను బిందు, తుంపర సేద్యం కిందకు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. తెలంగాణ ఏర్పాటుకు ముందు 2003-2013 వరకు పదేండ్లలో మొత్తం 23 జిల్లాల్లో 12 లక్షల ఎకరాల్లో రూ.2,074 కోట్ల ఖర్చుతో  డ్రిప్, స్ర్పింక్లర్ సాగు చేశారు. కానీ, తెలంగాణ ఏర్పడిన నాటినుంచి 2020 ఫిబ్రవరి నాటికి 6.6 లక్షల ఎకరాల్లో  సూక్ష్మసేద్యం పద్ధతిలో సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 56 లక్షల మంది రైతులుండగా, 2.48 లక్షల మంది డ్రిప్ సదుపాయం పొందారు. వారికి రూ.1,777.73 కోట్ల వ్యయంతో డ్రిప్, స్ర్పింక్లర్ పరికరాలను అందించారు.

సంవత్సరంరైతులుడ్రిప్‌ కనెక్షన్లుస్ప్రింక్లర్లుమొత్తం
2014-1531,27746,35330,13076,483
2015-1639,54577,97921,66599,644
2016-1755,1211,32,12122,8351,54,956
2017-1883,4581,39,28984,2762,23,565
2018-1937,59670,23330,5301,00,763
2019-201,7453,9209134,833
మొత్తం2,48,7424,69,8951,90,3496,60,244

మైక్రో ఇరిగేషన్

2013-14                    : 11.99 లక్షల ఎకరాలు

2019-20                    : 18,65,675 ఎకరాలు

(పెరుగుదల 6,66,675 ఎకరాలు, పెరిగిన శాతం 55 )

గ్రీన్ హౌజ్

2013-14                    : 20 ఎకరాలు

2019-20        : 1,210 ఎకరాలు 

(పెరుగుదల 1,190 ఎకరాలు, పెరిగిన శాతం 5,950)

  • పాలీ హౌజ్, గ్రీన్ హౌజ్ ఏర్పాటుకు భారీ సబ్సిడీలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవసరమయ్యే కూరగాయలన్నీ తెలంగాణలోనే పండించాలని, కూరగాయలు, పండ్ల విషయంలో రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.

రాష్ట్రంలో పండ్లకు సంబంధించిన అంశాలు

సాగు విస్తీర్ణం  4.35 లక్షల ఎకరాలు

మొత్తం దిగుబడి 22.97 లక్షల టన్నులు

ఏడాదికి సగటు వినియోగం 12.44 లక్షల టన్నులు

ఒక వ్యక్తి సగటు వినియోగం ఏడాదికి 31.10 కిలోలు

ఒక వ్యక్తి ఏడాదికి పెట్టే ఖర్చు  రూ.1,986

రాష్ట్రం నుంచి ఎగుమతులు 18.44 లక్షల టన్నులు

ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి 7.91 లక్షల టన్నులు

రాష్ట్రంలో కూరగాయలకు సంబంధించిన అంశాలు

సాగు విస్తీర్ణం  3.52 లక్షల ఎకరాలు

మొత్తం దిగుబడి 30.71 లక్షల టన్నులు

ఏడాదికి సగటు వినియోగం 36 లక్షల టన్నులు

ఒక వ్యక్తి సగటు వినియోగం ఏడాదికి 90 కిలోలు

ఒక వ్యక్తి ఏడాదికి పెట్టే ఖర్చు  రూ.2,782

రాష్ట్రం నుంచి ఎగుమతులు 7.72 లక్షల టన్నులు

ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి 13 లక్షల టన్నులు

 ప్రభుత్వం భారీ సబ్సిడీలతో పాలీహౌజ్, గ్రీన్ హౌజ్ సాగుకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు రైతులకు ఎకరా పరిమితితో 50% సబ్సిడీ ఇచ్చేవారు. అపుడు తెలంగాణలో కేవలం 354 మంది రైతులు 126 ఎకరాల్లో పాలీహౌజ్ సాగు చేస్తూ రూ. 24 కోట్ల సబ్సిడీ పొందారు. ఆ తర్వాత రైతులకు 3 ఎకరాల పరిమితితో 75 శాతం సబ్సిడీ అందుతున్నది.

సబ్సిడీ వివరాలు : తెలంగాణ ప్రభుత్వం మే, 2018 నాటికి 1272.39 ఎకరాలకురూ.230.28 కోట్ల వ్యయంతో 1,106 మంది రైతులకు (ఎస్సీలు 144, ఎస్టీలు 69 మంది) పాలీ హౌస్ సబ్సిడీ అందించింది. పంట నాణ్యతను బట్టి ఎస్సీ, ఎస్టీలకు గరిష్టంగా ఎకరాకు రూ.36.37 లక్షల రుణాన్ని 95 శాతం సబ్సిడీతో, ఇతరులకు 75 శాతం సబ్సిడీతో గరిష్టంగా ఎకరాకు రూ.29.52 లక్షలు మంజూరు చేస్తున్నారు. మొత్తం 600 ఎకరాలలో 721 మంది రైతులు ఈ పాలిహౌజ్ లలో వివిధ పంటలు వేశారు. పాలీహౌజ్ ల సబ్సిడీకి 2017-18 బడ్జెట్లో రూ.94.52 కోట్లు, 2018-19 బడ్జెట్లో రూ.120 కోట్లు కేటాయించారు.  పాలీ హౌజ్, గ్రీన్ హౌజ్ కల్టివేషన్ కోసం సబ్సిడీని 2016-17 నుంచి ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీని 75% నుంచి 95% పెంచింది. ఎకరానికి మించకుండా పాలిహౌజ్ నిర్మించుకోవడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది.

వెజిటబుల్‌ హబ్‌గా వంటిమామిడి : సీఎం కేసీఆర్ (27.1.2020)

సిద్దిపేట జిల్లా వంటిమామిడి కూరగాయల మార్కెట్‌ను అన్ని సౌకర్యాలతో విస్తరించి, వెజిటబుల్‌ హబ్‌గా ఆధునీకరించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సంస్థలకు అవసరమైన కూరగాయలను ఇక్కడి నుంచే సరఫరా చేస్తామని, కూరగాయల రైతుకు గిట్టుబాటుధర అందేలా చూ స్తామని చెప్పారు. 27 జనవరి 2021న సీఎం కేసీఆర్‌ వంటిమామిడి కూరగాయల మార్కెట్‌ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు, కమీషన్‌ ఏజెంట్లను కూరగాయల ధరలు అడిగి తెలుసుకున్నారు. రైతులతో నేరుగా మాట్లాడి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంటల సాగు, పెట్టుబడి వ్యయం, దిగుబడులు, మార్కెటింగ్‌ సౌకర్యం, బహిరంగ మార్కెట్‌లో ధరలు, సీజన్‌, డిమాండ్‌ను బట్టి కూరగాయలు పండిస్తే గిట్టుబా టు పొందే అవకాశం ఉంటుందని రైతులకు సూచించారు. సంప్రదాయ సాగుస్థ్ధానంలో నూతన పద్ధ్దతులను అవలంబిస్తూ.. మెళకువలను పాటిస్తే కూరగాయల దిగుబడులు, నాణ్యత పెరుగుతుందని తెలిపారు. రైతులకు కూరగాయల ధరల స్థిరీకరణ కోసం వంటిమామిడి మార్కెట్‌ యార్డులో ప్రభుత్వ కొనుగోళ్లు చేస్తామని చెప్పారు.

  • హార్టికల్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు

రాష్ట్రంలో కూరగాయల సాగులో ఆధునిక నూతన పద్ధతులను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు,  నాణ్యమైన దిగుబడులను పెంచి, రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఉండాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో కొత్తగా హార్టికల్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది.  ఈ మేరకు  ఫిబ్రవరి 25, 2016న జి.ఓ. జారీ చేసింది.  మార్కెట్‌లో డిమాండ్‌లేని సమయంలో వారి పంటలు కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసి, ప్రత్యామ్నాయ ఉత్పత్తులను తయారుచేసి, రైతుకు గిట్టుబాటు కల్పించాలన్నది ఈ కార్పొరేషన్ ప్రధాన లక్ష్యం. ఈ కార్పొరేషన్ తో నాణ్యతతో పాటు సాగులో విప్లవాత్మక మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.

  • హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు

గజ్వేల్‌ నియోజకవర్గంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట ఏర్పాటు చేసిన హార్టికల్చర్‌ యూనివర్సిటీని ముఖ్యమంత్రి కెసిఆర్ డిసెంబర్ 11, 2019 న ప్రారంభించారు. దీంతోపాటు ఫారెస్ట్ కాలేజీ, పరిశోధన కేంద్రాలను ప్రారంభించారు. హార్టికల్చర్ యూనివర్సిటీకి 7 జనవరి, 2016న శంకుస్థాపన జరిగింది. ఈ వర్సిటీని సిద్దిపేట జిల్లాలోని ములుగు మండల కేంద్రంలో 12.14 ఎకరాల విస్థీర్ణంలో రూ.1,831 కోట్ల వ్యయంతో, 5 బ్లాకులుగా (జి+5)నిర్మించారు. ఇదే రోజు గజ్వేల్ సమీకృత మార్కెట్ కాంప్లెక్స్, ఫ్రూట్ రీసెర్చ్ సెంటర్, సమీకృత ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయం, మహతి ఆడిటోరియంలను సీఎం ప్రారంభించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజి, మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి నిర్మాణాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

  • కొత్తగా నాలుగు వ్యవసాయ పాలిటెక్నిక్ లు ఏర్పాటు

రాష్ట్రంలో కొత్తగా 4 వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సిద్దిపేట జిల్లా తోర్నాల గ్రామంలో, సిరిసిల్ల జిల్లా సర్దార్ పూర్ లో, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో, నిజామాబాద్ జిల్లా మాల్తుమ్మెదలో వీటిని ఏర్పాటు చేశారు. ప్రతీ కాలేజీలో 30 సీట్లతో తరగతుల నిర్వహణ కొనసాగుతోంది.

  • రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ

మూతపడిన రామగుండం ఫర్టిలైజర్ ప్లాంటు పునరుద్ధరణకు ప్రభుత్వం చొరవ చూపింది.  ప్రధాని మోదీ చేతుల మీదుగా 2016 ఆగస్టు 7న ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణకు శంకుస్థాపన జరిగింది. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలంగాణ ప్రజల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందడమే కాకుండా ఎరువుల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి  సాధించేందుకు ఉపకరిస్తుంది.  రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్.సి.ఎల్)లో 2020 నవంబర్ నుంచి యూరియా ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రసాయనాలు, ఎరువులశాఖ సహాయ మంత్రి మాన్ సుఖ్ లక్ష్మణ్ బాయ్ మాండవ్యా అధికారులను ఆదేశించారు. 2020 సెప్టెంబర్ 12న ఆయన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డితో కలిసి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని సందర్శించారు. పనుల పురోగతిపై అధికారులు వారికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. కర్మాగారంలో రూ.6,120.5 కోట్ల వ్యయంతో చేపట్టిన పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ పరిశ్రమలో ఏటా 13 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి కానుండగా ఇందులో తెలంగాణకు 6.25 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయిస్తామని కేంద్ర మంత్రులు ప్రకటించారు.

  • కల్తీలేని ఆహార పదార్థాల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు

తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందుతుండటంతో లక్షలాది ఎకరాల్లో, లక్షల టన్నుల్లో పంటలు పండుతున్నాయి. అయితే, ఈ అధిక దిగుబడి వల్ల పంటలకు ధర తగ్గి రైతులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని నివారించి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా, ప్రజలకు కల్తీలేని ఆహార పదార్ధాలు అందించేలా, మహిళలు, యువతకు ఉపాధి కల్పించేలా ‘బ్రాండ్‌ తెలంగాణ’కు సీఎం కేసీఆర్‌ రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకొన్నది. ఇందులో రైతుల పంటలను గ్రామాల్లోని మహిళా సంఘాలే కొనుగోలు చేసి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు తరలిస్తాయి. అక్కడ వాటిని శుద్ధిచేసి, అదనంగా విలువలను జోడించి (వ్యాల్యూ యాడ్ చేసి), వివిధరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. ఈ ప్రక్రియలో రేషన్‌ డీలర్లను కూడా భాగస్వాములను చేస్తున్నారు. రేషన్‌షాపుల ద్వారా కల్తీలేని ఈ ఆహార ఉత్పత్తులను ప్రజలకు అమ్ముతారు. ఆయా జిల్లాల్లో పండే పంటల ఆధారంగా స్థానికంగానే ఈ పరిశ్రమలను నెలకొల్పనున్నారు. దీంతో వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రాష్ట్ర‌ ప‌రిశ్రమ‌లశాఖ మంత్రి కె.టి.రామారావు ఢిల్లీలో వరల్డ్ ఫుడ్ ఫెస్టివల్లో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ పాల‌సీని 2017 నవంబర్ 4న ఆవిష్కరించారు.   ఈ పాల‌సీ ద్వారా రాష్ట్రానికి రూ.20 వేల కోట్ల పెట్టుబ‌డులు, ల‌క్ష 25 వేల‌మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

ఫుడ్ పార్క్: 6 సెప్టెంబర్, 2019న కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ నిజామాబాద్ లోని లక్కంపల్లిలో మొట్టమొదటి ఫుడ్ పార్క్ ను ప్రారంభించారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా చేపట్టిన తొలి స్మార్ట్‌ మెగా ఫుడ్‌ పార్కుగా లక్కంపల్లి సెజ్‌ గుర్తింపును పొందింది. నందిపేట మండలం లక్కంపల్లి సెజ్‌లో స్మార్ట్‌ ఆగ్రో ఫుడ్‌ పార్కు నిర్మాణానికి 16 నవంబర్, 2015న శంకుస్థాపన జరిగింది. ఈ సెజ్‌లో మొదటి విడతగా 78 ఎకరాల్లో రూ.110 కోట్లతో వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటుచేస్తున్నారు. రైతుల ఆదాయం ద్విగుణీకృతం చేయటమే లక్ష్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన జరుగుతోంది. పెట్టుబడుల సాధన, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకై ప్రభుత్వం కృషి చేస్తోంది.

గజ్వేల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు కసరత్తు

సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోగల మండల కేంద్రాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం జూన్ 2020 వరకు సిద్దిపేట జిల్లాలోని తున్కి బొల్లారం శివార్లలో సర్వేనంబరు 340లో దాదాపు 400 ఎకరాలు, అచ్చాయపల్లిలో మరో 200 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికార యంత్రాంగం సేకరించింది. ఈ యూనిట్ల ఏర్పాటుతో కొండపోచమ్మసాగర్ భూనిర్వాసితులు 4 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. అలాగే మల్లన్నసాగర్ రిజర్వాయర్ పునరావాస కాలనీవాసులకు ఉపాధి కోసం గజ్వేల్ సర్వే నంబర్ 75తోపాటు, బయ్యారం పరిధిలోని ప్రభుత్వ భూములను గుర్తించారు. ఈ యూనిట్లు ఏర్పాటైతే మరో 10 వేల మందికి ఉపాధి లభిస్తుంది.

ప్రతి జిల్లాకు ఒక ఫుడ్ పార్కు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికో పరిశ్రమ (19 జూలై 2020)

తెలంగాణలో పంటల దిగుబడి భారీగా పెరిగింది. కాళేశ్వరంతోపాటు పలు ప్రాజెక్టులు పూర్తికావడంతో రైతులు రెండు పంటలు పండించే అవకాశం ఏర్పడింది. ఈ ఏడాది సాగు విస్తీర్ణం 1.20 కోట్ల ఎకరాలకు చేరుకొని, దిగుబడి బాగా వచ్చే అవకాశం ఉన్నది. మరోవైపు పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. చేపలు, గొర్రెలు, మేకల పెంపకం కూడా బాగా పెరిగింది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌చేసుకోవడానికి వీలుగా జిల్లాకు ఒక ఫుడ్‌ పార్కుతోపాటు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పరిశ్రమ  ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించింది.

            తెలంగాణ విభిన్న పంటలకు నిలయం.. దక్కన్‌ పీఠభూమి అయిన తెలంగాణలో పండే పంటలు చాలా రుచికరంగా ఉంటాయి. దీంతో ఇక్కడి వ్యవసాయ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా డిమాండ్‌ ఉన్నది. ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. రాష్ట్రంలో రైతులు పండించే పంటలన్నింటినీ ప్రాసెస్‌చేసి విక్రయిస్తే భారీ ఎత్తున లాభాలు వస్తాయి. రైతుల పంటకు లాభసాటి ధర పలుకుతుంది. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ స్టేట్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ (టీఎస్‌ఎఫ్‌పీఎస్‌)ని ఏర్పాటుచేసింది. ఈ సొసైటీ ద్వారా తృణ, పప్పుధాన్యాలు, నూనెగింజలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, ఫౌల్ట్రీ, చేపల ఉత్పత్తులను ప్రాసెస్‌చేసే యూనిట్లకు ప్రోత్సాహకాలు అందించే దిశగా సర్కారు కసరత్తుచేస్తున్నది.

            ఇందులో ప్రధానంగా వ్యవసాయ, ఉద్యాన, పాలు, ఫౌల్ట్రీ, మాంసం ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు తెలంగాణ అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా  బియ్యం, మక్కజొన్న, పత్తి, కంది, మిరప, సోయ, వేరుశెనగ, చెరకు, మామిడి, బత్తాయి, జామ, ఉసిరి, పుచ్చకాయ, కీర, క్యారెట్‌, టమాట, పసుపు, బెండకాయ, గుడ్లు, కోడి మాంసం, గొర్రెలు, మేకల మాంసం, చేపలు, పాలు ప్రాసెస్‌చేసి విక్రయించడానికి, ఎగుమతిచేయడానికి మంచి అవకాశాలున్నాయి. ఆయా జిల్లాలవారీగా సాగుచేస్తున్న పంటలు, వచ్చిన దిగుబడిని అంచనా వేసిన అధికారులు ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేలా నూతన పాలసీని రూపొందిస్తున్నది. 2020 ఆగస్టు నెలలో ఈ పాలసీ వచ్చే అవకాశాలున్నాయి. 

సెర్ప్ తో ఆహారశుద్ధి పరిశ్రమలు

 వ్యవసాయాన్ని బలోపేతంచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. పండిన పంటలతోనూ రైతులకు, వినియోగదారులకు మేలుచేసేలా ఏర్పాట్లుచేస్తున్నది. రైతులకు గిట్టుబాటు ధర, మహిళా సంఘాలకు ఉపాధి లక్ష్యంగా ప్రభుత్వం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. పంటల కొనుగోలులో ఇప్పటికే కీలకంగా వ్యవహరిస్తున్న గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌)లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు అనుగుణంగా రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో కీలక మార్పులు చేస్తున్నది. సెర్ప్‌ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసింది. ఇప్పటివరకు వ్యవసాయ విభాగంగా ఉన్న వ్యవస్థను వ్యవసాయ- ఫుడ్‌ ప్రాసెసింగ్‌ విభాగంగా మార్చారు. సెర్ప్‌ సీఈవో సందీప్‌కుమార్‌ సుల్తానియా ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ను కుటీర పరిశ్రమగా ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

  • దేశంలోనే అతి పెద్ద ఐస్ క్రీం తయారీ ప్లాంట్

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో హట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.207 కోట్ల పెట్టుబడులను పెట్టింది. ఈ సంస్థ దేశంలోనే అతి పెద్ద ఐస్ క్రీం తయారీ ప్లాంట్ ను సంగారెడ్డి జిలాలోని గోవింద్ పూర్ లో ఏర్పాటుచేస్తుంది. అక్కడ ప్లాంటు నిర్మాణపనులు వేగంగా జరుగుతున్నాయి. దీనిద్వారా స్థానికంగా ఉన్న 4 వేల డెయిరీ రైతు కుటుంబాలకు ప్రయోజనం కలగడంతోపాటు దాదాపు 500 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఈ ప్లాంటు ద్వారా ప్రతిరోజు 100 మెట్రిక్‌టన్నుల ఐస్‌క్రీం తయారవుతుంది. 2020 అక్టోబర్‌ నాటికి ప్లాంటు నిర్మాణం పూర్తయి ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి.

  • నిజామాబాద్ లో స్పైసెస్ బోర్డు రీజినల్ సెంటర్

నిజామాబాద్ లో సుగంధ ద్రవ్యాల బోర్డు రీజినల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ 4 ఫిబ్రవరి 2020న ప్రకటించారు. ఈ సెంటర్ కు ఐఏఎస్ అధికారి డైరెక్టర్ హోదాలో కార్యకలాపాలు పర్యవేక్షిస్తారు. కేంద్ర మంత్రిత్వశాఖకు నేరుగా నివేదిస్తారు.

  • రాష్ట్రంలో ప్రాంతీయ సైబర్ క్రైం సమన్వయ కేంద్రం

సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా తెలంగాణలో ప్రాంతీయ సైబర్ క్రైం సమన్వయ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి 4 ఫిబ్రవరి 2020న ప్రకటించారు. ఇందులో జాతీయస్థాయిలో నేషనల్ సైబర్ క్రైం థ్రెట్ అనాలసిస్ యూనిట్, ఫోరెన్సిక్ లాబ్ ఈకో సిస్టం, ట్రైనింగ్ సెంటర్, ఈకో సిస్టం మేనేజ్ మెంట్ యూనిట్, రీసెర్చ్, ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు.

  • మనోహరాబాద్ లో రూ.800 కోట్లతో ఐటిసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్  

 రైతులకు కనీస మద్ధతు ధర కల్పించడం కోసం ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతున్నది. ప్రభుత్వరంగంలో నెలకొల్పే ఈ యూనిట్ల నిర్వహణలో ప్రభుత్వం ఐటీసీ (Indian Tobacco company limited) భాగస్వామ్యం కోరింది. అందులో భాగంగా మెదక్ జిల్లా మనోహరాబాద్ సమీపంలో రూ.800 కోట్ల వ్యయంతో ఐటీసీ చేపట్టిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులు చేపట్టింది. ఆ పనులు పూర్తయ్యి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది.

98 అనుబధ ఆహార కేంద్రాల ఏర్పాటు

రాష్ట్రంలో ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అదనంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కింద మరిన్ని ఆహార కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రూ.123.78 కోట్ల వ్యయంతో 16 జిల్లాల్లో 98 అనుబంధ ఆహార కేంద్రాలను ఏర్పాటు చేయడానికి గ్రామీణాభివృద్ధి శాఖ డిపిఆర్ రూపొందించింది.

ఫుడ్ ప్రాసెసింగ్ లో మహిళా సంఘాలకు శిక్షణ – భాగస్వామ్యం

తెలంగాణలో రైతులను సంఘటిత పరచి, పండిన పంటలను ఫుడ్ ప్రాసెసింగ్‌ చేసి, నాణ్యమైన కల్తీలేని,బ్రాండెడ్ ఉత్పత్తులను ప్రజలకు అందించడానికి ప్రభుత్వం కార్యాచరణను రూపొందిస్తున్నది.  45 లక్షల మంది సభ్యులున్న 4 లక్షల మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.  మహిళా సంఘాల పెట్టుబడికి ‘స్త్రీ నిధి’ నుంచి రూ.5 కోట్ల రుణం ఇప్పించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. రాష్ర్టాన్ని పంటకాలనీలుగా విభజించి,తద్వారా రైతులు పండించే ప్రతి పంటకు డిమాండ్ వచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిధులు వెచ్చించనుండగా.. నిర్వహణ బాధ్యతలు పూర్తిగా మహిళా సంఘాలకే అప్పగించనున్నారు.

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ఆధునిక సాంకేతికత

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను జోడిస్తున్నది. ఈ పరిశ్రమలకు రెండు జాతీయ పరిశోధనా సంస్థల్లోని అధునాతన పరిజ్ఞానాన్ని వాడుకోవాలని నిర్ణయించారు. 2019 ఖరీఫ్ సీజన్ నుంచి కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా పంటల కాలనీల  ఏర్పాటు జరిగింది. వాటికి అనుసంధానంగా అక్కడ పండే పంటల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రాసెసింగ్  ప్లాంట్లు తప్పనిసరిగా చేశారు. రూ.26 కోట్లతో ప్రాసెసింగ్  ప్లాంట్ల ఏర్పాటుకు ఉద్యానవనశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్లాంట్లలో అల్లం, వెల్లుల్లి మిశ్రమం, కారం, పసుపు పొడి వంటి ఉత్పత్తులను తయారు చేయనున్నారు.   రైతుకు గిట్టుబాటు ధర దక్కడంతో పాటు మహిళా సంఘాలకు కమిషన్ ద్వారా ఆదాయం సమకూర్చడం, వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన ఉత్పత్తులను అందించటమే లక్ష్యంగా వీటిని రూపొందించారు. మామిడి ప్రాసెస్ బాధ్యతలను ఐకేపీ ఉద్యోగులకు అప్పగించారు.

ప్రయోగాత్మకంగా ఐదు జిల్లాల్లో మామిడి ప్రాసెసింగ్ కేంద్రాలు ప్రారంభం

మొదట ప్రయోగాత్మకంగా ఐదు జిల్లాల్లో ప్రాసెసింగ్  కేంద్రాలను ప్రారంభించారు. మామిడి సీజన్ కావడంతో తొలిసారిగా మహిళా రైతులతో మామిడి కొనుగోళ్లు చేయించారు. కొనుగోలు చేసిన మామిడి కాయలను సహజ సిద్ధంగా మాగపెట్టి, వినియోగదారులకు చేర్చుతున్నారు. తొలి విడతలో మామిడి సేకరణను ప్రారంభించిన సంఘాలు.. ఆ తర్వాత పసుపు సేకరణకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

గిట్టుబాటు ధర : గతంలో దళారులు రైతుల నుంచి మామిడి పండ్లకు తక్కువ ధరకు కొనుగోలు చేసి డిమాండ్ ఉన్న ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకునేవారు. రైతులు నష్టపోయేవారు. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే తొలి ప్రాధాన్యంగా తీసుకుంది. ఈ ప్రక్రియలోనే ప్రాసెసింగ్  కేంద్రాలను ఏర్పాటు చేసింది. గతంలో ఏ-గ్రేడ్ మామిడి పండ్లకు వ్యాపారులు రైతులకు చెల్లించింది కిలోకు రూ.20లోపు మాత్రమే. 2019 ఎండాకాలంలో పండించిన మామిడి కాయలను రూ.35 నుంచి రూ.40 వరకు చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేయడం విశేషం. ఒక్కో టన్నుకు రూ.15 వేలకు పైబడి గిట్టుబాటు ధర కల్పించారు. దీంతో రైతుకు కిలోకు రూ.15 వరకు అదనపు ఆదాయం వచ్చింది. ఉత్పత్తిదారుల సంఘాల్లోని సభ్యులు కూడా రైతులే కావటంతో ఆ కుటుంబాలకు కమీషన్ రూపంలో కూడా లాభం వచ్చింది. మామిడిపై రైతు ఉత్పత్తిదారుల సంఘాలు 4 శాతం వరకు కమీషన్ తీసుకుంటాయి. ఈ కమిషన్ నుంచే రైతు వద్ద సేకరించిన పండ్ల రవాణా, గోదాము కిరాయి, రైపెనింగ్ ఛాంబర్ అద్దెతోపాటు, ఖర్చులకు వినియోగిస్తారు.

  • రైతు పంటకు గిట్టుబాటుధర కల్పించడానికి ప్రభుత్వరంగ సంస్థల కొనుగోళ్లు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ దిగుబడులు పెరుగుతున్నాయి. అనుకూలమైన వాతావరణంతో పాటు కొత్త ఆయకట్టు అందుబాటులోకి రావడం, సకాలంలో వర్షాలు పడడం, 24 గంటల విద్యుత్తు సరఫరా వంటి కారణాలతో రైతులు పెద్ద ఎత్తున వరి సాగు చేపట్టారు.   దోమపోటు, ఇతర రోగాలేవీ సోకకపోవడంతో హెక్టార్‌కు 10 క్వింటాళ్ల చొప్పున అధికంగా దిగుబడి వచ్చింది. నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, నల్లగొండ, కరీంనగర్‌, భూపాలపల్లి జిల్లాల్లో అంచనాలకు మించి ధాన్యం దిగుబడులు వచ్చాయి. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కోసం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. గిట్టుబాటు ధర కోసం రూ.500 కోట్ల నిధిని ఏర్పాటు చేసింది.

రైతుల పంటల కొనుగోళ్లతో రూ.7,500 కోట్ల నష్టం

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుండి ప్రభుత్వం రైతుల నుంచి వివిధ రకాల పంటల కొనుగోళ్లు చేసింది. ఈ కొనుగోళ్ల వల్ల రూ.7,500 కోట్ల వరకు నష్టం వచ్చింది.  ఇందులో కేవలం ధాన్యం కొనుగోళ్ల వల్లనే రూ.3,935 కోట్ల నష్టం వచ్చింది. అలాగే, మక్కల కొనుగోళ్ల వల్ల రూ.1547.59 కోట్లు, జొన్నల కొనుగోళ్ల వల్ల రూ.52.78 కోట్లు, కందుల కొనుగోళ్ల వల్ల రూ.413.48 కోట్లు, ఎర్రజొన్నల కొనుగోళ్ల వల్ల రూ.52.47 కోట్లు, మినుముల కొనుగోళ్ల వల్ల రూ.9.23 కోట్లు, శనిగల కొనుగోళ్ల వల్ల రూ.108.07 కోట్లు, పొద్దుతిరుగుడు కొనుగోళ్ల వల్ల రూ.14.25 కోట్ల నష్టం వాటిల్లింది. ఇలా నికరంగా వచ్చిన నష్టంతోపాటు హమాలీ, ఇతర నిర్వహణా ఖర్చులన్నీ కలుపుకుంటే రూ.7,500 కోట్ల వరకు నష్టం వచ్చింది.

2020 సాగులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానం

రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 2019-20  వానాకాలంతో పోలిస్తే 2020-21 వానాకాలంలో 26 శాతానికి పైగా పెరిగింది. 2019-20లో  1.02 కోట్ల ఎకరాలు సాగులో ఉండగా.. 02 సెప్టెంబర్, 2020 నాటికి 1.28 కోట్లకు పైగా ఎకరాల్లో రైతులు పంట సాగు చేశారు. 26 లక్షల ఎకరాల్లో అధనంగా సాగు చేశారు. వానాకాలంలో సాగుచేసిన విస్తీర్ణంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాలను మించి రైతులు అన్నిరకాల పంటలను సాగు చేశారు.

  • దేశానికే అన్నంపెట్టే ధాన్యాగారం.. తెలంగాణ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సాగునీటి రంగానికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవసాయాభివృద్ధికి – రైతు సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేసి, సాగునీరు అందించింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. భూగర్భ జలమట్టం పెరిగింది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నది. దీంతో అటు ప్రాజెక్టు కాల్వల ద్వారా, ఇటు చెరువుల ద్వారా, మరోవైపు బోర్ల ద్వారా పుష్కలమైన నీరు వాడుకోవడం సాధ్యమైంది. ఈ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గత యాసంగిలో తెలంగాణలో 17 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ఈ యాసంగిలో 40 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. దీని ఫలితంగా తెలంగాణలో వరి ధాన్యం రికార్డు స్థాయిలో పండింది. పండిన పంట రాష్ట్ర అవసరాలు తీర్చడంతో పాటు, దేశ అవసరాలను కూడా తీరుస్తున్నది.

రెండో ముందస్తు అంచనాల నివేదిక ప్రకారం-

ఆహార ధాన్యాల ఉత్పత్తి (లక్షల టన్నుల్లో)

సంవత్సరంఖరీఫ్ దిగుబడిరబీ దిగుబడిమొత్తం దిగుబడి
2014-1544.7227.4672.18
2015-1635.7515.7051.45
2016-1752.2249.07101.29
2017-1849.3746.8396.20
2018-1957.5035.2592.75
2019-2078.6851.33130.01

వరి ధాన్యం సాగు విస్తీర్ణం

సంవత్సరం                                   సాగు విస్తీర్ణం                                      

2014-15                                34.96 లక్షల ఎకరాలు                     

2019-20                                68.50 లక్షల ఎకరాలు (100 శాతం పెరుగుదల) 

సాగునీటి లభ్యత పెరగటంతో అదనపు విస్తీర్ణంతో పాటు ఇతర పంటల నుంచి వరిసాగు వైపు రైతులు మొగ్గు చూపుటంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.

వరి ధాన్యం దిగుబడి

సంవత్సరం                                     దిగుబడి

2016-17                                1 కోటి టన్నులు

2019-20                                1.48 కోట్ల టన్నులు (48.08 శాతం అధికం)

(2021 మేనాటికి యాసంగిలో 66 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేయడం జరిగింది)

బియ్యం ఎగుమతి హబ్ గా తెలంగాణ (13.1.2021)

రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు బియ్యం దిగుమతులు సమృద్ధిగా ఉన్నాయని ది ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) పేర్కొన్నది. మనవద్ద పండే సన్నాల్లో తక్కువ గ్లూకోజ్‌ స్థాయి ఉండటం మధుమేహ బాధితులకు ఎంతో మేలుచేస్తాయని తెలిపింది. ‘తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతి- ముందుకుసాగే అవకాశాలు’ అనే అంశంపై రూపొందించిన నివేదికను ఎఫ్‌టీసీసీఐ బుధవారం విడుదల చేసింది.  

ప్రాజెక్టులతో భారీగా ధాన్యం దిగుబడి

సీఎం కేసీఆర్‌ ప్రణాళికాబద్ధంగా చేపట్టిన ప్రాజెక్టులతో నీటి లభ్యత పెరిగి రాష్ట్రంలో ధాన్యం దిగుబడి భారీగా వచ్చిందని ఎఫ్‌టీసీసీఐ తెలిపారు. దీంతో బియ్యం నిల్వలు భారీగా పెరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో వరి ఎక్కువగా పండించే కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, నల్లగొండ, మెదక్‌ తదితర జిల్లాల్లో డ్రైపోర్ట్‌ లను ఏర్పాటుచేసి ధాన్యం కొనాలని  సూచించింది. దీనిద్వారా రవాణా ఖర్చులు తగ్గే వీలుందని పేర్కొన్నది. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి, లేక జానకంపేటలలో ఇన్లాండ్‌ కంటెయినర్‌ డిపో (ఐసీడీ) ఏర్పాటుచేయాలని సూచించింది. ప్రధానంగా ఫిలిప్పీన్స్‌, వియత్నాం, అమెరికా, బంగ్లాదేశ్‌, సింగపూర్‌ దేశాలకు రాష్ట్రం నుంచి ఎగుమతులు అధికంగా ఉన్నాయని తెలిపింది.

కువైట్లకు మార్కెట్ల తెలంగాణ సోనా బియ్యం

షుగర్ రోగుల కోసం తక్కువ గ్లూకోజ్ లెవల్స్ కలిగిన సోనా బియ్యాన్ని (డయాబెటిక్ వైట్ రైస్) తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉత్పత్తి చేసింది. ఈ బియ్యాన్ని మార్కెటింగ్ శాఖ కువైట్ దేశంలోని మార్కెట్లకు ఎగుమతి చేసింది. త్వరలోనే అమెరికా, బ్రిటర్, మిడిల్ ఈస్ట్ దేశాలకు కూడా ఎగుమతి చేయనుంది.

రాష్ట్రంలో పంటల దిగుబడి తీరు (లక్షల టన్నులు)

పంట                      2014-15                    2019-20

బియ్యం               45.45                         98.74

మొక్కజొన్న         23.08                         25.59

కంది                   1.09                           2.07

పెసర                  0.45                           0.48

మినుము             0.16                           0.18

సెనగ                  0.81                           1.89

పప్పు ధాన్యాలు      2.63                           4.67

నూనె గింజలు                6.29                           6.64

పత్తి                    35.83                         48.62

మద్దతు ధర కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్

  • ధాన్యం కొనుగోలు కోసం సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ కు 2020లో ప్రభుత్వం రూ. 20,000 కోట్ల రూపాయల గ్యారంటీ ఇచ్చింది.
  • కందులు, మక్కలు, పెసర్లు, నూనె గింజలు కొనుగోలు కోసం     మార్క్ ఫెడ్, హాకాకు 2,000 కోట్లు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం జరిగింది.
  • 2019-20 యాసంగి కొనుగోళ్లలో దేశంలోనే తెలంగాణ రికార్డు
  • రాష్ట్రంలో 39 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు.
  • మరో 10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు.
  • కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ తో మార్కెట్లు బంద్ చేశారు.
  • దీంతో ప్రభుత్వం గ్రామాల్లోనే రైతుల నుంచి కొనుగోళ్లు జరుపుతున్నది.
  • ఇందుకోసం ప్రభుత్వం రూ 25,000 కోట్లు నిధులను విడుదల చేసింది.
  • (మొదట 6695 + తర్వాత 330 = 7025) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
  • ఇందులో 2301 కేంద్రాలు ఐకేపీ గ్రూపులవి, 4088 కేంద్రాలు పీఏసీఎస్ లవి, మిగతా కేంద్రాలు ఇతరులవి ఉన్నాయి.
  • పంట అమ్మిన డబ్బుల్ని నెలరోజుల్లో రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తున్నారు.
  • భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలోని రైతులు పండించిన మొత్తం పంటను కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన రాష్ట్రం తెలంగాణ మాత్రమే..
  • ( భారతదేశంలోనే ఇది 2020 ఏప్రిల్ వరకు రికార్డు)

అధిక దిగుబడికి గల కారణాలు

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో దిగుబడి రావడం ఓ రికార్డు. అనుకూలమైన వాతావరణంతోపాటు కొత్త ఆయకట్టు అందుబాటులోకి రావడం, సకాలంలో వర్షాలు పడడం ఓ కారణం. గతంలో వరి పొలంలో నిత్యం పూర్తిస్థాయిలో నీరు ఉండేది. దీంతో వరి ఉత్పాదకత తక్కువగా ఉండేది. ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తుండడంతో రైతులు ఒకేసారి నీటితో వరి పొలాన్ని నింపకుండా, అప్పుడప్పుడు తెరిపినిస్తూ నీళ్లు పెడుతుండడం వల్ల వరికి పూర్తిస్థాయిలో ఆక్సిజన్ అందింది. దీని ఫలితంగా వరి దిగుబడి ఎక్కువగా జరిగింది. అధిక దిగుబడినిచ్చే కొత్త వరి వంగడాలను రాయితీపై రైతులకు అందించారు. అలాగే స్వల్పకాలిక, నాణ్యమైన వరి విత్తనాలను రైతులకు అందించారు. ప్రభుత్వం  రైతులకు అందిస్తున్న రాయితీలతో  వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగింది. యంత్రాల వాడకం కూడా అధిక దిగుబడులకు కారణమే.

అధికంగా కనీస మద్ధతు ధర చెల్లించిన ప్రభుత్వం

ఉమ్మడి రాష్ట్రంలో 2010-11 సంవత్సరంలో రూ.1,936 కోట్లతో, 2012-13 లో రూ.1,773 కోట్లతో, 2013-14 లో రూ.3,678 కోట్లతో అప్పటి ప్రభుత్వం రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక తొలి ఏడాది రూ.3,390 కోట్లతో, 2015-16లో రూ.3,397 కోట్లతో,2016-17లో రూ.8,083 కోట్లతో కనీస మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకుంది.

మిర్చి పంటకు గరిష్ట మద్ధతు ధర : ఖమ్మం మార్కెట్లో 2020 జనవరిలో తేజారకం మిర్చి పంటకు గరిష్టస్థాయిలో క్వింటాలుకు రూ.21,300 ధర పలికింది.

మార్క్ ఫెడ్ కు రూ.850 కోట్ల రుణ అనుమతులు

2018-19 వానకాలంలో మొక్కజొన్న, జొన్న తదితర పంటలకు మద్దతు ధర కల్పించేందుకు రూ. 850 కోట్ల రుణం తీసుకునేందుకు మార్క్‌ ఫెడ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు 25 సెప్టెంబర్, 2018న ఉత్తర్వులు జారీచేసింది. ఆ రుణానికి  బ్యాంకు గ్యారంటీని కూడా ప్రభుత్వమే ఇచ్చింది. ఏదైనా జాతీయ బ్యాంకు లేదా జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) లేదా ప్రభుత్వ ఆర్థిక సంస్థల వద్ద ఈ రుణం తీసుకొనేందుకు వీలు కల్పించింది.

ఖమ్మం మార్కెట్లో 2020 జనవరిలో తేజారకం మిర్చి పంటకు గరిష్టస్థాయిలో క్వింటాలుకు రూ.21,300 ధర పలికింది.

  • రాష్ట్రంలోని 50 మొక్కజొన్న కొనుగోలు సెంటర్లలో మార్క్ ఫెడ్ ద్వారా 6911 టన్నులు కొనుగోలు చేశారు. అయితే, కనీస మద్దతు ధర (క్వింటాల్ కు రూ.1760) కంటే మార్కెట్లో మొక్కజొన్నలకు ఎక్కువ ధర ఉంది.

ధరల స్థిరీకరణకు తీసుకున్న చర్యలు

  • మార్కెట్ లో ధరలలో హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు రైతులు, వినియోగదారుల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టి అమలు చేస్తున్నది. ధరలను స్థిరీకరించేందుకు తీసుకున్న చర్యలతో ఉల్లి, టమాట రైతులను ప్రభుత్వం సంక్షోభం నుంచి గట్టెక్కించ గలిగింది.
  • 2015లో, దేశ వ్యాప్తంగా టోకుగా (హోల్ సేల్) మార్కెట్లో కిలోకి ఉల్లిగడ్డల ధర రూ. 60 నుండి రూ.80 వరకు ఉండగా, వినియోగదారుల కోసం ప్రభుత్వం కేజీ రూ. 20/- చొప్పున, ఒక కుటుంబానికి రెండు కిలోల చొప్పున సబ్సిడీపై 89 ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా సరఫరా చేసింది.  52,681 క్వింటాళ్ళను రూ. 24 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రజలకు సరఫరా చేసింది.
  • 2016లో మార్కెట్లలో ఉల్లి ధర కనిష్ట స్థాయికి పడిపోగా ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఉల్లిగడ్డను కిలో రూ.8 లకు కొనుగోలు చేయగా, టమాట రూ.5 చొప్పున కొన్నారు.
  • రైతుపై అదనపుభారం పడకుండా నేరుగా రైతుల పొలం వద్దకే మార్కెటింగ్ అధికారులు వెళ్లి ఉల్లిగడ్డలు, టమాటాలను కొనుగోలు చేశారు.
  • 2 సెప్టెంబర్, 2016 నుండి నవంబరు 24 తేదీ వరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రూ.8/- కేజీ చొప్పున ఉల్లిని కొనుగోలు చేసింది.దాదాపు రూ. 2,11,447/- క్వింటాళ్ళ ఉల్లిని రూ.19.18 కోట్లతో 3, 225 రైతుల నుండి సేకరించి, ఆదుకుంది.
  • వ్యవసాయ మార్కెటింగ్ శాఖ,  రూ. 5/- కేజీ చొప్పున 68 వేల క్వింటాళ్ళ టమాటను కొనుగోలు చేసి ఆదుకుంది.
  • 2019 నవంబర్ లో దేశవ్యాప్తంగా తీవ్ర ఉల్లి కొరత ఏర్పడింది. కిలో ఉల్లి రేటు ప్రధాన నగరాల్లో అమాంతంగా రూ. 150, రూ. 200 కు చేరింది. ఉల్లిగడ్డల ధరలను నియంత్రించేందుకు, సబ్సిడీపై ఉల్లిగడ్డలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం, మార్కెటింగ్‌ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భారత ప్రభుత్వం ఉల్లిగడ్డల కొరత నేపథ్యంలో కొరతను తగ్గించేందుకు ఈజిప్ట్‌ నుండి ఉల్లిగడ్డలను దిగుమతి చేసుకుని రాష్ర్టాలకు సరఫరా చేస్తోంది. ఈ క్రమంలో ఈజిప్ట్‌ నుండి వచ్చిన ఉల్లిగడ్డల్లో తెలంగాణ రాష్ర్టానికి 30 టన్నులు వచ్చాయి. ఈ ఉల్లిగడ్డలను రైతుబజార్లలోని సబ్సీడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఉల్లిగడ్డలను తొలుత హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లోని 11 రైతుబజార్లలో ఏర్పాటు చేసిన సబ్సిడీ కేంద్రాల ద్వారా కిలో రూ. 40కి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లిగడ్డలు హోల్‌సేల్‌లో రూ. 80 నుండి రూ.90 ధర పలుకుతోంది. రిటైల్‌ మార్కెట్లో రూ. 120 ధర పలుకుతోంది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఉల్లి విక్రయాలను పర్యవేక్షించేందుకు అధికారులతో టీంను ఏర్పాటుచేశారు.
  • రైతులు పరస్పరం చర్చించుకోవడానికి ప్రభుత్వం రైతు వేదికలు నిర్మిస్తున్నది. ప్రతీ ఐదువేల ఎకరాలకు ఒక క్లస్టర్ గా విభజించి, ప్రతీ క్లస్టర్ లో ఒక వేదిక నిర్మిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,604 వ్యవసాయ విస్తరణాధికారుల క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.350 కోట్లు విడుదల చేసింది. ఒక్కో వేదికను రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించనున్నారు. మొదటగా ఎర్రవల్లి, మర్కూక్‌ గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ 29 మే, 2020న శంకుస్థాపన చేశారు. ఈ రెండు రైతు వేదికలను సీఎం కేసీఆర్‌ తన సొంత ఖర్చులతో నిర్మించనున్నారు. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు రైతు వేదికలకు భూమిపూజ చేశారు. రైతులు, వ్యవసాయాధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులు, శాస్త్రవేత్తలు సమావేశమయ్యేలా ఇవి ఉపయోగపడనున్నాయి. గ్రామంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చే దాతల ద్వారా స్థల సేకరణ చేయాలన్న సీఎం కేసీఆర్ పిలుపునకు పలువురు దాతలు స్పందించి ఎకరం చొప్పున స్థలాలను విరాళంగా ఇచ్చారు. అలా లభించని చోట్ల ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని కలెక్టర్లకు సీఎం కేసీఆర్ సూచించారు.రైతులకు శిక్షణనిచ్చేందుకు, పథకాలపై అవగాహన కల్పించేందుకు మైకులు, కుర్చీలు, ఇతర మౌలిక సదుపాయాలు ఉండేలా రైతు వేదికలను తీర్చిదిద్దుతారు.
  • రికార్డు స్థాయిలో కొత్త గోదాముల నిర్మాణం

పంటలకు గిట్టుబాటు ధర వచ్చేవరకు రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణాలను చేపట్టింది. తెలంగాణ వచ్చే నాటికి కేవలం 4.17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 176 గోదాములు మాత్రమే ఉండేవి. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నిర్వహించిన సర్వేలో, తెలంగాణ వ్యాప్తంగా 29.47 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్ధ్యం కలిగిన గోదాముల అవసరం వుందని నిర్ధారించారు. దీనికనుగుణంగా కొత్తగా 1024 .50 కోట్ల వ్యయంతో 364 ప్రదేశాల్లో 18.30 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన గోడౌన్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇప్పుడు మొత్తం గోదాముల సంఖ్య 540 కు చేరుకుంది. 22.47 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు అందుబాటులోకి వచ్చాయి.

పెరిగిన సాగు.. దిగుబడి

రాష్ట్రం ఏర్పడిన నాటితో పోల్చితే ప్రస్తుతం తెలంగాణలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. ఇందుకు అనుగుణంగానే పంటల దిగుబడులు కూడా పెద్ద ఎత్తున పెరిగాయి. వరి పంట 2014-15లో 34.96 లక్షల ఎకరాల్లో సాగు కాగా, 2019-20లో ఏకంగా 79.58 లక్షల ఎకరాల్లో సాగైంది. ధాన్యం ఉత్పత్తి 2014-15లో 24.25 లక్షల టన్నులు కాగా, 2019-20లో ఏకంగా 1.12 కోట్ల టన్నులకు పెరిగింది. మక్కజొన్నలు 2014-15లో 17.10 లక్షల ఎకరాల్లో సాగు కాగా, 2019-20లో 15.92 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి 2014-15లో 41.83 లక్షల ఎకరాల్లో సాగు కాగా, 2019-20లో 52.56 లక్షల ఎకరాల్లో సాగు కావడం గమనార్హం. ఇలా సాగు విస్తీర్ణంతో పాటు ఉత్పత్తి కూడా పెరిగింది. దీంతో పంట నిల్వలకు గోడౌన్ల సామర్థ్యం సరిపోవడం లేదు.

తెలంగాణ కోటి టన్నుల గోదాంలు

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో 63.13 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం గల  1,493 గోడౌన్లు ఉన్నాయి. మరో 40 లక్షల టన్నుల సామర్థ్యం గల గోడౌన్లు అవసరమని మార్కెటింగ్‌శాఖ అంచనా వేసింది. వీటి నిర్మాణానికి చర్యలు ప్రారంభించింది.

నిర్మాణంలో 10 లక్షల టన్నుల సామర్థ్యం గోడౌన్లు

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల టన్నుల సామర్థ్యం గల గోడౌన్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో 2.42 లక్షల టన్నుల సామర్థ్యం, ప్రైవేటు ఆధ్వర్యంలో 4.50 లక్షల టన్నుల సామర్థ్యం, మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో సుమారు 3 లక్షల టన్నుల సామర్థ్యం గల గోడౌన్ల నిర్మాణం జరుగుతున్నది.

మార్కెట్లు

2013-14             :  150 వ్యవసాయ మార్కెట్లు

2021         :  192 వ్యవసాయ మార్కెట్లు

(పెరుగుదల 42, పెరిగిన శాతం 28)

గోదాములు

2013-14             : 176 గోదాములు (4.17 టన్నులు)

2021         : 710 గోదాములు (24.73 టన్నులు)

(పెరుగుదల 534, పెరిగిన శాతం 303)

గోదాముల నిల్వ సామర్థ్యం

2013-14             : 4.17 లక్షల టన్నులు

2021         : 24.73 లక్షల టన్నులు

(పెరుగుదల 20.56 లక్షల టన్నులు, పెరిగిన శాతం 493)

కోల్డ్ స్టోరేజ్ లింకేజ్ : వ్యవసాయ ఉత్పత్తులు పాడైపోకుండా ఎక్కువ కాలం నిల్వ చేసుకోవడానికి వీలుగా రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్ స్టోరేజ్ లింకేజి ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెటింగ్ శాఖ చేపడుతున్న విస్తరణ అభివృద్ధి కార్యక్రమాల కోసం 2018-19 బడ్జెట్లో రూ.132 కోట్లు ప్రతిపాదించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 290 కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో ఉన్నాయి. 

గోదాముల్లో ఈ-వేయింగ్ మిషన్లు : రేషన్‌డీలర్లకు కచ్చితమైన తూకంతో నిత్యావసర సరుకులు అందించాలనే ఉద్దేశంతో పౌరసరఫరాల సంస్థకు చెందిన  గోదాముల్లో ఎలక్ట్రానిక్ తూకం యంత్రాల(ఈ-వేయింగ్‌ మిషన్) ను పౌరసరఫరాలశాఖ 15 ఏప్రిల్, 2019 నుంచి అందుబాటులోకి తెచ్చింది. వీటిని పౌరసరఫరాల భవన్‌లోని కమాండ్ కంట్రోల్‌సెంటర్‌కు, జిల్లాల్లోని మినీ కమాండ్ కంట్రోల్‌ సెంటర్లకు అనుసంధానం చేస్తారు. దీనిద్వారా వేయింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా చూడటానికి అధికారులకు వీలవుతుంది.  ఈ వేయింగ్ మిషన్ల ద్వారా పనిభారాన్ని తగ్గించటంతో పాటు తూకంలో ఖచ్చితత్వాన్ని పాటించవచ్చు.

  • రాష్ట్రవ్యాప్తంగా ఈ-నామ్ అమలు

ఈ నామ్ విధానంలో సంస్కరణల్లో మార్కెట్లలో లైసెన్సింగ్ విధానం, మోడల్ యాక్ట్, నిబంధనలు, లావాదేవీలపై వ్యాపారులకు, అధికారులకు శిక్షణనిచ్చి అమలు చేస్తారు. రాష్ట్రంలోని గోదాములు, కోల్డ్ స్టోరేజీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను మార్కెట్లుగా ఏర్పాటు చేసి, వాటి ద్వారా ఈ నామ్ అమలు చేస్తే, రైతులకు మరింత లాభం చేకూర్చేందుకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ప్రయత్నిస్తోంది. జాతీయ వ్యవసాయ విధానం (ఈ-నామ్) అమలులో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో 189 మార్కెట్లు ఉండగా,  47 మార్కెట్లలో ఈ-నామ్ అమలవుతోంది.  మిగిలిన అన్ని వ్యవసాయ మార్కెట్లలో దశలవారీగా దీన్ని అమలు చేస్తారు.  ఈ-నామ్ విధానంలో డిసెంబర్ 2019 వరకు 18 లక్షల మందికి పైగా రైతుల నుంచి, 31.46 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తుల క్రయ, విక్రయాలు జరిగాయి. రూ.9,476 కోట్ల వ్యాపారం జరిగింది.

  • స్పెషలైజ్డ్ మార్కెట్ల ఏర్పాటు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్పెషలైజ్డ్ మార్కెట్లను ప్రభుత్వం నిర్మించింది. నల్లగొండ పక్కనే ఉన్న గంధంవారి గూడెం కాలనీలో 12 ఎకరాల విస్తీర్ణంలో రూ. 2 కోట్ల రూపాయలతో మార్కెట్‌ను శరవేగంగా పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలోనే బత్తాయి పంటలు సాగవుతుండడంతో.. జిల్లావ్యాప్తంగా రెండు లక్షల మంది రైతులు ఈ పంటపై ఆధారపడుతున్నారు. 3 లక్షల ఎకరాల్లో బత్తాయి సాగు చేస్తున్నారు. ప్రతీ ఏడాది రూ.2వేల కోట్ల పైగా బత్తాయి వ్యాపారం జరుగుతుంది. పండించిన బత్తాయి పంటను ఢిల్లీ, మహారాష్ట్ర, ముంబై, కోలకత్తా, మద్రాస్, రాజస్థాన్‌ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు.

నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బత్తాయి మార్కెట్ కు.. రైతులు తమ పంటను తీసుకుచ్చి స్వేఛ్చగా, ధైర్యంగా అమ్మకుంటున్నారు. దళారుల బెడద లేదు. సిండికెట్ దందాలు లేవు. కమీషన్ రూపంలో వేధించే ఏజెంట్లు లేరు. అంతా ఆన్ లైన్ లో లావాదేవీలు జరుగుతున్నాయి. నకిరేకల్ లో ఏర్పాటు చేసిన నిమ్మ మార్కెట్ (రాష్ట్రంలో తొలి నిమ్మ మార్కెట్) ను, ప్రాధమిక వ్యవసాయ భవనం గోదామును మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. పి.ఏ.పల్లి మండలం కొనమేకలవారిగూడెం దగ్గర రూ. 60.30 లక్షలతో  ప్రభుత్వం దొండ మార్కెట్ ను ఏర్పాటు చేస్తున్నది. మామిడి మార్కెట్ ను కొల్లాపూర్ లో నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నారు.

  • రైతులకు వడ్డీలేని రుణం

ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల భారీ నుండి రైతులను రక్షించాలనే ఉద్దేశంతో కేవలం పావలా వడ్డీకే తెలంగాణ ప్రభుత్వం రైతులకు పంట రుణాలను అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నది.  పంట రుణం సకాలంలో (12 మాసాలలో) చెల్లించినట్లయితే రూ.1 లక్ష  వరకు పంట రుణ వడ్డీని వడ్డీ లేని రుణాల పథకం క్రింద అమలు చేస్తున్నారు. రూ.1 లక్ష నుండి రూ.3 లక్షల వరకు పావలా వడ్డీ ని తీసుకుంటున్నారు. తెలంగాణ ఏర్పడిన నాలుగేండ్లలో 40 లక్షల మంది రైతులు రూ.467 కోట్ల రుణాన్ని పొందారు. 

రైతులకు వడ్డీలేని రుణ బకాయిల చెల్లింపు : రైతులకు వడ్డీలేని రుణాలకు సంబంధించిన బకాయిల చెల్లింపునకు రూ. 256 కోట్లను విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం 5 జూలై 2019న ఉత్తర్వులు జారీ చేసింది. గత రెండున్నరేళ్లుగా ఈ బకాయిలు పెండింగులో ఉన్నాయి. వీటిని బ్యాంకులకు చెల్లించేందుకు అదనపు నిధులు అవసరం కాగా వ్యవసాయ శాఖ వినతి మేరకు బడ్జెట్‌ ఆంక్షలను సడలించి ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.

  • రైతుబంధు రుణ పరిమితి 1 లక్ష నుంచి 2 లక్షలకు పెంపు

రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించనప్పుడు, తమ పంటను తక్కువ ధరకు అమ్ముకొని నష్ట పోకుండా వ్యవసాయ మార్కెట్ కమిటీల గోదాముల్లో నిల్వవుంచి ఆ పంట విలువ మీద 75 శాతం వరకు రుణంగా పొందే సౌకర్యం, రైతుబంధు పథకం ద్వారా కల్పించింది. ఈ పథకం  కింద రుణ సదుపాయాన్ని రూ. 1 లక్ష నుంచి 2 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం జీ.ఓ. నం 5 ను 2014 జులై 7 న జారీ చేసింది. 180 రోజుల వరకు వడ్డీ లేకుండా రైతులు ఈ సౌకర్యాన్ని పొందుతున్నారు. 180 రోజు నుండి 270వ రోజు వరకు 12 శాతం (రూపాయి) వడ్డీని వేస్తున్నారు. రైతులకు జారీ చేసిన కార్డుల్లో 3 ఏళ్ల పరిమితిని 5 ఏళ్లకు పెంచారు. తనఖా విధానానికి మినహాయింపు ఇచ్చింది.

రాష్ట్రం ఏర్పడిన నాలుగేండ్లలోనే 5,341 మంది లబ్ధిదారులకు రూ.64.80 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చారు. గతంలో రైతు సరుకు విలువలో 75శాతం లేదా గరిష్టంగా రూ.లక్ష  వరకు 3 శాతం వడ్ఢీ చొప్పున రుణం అందించే వారు. 90 రోజుల వరకు మాత్రమే వడ్డీ లేని రుణం ఇచ్చేవారు. 91 రోజునుండి 180వ రోజు వరకు నామ మాత్రపు వడ్డీ వసూలు చేసేవారు. జారీ చేసినకార్డు 3 ఏళ్లు చెల్లుబాటు అయ్యేది. భూమి తనఖా విధానం కూడా వుండేది.

  • మార్కెట్లలో హమాలీల కూలీ రేట్లు పెంపు

తెలంగాణ ఏర్పడక ముందు పౌర సరఫరాల శాఖలో పని చేస్తున్న హమాలీలకు క్వింటాలుకు రూ.8 కూలీ ఉండగా.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత దాన్ని రూ.12లకు పెంచారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నం. 26 ప్రకారం రెండేళ్లకోసారి రేట్లు పెంచాలని నిర్ణయించింది. 2016లో దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో రూ.15, పట్టణ ప్రాంతాల్లోని గోదాముల్లో రూ.15.50కు పెంచారు. వాస్తవానికి రూ.1.23 పైసలు పెంచాల్సి ఉండగా రూ.3 పెంచారు. ఈ క్రమంలో మళ్లీ 1 సెప్టెంబర్, 2018 నుంచి వీరి కూలీ రేట్లను పెంచిన ప్రభుత్వం 24 ఆగస్టు, 2018న ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన చార్జీలతో గ్రామీణ ప్రాంతాల్లో క్వింటాలుకు రూ.18, పట్టణ ప్రాంతాల్లో రూ.18.50 హమాలీలకు అందుతుంది.  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో క్వింటాల్‌కు రూ.15.50 ఉన్న హమాలీ చార్జీలను రూ. 18.50కి, ఇతరజిల్లాల్లో రూ.15 నుంచి రూ.18కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దసరా బోనస్‌ను రూ.4వేల నుంచి 4,500కు, పండుగ నాడు స్వీట్ల కోసం ఇచ్చే మొత్తాన్ని రూ. 500 నుంచి 700కు, రెండు జతల దుస్తుల టైలర్ చార్జీల కోసం ఇచ్చే డబ్బులని రూ.500 నుంచి 700లకు, హమాలీలకు రెండు జతల దుస్తులకు సంబంధించిన కుట్టుకూలీని ప్రభుత్వం రూ.500 నుంచి 600లకు పెంచారు. చనిపోయిన కార్మికుని దహన సంస్కారాలకు ఇచ్చే మొత్తాన్ని రూ.10వేల నుంచి రూ.20 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

స్వీపర్ల జీతాలు పెంపు : పౌరసరఫరాల శాఖలోని 170 మండల గోడౌన్లలో స్వీపర్లుగా పనిచేస్తున్న 200 మంది మహిళల జీతాలను ప్రభుత్వం 1 ఫిబ్రవరి, 2019 నుంచి నెలకు రూ.750 పెంచింది. దీంతో ప్రభుత్వానికి ఏటా రూ.18 లక్షల అదనపు భారం పడింది.

మార్కెట్ యార్డులలో హరితహారం: హరితహారంలో ప్రతిఏటా మార్కెట్లలో మొక్కలు నాటు తున్నారు. రాష్ట్రంలోని 180 మార్కెట్ యార్డుల్లో, తొలి విడత (2015-16) హరితహారంలో 4.5 లక్షల మొక్కలు నాటగా, 2వ విడతలో 8.89 లక్షల మొక్కలు నాటారు.

  • మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు

దేశంలో మరెక్కడా లేనివిధంగా, చరిత్రలో మొదటిసారిగా తెలంగాణలోని 180 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను రిజర్వేషన్ల ద్వారా భర్తీ చేస్తున్నారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా వర్గాల్లోని రైతులు మార్కెట్ చైర్మన్లు అయ్యే అవకాశం దక్కింది. బీసీలకు 50(29శాతం), షెడ్యూల్డ్ ఏరియా (11), ఓసి(84), ఎస్సీలకు 25 (15శాతం), ఎస్టీలకు 10 (6శాతం) మార్కెట్ చైర్మన్ పదవులు దక్కాయి. 33 శాతం రిజర్వేషన్ వల్ల 60 మంది మహిళలు మార్కెట్లకు  చైర్ పర్సన్లు అయ్యారు.

  • మార్కెట్ కమిటీ చైర్మన్ల గౌరవ వేతనం పెంపు

మార్కెట్ కమిటీ చైర్మన్ల గౌరవ వేతనం పెంచుతూ ప్రభుత్వం తేదీ. 21 అక్టోబర్, 2017న ఉత్తర్వులు జారీ చేసింది. సెలక్షన్ గ్రేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్లకు నెలకు రూ.25 వేలు, స్పెషల్ గ్రేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ల గౌరవ వేతనం రూ.20 వేలు, మిగతా మార్కెట్ కమిటీ చైర్మన్ల వేతనం రూ.15వేలు చొప్పున పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. సమావేశాల్లో చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, కమిటీ సభ్యులకు సిట్టింగ్‌ ఫీజు వెయ్యికి మించకుండా ఇస్తున్నారు.

  • మార్కెట్లలో రోజువారీ వివరాలు, సమస్యలపై కాల్ సెంటర్
  • రోజువారీ మార్కెట్ల స్ధితిగతులు, పంటల రాక, వాటి ధరలను తెలుసుకొని ఆదేశాలు ఇచ్చేందుకు మార్కెటింగ్ శాఖ వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసుకుని సమీక్షిస్తున్నది.
  • మద్దతు ధర అమలు, వారి సాధక బాధకాల విషయమై రైతులు చెప్పుకోవడానికి, వాటిని పరిష్కరించుటకు “డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్” కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా  ఫిర్యాదుల కేంద్రం “1800 599  4199” ఏర్పాటు చేశారు.
  • విత్తన భాండాగారంగా తెలంగాణ

ప్రపంచంలోనే విత్తనాభివృద్ధికి అనువైన అత్యుత్తమ నేలలున్న తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికమైన విత్తన భాండాగారం (సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా)గా మారనున్నది. వృక్ష సంరక్షణశాలలు (పాలీహౌజ్‌లు), సూక్ష్మసాగు ద్వారా రాష్ట్రంలోని రైతులకు అన్నివిధాలా లబ్ధి చేకూరనున్నది. 1,300 ఎకరాల్లో 3 సంస్థల నిర్మాణం జరుగుతోంది. వీటిలో  ఫల, వ్యవసాయ, అటవీ పరిశోధనలు జరుగుతాయి.  ఉమ్మడి రాష్ట్రంలోనే పాలీహౌస్‌కు సబ్సిడీ అమలు చేసినప్పటికీ హైదరాబాద్ పరిసరాల్లో కొందరికే పరిమితమైంది. ఉమ్మడి రాష్ట్రంలో 50 శాతం రాయితీతో ప్రతీ రైతుకు గరిష్ఠంగా ఎకరానికే పాలీహౌస్ పథకాన్ని అమలుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ పథకంపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాయితీని 75 శాతానికి పెంచి మూడెకరాల వరకు వర్తింపజేశారు. మిగతా 25 శాతం బ్యాంకు రుణాలు ద్వారా పొందే అవకాశాన్ని కల్పించారు.  సొంత భూమి కలిగిన రైతుకు నీరు, విద్యుత్ సౌకర్యం ఉంటే ఈ పథకాన్నిమంజూరుచేస్తున్నారు.2014-15  బడ్జెట్‌లో రూ.250 కోట్లు కేటాయించి హైదరాబాద్‌కు చుట్టుపక్కల 100 కిలోమీటర్ల పరిధిలో ఈ పథకాన్ని అమలుచేశారు. నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో రైతులకు నిధులు మంజూరు చేశారు. తొలి ఏడాది రూ.30 కోట్లు ఖర్చుచేసి 115 ఎకరాలకు పాలీహౌస్ యూనిట్లు మంజూరు చేశారు. 2015-16 బడ్జెట్‌లో రూ.250 కోట్లు మంజూరు చేయగా..100 కిలోమీటర్ల పరిధిని తొలగించా రు. రూ.87 కోట్లు ఖర్చు చేసి 450 ఎకరాల్లో అమలుచేశారు. 2016-17 బడ్జెట్‌లోనూ రూ.200 కోట్లు కేటాయించి సుమారు వెయ్యి ఎకరాల్లో పాలీహౌస్ అమలుచేయాలని భావిస్తున్నారు. 2018-19 బడ్జెట్ లో రూ.120 కోట్లు కేటాయించారు. ఇప్పటికీ దేశంలోని ఇతర రాష్ర్టాల్లో 50 శాతానికి మించి ఇవ్వడంలేదు.

విత్తన నిల్వల కోసం రూ.25 కోట్లతో కోల్డ్ స్టోరేజీ

రైతులకు అవసరమైన మేలురకం విత్తన తయారీని తెలంగాణ విశ్వవిద్యాలయం, సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చేపట్టాయి. ఈ విత్తనాలను నిల్వ ఉంచడానికి ప్రభుత్వం  రూ.25 కోట్లతో కోల్డ్ స్టోరేజీ నిర్మిస్తున్నది.

  • బీటీ పత్తి విత్తనోత్పత్తిలో తెలంగాణ రికార్డు – 07.05.2020

అత్యంత అనువైన వాతావరణం కలిగి, నాణ్యమైన విత్తనాల ఉత్పత్తికి కేంద్రంగా, దేశ విత్తనభాండాగారంగా తెలంగాణ నిలుస్తున్నది. దేశానికి కావాల్సిన విత్తన అవసరాల్లో సగానికి పైగా విత్తనాలను రాష్ట్రం నుంచే సమకూరుతున్నాయి. తెలంగాణ బీటీ పత్తి విత్తనోత్పత్తిలోనూ రికార్డు సృష్టిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆధునిక సాంకేతిక ‘ బీటీ’ టెక్నాలజీని ఉపయోగించి రికార్డుస్థాయిలో హైబ్రీడ్‌ పత్తి విత్తనాలు ఉత్పత్తిచేసి దేశానికి అందిస్తున్నది. దేశంలో 5.80 కోట్ల ప్యాకెట్ల బీటీ పత్తి విత్తనాలు ఉత్పత్తి కాగా, ఒక్క తెలంగాణలోనే 2 కోట్ల 21 లక్షల 42 వేల ప్యాకెట్ల విత్తనాలు ఉత్పత్తయ్యాయి. వీటిద్వారా రాష్ట్ర రైతులకు రూ.1616 కోట్ల ఆదాయం వస్తున్నది.

  • సోయాబీన్, జీలుగ విత్తనాల ధరలు, సబ్సిడీ ఖరారు 

సోయాబీన్‌,  జీలుగ విత్తనాల అమ్మకం ధరలు.. సబ్సిడీని ప్రభుత్వం నిర్ణయించింది.  క్వింటా సోయాబీన్‌ బహిరంగ మార్కెట్లో వాస్తవ ధర రూ  3,944 మాత్రమే ఉండగా రాష్ట్ర ప్రభుత్వం 40శాతం అదనంగా రూ.2,701 చెల్లిస్తుంది. దీంతో రైతుకు  మొత్తం కలిపి క్వింటాకు రూ.6,645 ధర లభిస్తుంది.  సోయాకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీ కూడా క్వింటాలుకు రూ.3710 మాత్రమే ఉన్నది. అలాగే, జీలుగ విత్తనాలకు వాస్తవ ధరరూ.3,507 మాత్రమే ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం 65శాతం అదనంగా రూ.1,888  చెల్లిస్తుంది. జనుము ధర మార్కెట్లో రూ.4,290 ఉండగా, అదనంగా ప్రభుత్వం రూ.2,310 చొప్పున, పిల్లి పెసరకు మార్కెట్లో రూ.5,850 మాత్రమే ఉండగా రాష్ట్ర ప్రభుత్వం 65శాతం అదనంగా రూ.3,150 చొప్పున చెల్లించనున్నది. ఈ మేరకు వ్యవసాయశాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి తేదీ.22 ఏప్రిల్ 2020న ఉత్తర్వులు జారీ చేశారు.

  • నీటి తీరువా పన్ను విధానం రద్దు

తెలంగాణ ఏర్పాటవక ముందు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రోడ్డు పన్ను లాగానే..  వ్యవసాయానికి నీటిని వాడుకునే రైతుల నుంచి నీటి తీరువా పన్నులు వసూలు చేసేవి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పన్ను బకాయిలతో పాటు, పన్ను విధానాన్ని శాశ్వతంగా రద్దు చేశారు. 2018 జూన్ 2 నాటికి రూ.800 కోట్ల నీటి తీరువా బకాయిలు రద్దయ్యాయి. ఇకపై రైతులకు సాగునీటిని ఉచితంగా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రైతులపై భారం పడకుండా ప్రాజెక్టులు, కాల్వల నిర్వహణ బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకోనున్నది.

  • తహశీల్దార్లకు సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు

రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు సులభతరం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సేల్ డీడ్ ను ప్రామాణీకరిస్తున్నారు. రైతులతోపాటు అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా ప్రతీ మండల రెవెన్యూ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 589 మండలాలున్నాయి. 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వాటిని యధావిధిగా కొనసాగిస్తారు. ఈ 141 సబ్ రిజిస్ట్రార్ల పరిధి వారి కార్యాలయమున్న మండలానికే పరిమితం అవుతుంది. మిగతా 443 చోట్ల తహశీల్దార్లకు సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగిస్తారు. తహశీల్దార్లు తామిచ్చిన ముందస్తు సమావేశపు తేదీలకు అనుగుణంగా శని, ఆదివారాలు, ఇతర సెలవులు మినహాయించి వారానికి ఐదు రోజులు ఉదయం పూట రిజిస్ట్రేషన్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో తహశీల్దార్లు హాజరుకాలేకపోతే, ఆ బాధ్యతలను డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగిస్తారు. దీంతో భూముల రిజిస్ట్రేషన్లు కాగానే, వెంటనే రెవెన్యూ రికార్డుల్లో కూడా కొన్నవారి పేరిట భూమి పేరు మార్పిడి జరుగుతుంది.

అవినీతి, నకిలీలు, ఇబ్బంది తొలగించడమే లక్ష్యం

తెలంగాణ ఏర్పాటకు ముందు అవసరార్ధం రైతులు భూములు అమ్ముకోవాలన్నా, వాటిని కొనుక్కోవాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందిపడేవారు. అదే సమయంలో కొందరు వ్యక్తులు నకిలీ పాస్ పుస్తకాలు, డాక్యుమెంట్లు సృష్టించి, వాటితో రుణాలు పొంది మోసాలు చేసేవాళ్లు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అక్రమాలకు తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంస్కరణలు తీసుకువచ్చింది. క్రయ విక్రయదారులు కలసి ఒక్కసారే  రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి, వారి భూముల లావాదేవీలను రిజిస్ట్రార్ సమక్షంలో పూర్తి చేసుకుంటారు. ఆ తర్వాత రెవెన్యూ అధికారులు భూమి కొన్నవారి పేరిట కొత్తపాస్ పుస్తకాన్ని వారి ఇంటికే కొరియర్ ద్వారా పంపుతారు. ఇలా దళారుల ప్రమేయం లేకుండా తమ పని ఒక్కరోజులో పూర్తి చేసి, అవినీతికి ఆస్కారం లేనివిధంగా రిజిస్ట్రేషన్ల విధానాన్ని అమలు పరుస్తారు. భూ రికార్డుల నిర్వహణలో నూటికి నూరుశాతం పారదర్శకంగా పనులు జరిగేలా ప్రతీ విషయాన్నిధరణి వెబ్ సైట్లో నమోదు చేస్తారు.

ప్రతిపాదిత నూతన రిజిస్ట్రేషన్ విధానం

అమ్మే వారు, కొనేవారు పరస్పర అంగీకారానికి వచ్చిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ ను అపాయింట్ మెంట్ టైమ్ అడగాలి.(పాస్ పోర్టులు, వాహన రిజిస్ట్రేషన్లలాగా టైమ్ స్లాట్)

భూమి అమ్మకం డాక్యుమెంటు తయారు చేయడానికి లైసెన్సుడు డాక్యుమెంటు రైటర్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఉంటారు. వారు ఫీజు తీసుకుని రాసిన కాగితాలను అనుమతిస్తారు.

  • అమ్మేవారు/కొనేవారు తామే స్వయంగా డాక్యుమెంటు రాసుకున్నా అనుమతిస్తారు. దీనికోసం ఫారాలు/టెంప్లేట్స్ అందుబాటులో ఉంచుతారు.
  • పుస్తకాలతో సబ్ రిజిస్ట్రార్ ముందు హాజరు కావాలి.
  • బయోమెట్రిక్ విధానం ద్వారా ఇద్దరి వేలిముద్రలు, ఫోటోలు, సంతకాలు తీసుకుంటారు.
  • ఎంత భూమి అమ్ముతున్నారో అంత భూమిని అమ్మేవారి పాస్ పుస్తకం నుంచి సబ్ రిజిస్ట్రార్ తొలగిస్తారు. వెంటనే కొన్న వారి పేరిట పాస్ పుస్తకంలో నమోదు చేస్తారు. సబ్ రిజిస్ట్రార్ ముద్ర వేసి, సంతకం చేస్తారు.
  • భూమిని కొత్తగా కొంటున్న వారయితే, కొత్త పాస్ పుస్తకం ఇస్తారు. అందులో కొన్న భూమి వివరాలు నమోదు చేస్తారు.
  • ఇద్దరి పాస్ పుస్తకాలను అదే రోజు అదే సమయంలో తహశీల్దార్ కు పంపుతారు.
  • సదరు భూమి యజమానిగా అమ్మిన వారి పేరు తొలగించి, కొన్న వారి పేరుపై మార్పిడి(మ్యుటేషన్)  చేస్తారు.
  • ఈ వివరాలను తహశీల్దార్  కార్యాలయంలోని భూమి రికార్డుల్లో నమోదు చేస్తారు.
  • తహశీల్దార్  కార్యాలయంలోని ఐటీ అధికారికి ఈ వివరాలు పంపాలి.  ఐటి అధికారి ఆ వివరాలను వెబ్ సైట్ లో ఎంటర్ చేస్తారు.
  • వెబ్ సైటులో నమోదైన వివరాలు కొన్న వారికి, అమ్మిన వారి ఫోనుకు (బ్యాంకు లావాదేవీల మాదిరిగా) వెంటనే ఎస్.ఎం.ఎస్. పోతుంది. 
  • పాస్ పుస్తకాలను ఇప్పటి మాదిరిగా ఆర్డీవోకు పంపాల్సిన అవసరం లేదు. పేరు మార్పిడి (మ్యుటేషన్) బాధ్యత, అధికారం పూర్తిగా తహశీల్దార్ దే.
  • పేరు మార్పిడి(మ్యుటేషన్) జరిగిన తర్వాత కార్యాలయ ముద్రవేసి, తహశీల్దార్  సంతకం చేస్తారు. ఆ పాస్ పుస్తకాలను అదే రోజు తిరిగి సబ్ రిజిస్ట్రార్ కు పంపుతారు.
  • తహశీల్దార్  నుంచి తనకు అందిన పాస్ పుస్తకాలను సబ్ రిజిస్ట్రార్ కొరియర్ ద్వారా అమ్మిన వారికి, కొన్న వారికి పంపుతారు. కొన్నవారికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్  పంపుతారు.
  • రైతులకిచ్చే పాసుపుస్తకంలో ఖాతా నంబరుతోపాటు పాస్ పుస్తకం యూనిక్ కోడ్, గ్రామం కోడ్, మండలం కోడ్, యజమాని ఆధార్ నంబరు ఉంటాయి.
  • గ్రామీణ విత్తనోత్పత్తి పథకం (సీడ్ విలేజ్ స్కీం)

గ్రామాల్లోని రైతులకు సబ్సిడీ విత్తనాలందించేందుకు ప్రభుత్వం గ్రామీణ విత్తనోత్పత్తి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఒక గ్రామంలో 25 మంది రైతులు యూనిట్‌గా ఏర్పడితే, వారికి రాయితీపై విత్తనాలను పంపిణీ చేస్తారు.  వారు పండించిన ధాన్యాన్ని విత్తనాల కోసం మళ్లీ రైతులకే విక్రయిస్తారు. దీంతో రైతులు విత్తన దుకాణాల వద్దకు వెళ్లకుండా, నేరుగా రైతుల వద్దే కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పథకం ద్వారా విత్తనాలు పొందిన రైతులు మూడేళ్లపాటు రైతులకు తిరిగి విత్తనాలు అమ్ముకునే వీలుంటుంది.

  • సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల ఏర్పాటు

ఉద్యాన రైతుల కోసం, ఆధునీకరణ పద్ధతుల ద్వారా ఉద్యాన పంటలు పండించేందుకు, అందుకనుగుణంగా నాణ్యమైన మొక్కలు సరఫరా చేసేందుకు ప్రభుత్వం రెండు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేసింది. వీటిలో ఒకదానిని 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.9 కోట్లతో జీడిమెట్లలో, రెండోదాన్ని రూ.11 కోట్లతో మెదక్ జిల్లా ములుగులో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో పాలీ హౌస్ రైతులకు నూతన పరిజ్ఞానం, సమగ్ర పోషక యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు, అధిక దిగుబడులు సాధించుటకు అవలంబించాల్సిన పద్ధతులపై శిక్షణనిస్తారు.

  • ఆయిల్ పామ్ ప్లాంట్ – సాగు

సాంప్రదాయ పంటల మార్పిడితో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుకు ప్రాధాన్యతనిస్తున్నది. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేటలో పామాయిల్ ప్లాంటు ప్రారంభమైంది.  రూ.82 కోట్ల వ్యయంతో గంటకు 60 టన్నుల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్లాంటు పనులు 18 ఏప్రిల్, 2016న ప్రారంభించి, కేవలం ఏడాదిలోనే నిర్మాణం పూర్తి చేశారు. 29 ఏప్రిల్, 2017 నుంచే ఉత్పత్తి ప్రారంభం అయింది. ఈ ప్లాంటుతో ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల రైతులకు మేలు జరుగుతుంది. ఆశ్వారావుపేట పామాయిల్‌ ప్లాంట్‌ ఆధునీకరణకు కొత్త మిషన్లు, బాయిలర్లు రూ. 30 కోట్లతో కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అలాగే, అశ్వరావుపేట, అప్పారావుపేట పామాయిల్ ప్లాంట్లకు కలిపి ఇప్పటివరకు రూ. 100 కోట్లు ఖర్చు చేశారు.

ఆయిల్ ఫామ్ సాగు : 23 జిల్లాల్లో  ఆయిల్‌పామ్‌ సాగుకు అనుకూలత ఉందని నిపుణులు చెప్పారు. మొత్తం 2.73 లక్షల ఎకరాలు ఆయిల్‌పామ్‌ సాగుకు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. ఆయిల్‌పామ్‌ సాగుచేస్తే ఎకరానికి రూ.20 వేలు సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయిల్‌పామ్‌ 4 ఏళ్లకు పంట వస్తుంది, అప్పటివరకు అంతర పంటలు వేసుకోవచ్చు.

  • మామిడి తోట రైతులకు హాట్ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు

రాష్ట్రంలో 4.17 లక్షల ఎకరాల్లో ఏడాదికి 4.80 లక్షల టన్నుల మామిడి దిగుబడి అవుతున్నది. అయినప్పటికీ  మామిడి విదేశాలకు ఎగుమతి చేసుకొని ఆర్ధికంగా లాభపడుదామనుకున్న మామిడి రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మామిడి కాయలపై టెంక పురుగు, లార్వా ఉంటున్నందున వాటిని విదేశాలకు అనుమతించడంలేదు. దీంతో మామిడి రైతులు పంటను విదేశాలకు ఎగుమతి చేసుకోలేక ఆర్థికంగా నష్టపోతున్నారు. మామిడి ఎగుమతులను పెంచాలని భావించిన ప్రభుత్వం.. రైతులకు హాట్ వాటర్ (వేడినీటి) ట్రీట్ మెంట్ ప్లాంట్లను సబ్సిడీతో అందించాలని నిర్ణయించింది. ఈ ప్లాంట్లలో కాయలను శుద్ధిచేస్తే టెంకపురుగు, లార్వాలు తొలగిపోతాయి. రైతులకు స్వచ్ఛమైన, నాణ్యమైన మామిడికాయలు లబిస్తాయి. తద్వారా విదేశాలకు ఎగుమతులు కూడా పెరుగుతాయి. ఈ ప్లాంట్ ఒక్కో యూనిట్ కు రూ.30 లక్షలు అవుతుంది. ఎస్సీ, ఎస్టీలకు 90%, మిగిలిన వారికి 50% నుంచి 75% వరకు సబ్సిడీతో ఈ ప్లాంట్లను అందివ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది.

  • ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు

రాష్ట్రంలోని 906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్ –ప్యాక్స్)కు ప్రభుత్వం  2020  ఫిబ్రవరి 15న ఎన్నికలు నిర్వహించింది.  రాష్ర్టంలోని 906 ప్యాక్స్ లో 18,42,412 మంది ఓటర్లు ఉన్నారు. వీరు 11,770 మంది సభ్యుల (డైరెక్టర్లు)ను ఎనుకున్నారు. ప్రతి సొసైటీలో దాదాపు 2,300 నుంచి 2,800 వరకు రైతులు ఓటర్లుగా ఉన్నారు. ప్రతి సొసైటీలో 13మంది సభ్యులను ఎన్నుకున్నారు. మహిళలకు ప్రతి సొసైటీలో రెండు స్థానాలు కేటాయించారు. ప్రతి సొసైటీలోని 13మంది సభ్యుల్లో ఎస్సీ-1, ఎస్సీ మహిళ-1, ఎస్టీ -1, బీసీ-2, ఓసీ -7, ఓసీ మహిళ-1 సీట్లు కేటాయించారు.

  • రాష్ట్రవ్యాప్తంగా పెగిరిన భూగర్భ జలమట్టం

రాష్ట్రంలో 2020 జనవరి నెలలో సాధారణం కంటే 14శాతం అధిక వర్షపాతం నమోదవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా సగటు భూగర్భ జలమట్టం పెరిగింది.  దీంతో సగటు భూగర్భ జలమట్టం 8.88 మీటర్లుగా ఉన్నదని భూగర్భ జలవనరులశాఖ 11 ఫిబ్రవరి 2020న నివేదిక విడుదల చేసింది.   12 జిల్లాల్లోని 222 మండలాల్లో  అధిక వర్షపాతం, 21 జిల్లాల్లోని  309 మండలాల్లో సాధారణ వర్షపాతం, మరో 58 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైనట్టు నివేదికలో వివరించింది. సూర్యాపేట జిల్లాలో సాధారణం కంటే 14 శాతం తక్కువ వర్షపాతం, వరంగల్‌ అర్బన్‌లో 43 శాతం అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 1,278 బోర్లను పరిశీలించిన అధికారులు.. 1,025 బావుల్లో నీటిమట్టాలు సమృద్ధిగా ఉన్నట్టు గుర్తించారు. మరో  253 బావుల్లో నీటిమట్టం  పడిపోయినట్టు తెలిపారు.   భూగర్భజల మట్టం వివరాలను జిల్లాలవారీగా పరిశీలిస్తే.. అత్యల్పంగా వనపర్తి జిల్లాలో 4.39 మీటర్లు, అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 18.88 మీటర్లుగా నమోదైనట్టు నివేదిక వెల్లడించింది.  జిల్లాలవారీగా 2019 జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో 0.13 మీటర్ల నుంచి 8.10 మీటర్ల మేర భూగర్భ జలమట్టాలు  పెరిగినట్టు పేర్కొంది.

  • బీటీ పత్తి విత్తనోత్పత్తిలో తెలంగాణ రికార్డు – 07.05.2020

అత్యంత అనువైన వాతావరణం కలిగి, నాణ్యమైన విత్తనాల ఉత్పత్తికి కేంద్రంగా, దేశ విత్తనభాండాగారంగా తెలంగాణ నిలుస్తున్నది. దేశానికి కావాల్సిన విత్తన అవసరాల్లో సగానికి పైగా విత్తనాలను రాష్ట్రం నుంచే సమకూరుతున్నాయి. తెలంగాణ బీటీ పత్తి విత్తనోత్పత్తిలోనూ రికార్డు సృష్టిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆధునిక సాంకేతిక ‘ బీటీ’ టెక్నాలజీని ఉపయోగించి రికార్డుస్థాయిలో హైబ్రీడ్‌ పత్తి విత్తనాలు ఉత్పత్తిచేసి దేశానికి అందిస్తున్నది. దేశంలో 5.80 కోట్ల ప్యాకెట్ల బీటీ పత్తి విత్తనాలు ఉత్పత్తి కాగా, ఒక్క తెలంగాణలోనే 2 కోట్ల 21 లక్షల 42 వేల ప్యాకెట్ల విత్తనాలు ఉత్పత్తయ్యాయి. వీటిద్వారా రాష్ట్ర రైతులకు రూ.1616 కోట్ల ఆదాయం వస్తున్నది.

  • తెలంగాణ బియ్యం.. దేశానికే అభయం

ఎఫ్.సీ.ఐ.ఛైర్మన్ ప్రసాద్ ప్రశంసలు (8 మే 2020)

 తెలంగాణ బియ్యం దేశానికే అభయాన్ని ఇస్తున్నాయని ఎఫ్.సి.ఐ.ఛైర్మన్ డివి ప్రసాద్ ప్రశంసించారు. తెలంగాణలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులతో వరిసాగు విస్తీర్ణం పెరిగిందని, దీంతో ఈ ఏడాదిలో ఎఫ్.సి.ఐ. దేశవ్యాప్తంగా 45 లక్షల టన్నుల బియ్యం సేకరిస్తే అందులో రికార్డుస్థాయిలో తెలంగాణ నుంచే 30 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించిందని ఆయన అన్నారు. ఏపీ నుంచి 10 లక్షల టన్నులు సేకరించగా, దేశంలోని మిగిలిన రాష్ర్టాల నుంచి 5 లక్షల టన్నులే సేకరించినట్లు పేర్కొన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఎఫ్.సి.ఐ తెలంగాణ రీజియన్ నుంచి తెలంగాణతోపాటు, కర్ణాటక, తమిళనాడు, కేరళ,జార్ఖండ్, పశ్చిమబెంగాల్ కు కూడా బియ్యాన్ని సరఫరా చేసిందన్నారు.

ఎఫ్.సి.ఐ నిండా తెలంగాణ ధాన్యమే  

తెలంగాణ చరిత్రలో మొదటిసారిగా భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) యాసంగి సీజన్‌కుగాను రికార్డుస్థాయిలో బియ్యాన్ని పౌరసరఫరాలశాఖ నుంచి సేకరించనున్నది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 45 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా, అందులో తెలంగాణ నుంచి 30 లక్షల టన్నులు, ఏపీ నుంచి 10 లక్షల టన్నులు సేకరించగా, దేశంలోని మిగిలిన రాష్ర్టాల నుంచి 5 లక్షల టన్నులే సేకరించింది.  సాధారణంగా రేషన్‌కార్డుపై నెలకు ఒక వ్యక్తికి ఆరుకిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసే తెలంగాణ ప్రభుత్వం గత నెలలో కరోనా నేపథ్యంలో పేదలకు 12 కిలోల చొప్పున ఉచితంగా పంపిణీచేసింది. దీనికితోడు ఇతర రాష్ర్టాలలో ఆకలితో అలమటించే వారిని ఆదుకొనేందుకు 374 రైళ్ల ద్వారా 10.47 లక్షల టన్నుల బియ్యాన్ని రవాణా చేసింది. కర్ణాటక, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్‌, జార్ఖండ్‌ రాష్ర్టాలకు బియ్యం పంపించింది. రాష్ట్రంలోని 57 స్వచ్ఛంద సంస్థలకు సబ్సిడీ రేటుతో ఆహార ధాన్యాల్ని ఎఫ్‌సీఐ తెలంగాణశాఖ విడుదల చేసింది. అంతేకాకుండా మరో ఐదు నెలలపాటు రాష్ట్రంలోని 87 లక్షల రేషన్‌కార్డుదారులకు పంపిణీ చేసేందుకు బియ్యం నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి.  కాగా, కేంద్రం తెలంగాణకు 4.20 లక్షల టన్నుల బియ్యాన్ని మంజూరు చేయగా ఎఫ్.సి.ఐ. వాటిని సరఫరా చేసింది. ఇందులో 2.87 లక్షల టన్నుల బియ్యం ఉచితంగా, 1.33 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కిలో రూ.22 చొప్పున  కేంద్రం అందజేసింది.

తమిళనాడు, కేరళ, బీహార్ రాష్ట్రాలకు తెలంగాణ బియ్యం (19.4.2020)

లాక్ డౌన్ అమలు నేపథ్యంలో వరంగల్ నుంచి తమిళనాడు, కేరళ, బీహార్ రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేస్తున్నారు. భారత ఆహార సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ నుంచి  ఇప్పటికే పలు విడతలుగా ఆయా రాష్ట్రాలకు ఎగుమతి చేశారు. ఆసియా ఖండంలోనే పెద్దదైన ఏనుమాముల మార్కెట్‌ సమీపంలోని గోదాముల నుంచి తొలుత లారీల ద్వారా బియ్యం బస్తాలను వరంగల్‌ రైల్వే గూడ్స్‌ షెడ్డుకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి 42 వ్యాగన్లతో కూడిన  జంబో గూడ్స్‌ ద్వారా బియ్యాన్ని తమిళనాడు, కేరళ, బీహార్ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

 ధాన్యం సేకరణలో తెలంగాణ వాటా 63 శాతం

దేశానికి కావాల్సిన ఆహారం అందించడంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా అవతరించింది. 2020 యాసంగిలో ఎఫ్.సి.ఐ దేశమంతటా సేకరించిన మొత్తం ధాన్యంలో 63 శాతం కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచి సేకరించగా, మిగతా అన్ని రాష్ట్రాల నుంచి కలిపి 37 శాతం మాత్రమే సేకరించింది. 

రాష్ట్రంలో  ధాన్యం కొనుగోళ్ల వివరాలు             

ఒక రాష్ట్రంలో రైతులు పండించిన మొత్తం పంటను కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే.  తెలంగాణ రాష్ట్రంలో 2020 మే 30 వరకు 28,03,328 టన్నుల వరి, 8,11,907 టన్నుల మక్కజొన్నలు, 82,941 టన్నుల శనగ, 6,193 టన్నుల పొద్దుతిరుగుడు, 10,489 టన్నుల జొన్నలు కొనుగోలు చేయడం జరిగింది. రాష్ట్రంలో వానాకాలంలో   ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను ప్రభుత్వం 5,690 నుంచి 6,408కి పెంచింది.  

2019-20 వానకాలం ధాన్యం సేకరణలో తెలంగాణకు రెండోస్థానం (5.2.2021)

2019-20 వానకాలం ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది. పంజాబ్‌ నుంచి 162.33 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా.. తెలంగాణ నుంచి 111.26 లక్షల టన్నులు సేకరించింది. 2017-18లో 54 లక్షల టన్నులు, 2018-19లో 77.46 లక్షల టన్నులు సేకరించగా..2019-20లో 111.26 లక్షల టన్నులకు పెరిగింది.

2020-21 వానకాలంలో 48.84 ధాన్యం సేకరణ

రాష్ట్రంలో 2020-21 ఏడాది వానకాలం సీజన్‌లో 48.84 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. రైతులకు రూ.9,214.41 కోట్లు చెల్లించినట్టు పేర్కొన్నది.

రద్దయిన రేషన్ కార్డులు :

తెలంగాణ రాష్ట్రంలో 2017లో 41,194, 2018లో 3,101, 2019లో 40,684, 2020లో 12,154 కార్డుల చొప్పున మొత్తంగా 97,133 రేషన్ కార్డులు రద్దుచేశారు.

  • సమగ్ర వ్యవసాయ విధానం – ప్రత్యామ్నాయ పంటల సాగు (10 మే 2020)

తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించే అన్ని పంటలకు మంచి ధర వచ్చి, రైతులకు మేలు కలిగేందుకు  సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించేందుకు కేసీఆర్ నిర్ణయించారు.  రైతులు అందరూ ఒకే పంట వేసి నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసే పద్ధతిని అమలు చేయాలని భావిస్తున్నారు.   రాష్ట్రంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయాలి? పండిన పంటను అమ్ముకోవడానికి ఎలాంటి వ్యూహం అనుసరించాలి? అనే విషయాలపై అధ్యయనం జరిగింది. దీనికి కొనసాగింపుగా ముఖ్యమంత్రి నేరుగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, మండలాలకు చెందిన వ్యవసాయ విస్తరణాధికారులు, రైతు బంధు సమితి ప్రతినిధులతో మాట్లాడారు.

నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలి : సీఎం కేసీఆర్ పిలుపు (15 మే 2020)

రైతులకు లాభం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ప్రభుత్వం సూచించిన పంటలనే రైతులు సాగు చేయాలని కోరారు. నియంత్రిత పద్ధతిలో వరి పంట సాగు ఈ వర్షాకాలంలోనే ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలంటే తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం, యాసంగి కలిపి ఏడాదికి 60 నుంచి 65 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పంట సాగు చేయాలని వ్యవసాయ రంగ నిపుణులు ప్రభుత్వానికి, రైతులకు సూచించారు. వర్షాకాలంలో మక్కల సాగు ఏమాత్రం లాభసాటి కాదని, మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పత్తి సాగు శ్రేయస్కకరమని వారు తేల్చి చెప్పారు. తెలంగాణలో వానాకాలం పంటగా 10 నుంచి 15 లక్షల ఎకరాల్లో కందులు వేయడం మంచిదని వారు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో వ్యవసాయ రంగ నిపుణులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులతో 15 మే 2020న సిఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు పలు సూచనలు చేశారు. తెలంగాణలో సాగుభూమి, సాగు పద్ధతులు, దేశీయంగా, అంతర్జాతీయంగా మార్కెట్లను అధ్యయనం చేసిన అనంతరం వారు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

రాష్టంలో నియంత్రిత పంటల సాగు కోసం పంటల మ్యాప్ రూపకల్పన

తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయతలపెట్టిన నియంత్రిత పంటల సాగు విధానాన్ని ఖరారు చేస్తున్నారు.  రాష్ట్రంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. జిల్లాల వారీగా ఏ పంట ఎంత వేయాలి? వరిలో ఏ రకం విత్తనం ఎక్కడ ఎంత వేయాలి? అనే విషయాలను ప్రకటించింది.

2020లో నియంత్రిత పంటల లక్ష్యం : 2019లో 24 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, 2020లో 60.16 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది. అలాగే 2019లో కేవలం 3.35 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయగా 2020లో 12.31 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. సోయాబీన్ 2019లో 2.10 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 2020లో 4.68 లక్షల ఎకరాల లక్ష్యాన్ని నిర్ణయించింది.

రాష్ట్ర వ్యవసాయ చరిత్రలో సరికొత్త రికార్డు

1.25 కోట్లకుపైగా ఎకరాల్లో పంటల సాగు

నాడు దండగ అన్న వ్యవసాయం.. నేడు పండగైంది..

రాష్ట్ర వ్యవసాయరంగంలో నూతన శకం మొదలైంది. సీఎం కేసీఆర్‌ చెప్పిన మాటకు కట్టుబడి రైతులు నియంత్రిత సాగుకు జైకొట్టారు. రాష్ట్ర రైతులను ధనికులను చేయాలనే లక్ష్యంతో పాలిస్తున్న సీఎం కేసీఆర్‌.. అందుకు అనుగుణంగా నియంత్రిత సాగుకు రూపకల్పన చేశారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలే పండించేలా మార్గనిర్దేశం చేశారు. రైతులు దానిని పాటించారు. అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని మించి పంటలు సాగుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1.25 కోట్లకు పైగా ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి.

నియంత్రిత సాగుకు కట్టుబడి రాష్ట్ర రైతులు పంటలు సాగుచేశారు. ఎక్కువ భాగం పత్తి, కంది, వరి సాగుచేయాలని, మక్కజొన్న జోలికి పోవద్దని ప్రభుత్వం సూచించింది. ఇందుకు అనుగుణంగానే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా పత్తి, వరి, కంది పంటలే కనిపిస్తున్నాయి. ధర లేకపోవడంతో ఈ సీజన్‌లో మక్కజొన్నను సాగుచేయొద్దని ప్రభుత్వం సూచించడంతో రైతులు ఆ పంట జోలికి పోలేదు. పౌల్ట్రీ, డెయిరీ రైతులు మాత్రం కొంత మేర మక్కజొన్నను సాగుచేశారు. వీరు కూడా ప్రభుత్వ అనుమతితోనే సాగుచేయడం గమనార్హం. ఈ సీజన్‌లో వరిని 41.46 లక్షల ఎకరాల్లో సాగుచేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 45.72 లక్షల ఎకరాల్లో వరి సాగు కావడం విశేషం. నియంత్రిత సాగులో పత్తిదే అగ్రభాగం. ఈ సీజన్‌లో ఏకంగా 60.16 లక్షల ఎకరాల్లో సాగుచేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించగా, ఇప్పటివరకు 58.81 లక్షల ఎకరాల్లో పత్తి సాగు పూర్తయింది. మరో 1.35 లక్షల ఎకరాల్లో విత్తితే లక్ష్యం పూర్తవుతుంది. కంది సాగు కూడా అదేస్థాయిలో సాగింది. ఈ పంటను 12.31 లక్షల ఎకరాల్లో వేయాలని నిర్ణయించగా, ఇప్పటివరకు 10.36 లక్షల ఎకరాల్లో సాగు పూర్తికావడం విశేషం. సీఎం కేసీఆర్‌ నియంత్రిత సాగును ప్రకటించినప్పుడు అందరిలోనూ అనుమానాలే. ప్రతిపక్షాలైతే ఇది సాధ్యమయ్యే పనే కాదని హేళనచేశాయి. కానీ సీఎం కేసీఆర్‌పై ఉన్న నమ్మకంతో రైతులు ఆయన పక్షాన నిలిచారు. నియంత్రిత సాగుకు జైకొట్టి ప్రతిపక్షాల విమర్శలకు సాగుతో సమాధానంచెప్పారు. సీఎం కేసీఆర్‌ ఏదిచెప్పినా ఏదిచేసినా తమ మంచికే అనేది రైతుల ప్రగాఢ విశ్వాసం. అందుకే నియంత్రిత సాగు విజయవంతమైంది.

కాళేశ్వరం జలాలు.. రైతుబంధు

నియంత్రిత సాగు సక్సెస్‌లో కాళేశ్వరం జలాలది, రైతుబంధుది కీలకపాత్ర. తెలంగాణను అన్నపూర్ణగా మార్చేందుకు అవసరమైన సాగు నీటిని అందించేందుకు సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకురార్పణచేశారు. సీఎం కన్న కలలు అతి త్వరలోనే సాక్షాత్కారమయ్యాయి. కాళేశ్వరం జలాలు కాలువల్లో పొంగిపొర్లాయి. చెరువులు, కుంటలకు జలకళ వచ్చి, సాగునీరు పుష్కలంగా అందుబాటులోకి వచ్చింది. ఇక రైతుబంధుతో పెట్టుబడికి ఇబ్బందులు లేకుండాపోయాయి. ఎకరాకు రూ.5 వేల చొప్పున ఈ సీజన్‌లో 57.62 లక్షల మంది రైతులకు రూ.7,251.85 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది.

అనుకూలంగా వర్షాలు

నియంత్రిత సాగుకు భగవంతుని మద్దతు కూడా లభించింది. ఈ సీజన్‌లో ప్రారంభం నుంచి కూడా వాతావరణం సాగుకు అనుకూలంగా ఉన్నది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా రికార్డుస్థాయిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం కన్నా ఏకంగా 51శాతం అధికంగా నమోదుకావడం గమనార్హం. 25 జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కాగా, 8 జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డయింది. కాళేశ్వరం నీటితో చెరువులకు జలకళ వచ్చింది. వర్షాలు తోడవడంతో వ్యవసాయం జోరుగా సాగుతున్నది.

  • గణనీయంగా పెరిగిన వరిసాగు విస్తీర్ణం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సాగునీటి రంగానికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవసాయాభివృద్ధికి – రైతు సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేసి, సాగునీరు అందించింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. భూగర్భ జలమట్టం పెరిగింది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నది. దీంతో అటు ప్రాజెక్టు కాల్వల ద్వారా, ఇటు చెరువుల ద్వారా, మరోవైపు బోర్ల ద్వారా పుష్కలమైన నీరు వాడుకోవడం సాధ్యమైంది. ఈ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గత యాసంగిలో తెలంగాణలో 17 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ఈ యాసంగిలో 40 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. దీని ఫలితంగా తెలంగాణలో వరి ధాన్యం రికార్డు స్థాయిలో పండింది. పండిన పంట రాష్ట్ర అవసరాలు తీర్చడంతో పాటు, దేశ అవసరాలను కూడా తీరుస్తున్నది.

‘‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’’ తెలంగాణ (15 మే 2020)

కోటి 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు.. ఆరేళ్లలో 367శాతం పెరుగుదల

ధాన్యం కొనుగోళ్ల విషయంలో పౌర సరఫరాల శాఖ ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో సాధించలేని ఘనతను స్వరాష్ట్రంలో సాధించగలిగింది. 2014-15లో వానాకాలం, యాసంగి పంటలు కలిపి 24 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ధాన్యం కొనుగోలు చేసింది. ఆరేళ్ల తర్వాత   2019-20లో ప్రభుత్వం వానాకాలంలో 47 లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగిలో 65 లక్షలు కలిపి మొత్తం కోటి 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగలిగింది. అలాగే, 2021 మే నాటికి రైతుల నుంచి ప్రభుత్వం  66 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది.

 కొత్త రాష్ట్రమైన తెలంగాణలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముందుచూపుతో.. కేవలం ఆరేళ్లలోనే 367 శాతం కొనుగోళ్లు పెరిగి ‘‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’’గా అవతరిస్తున్నది. సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు సంక్షేమ చర్యలు, ముఖ్యంగా కాళేశ్వరం లాంటి కొత్త సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పాత ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడం, 24 గంటలు ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా పథకాల కారణంగా ధాన్యం దిగుబడి కోటి మెట్రిక్ టన్నులు దాటింది.

సోనా బియ్యంతో తెలంగాణకు బ్రాండ్‌ ఇమేజ్‌

తెలంగాణ సోనా సన్నరకం బియ్యం జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాష్ర్టానికి బ్రాండ్‌ ఇమేజ్‌ కల్పించనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయాలవల్ల వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతల్లో తెలంగాణ మిగులు రాష్ట్రంగా మారింది.  ప్రస్తుతం ఆ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌ 15048)కి బ్రాండ్‌ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం, వ్యవసాయ వర్సిటీలు, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌తో 15 ఆగస్టు 2020న  అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.

దేశంలోని top  3 అగ్రివర్సిటీల్లో స్థానం…

ప్రభుత్వ సహకారం, అందరి సమిష్టి కృషితో పీజేటీఎస్‌ఏయూ దేశంలోని వ్యవసాయ వర్సిటీల్లో తొలి 3 స్థానాల్లో, దక్షిణ భారతదేశంలో తొలిస్థానంలో నిలిచింది.

పత్తిసాగులో తెలంగాణ నంబర్-2 (15 నవంబర్2020)

విస్తారమైన వర్షాలు, నియంత్రిత సాగు విధానంతో పత్తిసాగులో దేశంలో 104.40 ఎకరాల సాగుతో మహారాష్ట్ర మొదటిస్థానంలో నిలవగా, 59.92 లక్షల ఎకరాల సాగుతో తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. అయితే,అదనపు సాగు విస్తీర్ణం 13.98 లక్షల ఎకరాల పెరుగుదలతో  మొదటిస్థానంలో నిలిచింది. 2019—20లో దేశవ్యాప్తంగా 313.98 లక్షల ఎకరాల్లో పత్తి  సాగవగా, తెలంగాణ రాష్ట్రంలో 45.94 లక్షల ఎకరాల్లో సాగైంది.  2020-21లో దేశంలో 320.16 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా, తెలంగాణలో 59.92 లక్షల ఎకరాల్లో సాగైంది.

  • రాష్ట్రంలోని 32 జిల్లాల్లో లక్ష కల్లాల నిర్మాణానికి నిర్ణయం (10 జూన్ 2020)

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కల్లాలు లేక రైతులు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. కాగా, 2020 -21 ఏడాదికిగాను 40 నుంచి 45 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా.  దీంంతో రైతుల పంటల కోసం ఉపాధిహామీ కింద హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో లక్ష కల్లాలు నిర్మించాలని మంత్రులు హరీశ్ రావు, జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు సభ్యులుగా ఉన్న మంత్రివర్గ ఉపసంఘం 10 జూన్ 2020న నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపింది.  40 నుంచి 70 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ కల్లాల నిర్మాణం చేపట్టనున్నారు. ఒక్కో ప్లాట్ ఫామ్ నిర్మాణానికి రూ.46,045 చొప్పున లక్ష కల్లాలకు రూ.460 కోట్లకు పైగా అవుతుందని అంచనా వేసింది.

  • తెలంగాణ పంటలకు మిడతల దండుతో ప్రమాదం

తెలంగాణకు 200 కిలోమీటర్ల దూరంలో మిడతల దండు ప్రమాదం పొంచిఉన్నదని ప్రభుత్వం గుర్తించింది. మహారాష్ట్రలోని రాంటెక్‌ సమీపంలో ఇది తిష్టవేసింది. ఈ దండు దక్షిణం వైపు ప్రయాణిస్తే తెలంగాణకు ముప్పు ఉన్నట్టేనని భావించిన ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. 2020 జూన్ నెలలో ఇవి ఎప్పుడైనా రావచ్చని, వానకాలం సీజన్‌ ప్రారంభంలో ఇవి దాడిచేస్తే విత్తనాలు మొలకెత్తే దశలో వానాకాలం పంటలకు తీవ్రనష్టం జరుగవచ్చని భావించిన సీఎం కేసీఆర్‌ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ విషయమై 10 జూన్ 2020న  ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం.. మిడతల దాడినుంచి రాష్ర్టాన్ని రక్షించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల సరిహద్దులో గల 8 జిల్లాల కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు. దీనిపై పర్యవేక్షణకు సీఎస్‌ సోమేశ్ కుమార్  నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేయగా, పర్యవేక్షించారు.

కోటి ఎకరాలు దాటనున్న సాగు (27 అక్టోబర్2020)

రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో కోటి ఎకరాలకు పైగా మాగాణం సాగు కానుంది. రాష్ట్ర ప్రణాళికా సంఘం లెక్కల ప్రకారం రాష్ట్రంలో 33 భారీ ప్రాజెక్టులకుగాను 9 పూర్తయ్యాయి. మిగిలిన 24 ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. 2020 అక్టోబర్ వరకు భారీ ప్రాజెక్టుల కింద 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుండగా.. మిగతా ప్రాజెక్టులు కూడా పూర్తయితే 32 లక్షల ఎకరాల స్థిరీకరణ సహా 89 లక్షల ఎకరాలకు నీరందనుంది.

అలాగే, 37 మధ్యతరహా ప్రాజెక్టులకుగాను 27 పూర్తయ్యాయి. మరో 10 నిర్మాణంలో ఉన్నాయి. ఇవి కూడా పూర్తయితే మరో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ క్రమంలో 44,672 చెరువుల కింద 18,45,000 ఆయకట్టు, 635 ఎత్తిపోతల పథకాల కింద 4,50,000 ఎకరాల ఆయకట్టు కూడా సాగవుతుంది. ఇవన్నీ పూర్తయితే రాష్ట్రంలో సాగు విస్తీర్ణం కోటి ఎకరాలు దాటనుంది.

తెలంగాణ విత్త‌న సంస్థ‌కు ఉత్తమ అవార్డు (4 డిసెంబర్ 2020)

దేశంలోనే ఉత్తమ విత్తన ధృవీకరణ సంస్థ అవార్డ్‌ను తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ  సంస్థ అందుకుంది. ఇండియా సీడ్ అవార్డ్స్ లో విత్త‌నాభివృద్ధి సంస్థ ఎండీ కేశ‌వులు 4 డిసెంబర్ 2020న ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత విత్తన ధృవీకరణలో నూతన సంస్కరణలతో తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ దేశంలో నంబర్ వన్ గా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ సౌకర్యాలను, మౌలిక సదుపాయాలను  కలిగిఉండి విత్తన దృవీకరణలో తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ దేశంలో ఒక రోల్ మోడల్‌గా నిలిచింది.

అన్నదాతలకు అండగా.. తెలంగాణ ప్రభుత్వం

ప్రముఖ న్యూస్ చానల్ భారత్ సమాచార్ ప్రశంస (26.12.2020)

రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటున్న విధానం అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రముఖ న్యూస్‌చానల్‌ భారత్‌ సమాచార్‌ ఎడిటర్‌ బ్రజేశ్‌ మిశ్రా కొనియాడారు. క్వింటా ధాన్యానికి రూ.1,888 మద్దతు ధర కల్పిస్తూ కేవలం ఎనిమిది రోజుల్లోనే డబ్బు చెల్లిస్తున్నదని ప్రశంసిస్తూ 26 డిసెంబర్ 2020న ఆయన ట్వీట్‌ చేశారు.

భూ సంస్కరణల్లో తెలంగాణ భేష్‌

ఆర్థిక సంఘం ప్రశంసలు (4.2.21)

 భూ రికార్డుల నిర్వహణ, సంస్కరణల్లో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని 15వ ఆర్థిక సంఘం కొనియాడింది. రికార్డుల డిజిటలైజేషన్‌లో దేశంలోనే రెండోస్థానంలో నిలిచిందని ప్రశంసించింది. కంప్యూటరైజ్డ్‌ డాటాతో లబ్ధిదారులను సులభంగా గుర్తిస్తూ.. రైతులకు ఉపయోగపడే పలు పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నదని పేర్కొన్నది. ఇటీవల విడుదల చేసిన నివేదికలో 15వ ఆర్థిక సంఘం తెలంగాణలో చేపట్టిన భూ సంస్కరణలను ప్రత్యేకంగా ప్రస్తావించడంతోపాటు, ప్రశంసలు కురిపించింది. 99 శాతానికిపైగా భూముల సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం డిజిటలైజ్‌ చేసిందని పేర్కొన్నది. ఇందులో మహారాష్ట్ర మొదటిస్థానంలో, తెలంగాణ రెండోస్థానంలో నిలిచిందని.. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రికార్డుల ప్రక్షాళనతోనే ఇది సాధ్యమైందని తెలిపింది. రాష్ట్రంలో భూ రికార్డులు పక్కాగా ఉండటం, డిజిటలైజేషన్‌తో రాష్ట్రంలో రైతుల కోసం అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయని ఆర్థిక సంఘం అభినందించింది. దీంతోపాటు, భూముల వివరాలన్నింటినీ ప్రజలకు అందుబాటులో ఉంచడంతో మోసాలకు ఆస్కా రం లేకుండా పోయిందని.. ధరణి పోర్టల్‌ను ఉద్దేశిస్తూ 15వ ఆర్థిక సంఘం అభినందించింది.

వరి సాగు విస్తీర్ణం

2014-15    : 34.97 లక్షల ఎకరాలు

2019-20  : 79.47 లక్షల ఎకరాలు

(పెరుగుదల 44.5 లక్షల ఎకరాలు, పెరిగిన శాతం 127.19)

వరి దిగుబడి 

2014 -15  :        68.17 లక్షల టన్నులు

2019-20   :        178.27 లక్షల టన్నులు

(పెరుగుదల 110.1 లక్షల టన్నులు, పెరిగిన శాతం 161.50)

వరి పంట విలువ

2014-15            : రూ.9,528.18 కోట్లు

2019-20           : రూ.32,372.97 కోట్లు

(పెరుగుదల 22,844.65 కోట్లు,  పెరిగిన శాతం 239.76)

ప్రభుత్వం ద్వారా వరి ధాన్యం సేకరణ

2013-14            : 24.42 లక్షల టన్నులు (సమైక్య ఎ.పి.)

2014-15    : 24.30 లక్షల టన్నులు (తెలంగాణ)

2019-20           : 1.11 కోట్ల టన్నులు

(2014తో పోలిస్తే 2020కి పెరుగుదల 86.7 లక్షల టన్నులు, పెరిగిన శాతం 356.7)

ఎఫ్.సి.ఐ. తెలంగాణ నుంచి సేకరించిన బియ్యం

2013-14            : 12.18 లక్షల టన్నులు (సమైక్య ఎ.పి.)

2014-15    : 11.14 లక్షల టన్నులు (తెలంగాణ)

2019-20           : 49.94 లక్షల టన్నులు

(2014తో పోలిస్తే 2020కి పెరుగుదల 38.8 లక్షల టన్నులు, పెరిగిన శాతం 348)

దేశంలో వరి పంటకు ర్యాంకులు

వరి విస్తీర్ణం

2014-15            : 12వ ర్యాంకు

2019-20           : 5వ ర్యాంకు

వరి ఉత్పత్తి

2014-15    : 9వ ర్యాంకు

2019-20   : 2వ ర్యాంకు

వరి ఉత్పాదకత

2014-15            : 4వ ర్యాంకు

2019-20           : 2వ ర్యాంకు

పత్తి సాగు విస్తీర్ణం

2014-15    :       41.83 లక్షల ఎకరాలు

2019-20           :       52.54 లక్షల ఎకరాలు

(పెరుగుదల 10.71 లక్షల ఎకరాలు, పెరిగిన శాతం 25.6)

పత్తి దిగుబడి

2014-15            : 18.45 లక్షల టన్నులు

2019-20           : 37.62 లక్షల టన్నులు

(పెరుగుదల 19.17 లక్షల ఎకరాలు, పెరిగిన శాతం 103.91)

పత్తి పంట విలువ

2014-15            : రూ.7,548.90 కోట్లు

2019-20           : రూ.17,708.53 కోట్లు

(పెరుగుదల రూ.10,159.63 కోట్లు, పెరిగిన శాతం 134.58)

దేశంలో పత్తి పంటకు ర్యాంకులు 

పత్తి విస్తీర్ణం

2014-15            :  3వ ర్యాంకు

2019-20           :  2వ ర్యాంకు

పత్తి ఉత్పత్తి

2014-15    :       3వ ర్యాంకు

2019-20   :       3వ ర్యాంకు

ఉత్పాదకత

2014-15    :       11వ ర్యాంకు

2019-20   :       8వ ర్యాంకు

వ్యవసాయ ట్రాక్టర్లు

2013-14            :  94,537 వ్యవసాయ ట్రాక్టర్లు

2019-20            : 2,14,650 వ్యవసాయ ట్రాక్టర్లు

(పెరుగుదల 1,20,113, పెరిగిన శాతం 127)

హార్వెస్టర్లు

2013-14            :  6,318 హార్వెస్టర్లు

2019-20           : 18,483 హార్వెస్టర్లు

(పెరుగుదల 12,165, పెరిగిన శాతం 192.54)

  నూతన వరి, గోధుమ వంగడాల్లో డి-విటమిన్ (12.2.2021)

తెలంగాణ రైతు శాస్త్రవేత్త పద్మశ్రీ చింతల వెంకట్‌రెడ్డి అద్భుత ఆవిష్కరణ

ప్రాణికోటికి సూర్యుడు అందించే డి-విటమిన్‌, ఇపుడు మనం తినే ఆహారంలో సరిగా అందక మందులుగా వాడే దుస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో బియ్యం, గోధుమల్లో కూడా విటమిన్‌-డి లభించేలా తెలంగాణ రైతు శాస్త్రవేత్త పద్మశ్రీ చింతల వెంకట్‌రెడ్డి నూతన వరి, గోధుమ వంగడాలు సృష్టించారు. వెంకట్ రెడ్డి ప్రయోగాలు చేసిన సాంబమసూరి, బాస్మతి, కావేరీ చింటు వరి వంగడాలతోపాటు, కొత్త గోధుమ వంగడాల్లో డి-విటమిన్ పుష్కలంగా ఉన్నట్లు తేలింది. దీంతో ఈ రెండింటికీ ఇండియన్‌ పేటెంట్‌ రైట్స్‌ కోసం వెంకట్‌రెడ్డి దరఖాస్తు చేసుకొన్నారు. ఆ తర్వాత అంతర్జాతీయ అనుమతి కోసం జెనీవాలో ఉన్న వరల్డ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ ఆర్గనైజేషన్‌కు కూడా దరఖాస్తు చేసుకోగా, ఆ సంస్థ ఆమోదం తెలిపింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నాడు దండగ అన్న వ్యవసాయం.. నేడు పండగైంది..

ట్రెండింగ్‌

Advertisement