Karimnagar

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్

Hide this category: 
Show

సమాచారమిస్తే..చావ బాదారు

కరీంనగర్, జూలై 17: సమాచారమిస్తే చావ బదుతారా..? సంబంధం లేని వ్యక్తులపై కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేస్తారా..? పైగా బయటకు చెబితే ఎన్‌కౌంటర్ చేస్తామంటూ బెదిరిస్తారా..? ఇది ప్రజాస్వామ్యమా ? లేక రాచరిక రాజ్యమా ? అంటూ దళిత కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. దళితులపై అక్రమంగా కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులపై కేసు నమోదు చేయడమేకాక కమిషన్ వేసి విచారణ జరిపించాలని, అక్రమంగా పెట్టిన కేసులను భేషరతుగా తీసివేయాలని డిమాండ్ చేశారు.

హరితహారానికి రూ.25లక్షల విరాళం

కరీంనగర్, జూలై 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూడో విడత హరితహారం కార్యక్రమ నిర్వహణకు వెలిచాల సరళాదేవి ధార్మిక స్వచ్చంద సంస్థ పేరిట రూ.25లక్షల విరాళాన్ని సిఎం కెసిఆర్‌కు పంపించడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే, పుష్పాంజలి రీసార్ట్స్ అధినేత వెలిచాల జగపతిరావు తెలిపారు. సోమవారం పుష్పాంజలి రిసార్ట్స్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరో 25లక్షల విలువచేసే 50వేల మొక్కలను చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో నాటనున్నట్లు తెలిపారు.

మంత్రాల నెపంతోనే నర్సింహులు హత్య

గంభీరావుపేట, జూలై 16: మంత్రాలు వస్తాయనే నెపంతోనే నర్సింహులును హత్య చేసినట్లు సిరిసిల్ల డీఎస్పీ అవధాని చంద్రశేఖర్ తెలిపారు. గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన సూర నర్సింహులు హత్యా కేసులో ఆదివారం నిందుతులను అరెస్టుచేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ నర్సింహులు హత్యకేసులో శివరాత్రి లక్ష్మీ, నరేష్‌లను అరెస్టుచేసినట్లు వెల్లడించారు. హత్య జరిగిన తీరును వివరించారు. శివరాత్రి లక్ష్మీ కుమారుడి దశదినకర్మకు ఈ నెల 10న సూర నర్సింహులు భోజనానికి వెళ్లినట్లు వెల్లడించారు.

ఘనంగా పోచమ్మ బోనాలు

కోహెడ, జూలై 16: మండల కేంద్రంలో ఆదివారం వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. రెడ్డి సంక్షేమ సంఘం, పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. అలంకృత బోనాలను మహిళలు తలపై పెట్టుకొని చప్పుళ్లతో వీధులగుండా ఊరేగింపుగా వెళ్లి పోచమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు చంద్రారెడ్డి, నాయకులు రాంచంద్రారెడ్డి, మల్లారెడ్డి, రవీందర్ రెడ్డి, దర్గారెడ్డి, పద్మశాలీ సేవా సంఘం నాయకులు హన్మంత్, శ్రీనివాస్, సత్యనారాయణ, వేణు తదితరులు పాల్గొన్నారు.

2019లో అధికారం కాంగ్రెస్‌దే

మానకొండూర్, జూలై 16: 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమని టిపిసిసి రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం వీణవంక మండలంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్లి తిరిగి మానకొండూర్ వస్తుండగా మండల కేంద్రంలో తూర్పు దర్వాజ వద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మండల అధ్యక్షుడు వెంకటరెడ్డిల ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలుకుతూ భారీ బైక్‌ర్యాలీ చేపట్టారు. అనంతరం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

రాష్టప్రతి ఎన్నికల్లో ఇదీ మన లెక్క!

కరీంనగర్, జూలై 16: మరికొన్ని గంటల్లో దేశ ప్రథమ పౌరుడు (రాష్టప్రతి) ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న దరిమిలా జిల్లా నుంచి చట్టసభలకు ప్రాతినిద్యం వహిస్తున్న మన (ఎమ్మెల్సీలు మినహా) ఎమ్మెల్యేలు, ఎంపిలు, రాజ్యసభ సభ్యులు వేసే ఓట్ల విలువ మొత్తం 3,840గా లెక్క తేలింది. ఉమ్మడి జిల్లా నుంచి 13మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపిలు, ఒక రాజ్యసభ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. నిజామాబాద్ ఎంపి మన జిల్లా పరిధిలో ఉన్నప్పటికీ ఉమ్మడి జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం. కాబట్టి నిజామాబాద్‌ను మన లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.

మొక్క సంరక్షణకు కృషి చేస్తే ఆసుపత్రి ఫీజులో రాయితీ

జగిత్యాల, జూలై 14: తెలంగాణ హరితహారం 3వ విడత కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని అరుణ ఆసుపత్రి వైద్యులు ఎల్లాల శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం హరితహారం కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నారు. పట్టణానికి చెందిన ప్రముఖ పిల్లల వైద్యులు ఎల్లాల అరుణ, శ్రీనివాస్‌రెడ్డి ఆసుపత్రికి వచ్చిన సందర్శకులకు ఒక మొక్కను అందించి నాటాలని సూచించారు. అంతేకాకుండా వైద్యం కోసం వచ్చే మహిళలకు మొక్కలను అందించి పేరు, ఫోన్ నంబర్ తదితర వివరాలు సేకరించారు. తిరిగి వైద్యం కోసం వచ్చే సమయంలో మొక్కకు సంబంధించిన మొక్క ఎదుగుదల వివరాలతో పాటు ఫొటోను చూపిస్తే ఫీజులో రాయితీ అందిస్తానని మొక్కల పెంపకానికి ప్రోత్సాహాన్ని ఇచ్చారు.

స్వశక్తి మహిళల ఆర్థికాభివృద్ధికి బ్యాంక్ లింకేజి రుణాలు దోహదం

కరీంనగర్, జూలై 14: స్వశక్తి సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధికి, మహిళా సాధికారతకు బ్యాంక్ లింకేజి రుణాలు ఎంతో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. శుక్రవారం స్థానిక స్వశక్తి కళాశాలలో జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) 36వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన స్వశక్తి సంఘాల మహిళల సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జిల్లాలోని స్వశక్తి సంఘాల మహిళలందరు బ్యాంక్ లింకేజి రుణాలు తీసుకొని సూక్ష్మ వ్యాపారాలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నిర్వహిస్తూ సుస్థిర జీవనోపాధిని ఏర్పరచుకోవాలని సూచించారు.

జిల్లాలో కురిసిన వర్షం

కరీంనగర్, జూలై 14: కరీంనగర్ జిల్లాలోని అక్కడక్కడ చిరుజల్లులు, పలుచోట్ల భారీ వర్షాలు కురిసాయి. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు వర్షం కురిసింది. జిల్లాలో 16 మండలాలు ఉండగా, కేవలం నాలుగు మండలాల్లో మాత్రమే వర్షం కురువలేదు. మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. గంగాధర మండలంలో 19.1, రామడుగులో 19.2, చొప్పదండిలో 24.3, కరీంనగర్‌లో 21.2, మానకొండూర్‌లో 15.0, తిమ్మాపూర్‌లో 21.0, చిగురుమామిడిలో 26.4, సైదాపూర్‌లో 23.0, కేశవపట్నంలో 18.0, వీణవంకలో 12.0, హుజూరాబాద్‌లో 28.4, జమ్మికుంట మండలంలో 14.2 మి.మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

అంకిత భావంతో పనిచేయాలి

పెద్దపల్లి, జూలై 14: అధికారులు అంకిత భావంతో పనిచేయాలని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో 24శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం స్నేహ పూర్వకమైన ప్రభుత్వం అని అధికారులు నిజమైన పేదవాడికి న్యాయం చేసేలా పనిచేయాలని కొత్త జిల్లా కొత్త ఒరవడిగా ఉండాలని, అందరు కలిసి కట్టుగా పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుందన్నారు.

Pages