వస్తున్నాడు ‘మీలో ఒకడు’

Published: Sat, 09 Jul 2022 04:44:43 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వస్తున్నాడు మీలో ఒకడు

కుప్పిలి శ్రీనివాస్‌ హీరోగా నటిస్తూ  స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘మీలో ఒకడు’ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. సీనియర్‌ నటుడు సుమన్‌ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో హ్రితికా సింగ్‌, సాధన వపన్‌ హీరోయిన్లుగా నటించారు. చిత్రం గురించి దర్శకనిర్మాత శ్రీనివాస్‌ మాట్లాడుతూ ‘మంచి కథ, కథానాలతో సినిమా రూపుదిద్దుకొంది. సుమన్‌, శ్రీనివాస్‌ మధ్య వచ్చే సన్నివేశాలు, హీరోహీరోయిన్ల రొమాంటిక్‌ సీన్లు, గబ్బర్‌సింగ్‌ బ్యాచ్‌ కామెడీ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. పాటలకు మంచి స్పందన వచ్చింది’ అని తెలిపారు. కృష్ణభగవాన్‌, సమీర్‌, అశోక్‌కుమార్‌, బస్టాప్‌ కోటేశ్వరరావు ఇతర ముఖ్య తారాగణం.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International