20వ వసంతంలోకి తెలుగు వికీపీడియా

ఊళ్లు.. ప్రముఖ వ్యక్తులు.. చారిత్రక కట్టడాలు.. ప్రదేశాలు.. ఇలా ఏ సమాచారం కావాలన్నా.. ఠక్కున గుర్తుకొచ్చేది వికీపీడియా. ఇది తెలుగులోనూ విజ్ఞానాన్ని అందిస్తోంది.

Updated : 23 Dec 2022 06:06 IST

నెలకు 15 లక్షల మంది వీక్షణ
25న ప్రత్యేక వేడుకలకు ఏర్పాట్లు

ఊళ్లు.. ప్రముఖ వ్యక్తులు.. చారిత్రక కట్టడాలు.. ప్రదేశాలు.. ఇలా ఏ సమాచారం కావాలన్నా.. ఠక్కున గుర్తుకొచ్చేది వికీపీడియా. ఇది తెలుగులోనూ విజ్ఞానాన్ని అందిస్తోంది. మొబైల్‌ యాప్‌లోనూ సమాచారం తెలుసుకునే వీలుంది. 20వ వసంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఈ నెల 25న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు రవీంద్రభారతిలోని పైడి జైరాజ్‌ ప్రివ్యూ థియేటర్‌లో తెలుగు వికీపీడియన్లందరూ కలిసి వేడుకలు నిర్వహించనున్నారు. తప్పుల్లేకుండా రాయగలిగితే చాలు.. ఎవరైనా వికీపీడియాలో వ్యాసాలు పొందుపరచవచ్చు. వ్యాసాలు, ఫొటోలను అభివృద్ధి చేసేందుకు నిర్వాహకులు ప్రత్యేకంగా పోటీలు నిర్వహిస్తుంటారు. ఉత్తమంగా నిలిచిన వారికి బహుమతులు, అవార్డులు అందిస్తుంటారు.

ఎన్నో ప్రత్యేకతలు..

* తెలుగు రాష్ట్రాలకు చెందిన 26,811 వేల గ్రామాల సమాచారంతో పేజీలున్నాయి.

* 1277 మండలాలకు చెందిన పేజీలు అందుబాటులో ఉన్నాయి.

* 2016లో తెలంగాణ, ఈ ఏడాది ఏపీలో జరిగిన జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణ తర్వాత సమాచారం సైతం అందుబాటులో ఉంది.

* ఆయా జిల్లాలు, మండలాల భౌగోళిక పరిస్థితిని ప్రతిబింబించేలా ప్రభుత్వ అధికారిక సమాచారం సేకరించి నిక్షిప్తం చేశారు. దాదాపు 60 వేల పేజీల గ్రామ, మండల, జిల్లాల సమాచారాన్ని పొందుపరిచారు.

* సినిమాలకు సంబంధించి దాదాపు ఏడు వేల వ్యాసాలు రాశారు. ఇవి 15 వేల పేజీల్లో నిక్షిప్తమయ్యాయి.


మారుమూల సమాచారం లభ్యం
- వి.ప్రణయరాజ్‌, తెలుగు వికీపీడియన్‌

వికీపీడియాలో సమాచారం ఉచితంగా లభిస్తుంది. ఇక్కడ ఎవరైనా రాయవచ్చు. ఫొటోలు అప్‌లోడ్‌ చేయవచ్చు. అందుకే మారుమూల ప్రాంతాల సమాచారం, ఫొటోలు లభ్యమవుతున్నాయి. ఇందులోని వ్యాసాలను పుస్తకంగా ప్రింట్‌ చేసుకోవచ్చు.. అమ్ముకోవచ్చు. ఇందుకు వికీపీడియాకు ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు. కేవలం ‘వికీపీడియా నుంచి తీసుకున్నాను’ అని రాస్తే సరిపోతుంది.

 ఈనాడు, హైదరాబాద్‌

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని