హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kadapa Women: లేచిపోయి పెళ్లి చేసుకున్న అమ్మాయిలు.. పోలీస్ స్టేషన్లో షాకింగ్ పంచాయితీ.., చివర్లో...

Kadapa Women: లేచిపోయి పెళ్లి చేసుకున్న అమ్మాయిలు.. పోలీస్ స్టేషన్లో షాకింగ్ పంచాయితీ.., చివర్లో...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Kadapa Women: ఈ రోజుల్లో స్వలింగ పెళ్లిళ్లు ఎక్కువవుతున్నాయి. విదేశాల్లో ఇలాంటి పెళ్లిళ్లను చూస్తుంటాం. భారత్ లో ఇలాంటి పెళ్లిళ్లను అంగీకరించరు. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఆ ఆలోచనే చేయరు. కానీ ఇద్దరు మహిళలు మాత్రం అనుకున్నంత పనీ చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kadapa (Cuddapah), India

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

సాధారణంగాపెళ్లీడుకు వచ్చిన అబ్బాయికి, అమ్మాయికి వివాహం చేస్తారు. మంచి చెడులు చూసి జంటను ఒకటి చేస్తారు. కానీ ఈ రోజుల్లో కొన్ని బంధాలు లోకానికి విరుద్ధగా సాగుతుంటాయి. అలాంటివి చూసిన వారికి నవ్వాలో ఏడవాలో అర్ధం కాదు. ఈ రోజుల్లో స్వలింగ పెళ్లిళ్లు ఎక్కువవుతున్నాయి. విదేశాల్లో ఇలాంటి పెళ్లిళ్లను చూస్తుంటాం. భారత్ లో ఇలాంటి పెళ్లిళ్లను అంగీకరించరు. ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh) లో అయితే ఆ ఆలోచనే చేయరు. కానీ ఇద్దరు మహిళలు మాత్రం అనుకున్నంత పనీ చేశారు. ఒకర్ని ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అక్కడితో ఆగారా పోలీస్ స్టేషన్లో పంచాయతీ పెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లా  (YSR Kadapa District) వేంపల్లెలో ఇలాంటి పెళ్లి జరిగింది.

చెన్నూరు గ్రామానికి చెందిన మహిళకు ఏడాది క్రితం పెండ్లమర్రి మండలం మిట్టమీదపల్లెకు చెందిన వ్యక్తితో పెళ్లయింది. ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో మహిళకు తమ బంధువైన వేంపల్లె రాజీవ్ కాలనీకి చెందిన మరో మహిళతో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఇది చదవండి: పొలంలో కలుపుతీస్తుంటే మెరుస్తూ కనిపించిన రాయి.., అమ్మితే రూ.34లక్షలొచ్చాయి..


ఈ క్రమంలోనే గత శనివారం ఇద్దరు మహిళలు ఇంటి నుంచి పారిపోయి శ్రీకాళహస్తిలో వివాహం చేసుకున్నారు. మూడు రోజులు అక్కడ ఉండి మంగళవారం వేంపల్లెకి తిరిగొచ్చారు. ఇంటికి వెళ్తే తమను చంపేస్తారన్న భయంతో నేరుగా వేంపల్లె పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. తాము ప్రేమించుకున్నామని తమ కు రక్షణ కల్పించమని పోలీసులను కోరారు. తొలుత షాక్ తిన్న పోలీసులకు వారికి ఏం చెప్పాలో తెలియలేదు. మెల్లగా తేరుకొని ఇద్దర్నీ కూర్చొబెట్టి కౌన్సెలింగ్ ఇచ్చి ఎవరిళ్లకు వారిని పంపేశారు.

ఇది చదవండి: బుగ్గ కొరికాడని భర్తపై కేసు పెట్టిన భార్య.. ఇద్దరి మధ్య అంతలా ఏం జరిగిందంటే..!


గతంలో కడప జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు పెళ్లి చేసుకున్నామంటూ హడావిడి ఇచ్చారు. ఇద్దరూ దుబాయ్ లో ఉండగా సోషల్ మీడియా ద్వారా కలుసుకున్నారు. ఆ తర్వాత దగ్గరై పెళ్లి చేసుకున్నారు. వారిలో ఓ యువకుడు ఇండియాకు తిరిగొచ్చేయగా.. మరో యువకుడు వచ్చి తన భర్తను అప్పగించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐతే ఇటువంటి ఘటనలు ఈమధ్య ఎక్కువ ఎక్కువవుతున్నాయి. ఇటీవల గుజరాత్ లో ఓ యువతి తనను తానే పెళ్లి చేసుకుంది. ఆ యువతి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఐతే ఇలాంటివి ప్రచారానికి బాగుంటాయి గానీ... జీవితంలో ముందుకు సాగడానికి కాదని పలువురంటున్నారు. స్వలింగ వివాహాలు శ్రేయస్కరం, చట్టబద్ధం కాదని చెబుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Kadapa, Marriage

ఉత్తమ కథలు