ఉద్యమ పతాక.. ఆలేరు

- - Sakshi

ఆలేరు.. అసెంబ్లీ ఫ్లాష్‌బ్యాక్‌

రాజకీయ చైతన్యానికి పుట్టినిల్లు

ఆలయాలకు నెలవు

 ఐదు సార్లు మహిళా ఎమ్మెల్యేల గెలుపు

 ఇక్కడి నుంచి మోత్కుపల్లి వరుసగా ఐదు పర్యాయాలు విజయం

యాదాద్రి: నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాడంలో భూమి, భుక్తి, విముక్తి కోసం పోరు నడిపిన గడ్డ, మహిళా చైతన్యానికి ప్రతీక, మలిదశ తెలంగాణ ఉద్యమానికి దక్షిణ తెలంగాణలోనే పెట్టనికోట ఆలేరు. ఈ నియోజకవర్గం నిత్య చైతన్యంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు, కళలు, సాహిత్యం, సాంస్కృతిక, క్రీడా రంగాలకు నిలయం.

ఇక్కడి ఓటరు తీర్పు విలక్షణం. ఈ నియోజకవర్గంలో ఐదు సార్లు మహిళా ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఇక్కడి నుంచి మోత్కుపల్లి నర్సింహులు వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది.. పలుమార్లు మంత్రిగా పని చేశారు.

ఆలేరుకు ప్రత్యేక స్థానం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం కలిగి ఉంది. 1952లో ఏర్పాటైన నియోజకవర్గం జనరల్‌ కేటగిరీ నుంచి 1978లో ఎస్సీ రిజర్వ్‌డ్‌ చేయబడింది. 2009లో జనరల్‌ కేటగిరిలోకి మారింది.

నల్లగొండ, సిద్దిపేట, మేడ్చల్‌, జనగామ, సూర్యాపేట, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ నియోజకవర్గంలో ఆలేరు, యాదగిరిగుట్ట, రాజాపేట, తుర్కపల్లి, మోటకొండూరు, బొమ్మలరామారం, గుండాల, ఆత్మకూర్‌(ఎం) మండలాలు ఉన్నాయి. భౌగౌళికంగానూ.. ఓటర్ల సంఖ్యా పరంగా ఆలేరు అతిపెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 2,27,738 మంది ఓటర్లు ఉన్నారు.

వీరిలో 1,14,388 మంది పురుషులు, 1,13,332 మంది మహిళలు, 18 మంది ఇతరులు ఉన్నారు. 1952 నుంచి 2018 వరకు 16 సార్లు జరిగిన ఎన్నికల్లో పీడీఎఫ్‌ రెండు సార్లు, కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ ఐ ఐదు సార్లు, టీడీపీ మూడుసార్లు, టీఆర్‌ఎస్‌ నాలుగు సార్లు, ఇండిపెండెంట్‌ ఒకసారి గెలుపొందారు.

పాడి పంటలకు నెలవు
పాడి పంటలకు నెలవు ఆలేరు. ఇక్కడి రైతులు సాగర్‌ ఆయకట్టు సమానంగా ధాన్యం పండిస్తారు. పత్తి కూడా అధికంగా పండుతుంది. దేవా దుల, బునాదిగాని కాల్వలతోపాటు బోరు బావులపై ఆధారపడి పంటలు సాగు చేస్తారు. పాడి పరిశ్రమ, నేత, గీత వృత్తులు ప్రధానం. ఇక్కడి నుంచి పనుల కోసం హైదరాబాద్‌ వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన గంధమల్ల రిజర్వాయర్‌ పూర్తయితే సాగునీటికి ఢోకా ఉండదు.

ఎమ్మెల్యేలుగా ఆరుట్ల దంపతులు
ఆలేరు ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఆరుట్ల దంపతులు ముందుండి నడిపించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈ దంపతులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆరుట్ల కమలాదేవి ఆలేరు నుంచి మూడుసార్లు వరుసగా గెలపొందారు. ఈమె భర్త ఆరుట్ల రామచంద్రారెడ్డి మెదక్‌ జిల్లా రామాయంపేట, భువనగిరి నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

వరుస విజయాల మోత్కుపల్లి..
మోత్కుపల్లి నర్సింహులు ఆలేరు నియోజకవర్గంలో వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలుగుదేశం ఆవిర్భావంతో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో గనులు, భూగర్భ జలవనరులు, సాంఘిక సంక్షేమ, విద్యుత్‌, పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. టీడీపీ నుంచి మూడుసార్లు ఇండిపెండెంట్‌గా ఒకసారి, కాంగ్రెస్‌ నుంచి ఒకసారి విజయం సాధించారు.

ఆలయాలకు నిలయం..
ఆలేరు నియోజకవర్గానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. చారిత్రక ఆలయాల సంపద, తెలంగాణ సాయుధపోరాట నేపథ్యం ఉంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం, కొలనుపాక జైన దేవాలయం, శ్రీసోమేశ్వరాలయం ఇక్కడి ప్రత్యేకత.

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఈ నియోజకవర్గంలోనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం రూ.1200 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులు చేపట్టింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆలయంగా తీర్చిదిద్దింది. తెలంగాణ సాయుధపోరాట సేనానులు ఆరుట్ల కమలాదేవి, రామచంద్రారెడ్డి దంపతులు, రేణికుంట రామిరెడ్డి, కుర్రారం రామిరెడ్డి వంటి వీరులగన్న భూమి ఆలేరు. శాసనసభలో తొలి మహిళా ప్రతిపక్ష నేత ఆరుట్ల కమలాదేవి ఇక్కడివారే కావడం గమనార్హం.

Read latest Nalgonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

20-10-2023
Oct 20, 2023, 08:59 IST
యాదాద్రి: తెలంగాణ ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి శుక్రవారం బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జిట్టా.....
20-10-2023
Oct 20, 2023, 08:16 IST
మెదక్‌: ఎన్నికల నియమావళిని అడ్డుపెట్టుకొని కొందరు కిందిస్థాయి పోలీస్‌ సిబ్బంది చేస్తున్న పనులకు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం...
20-10-2023
Oct 20, 2023, 07:55 IST
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను నేడు ప్రకటించే అవకాశం ఉంది. తొలి...
20-10-2023
Oct 20, 2023, 05:48 IST
సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో వామపక్షాలు సర్దుకుపోయే ధోరణిలో ఉన్నట్టు కన్పి స్తున్నాయి. రెండేసి చొప్పున అసెంబ్లీ స్థానాలకు...
20-10-2023
Oct 20, 2023, 05:35 IST
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే అది బీఆర్‌ఎస్‌ ఖాతాలోకే చేరుతుందని,  కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌ పార్టీనే ‘బీ టీం’...
20-10-2023
Oct 20, 2023, 04:33 IST
రోజురోజుకు సరికొత్తగా మారుతూ వస్తున్న కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్‌–ఏఐ) అసెంబ్లీ రాజకీయ సమరాంగణంలోకి కూడా అడుగుపెట్టింది. ఎక్స్‌(ట్విట్టర్‌), ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం...
20-10-2023
Oct 20, 2023, 04:00 IST
సాక్షి, హైదరాబాద్‌: గవర్నర్‌ పదవిలో తనను నియమిస్తే కాంగ్రెస్‌ పార్టీ ఎందుకంత భయాందోళనలకు గురై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)కు...
20-10-2023
Oct 20, 2023, 03:55 IST
సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/ కాటారం: తెలంగాణలో కాంగ్రెస్‌ సునామీ రాబోతోందని, ఆరు గ్యారంటీలతో తెలంగాణ ప్రజల స్వప్నాన్ని నెరవేరుస్తుందని ఏఐసీసీ...
20-10-2023
Oct 20, 2023, 03:28 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించే లక్ష్యంతో దూకుడు పెంచుతున్న బీజేపీ.. తాము గెలిస్తే బీసీని ముఖ్యమంత్రిని...
19-10-2023
Oct 19, 2023, 14:06 IST
సాక్షిప్రతినిధి, వరంగల్‌: ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ పర్యటన కాంగ్రెస్‌ కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపింది. ములుగు జిల్లా రామాంజాపూర్‌...
19-10-2023
Oct 19, 2023, 12:36 IST
సంగారెడ్డి: దుబ్బాక నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీలో గ్రూపు విభేదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. పాతతరం మారినా గ్రూపుల...
19-10-2023
Oct 19, 2023, 11:54 IST
జోగులాంబ గద్వాల: కాంగ్రెస్‌ పార్టీలో ముసలం మొదలైంది. అది ముదిరి కల్లోలంగా మారింది. ముందు నుంచి పార్టీకి సేవలందించిన వారికే...
19-10-2023
Oct 19, 2023, 11:02 IST
మహబూబ్‌నగర్‌: ‘మిషన్‌ భగీరథ ద్వారా మంచి నీళ్ల బాధ పోయింది. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం జరిగింది. పాలమూరు ఎత్తిపోతల...
19-10-2023
Oct 19, 2023, 10:48 IST
కరీంనగర్: మండలంలోని కొత్తపల్లిలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ మానకొండూర్‌ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ...
19-10-2023
Oct 19, 2023, 10:12 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాజకీయ పార్టీల...
19-10-2023
Oct 19, 2023, 10:02 IST
నల్గొండ: ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలకంగా మారనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళల...
19-10-2023
Oct 19, 2023, 09:53 IST
నల్లగొండ: నీలగిరి మున్సిపాలిటీలోని అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎనిమిది మంది కౌన్సిలర్లు కారు దిగి కాంగ్రెస్‌ గూటికి చేరడం...
19-10-2023
Oct 19, 2023, 08:48 IST
సాక్షి, రంగారెడ్డి: కాంగ్రెస్‌ పార్టీ కల్వకుర్తి అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి, ఐక్యత ఫౌండేషన్‌ చైర్మన్‌ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి మధ్య సయోధ్య కుదిరిందా..?...
19-10-2023
Oct 19, 2023, 08:07 IST
సాక్షి, ఆదిలాబాద్‌: బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావుపై చీటింగ్‌ కేసు నమోదైంది. బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ...
19-10-2023
Oct 19, 2023, 04:10 IST
సాక్షి ప్రతినిధి, వరంగల్‌: స్వాతంత్య్రం కోసం సాగిన పోరాటంలోంచి పుట్టిన కాంగ్రెస్, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే క్రమంలో ప్రత్యేక రాష్ట్రం...



 

Read also in:
Back to Top