News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

MLC Vamsikrishna Srinivas : జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ - పవన్ సమక్షంలో చేరిక !

Janasena : వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేన పార్టీలో చేరారు. తన అనుచరులతో కలిసి తాడేపల్లి జనసేన కార్యాలయానికి వచ్చారు.

FOLLOW US: 
Share:

MLC Vamsikrishna Srinivas joined Janasena :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీలో చేరారు.  ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ  అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరుస షాక్‌లు తగులున్నాయి. అయితే తాను వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నందున అధికారికంగా కండువా కప్పించుకోలేదు. తన అనుచరులకు జనసేన కండువాలు కప్పించారు. తన వర్గానికి చెందిన  కార్పొరేటర్లతో ఆయన జనసేన పార్టలో చేరిపోయారు.  

వైసీపీ హైకమాండ్  బుజ్జగింపులను పట్టించుకోని వంశీకృష్ణ 

వంశీ కృష్ణ ణపై సోషల్‌ మీడియాలో ప్రచారం సాగుతుండడంతో.. నిన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు.. వంశీని కలిసి చర్చలు జరిపారు.  పార్టీ మారే ఆలోచన లేదని వంశీకృష్ణ తనకు చెప్పారని ఈ సందర్భంగా వెల్లడించారు.. దీనిపై మాత్రం వంశీ కృష్ణ స్పందించలేదు.  కానీ, నేడు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి వైసీపీ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ అనుచరులతో సహా వెళ్లి  పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో పార్టీలో చేరారు.  

మద్యం అమ్మకాల లెక్కలు మాయం - సీఎస్‌కు అచ్చెన్నాయుడు ఘాటు లేఖ !

పీఆర్పీ నుంచి  రాజకీయ ప్రవేశం చేసిన వంశీకృష్ణ 

వంశీతో నాకు 2009 నుంచే పరిచయం ఉందని పవన్ అన్నారు.  ప్రజా రాజ్యం యువజన విభాగం యువరాజ్యం అధ్యక్షునిగా ఉన్నప్పటి నుంచి వంశీతో నాకు పరిచయం ఉందన్నారు.   ఎమ్మెల్సీగా ఉండి కూడా వంశీ జనసేనలోకి వచ్చిన ఆయనని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను.. వంశీ తన సొంతింటికి వచ్చారు.. ఆయన పార్టీలోకి వచ్చిన విధానం నాకు నచ్చింది.. వంశీ ఏ నమ్మకంతో జనసేనలోకి వచ్చారో.. ఆ నమ్మకం కొల్పోకుండా పార్టీ అండగా ఉంటుంది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. వంశీని నేనో నియోజకవర్గం దృష్టిలో నేను చూడడం లేదు.. వంశీ వంటి నేతలు రాష్ట్రానికి అవసరం.. వంశీకి చాలా బలంగా పార్టీ అండగా ఉంటుందని  పవన్  హామీ ఇచ్చారు. 

వంశీ కృష్ణ శ్రీనివాస్ ప్రజారాజ్యం  పార్టీ నుంచే రాజకీయ ప్రవేశం చేశారు. యాదవ సామాజికవర్గంలో   బలమైన స్థానం ఉన్నప్పటికీ, 2019 ఎన్నికలకు ముందు విశాఖ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే టిక్కెట్ నిరాకరించడంతో వైసీపీ పార్టీతో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్‌కు విభేదాలు మొదలయ్యాయని చెబుతున్నారు.  ఆ తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ నగర అధ్యక్ష పదవిని కట్టబటెట్టింది వైసీపీ.. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో 21వ వార్డు నుండి కార్పొరేటర్‌గా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే, 11వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందిన జి.హరి వెంకట కుమారిని మేయర్‌గా పార్టీ ఎన్నుకోవడంతో ఆయన మళ్లీ నిరుత్సాహానికి గురయ్యారు.                                      

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం- వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ బంధువులు ఐదుగురు మృతి

వైసీపీలో అవమానాలు ఎుదరయ్యాయని ఆవేదన 

మేయర్‌గా ఎన్నిక కాకపోవడంతో మనస్తాపానికి గురైన వంశీకృష్ణ.. నగర పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు .  కొంతమంది వైసీపీ నాయకులు తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన వైఎస్సార్‌సీపీ అధిష్టానం.. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది.. కానీ, ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న పట్టుదలతో ఉన్న ఆయన.. ఇప్పుడు జనసేనలో చేరారు. జనసేనలో చేరే ఎవరికీ టిక్కెట్ ఆఫర్లు ఇవ్వడం లేదని.. టిక్కెట్ అంశాలపై చర్చలు జరిపినప్పుడు.. మాత్రమ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని జనసేన వర్గాలు చెబుతున్నాయి.                                                                 

Published at : 27 Dec 2023 03:20 PM (IST) Tags: Telugu Latest News Telugu News Pawan Kalyan MLC Vamsi Krishna Srinivas YCP MLC to Janasena

ఇవి కూడా చూడండి

APPSC AEE Notification: ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 21 ఏఈఈ పోస్టులు, ఎంపికైతే రూ.1.47 లక్షల వరకు జీతం

APPSC AEE Notification: ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 21 ఏఈఈ పోస్టులు, ఎంపికైతే రూ.1.47 లక్షల వరకు జీతం

AP AHA Admit Card: ఏనిమల్ హస్బెండరీ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

AP AHA Admit Card: ఏనిమల్ హస్బెండరీ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

Fog In Vizag: పొగమంచుతో ప్రమాదం- విశాఖలో ఐదు వాహనాలు ఢీ

Fog In Vizag: పొగమంచుతో ప్రమాదం- విశాఖలో ఐదు వాహనాలు ఢీ

Andhra Pradesh Ward and Village Volunteers: ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేయడం లేదు- జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వాలంటీర్ల సంఘం

Andhra Pradesh Ward and Village Volunteers: ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేయడం లేదు- జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వాలంటీర్ల సంఘం

AP Volunteers Agitation: వాలంటీర్లు రివర్స్ అయితే అది జగన్ స్వయంకృతాపరాధమేనా- దీనిపై జరుగుతున్న చర్చేంటీ

AP Volunteers Agitation: వాలంటీర్లు రివర్స్ అయితే అది జగన్ స్వయంకృతాపరాధమేనా- దీనిపై జరుగుతున్న చర్చేంటీ

టాప్ స్టోరీస్

Ananthapuram News: 'అనంత' నేతలతో సీఎం జగన్ చర్చలు - ఈసారి టికెట్ ఎవరికో.?, అందరిలోనూ సర్వత్రా ఉత్కంఠ

Ananthapuram News: 'అనంత' నేతలతో సీఎం జగన్ చర్చలు - ఈసారి టికెట్ ఎవరికో.?, అందరిలోనూ సర్వత్రా ఉత్కంఠ

AITUC Won In Singareni Election 2023: సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల్లో AITUCదే విజయం

AITUC Won In Singareni Election 2023: సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల్లో AITUCదే విజయం

Vijayakanth Profile: విప్లవ కళాకారుడు నుంచి 'కెప్టెన్ విజయకాంత్‌' కావడం వెనుక రోజా భర్త!

Vijayakanth Profile: విప్లవ కళాకారుడు నుంచి 'కెప్టెన్  విజయకాంత్‌' కావడం వెనుక రోజా భర్త!

Guna Bus Accident: ట్రక్‌ని ఢీకొట్టిన బస్సు, చెలరేగిన మంటలు - 13 మంది సజీవదహనం

Guna Bus Accident: ట్రక్‌ని ఢీకొట్టిన బస్సు, చెలరేగిన మంటలు - 13 మంది సజీవదహనం