e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home ఇంటర్వూ ఏడాదికి మించి ఇండ‌స్ట్రీలో ఉండ‌లేన‌న్నారు

ఏడాదికి మించి ఇండ‌స్ట్రీలో ఉండ‌లేన‌న్నారు

‘జెర్సీ’లో మ్యాంగో బర్ఫీగా కనిపించిన శ్రద్ధా శ్రీనాథ్‌ గుర్తుంది కదా! ‘ఆమె అందాన్నీ, అంతకు మించిన అభినయాన్నీ అంత త్వరగా ఎలా మరచిపోగలం?’అంటారా! బ్లాక్‌బస్టర్‌ హిట్‌తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీక్వీన్‌ ‘జోడి’,‘కృష్ణ అండ్‌ హిస్‌ లీలా’ సినిమాలతో మనకు దగ్గరైంది. ‘కథానాయిక’ అనే కిరీటం కోసం కాకుండా.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికే సినిమాల్లోకి వచ్చానంటున్న శ్రద్ధా శ్రీనాథ్‌ పంచుకున్న కబుర్లివి..

ఏడాదికి మించి ఇండ‌స్ట్రీలో ఉండ‌లేన‌న్నారు

మా నాన్న ఆర్మీ మ్యాన్‌. ఆయనకు తరచూ బదిలీలు అయ్యేవి. దాంతో మా కుటుంబం ప్రతి రెండేండ్లకూ ఓ కొత్త ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చేది. అడవులు, కొండలు, చివరికి ఎడారి ప్రాంతాల్లోనూ ఉన్నాం. ఊళ్లు మారుతుండటంతో, నా చదువు కూడా రకరకాల స్కూల్స్‌లో సాగింది. ప్లస్‌ టూ పూర్తయ్యే నాటికి నేను తొమ్మిది పాఠశాలలు మారాల్సి వచ్చింది. రెండేండ్లకు ఒకసారి నా స్నేహితులు మారిపోయేవారు, టీచర్లూ మారిపోయేవారు, ఇరుగుపొరుగు కూడా మారిపోయేవారు. కానీ, చిన్నప్పుడే దేశంలోని రకరకాల ప్రాంతాలు చూశానన్న తృప్తి మిగిలింది.

ఏడాదికి మించి ఇండ‌స్ట్రీలో ఉండ‌లేన‌న్నారు
- Advertisement -

చిన్నప్పుడు చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని. మా బంధువుల్లో ఎవరెలా మాట్లాడుతారో సరదాగా మిమిక్రీ చేసి నవ్వించేదాన్ని. యాక్టింగ్‌ నాలో సహజంగా ఉన్నట్టుంది! అందుకే, ‘లా’ చదివే రోజుల్లో నాటకాలవైపు మనసు మళ్లింది. బెంగళూరులో నాటకాలకు మంచి ప్రోత్సాహం ఉండేది. మరోవైపు లా పూర్తయ్యాక రెండేండ్లు న్యాయవాదిగా పనిచేశాను. ఆ సమయంలోనూ నాటకాలను వదులుకోలేదు. తరచూ ఆడిషన్స్‌కు వెళ్లేదాన్ని. అది సీరియల్‌ అయినా, సినిమా అయినా.. నటిగా చాన్స్‌ రావాలనుకున్నా. హీరోయిన్‌ అయిపోవాలని కలలేం కనలేదు. మంచిపాత్ర ఏదొచ్చినా చేద్దామని అనుకున్నా. మొత్తానికి, సినిమాల్లో అవకాశం రావడంతో హీరోయిన్‌గా ప్రేక్షకులకు ఇలా పరిచయం అయ్యాను.

ఏడాదికి మించి ఇండ‌స్ట్రీలో ఉండ‌లేన‌న్నారు

కన్నడలో నా మొదటి సినిమా ‘యూ టర్న్‌’. ఈ చిత్రాన్ని న్యూయార్క్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. బొమ్మ విడుదలైన రోజు నాకింకా గుర్తుంది. ఆ రోజంతా నా ఫోన్‌ రింగ్‌ అవుతూనే ఉంది. అలాగే, కెరీర్‌ తొలినాళ్లలోనే మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. నేను పోషించింది చిన్న పాత్రే కావొచ్చు! కానీ, నాకు కొండంత ఆనందాన్ని ఇచ్చింది. నేను ఇప్పటి వరకూ నటించిన సినిమాల్లో కొన్ని ప్రేక్షకులకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ, అన్ని సినిమాలూ నటిగా నాకు సంతృప్తిని ఇచ్చినవే!

ఏడాదికి మించి ఇండ‌స్ట్రీలో ఉండ‌లేన‌న్నారు

ప్లస్‌ టూ తర్వాత ‘లా’ చదువడానికి బెంగళూరును ఎంచుకున్నాను. ఒంటరిగా ఉండేదాన్ని. ఇంటికి దూరంగా ఉండటం అదే మొదటిసారి. రెక్కలు వచ్చినట్టుగా అనిపించేది. బస్‌లో ఊరంతా తిరిగేదాన్ని. స్నేహితులతో సరదాగా గడిపేదాన్ని. అలాఅని చదువులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ఇష్టంతోనే ‘లా’లో చేరాను. కానీ, ఒక్కో రోజు ఒక్కో ఆలోచన వచ్చేది. ఓరోజు ఆస్ట్రోనాట్‌ అయిపోవాలని అనుకునేదాన్ని. మరో రోజు న్యూస్‌ రీడర్‌గా సెటిలవ్వాలనిపించేది. ఇంకో రోజు సైకోథెరపిస్ట్‌గా రాణించాలని భావించేదాన్ని. ఇలా రోజుకో కెరీర్‌ కల! దాదాపు పది రకాల కెరీర్ల గురించి ఆలోచించా. చివరికి నటనపై దృష్టి సారించా. యాక్టింగ్‌ నాకు పర్‌ఫెక్ట్‌ అని ఫిక్సయ్యా.

ఏడాదికి మించి ఇండ‌స్ట్రీలో ఉండ‌లేన‌న్నారు

సినిమా ఇండస్ట్రీ గురించి నాకెలాంటి నాలెడ్జ్‌ లేదు. మా ఇంట్లో వాళ్లకు అస్సలు తెలియదు. ఇండస్ట్రీలో పరిచయాలూ లేవు. కానీ, నటిని కావాలనే ఆకాంక్ష నన్ను నడిపించింది. నేను సినిమాల్లోకి వచ్చి ఆరేండ్లు అవుతున్నది. ఈ చిన్న ప్రయాణంలో ఎన్నో మరపురాని జ్ఞాపకాలు. సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ‘ఈ అమ్మాయి ఏడాది కన్నా ఎక్కువ కాలం ఉండలేదు’ అన్న మాటలూ వినిపించాయి. వాటికి నేనేమీ స్పందించలేదు. ఇండస్ట్రీలో నిలదొక్కుకొని సమాధానం ఇవ్వాలనుకున్నా. నాకు సరిపోయే పాత్రలను ఎంచుకున్నా. దక్షిణాది నాలుగు భాషల్లోనూ సినిమాలు చేశాను. ‘జెర్సీ’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యా! ఆ సినిమా నాకు మంచిపేరు తెచ్చింది. జోడి, కృష్ణ అండ్‌ హిస్‌ లీలా సినిమాలు నన్ను తెలుగువారికి మరింత దగ్గర చేశాయి.

ఏడాదికి మించి ఇండ‌స్ట్రీలో ఉండ‌లేన‌న్నారు

ఏడాదికి ఒకసారైనా ఫ్యామిలీతో విహారానికి వెళ్తుంటాను. అప్పుడప్పుడు స్నేహితులతో కూడా. సోలో ట్రావెల్‌ అంటే నాకిష్టం. ఒంటరిగా ఈ ప్రపంచమంతా చుట్టేయాలనిపిస్తుంది. సాహసయాత్రలు చేస్తుంటాను. ఎక్కడికి వెళ్లినా లోకల్‌ హాస్టల్స్‌లో ఉంటాను. కొత్తవారితో పరిచయాలు పెంచుకుంటాను. భూటాన్‌ ప్రయాణం, ఈశాన్య భారతంలో వాటర్‌ రాఫ్టింగ్‌ జీవితకాలం గుర్తుండిపోతాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

బ్ర‌హ్మాజీతో జాగ్ర‌త్త‌గా ఉండు.. నాగ‌శౌర్య‌కు రానా సూచ‌న‌

ఆర్య ఇంట డ‌బుల్ ధ‌మాకా.. త‌ల్లి అయిన అఖిల్ హీరోయిన్‌.. విశాల్‌ ఎమోష‌న‌ల్

RRR సినిమా విషయంలో వివాదాలు తప్పవా?

పవర్ స్టార్‌తో ఆ హీరోయిన్ నాలుగో పెళ్లి.. ఫోటో వైరల్?

జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారు వచ్చేసింది.. చరణ్ ఇంటి ముందు పార్కింగ్..!

త్రిష పెళ్లి టాపిక్ మళ్లీ వైరల్..ఇంత‌కీ ఎవ‌రా వ్య‌క్తి.?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఏడాదికి మించి ఇండ‌స్ట్రీలో ఉండ‌లేన‌న్నారు
ఏడాదికి మించి ఇండ‌స్ట్రీలో ఉండ‌లేన‌న్నారు
ఏడాదికి మించి ఇండ‌స్ట్రీలో ఉండ‌లేన‌న్నారు

ట్రెండింగ్‌

Advertisement