శబరిమల కేసు విచారించేది ఈ జడ్జీలే

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం విషయంలో మహిళల పట్ల వివక్ష వద్దంటూ దాఖలైన పిటీషన్లపై ఇకపై రోజువారీగా విచారించాలని నిర్ణయించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే తొమ్మిది మంది సభ్యులు గల విస్తృత ధర్మాసనాన్ని నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నేతృత్వంలో ఏర్పాటైన విస్తృత ధర్మాసనంలో ఇద్దరు తెలుగు న్యాయమూర్తులకు చోటు దక్కింది. జస్టిస్ ఎల్. నాగేశ్వర్ రావు, జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి తొమ్మిది మంది సభ్యులు గల ధర్మాసనంలో సభ్యులుగా నియమితులయ్యారు. జనవరి […]

శబరిమల కేసు విచారించేది ఈ జడ్జీలే

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం విషయంలో మహిళల పట్ల వివక్ష వద్దంటూ దాఖలైన పిటీషన్లపై ఇకపై రోజువారీగా విచారించాలని నిర్ణయించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే తొమ్మిది మంది సభ్యులు గల విస్తృత ధర్మాసనాన్ని నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నేతృత్వంలో ఏర్పాటైన విస్తృత ధర్మాసనంలో ఇద్దరు తెలుగు న్యాయమూర్తులకు చోటు దక్కింది. జస్టిస్ ఎల్. నాగేశ్వర్ రావు, జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి తొమ్మిది మంది సభ్యులు గల ధర్మాసనంలో సభ్యులుగా నియమితులయ్యారు.

జనవరి 13వ తేదీ నుంచి శబరిమల కేసును ప్రతీ రోజు విచారించాలని చీఫ్ జస్టిస్ బాబ్డే నిర్ణయించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. తొమ్మిది మంది సభ్యులున్న విస్తృత ధర్మాసనంలో జస్టిస్ ఆర్. భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్. నాగేశ్వర రావు, జస్టిస్ మోహన్ ఎం. శంతన్‌గౌడర్, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి, జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ సూర్యకాంత్ సభ్యులుగా నియమితులయ్యారు.

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి రుతుస్రావం కలిగి వున్న మహిళలకు అవకాశం లేదు. పదేళ్ళలోపు బాలికలు, యాభై ఏళ్ళపై బడిన మహిళలనే అయ్యప్పదర్శనానికి అనుమతిస్తారు. ఈ విధానం మహిళలపై వివక్షతో కూడుకున్నదని పలు మహిళా సంఘాలు కోర్టునాశ్రయించగా.. కేరళ హైకోర్టు మహిళా సంఘాలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ పలు హిందూ సంఘాలతోపాటు శబరిమల అయ్యప్ప ఆలయ ట్రస్టు ట్రావెన్ కోర్ దేవస్వోమ్ బోర్డు సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. అయితే, సుప్రీం కోర్టు గత నవంబర్‌ నెలలోనే ఈ విషయంలో తుది తీర్పునిస్తుందని అందరూ భావించగా.. అప్పట్లో సుప్రీం ధర్మాసనానికి నేతృత్వం వహించిన మాజీ సీజేఐ రంజయ్ గొగోయ్.. మరింత లోతుగా విచారణ అవసరమని భావించి విస్తృత ధర్మాసనానికి కేసును బదిలీ చేశారు.

ఆ తర్వాత రంజయ్ గొగోయ్ పదవీ విరమణ చేయగా.. ఆయన స్థానంలో ఎస్.ఏ.బాబ్డే సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే ఆయన రోజువారీ విచారణ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందుకోసం తొమ్మిది మంది జడ్జీలు గల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu