close
Choose your channels

జూలై 15న విడుదలవుతున్న 'నిన్నే కోరుకుంటా'

Sunday, July 10, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శుభకరి క్రియేషన్స్‌ పతాకంపై సందీప్‌, విజయ్‌భాస్కర్‌, ఆనంద్‌, పూజిత, సారిక‌ మొదలగువారు ప్రధాన తారాగణంగా గణమురళి దర్శకత్వంలో నిర్మాత మరిపి విద్యాసాగర్‌ నిర్మించిన చిత్రం నిన్నే కోరుకుంటా`. సెన్నార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 15న విడుద‌ల కానుంది.
ఈ సందర్భంగా...
చిత్ర నిర్మాత మరిపి విద్యాసాగర్‌(వినయ్‌) మాట్లాడుతూ - ఇదొక రొమాంటిక్‌ కామెడీ మూవీ. సినిమా అంతా ప్రేక్షకుల్ని ఎంట‌ర్‌టైన్ చేస్తూనే నేటి యువతీ యువకుల మనస్థత్వాలను ఈ చిత్రం ప్రెజెంట్ చేస్తుంది. ఆర్టిస్ట్‌లు, టెక్నిషియ‌న్స్ అందరూ సినిమాకోసం ఎంతగానో సహకరించారు. దర్శకుడు గణమురళి చెప్పినదానికంటే గొప్పగా చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ జూలై 15న సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
సందీప్‌, విజయ్‌భాస్కర్‌, ఆనంద్‌, పూజిత, సారిక‌, చ‌మ్మ‌క్ చంద్ర‌, సుమ‌న్ శెట్టి, వైజాగ్‌ ప్రసాద్‌, పూర్ణిమ, ప్రదీప్‌, సత్యం రాజేష్‌, సుమన్‌శెట్టి, కొండవలస, సంజన, అంబటి శ్రీను, మొదలగువారు నటించిన ఈ చిత్రానికి మాటలు: సాహు, ప్రకాష్‌, మాధవ్‌, పాటలు: పోతుల రవికిరణ్‌, కులశేఖర్‌, సంగీతం: ప్రణవ్‌, ఎడిటింగ్‌: నందమూరి హరి, నిర్మాత: మరిపి విద్యాసాగర్‌(వినయ్‌), కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: గణమురళి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.