maredu chettu uses bilva tree uses maredu chettu upayogalu

మారేడు తో ముచ్చటైన ఆరోగ్యం మీ సొంతం.

పూజల్లో చాలామంది మారేడు పత్రాలు వాడటం చూస్తూ ఉంటాం. శివుడికి ఇవి ఎంతో ప్రీతి అని చెబుతారు. శివాలయం కు వెళ్లి లింగాన్ని దర్శించుకునేవాళ్ళు తప్పక  మారేడు దళాలు వెంటబెట్టుకు వెళతారు. ఈ మారేడు చెట్టుకు కాసే కాయలు వెళక్కాయల లాగా ఉంటాయి. లోపల గుజ్జు కూడా ఉంటుంది. చాలా మందికి మారేడు కేవలం దేవుడి పూజ కోసమే అనే అభిప్రాయం ఉంది. అయితే ఇది తప్పని మారేడులో గొప్ప ఆరోగ్యం దాగుందనే విషయం ఇదిగో ఇపుడు మీకు చెప్పడమే ఈ విషయ సారాంశ ఉద్దేశం. మరి మారేడులో ఆరోగ్య రహస్యాలు చదివేయండి.

◆ అమీబియాస్ తో బాధపడేవారికి మారేడు చాలా మంచి చేస్తుందని చెప్పవచ్చు. తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోయినా లేదా ఆహారం తీసుకున్న వెంటనే విరేచనానికి వెళ్ళవలసి వచ్చినా, మలబద్దక సమస్యతో బాధపడినా గ్యాస్ పెరగడం, పేగు పూత, కడుపు నొప్పి, నీరసం, నిస్సత్తువ  ఇవన్నీ అమీబియాస్ వ్యాధి లక్షణాలు. ఇన్ని లక్షణాలు ఉన్న అమీబియాస్ ను మారేడు మూలాలతో సహా మాయం చేయగలదు అంటే ఇది ఎంత ప్రభావం కలిగినదో అర్థం చేసుకోవచ్చు. 

◆ మారేడు పండు కన్నా, లేత కాయ ఎక్కువ గుణాలు కలిగి ఉంటుంది. మారేడు ఆకుల్ని దంచి, ఆ రసాన్ని తాగితే ఉమెషుగర్ వ్యాధి ఉన్నవారికి గొప్ప మేలు చేకూరుస్తుంది. ఈ మారేడు రసాన్ని  రోజు కొద్దికొద్దిగా  మోతాదు పెంచుకుంటూ తాగడం వల్ల షుగర్ క్రమబద్ధీకరించుకోవచ్చు.

◆ తాజా  మారేడు ఆకులను దంచి రసం తీసి ఆ రసంలో కొద్దిగా ఉప్పు చేర్చి తాగితే నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పి తగ్గుతుంది.

◆ మారేడు కొద్దిగా తీపి రుచిని కలిగి ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల వాంతులను తగ్గిస్తుంది. మారేడు చెట్టు వేరును నీళ్లలో మరిగించుకుని పంచదార కలుపుకుని తాగితే ఎంతటి వాంతులు అయినా నివారణ అవుతాయి. అంతే కాదు గుండెకు మంచి చేస్తుంది, ఒంటికి నీరు పట్టడం, నిమ్ము చేరడం, తరచూ జ్వరం రావడం, విరేచనాలు అవ్వడం వంటి సమస్యలలో మారేడు పండు ప్రభావాన్ని చూపిస్తుంది.

◆ ఇది కాస్త వగరుగా కూడా ఉంటుంది. ఆకలిని పుట్టిస్తుంది. మూల వ్యాధులు, ఇస్నోఫీలియా, తరచూ వేడి చేయడం, వంటి సమస్యలకు మారేడు చక్కగా పనిచేస్తుంది. విషజ్వరాలలో మారేడు వేరు కషాయం మంచి చేస్తుంది.

◆ గుండె వేగంగా కొట్టుకోవడం మరియు గుండె నొప్పులలో నేరేడు ప్రభావవంతంగా పనిచేస్తుంది. 

◆ మారేడు కాయను దంచి నీళ్లలో మరిగించి పటికబెల్లం కలుపుకుని తాగితే ఎంతగానో వేధించే ఎక్కిళ్ళు కూడా ఆగుతాయి.

చివరగా……

మారేడు అనేది ముళ్ళతో కూడి ఎత్తుగా పెరిగే చెట్టు. దీని ఆకులను మరియు కాయలను, వేర్లను కూడా ఆయుర్వేద పరంగా ఉపయోగించుకుని గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పైన చెప్పుకున్న సమస్యలను చక్కగా పరిష్కరించుకోవచ్చు కూడా.

Leave a Comment

error: Content is protected !!