ఈటీవీ విన్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌

మనకు ఇష్టమైన సినిమాలను ఎక్కడినుంచైనా చూసే అవకాశాలను అందిస్తోంది ‘ఈటీవీ విన్‌’. ఎన్నో హంగులతో మొదలైన ఈటీవీ విన్‌లోకి ఇప్పుడు మరో కొత్త చిత్రం వచ్చి చేరింది.

Published : 06 May 2023 00:44 IST

మనకు ఇష్టమైన సినిమాలను ఎక్కడినుంచైనా చూసే అవకాశాలను అందిస్తోంది ‘ఈటీవీ విన్‌’. ఎన్నో హంగులతో మొదలైన ఈటీవీ విన్‌లోకి ఇప్పుడు మరో కొత్త చిత్రం వచ్చి చేరింది. ఇ.సత్తిబాబు తెరకెక్కించిన ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ సినిమా ఈటీవీ విన్‌లో శుక్రవారం నుంచి ప్రసారం అవుతుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో విశ్వంత్‌, అభిజిత్‌, వాసంతి కృష్ణన్‌, ప్రజ్ఞా నయన్‌ నాయకానాయికలుగా నటించారు. ‘‘ప్రేమకథా నేపథ్యంలో కామెడీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ వారంతంలో కుటుంబంతో తప్పక చూడల్సిన సినిమా ఇది’’ అని చిత్రబృందం తెలిపింది. కోవెలమూడి సత్య సాయిబాబా, హేమంత్‌ కుమార్‌ వేమూరి నిర్మించిన ఈ చిత్రానికి రాజేష్‌ సంగీతం అందించారు. షకలక శంకర్‌, భద్రమ్‌, తదితరులు కీలక పాత్రల్లో నటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు