Vivek Venkataswamy: భాజపాకు షాక్‌.. మాజీ ఎంపీ వివేక్‌ రాజీనామా

తెలంగాణలో భాజపాకు షాక్‌ తగిలింది. మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు.

Updated : 01 Nov 2023 12:36 IST

హైదరాబాద్: తెలంగాణలో భాజపాకు షాక్‌ తగిలింది. మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్‌లో చేరారు. శంషాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో వివేక్‌, ఆయన కుమారుడు వంశీ ఆ పార్టీ కండువా వేసుకున్నారు.

ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, వివేక్‌ మీడియాతో మాట్లాడారు. భారాసను గద్దె దింపే శక్తి కాంగ్రెస్‌కు ఉందని వివేక్‌ నమ్మారని.. ఆయన చేరికతో తమ పార్టీకి వెయ్యి ఏనుగుల బలం వచ్చిందన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

వివేక్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను భారాస నెరవేర్చలేకపోయిందన్నారు. కేసీఆర్‌ కుటుంబం వారి ఆకాంక్షల మేరకే పనిచేస్తోందని ఆరోపించారు.  కేసీఆర్‌ను గద్దె దింపాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు. టికెట్‌ అనేది అంత ముఖ్యమైన విషయం కాదని ఈ సందర్భంగా వివేక్‌ వ్యాఖ్యానించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు